పుట:అక్షరశిల్పులు.pdf/107

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌

కవిరాజ్‌. బిరుదులు: కవిరాజ్‌, కవితిలక. రాష్ట్రస్థాయి 'నేషనల్‌ ఇంటిగ్రేషన్‌ ఫోరం'

అక్షరశిల్పులు.pdf

(పెనుకొండ ) ఏర్పాటు చేసినమత సామరస్యం, జాతీయ ు

సమైక్యత-సమగ్రతలు, మత సామరస్యం ప్రధాన లక్ష్యంగా రాష్ట్రరాజధాని నగరంలోనే కాకుండా రాష్ట్ర స్థాయిలో వివిధ ప్రాంతాలలో పలుసాహిత్య-సాంసృతిక కార్యక్రమాలు నిర్వహిస్తూ, ఆ దిశగా విశేష కృషి చేశారు. ఆయన సేవలకు గుర్తింపుగా 1981లో 'జాతీయ సమగ్రతావాది' గా ప్రజలు గౌరవించుకున్నారు. రచనలు: సర్వమత సార సంగ్రహం, తౌహిద్‌ -కా-రవుషన్. హిందూ-ముస్లిం-క్రెస్తవ ఆచారాలు, కర్మ కాండలు. హిందూ మతస్థుల ప్రార్థనాధికారాలను చాలా వివరంగా ప్రస్తావిస్తూ సప్రమాణ, సాధికాధికారిక గ్రంథాలు ఆయన రచించారు.

మిష్కన్‌ సాహెబ్‌ షేక్‌: అనంతపురం జిల్లా ధర్మవరం తాలూకా గుండంపల్లి జన్మస్థలం. పుట్టిన తేది: 06-07-1914. చదువు: 6వ తరగతి. అప్పటి నివాసం: అనంతపురం జిల్లా చియ్యేడు. రచనలు: నానార్థ నవనీతము.

మహమ్మద్‌ అలీ మహమ్మద్‌: నెల్లూరు జిల్లా తిమ్మసముద్రంలో 1955 జూలై ఒకటిన

అక్షరశిల్పులు.pdf

జననం. తల్లితండ్రులు: ఖాదర్‌ బీ, హుస్సేన్‌ సాహెబ్‌. చదువు:

ఎం.ఏ., బి.ఇడి. ఉద్యోగం: ఉపాధ్యాయులు. కలంపేరు: మానస. కళాశాల పత్రికలో కవితలు రాయడంతో రచనా వ్యాసంగం ఆరంభించి వివిధ పత్రికలలో కవితలు ప్రచురితం. లక్ష్యం: బడుగు బలహీన వర్గాలప్రజానీకంలో చైతన్యంకలగచేయడం. చిరునామా: ఎండి మహమ్మద్‌ అలీ, కలిగిరి-524224, నెల్లూరు జిల్లా. సంచారవాణి: 94414 77804.

ముహమ్మద్‌ ఆరీజ్‌: గుంటూరు జిల్లా పెనుమూలిలో 1963 నవంబర్‌ 24న జననం.

అక్షరశిల్పులు.pdf

తల్లితండ్రులు: అఫ్సరువన్నీసా, ఉస్మాన్‌ షరీఫ్‌. చదువు: ఎం.ఏ.

వ్యాపకం: సామాజిక కార్యకర్త. కలం పేరు: భాస్కర్‌. సామాజిక -రాజకీయ అంశాల మీద ప్రత్యేక అధ్యాయనం. 1978లో కళాశాల పత్రికలో 'స్త్రీ పక్షపాతి మహమ్మద్‌ ప్రవక్త' వ్యాసం ప్రచురణ ద్వారా రచనా వ్యాసంగం ఆరంభం. అప్పటి నుండి తెలుగు, ఆంగ్ల భాషల్లో రాసిన పలు సామాజిక-రాజకీయ వ్యాసాలు వివిధ పత్రికల్లో, సావనీర్‌లలో ప్రచురితం. రచనలు:

106