పుట:Aandhrashaasanasabhyulu.pdf/22

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తమ్మినేని పాపారావు

స్వతంత్ర, నగరి కటకం నియోజకవర్గం, జననం: 16-4-1916, గాంధీ హరిజనసేవా సంఘ సభ్యుడు, 1934లో జిల్లా రాష్ట్ర కాంగ్రెసు సభ్యుడు, 1950 జిల్లా కాంగ్రెసు సంఘ అధ్యక్షుడు, 1953-54 జిల్లా కాంగ్రెసు సంఘ ప్రధాన కార్యదర్శి, శ్రీకాకుళం జిల్లా సెంట్రల్ కోఆపరేటివ్ బ్యాంక్, ఆంధ్రాస్టేటు సెంట్రల్ కోఆపరేటివ్ బ్యాంక్ డైరెక్టరు. ప్రత్యేక అభిమానం: రైతు సమస్యలు, అడ్రస్సు: తొగరం పోస్టు, శ్రీకాకుళం జిల్లా.

పసగాడ సూర్యనారాయణ

స్వతంత్ర : శ్రీకాకుళం నియోజకవర్గం, వయస్సు : 48, విద్య : 5వ ఫారం, 12 సం||లు శ్రీకాకుళం కో-ఆపరేటివ్ సెంట్రల్ బ్యాంకి డైరెక్టరు, 10 సం||లు శ్రీకాకుళం పురపాలక సంఘ సభ్యుడు. ప్రత్యేక అభిమానం : కార్మిక శ్రేయస్సు, అడ్రస్సు : శ్రీకాకుళం.

వైరిచర్ల చంద్రచూడామణి దేవ్

స్వతంత్ర : పార్వతీపురం నియోజకవర్గం, కురుప్పం రాజా, 1952 ఎన్నికలలో ఉమ్మడి మద్రాసు శాసన సభకు కాంగ్రెస్ అభ్యర్ధిగా కురుప్పం నియోజకవర్గం నుండి ఎన్నిక, అడ్రస్సు : పట్టాయత్ కురుప్పం పోస్టు, పార్వతీపురం తాలూకా.

ముదుండి సత్యనారాయణ రాజు

ప్రజా సోషలిష్టు : చీపురుపల్లి (జనరల్) నియోజకవర్గం, జననం: 5-6-1907, విద్య: బి.యస్.సి. పంచదార ఫ్యాక్టరీ మేనేజరు ఉద్యోగానికి రాజీనామా యిచ్చి రాజకీయాలలో ప్రవేశించి కార్మిక హక్కులకు కృషి, ప్రత్యేక అభిమానం : పరిశ్రమాభివృద్ధి, కార్మికాభ్యుదయం, అడ్రస్సు : మెరకమూడిదాం, చీపురుపల్లి తాలూకా, శ్రీకాకుళం జిల్లా.

కొత్తపల్లి పున్నయ్య

కాంగ్రెసు : చీపురుపల్లి (రిజర్వుడు) నియోజకవర్గం, జననం : 1924, విద్య: బి. యల్. 1945-48 ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ సభ్యుడు, 48-50 కార్యనిర్వహకవర్గ సభ్యుడు, 1942 క్విట్ ఇండియా ఉద్యమములోను, 1950 సోంపేట తాలూకా హరిజనుల భావిహక్కుల రక్షణ విషయములో 6 రోజులు జైలుశిక్ష, ఇదివరలో విశాఖజిల్లా విద్యార్థి కాంగ్రెసు కార్యదర్శి, ఉత్తర విశాఖ జిల్లా కాంగ్రెసు సహాయ కార్యదర్శి, ప్రత్యేక అభిమానం : హరిజనోద్ధరన, సంఘసేవ, అడ్రస్సు : చీపురుపల్లి.