పుట:అక్షరశిల్పులు.pdf/105

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌

అక్షరశిల్పులు.pdf

'రమ్యభారతి'లో (త్రెమాసపత్రిక , విజయవాడ , 2000)

ప్రచురితమైన 'డాన్స్‌ తారలు' కవిత గుర్తింపు తెచ్చి పెట్టింది. సమాజానికి ఉపయోగపడే విలువైన సూక్తులను సేకరించడంలో ఆసక్తి వలన వేలాది సూక్తులను ప్రోదిచేశారు. రచన: అక్షర తపస్సు (కవితాసంపుటి, 2006). రాష్ట్రంలోని పలు సేవా-సాహితీ- సాంస్కృతిక సంస్థలచే సన్మానాలు. లక్ష్యం: వక్రంగా సాగుతున్న సమాజాన్ని సక్రమ దారిలో నడిపేందుకు అవసరమైన దిద్దుబాటు విధానాలను రచనల ద్వారా సూచించడం. చిరునామా: షేక్‌ మహబూబ్‌ అలీ, కేరాఫ్‌ షేక్‌ అబ్దుల్‌ సత్తార్‌ (పెయింటర్‌), ఇంటి నం.12-1-90, మహబూబ్‌నగర్‌, బిలాల్‌ మసీదు వద్ద, నరసరావుపేట -522601, గుంటూరు జిల్లా. సంచారవాణి: 9394195978 (పి.పి).

మహబూబ్‌ సయ్యద్‌: గుంటూరు జిల్లా సత్తెనపల్లి గ్రామంలో 1938 జనవరి 12న జననం. తల్లితండ్రులు: సయ్యద్‌ ఖాశింబి, సయ్యద్‌ అక్బర్‌. చదువు: ఎం.ఏ., బి.యల్‌. వ్యాపకం: అధ్యాపకులు (విశ్రాంత ప్రిన్సిపాల్‌: ఆంధ్ర ముస్లిం కళాశాల, గుంటూరు) ప్రస్తుతం

అక్షరశిల్పులు.pdf

న్యాయవాది. 1992 నుండి పలు పత్రికల్లో వ్యాసాలు చోటు చేసు కున్నాయి. మతసామరస్యాన్ని ఆకాంక్షిస్తూ రాసిన పలు ప్రసంగ వ్యాసాలు ఆకాశవాణిలో ప్రసారం. రచనలు: 1.'భిన్నత్వంలో ఏకత్వం' (1999), 2. సద్ధర్మాచరణ (2008), 3. ఆంధ్రా ముస్లిం కళాశాల చరిత్ర (2008). ఈ గ్రంథాలలో 'భిన్నత్వంలో ఏకత్వం' 'యూనిటీ ఇన్‌ డైవర్సిటీ' పేరుతో ఆంగ్లంలో అనువాదం అయ్యింది. అవార్డులు: బెస్ట్‌ సిజన్‌ ఆఫ్‌ ఇండియా (ఇండియన్‌ ఇంటర్‌ నేషనల్‌ ఫ్రెండ్షిప్‌ సొసైటీ, న్యూఢిల్లీ, 1999), చైతన్య భారతి పురస్కారం (హైదారాబాద్‌, 2007), గౌరవ డాక్టరేట్ (ఇంటర్‌న్నేషనల్‌ ప్రేయర్‌ గ్రూప్‌, గుంటూరు, 2007). లక్ష్యం: సర్వేశ్వరుడు ఒక్కడేనన్న ప్రచారం చేస్తూ మత సామరస్యాన్ని పటిష్టంగావించడం. చిరునామా: సయ్యద్‌ మహబూబ్‌, న్యాయవాది, 6/ 13, బ్రాడిపేట, గుంటూరు, గుంటూరు జిల్లా. సంచారవాణి: 92993 01825.

మెహబూబ్‌ అలీ ఖాన్‌ షేక్‌: 1916లో విజయవాడలో జననం. విజయవాడ నుండి వెలువడిన స్వతంత్ర పత్రిక 'ది ఆజాద్‌' సంపాదకులు. ప్రధాన వృత్తి ప్రజావైద్యం. వక్త. ఆంధ్రప్రదేశ్‌, చరిత్రను భవిష్యత్తును వివరిస్తూ పలు గ్రంథాలను ప్రచురించారు.

మహబూబ్‌ బాషా షేక్‌: నెల్లూరు జిల్లా కసుమూరులో 1941 జూలై ఒకిటిన జననం. తల్లితండ్రులు: షేక్‌ గౌసున్నీసా బేగం, షేక్‌ హబీబ్‌ సాహెబ్‌. చదువు: ఎం.ఏ.,

104