పానశాల/పానశాల

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

పానశాల

Panasala Duvvuri Ramireddi 1991 123 P.pdf
Panasala Duvvuri Ramireddi 1991 123 P.pdf


1. లెమ్మోయీ మదిరాతపస్వి, దిశలా
          లేఖ్యంబుగా మాఱెఁ; బా
త్రమ్ము\న్‌ నింపుము గోస్తనీరసమున\న్‌
          రాగోదయశ్రీలు పైఁ
గ్రమ్మ\న్‌ జీవితభాజనంబు పరిపూ
          ర్ణంబౌటకు\న్‌ మున్నె; కా
లమ్మౌనన్న రవంబు వింటి మధుశా
          ల\న్‌ మొన్న లేఁబ్రొద్దునన్‌.

2. అరుణుఁడు యామినీవిభవమంతయు గెల్చి జయాంకమట్లు క
ర్బుర రమణీయ కేతనముఁ బూర్వదిశం బయికెత్తె లెమ్ము; ని
ద్దురవిడి తమ్మిపూవులటు తొంగలిఱెప్పల నెత్తిచూడు; నీ
వెఱుఁగవొతొయ్యలీ చిరము నియ్యిలఁగన్నులుమూయు కట్టడ\న్‌.

 
3. పారదమట్లు జీవితము పట్టిన నిల్వదు; శీఘ్రగామి; ద్రా
క్షారస మిమ్ము, తాపమునఁ గందెను చిత్తము; జాగరూక సం
చారము నిద్రదౌలతు వశంబయి రూపఱు; యౌవనంపుటం
గారము నీటఁ జల్లవడు; గన్నుల నెత్తుము, లెమ్ము నెచ్చెలీ.

Panasala Duvvuri Ramireddi 1991 123 P.pdf

4. పొలములపూలగాలి వలపుల్‌ కలఁబోయుచువీచె; గాజు గి
న్నెలఁ జిఱుచేదుపానకమునింపుము; నశ్వరమైన ఈస్థితిం,
దెలియుమ యీక్షణం బెరవుదెచ్చిన సొమ్మని; జాఱఁబుచ్చినం
గలికి, మఱెప్పుడిట్టితఱి క్రమ్మఱరాదు; నిజమ్ము; నమ్ముమా!

5. కనుగొమ్మా నినుబోలె రాగవతియై కాంతిల్లెఁ పూర్వాశ, మో
మున నీలాలక రేఖలొత్తుచు, నిశాభుక్తావశేషాసవం
బును సీసాలకు నింపి యొక్కసరకంబు\న్‌ ముంచియందిమ్ము; ద
క్కని యారేపటి మాటలేటి కనుభోగ్యంబైన నేఁడుండఁగ\న్‌.

6. తరుణార్కుండు సువర్ణవాగురులచేతం బాదుషాహా దివం
భర హర్మ్యోపరి గర్భగోళ శిఖరవ్రాతంబు బంధించె; వా
సర కైఖుస్రువు రక్తిమాసవము నాశాపాత్రఁ బూరించె; ని
త్తఱి ఘోషించె మునాదియెల్లరకుఁ బ్రాతఃపానగూఢార్థముల్‌.

Panasala Duvvuri Ramireddi 1991 123 P.pdf

విరియు గులాబిపూలు తన ప్రేయసులౌట మొగంబు లన్యులె
వ్వరుఁ గనరంచుఁ జిన్కు వలిపంపు ముసుంగుల దాచె మేఘుఁ; డా
విరిగొను కెంపుపానకము వేగమ గిన్నెలనింపు; జీవితాం
బరమున నొక్కతార గనుమూసెను లెమ్మనికూయుఁ బల్గులు\న్‌.

చేవల్‌ చచ్చిన కోరికల్‌ మరల నుజ్జీవింప నవ్యాబ్దశో
భావాల్లభ్యము వచ్చె; భోగులకు సేవ్యంబయ్యెఁ గుల్యాజల
స్రావంబుల్‌ వను; లొత్తెఁ గొమ్మలను మూసాశ్వేతహస్తప్రభల్‌;
ఈ విశ్వంభర క్రీస్తుమార్పులఁ బునర్జృంభించె నాఁ గాంతిలు\న్‌.

చెలియ, గులాబిమోముపయిఁ జిందె నుగాదిహిమాంబుశీకరం
బులు; ప్రమదాంఘ్రి చిహ్నములు పొల్చె హృదంతర శాద్వలంబునం;
దలఁచెదవేల నిన్నటివెతల్‌; మఱి నేఁడు ముదంబుగూర్ప, ర
మ్మెలమిని బచ్చబైల సెలయేటితటాలఁ బచారు సేయగన్‌.

Panasala Duvvuri Ramireddi 1991 123 P.pdf
Panasala Duvvuri Ramireddi 1991 123 P.pdf

ఎఱుఁగవె కాలవల్లి మనయిద్దఱి మృత్యువు లల్లుఁగొయ్యగాఁ
బెరుగు; గుడారమౌను మనవేడ్కకు నీభువనంబు; జంటగాఁ
గరముల వారుణీభరిత కాంచనపాత్రిక లందికొన్న న
ద్దిర! మనచేతఁ జిక్కువడదే చిరకాలపుసత్య మంగనా!

Panasala Duvvuri Ramireddi 1991 123 P.pdf

చెలులను బంధులన్‌ మధుర శీధువు నామనితోఁట వీడి యూ
హలు నెగఁబ్రాకఁజాలని రహస్యపుఁ జోటికిఁ బోదువీవు; నేఁ
బలికెదఁ దెల్పరాని యొకభావము; సంధ్యలఁ దూలి రాలు పూ
వులు కృశియించుఁగాని విరఁబూయవుక్రమ్మఱ; నమ్ముమో సఖీ!

    
కాల మహర్నిశంబనెడు కత్తెరతో భవ దాయురంబర
శ్రీల హరించు; మోముపయిఁజిల్కును దుమ్ముదుమార; మేలొకో
జాలిపడంగ? నీక్షణము సంతసమందుము; నీవువోదు; వీ
రేలుఁ బవళ్లు మున్నటు చరించు నిరంతర మండలాకృతిన్‌.

 
ఆమని లేఁతమబ్బులు ప్రియంబుగ రాగవతీకపోలముల్‌
తేమగిలంగఁ దుంపురిలు తియ్యనివేళల లేచిరమ్ము చా
నా, మధురాసవంబుఁ దమినానఁగ; నేఁడు విహారభూమి శో
భామయమైన యీగఱిక పచ్చగిలుంగద రేపు నీపయిన్‌!

Panasala Duvvuri Ramireddi 1991 123 P.pdf
Panasala Duvvuri Ramireddi 1991 123 P.pdf

అల బహరాముగోరి మధువానిన సుందర భోగమందిరం
బుల మృగరాజు నేఁడు భయమున్విడి క్రుమ్మరు; జంబుకంబు పి
ల్లలఁగను; వన్యరాసభములన్‌ మృగయారతిఁ బట్టినట్టి భూ
తలపతి గోరి పట్టువడెఁ దానొకగోరి, నెఱుంగుదే చెలీ!

Panasala Duvvuri Ramireddi 1991 123 P.pdf

అయయో! యెందఱి మానవోత్తముల కంఠాంకూరముల్‌ ద్రుంచె ని
ర్దయమౌకాలము; యౌవనంబు, తనుసౌందర్యంబు లావణ్య, మ
వ్యయమై నిల్చునె? యెన్ని యెన్ని కసుగాయల్‌ రాలె నీనేల; నా
రయలేదో విరఁబూయకే యురలి వ్యర్థంబైన లేమొగ్గలన్‌.

Panasala Duvvuri Ramireddi 1991 123 P.pdf

నీవూ నేనును తారతమ్య మిహమందేగాని భూగర్భ ర
త్నావాసంబున లేదు; దుర్జనుఁడు పుణ్యాత్ముండు భిక్షార్థియున్‌
శ్రీవాల్లభ్య ధురంధరుండు నొకటే శ్రేణిన్‌ సుఖాసీనులై
యావిందున్‌ భుజియింతు; రంతఁ గనలేమా మృత్తికన్‌ భేదముల్‌.


కాలిడినంత గ్రుచ్చుకొనుకంటకముల్‌ ప్రియురాలిమోమునన్‌
వ్రేలిన ముద్దుముంగురులొ! బిత్తరికన్బొమ లౌనొయేమొ! రా
జాలయ భగ్నగోళశిఖరావళిఁ గన్నుల గట్టు నిష్టకా
మాలలు పూర్వభూభుజుల మస్తములౌనొ! వజీరు వ్రేళులో!

Panasala Duvvuri Ramireddi 1991 123 P.pdf

జలజల మంజులార్భటుల జాల్కొను నీ సెలయేటికోవలన్‌
మొలచిన లేతపచ్చికల మోటుగఁ గాలిడఁబోకు, దేవదూ
తల రుచిరాధర ప్రకృతిఁ దాల్చెనొ! సుందర మందగామినీ
లలిత శరీరమృత్కణములం జిగిరించెనొ యేమొ కోమలీ!

పొలమున నేత్రపర్వముగఁ బూచిన రాగవతీ సుమంబు శో
భల విలసిల్లెఁ బూర్వనరపాలుర రక్తకణాలనుండి; యే
చెలియ నిగారపుం దళుకు చెక్కులనేలిన పుట్టుమచ్చపై
వెలసెనో నీలకాంత కనువిందొనరించును బూలరెమ్మలన్‌.

గతము గతంబె, యెన్నటికి కన్నులఁగట్టదు; సంశయాంధ సం
వృతము భవిష్యదర్థము; వివేకవతీ, యొక వర్తమానమే
సతత మవశ్యభోగ్యమగు సంపద; రమ్ము విషాదపాత్ర కీ
మతమునఁ దావులేదు; క్షణమాత్ర వహింపుము పానపాత్రికన్‌.
 
పాఱెడువాఁగు నీరమటు, పైఁబయి వీఁచు నెడారిగాలి నా
జాఱె మఱొక్కరోజు వరుసన్‌ మనయిద్దఱి జీవితంబులన్‌;
ఊరుపు మేననుండువఱ కుమ్మలికంగొన, రూపహీనమై
యారయరాని 'రేపు' నకు, నంతమునొందిన 'నిన్న' కున్‌ సఖీ.

Panasala Duvvuri Ramireddi 1991 123 P.pdf

పరిశుష్కంబగు జీవనంబు రస సంపన్నంబు గావించు ని
ర్జర పానీయము వారుణీరసముఁ బాత్రన్నింపి యందిమ్మ యా
తురదీఱం జవిగొందు; జీవితము వాతూలంబులో దివ్వె! చె
చ్చెఱఁ గానిమ్ము; గతించుఁబ్రాయమదిగో శీఘ్రంబుగం బ్రేయసీ.

Panasala Duvvuri Ramireddi 1991 123 P.pdf

సమశీతోష్ణత హాయినించె; సుఖసంస్పర్శంబుగన్‌ గంధవా
హము వీతెంచె; గులాబితోఁటపయి సాయంకాలచిత్రాబ్జముల్‌
ప్రమదాశ్రుల్‌ చిలికించె; బుల్బులియు 'నీరక్తాస్యముల్‌ ద్రాక్షసా
రమునం గెంపిలఁ జేయుఁ' డంచుఁ జవులూరంబల్కె రోజాలకున్‌.

నలుదిక్కుల్‌ కమనీయచంద్రికల సుస్నాతంబులై దోఁచెఁ; జి
త్తలతాంతంబును బూచె; ద్రాక్షరసపాత్రం జేతికందిమ్మ యో
లలనా, వింటిని కాలసూక్తి; ఫలమెల్లంగాల్చు నిర్ఘాతచం
చలయౌ మృత్యువు ధాన్యశాలకిపుడే సంధించె నంగారమున్‌.

Panasala Duvvuri Ramireddi 1991 123 P.pdf

ఈమధుమాసశర్వరుల నిందుశిలా రమణీయవేదిఁ గాం
తామణిఁ గూడి రాగవతినా వహియింపుము పానపాత్ర నా
రామమునందు; నీ వెఱుఁగరాక లయింతు; వనాదికాల హిం
సా మలినప్రవృత్తి మధుసారమునం గడుగంగఁ జెల్లదే?

Panasala Duvvuri Ramireddi 1991 123 P.pdf

జిలిబిలి కమ్మగప్పురపుఁ జిన్నెల వెన్నెలగుత్తి తావులం
జిలుకుచుఁ జైత్రయామవతి చీరచెఱంగునఁ బూఁతపూచె; నె
చ్చెలి, యిటువంటికాలమిఁకఁ జిక్కదు; భోగ్యము మద్య; మెన్ని ల
క్షల సమ లీనిశాప్రియుఁడు కాంతిలునో మన గోరిమిట్టలన్‌.


జీవితసార్థవాహము విచిత్రగతిం బయనించు, నందులో
నీ వొకఱెప్పపాటయిన నెయ్యురతో సుఖముందువేని మో
దావహ మంతకన్నఁ గలదా? మధుపాత్రిక నందియిమ్ము సా
ఖీ, వివరించెదేల తిలకింపని రేపును? రేయి జాఱెడిన్‌.

యామినినొక్కపాత్ర మధువానెద; రెంటను భాగ్యవంతుఁడన్‌
నామతమున్‌ వివేకమును నాలుగిటన్‌ విడియాకులిత్తు; నా
పై మది యుండిలేదను తపస్వి యవస్థ మునింగితేలి ద్రా
క్షామణి ముద్దుకూఁతురిని శయ్యకుఁ దార్చెద లేఁతవెన్నెలన్‌.

Panasala Duvvuri Ramireddi 1991 123 P.pdf

  
మనమునఁ దెల్వియున్నపుడు మాటువడుంబ్రమదంబు; మే నెఱుం
గనియటు కైపుసేయఁ దుదిఁ గాంచువివేకము; వీనిరెంటి మ
ధ్యను చెలువౌ నవస్థయె సుఖాస్పదజీవిత; మట్టి జీవితం
బునకు గులామునై వెడలఁబుత్తు దినాలు ఖులాసగా సఖీ.

Panasala Duvvuri Ramireddi 1991 123 P.pdf

ప్రతిదినముం దలంచెదను రాత్రులయం దనుతాపమొంద; సం
తత మధుపాన భోగపరతన్‌ మఱునాఁటికి మార్చికొందు; నీ
వితముగ కొన్నినాళ్ళు కడవెళ్ళ వసంతమువచ్చె నిప్పు డా
తత సుమనోభరంబుఁ దలఁదాలిచి; నే వగపిల్లు టెట్లొకో!

తారాశుక్తులు రాల్చినట్టి జిగిముత్యాలట్లు పూఱేకులన్‌
జాఱెన్‌ సన్నని మంచుతుంపురులు; వాసంతోదయశ్రీకిఁ గం
తారత్నం బనువైన నెచ్చెలిగ నుద్యానంబునం దోఁచె మి
త్రా, రారమ్ము సుఖింపు, మీయదను వ్యర్థంబైన రాదెన్నడున్‌.

విరులును పచ్చపూరి కనువిందొనరించి ముదంబుఁ గూర్చు ని
త్తఱిఁ, బరికింపు మందమును; తప్పక యింకొక నాలుగైదు వా
సరముల మంటిలోఁగలయు, సాఖి, సుమంబులఁ గోసికొమ్ము; బం
గరు సరకంబునన్‌ మదిరఁ గమ్మగ నానుము నిర్విచారతన్‌.
  
విరహ రహస్యవేదనలు వీడుఁ దమంతన రేపోమాపొ; నిన్‌
మఱవ దదృష్ట రేఖ; మధుమాసము; కాలముగూడివచ్చె; సుం
దరి హృదయానుసారిణి వనంబున నీకయి వేచియుండ నీ
తరుణమునన్‌ సుఖింపక వృథా పరచింతనలేల మర్త్యుఁడా?

మన ప్రియజీవితంబు కుసుమంబుల పోలికఁ జంచలంబుగా
వునఁ బువులట్లు కాలమును బుత్తము నవ్వుల నాటపాటలన్‌;
గొనగొనఁబాఱు కాలువలకోవలఁ దియ్యని పానమాని జీ
వన భరణప్రయాస మొకప్రక్కకు రువ్వుదమోసి ప్రేయసీ.

    
కమ్మని పిల్ల తెమ్మెరల కౌగిళులం బులకించి వాసనల్‌
చిమ్ము గులాబి; బుల్బులి హసించుసుమంబుల రామణీయకం
బిమ్ముగఁ గ్రోలి మైమఱచు; నేలవిలంబము? పాత్రనింప రా
రమ్ము లతాంగి, యిద్దఱము రాలకపూర్వమె పూలపోలికన్‌.

ముదిరిన కెంపువన్నె మధుపూరము దప్ప మఱేమిగాని యీ
యదనున నంటబోఁకుడని హాయిగ బుల్బులిపాడుఁ; బూఁబొదల్‌
మృదుల సుమాధరంబులను మెల్లగ విచ్చి వచించు 'రండి, మా
సదనములందు విందులయి సంతసమొందుడు మూడునా'ళ్ళనన్‌.

     
వలపుఁ బొలంతి, యీప్రకృతి వన్యపథంబులఁ బూలపండువుం
జలుప నుపక్రమించె; విరసంబగు శుష్క విరక్తిమార్గముల్‌
పలుకకు; మూఁడునాళ్ళ మురిపంబుగదా మనజీవితంబు; పా
యలువడి పాఱు నిర్ఝరమునంటిన పూఁబొదరిండ్లఁ జూచితే!

అసవపూర్ణమౌ కలశ, మామిషఖండము, వెన్నరొట్టె, ది
వ్యాసమరూప యౌవనగుణాలయ వీణియ మీటుచున్‌ దినా
యాసముఁ దీర్ప నిర్జనవనాంతర సీమల నబ్బెనేని వ
హ్వా! సులతాను భోగవిభవంబులఁ గోరెడిమూఢుఁడుండునే!

     
పచ్చబయళ్ళు, నేటిదరిపట్టులు, నొక్కక్షణంబు శ్రాంతియున్‌
అచ్చరవంటి నెచ్చెలి, రసాంకితకావ్యముఁ గెంపుపానకం
బిచ్చగ నామనిన్‌ దొరకెనేని మసీదులు గుళ్ళ దాస్యమున్‌
మెచ్చక ముక్తులై సుఖముమీఱఁ జరింతురు జాగరూకులున్‌.

Panasala Duvvuri Ramireddi 1991 123 P.pdf
Panasala Duvvuri Ramireddi 1991 123 P.pdf


తలఁపన్‌ లౌకిక కార్యకల్పనల గంతవ్యంబు శూన్యత్వ; మీ
వు లయంబొందినట్లెయౌదు; వసువుల్‌ వోనాటకున్‌ మున్నె మం
జుల వల్లీనిలయంబులం జెలుల మోజుల్‌ దీర్చి ఖయ్యాయ, త
ల్లలనామండల భుక్తశేష రసమున్‌ ధన్యుండవై గ్రోలుమా.

వాదులుమాని నాసరస వారుణినానుము, దానితో మహ
మ్మూదు సమస్తరాజ్యరమ పోలదు! వేణువినోదగీతి దా
వీదు గళస్వనంబటుల విశ్వ రసోదయ హేతువయ్యె శా
తోదరి, నేఁటి సమ్మదము నోడకు రేపను జూదపాటలో\న్‌.

కను మెపుడో యకాండముగ. గాలము నీపయి దొమ్మిపోటు సే
యనిపుడే గులాబి జిగులారెడు ద్రాక్షరసమ్బు నానుమా;
తనువు నశించి దుమ్మగుట తథ్యము; నీవు పసిండిముద్దవా
జను లొకసారి పూడ్చి మఱుసారి నినుం బెకలించి యెత్తఁగన్‌

     
చెలియరొ, నిన్ను నన్ను విరచించిన యప్పుడు సృష్టికర్త ముం
దల లిఖియించెనేమొ సురఁద్రావి సుఖింపఁగనాకు, హృత్తటం
బులు దెగిపాఱు ప్రేమరసపూరము గిన్నెలనింప నీకు; నా
శలు ఫలియింప మద్యకలశంబును నీవుఁ జిరంబు వెల్గుతన్‌!

Panasala Duvvuri Ramireddi 1991 123 P.pdf
x

కౌసరు నిర్ఝరంబు సురకాంతలు నాకమునందు నుందురం
చాసపడంగ నేల చెలియా? తొలిసంజల నీవు వోయు ద్రా
క్షాసవ మా నదీజలమునంతటి కన్నను దీపుగాదె! నీ
దాసులు పాదుషాలను వదంతియె చాలదె రూపుదెల్పఁగన్‌.

Panasala Duvvuri Ramireddi 1991 123 P.pdf

     
చానా, నీసరసాస్యబింబమునకున్‌ జమ్‌షీడుపాత్రంబు దీ
టౌనే? నీపదమార్గమందు మృతి పూర్ణాయుష్యలాభంబుకం
టే నేటౌగద! కోటిబాలరవులే నీపాదరాగంబునన్‌
స్నానంబాడ, మదీయజీవితము భాస్వద్ధామ మౌటబ్రమే!

వనిత, యనుంగు ముంగురులపైఁ జెయివైచితి నంచు నూరకే
కనలెదవేమొ; నాయెడఁద కట్టువడెన్‌ నెలవంక యుచ్చులం;
జెనఁటి తమాషకై యురులఁ జేయిడ; నా హృదయంబునేనొ కో
రినయటు బుజ్జగింప బెదరించెదవేల తుటారి చూపులన్‌.

  
అమృతరసాయనోష్ఠి, స్ఫటికాసవపాత్రము నాకుమాఱు నీ
సుమరదనచ్ఛదంబున నసూయ రగుల్కొన ముద్దువెట్టెఁ; బం
తముమెయి దాని నెత్తురును ద్రావకయుండిన నను ఉమ్రఖ
య్యమ యని పిల్వఁబోకు, తగవౌనె పరాంగన మోవిముట్టఁగన్‌.

Panasala Duvvuri Ramireddi 1991 123 P.pdf
Panasala Duvvuri Ramireddi 1991 123 P.pdf

చెలియ, మనోహరప్రణయ శీతలతన్‌ సుఖియించు నామనం
బలమటతోఁ దపించు నకటా! భవదీయ వియోగకీలలన్‌;
దెలియదొ, సాఖియార్తులకు తియ్యని మందని; ప్రాణముల్‌ త్వదం
ఘ్రుల విడిపింతు; రమ్ము, బ్రదుకున్‌ నిలబట్టెద నిట్టియాసలన్‌.

     
వలపులదివ్వె, నీమృదుల పాద లతాంతము ముద్దుగొందు; న
న్యల మధురాధరంబులయినం దులఁదూగవు దానితోడ; రా
త్రుల సహవాసకామినయి రోసియు నిన్‌ గనలేక భగ్నవాం
ఛలఁ జివురించు లజ్జ పెలుచం బవలెల్లను బుత్తు దీనతన్‌.

Panasala Duvvuri Ramireddi 1991 123 P.pdf

చెలియరొ, నీవియోగమునఁ జిత్తము చీకి కృశించె; నీవు నే
వలనికిఁ బోయినన్‌ విడువఁ బయ్యెదకొంగు; నిరంతరంబు ని
న్వలచినవార లెందఱొ వనారిలి కూలిరి నీవు పోవ; నే
డెలమి దొలంక వచ్చితిని; ఎందఱు నీబలిపీఠిఁ జత్తురో!

 
లలనా, కోమలమైన నీతనువు నేలన్‌ లీనమైపోయి య
వ్వల నానావిధ భాండభాండికల రూపంబెత్తుఁ; దత్త్వజ్ఞులీ
చల వృత్తంబును నమ్మఁబోరు; నిరయ స్వర్గానుసంధాన క
శ్మల చిత్తంబుఁ బురాతనాసవమునన్‌ స్నానంబు గావింపుమా.

Panasala Duvvuri Ramireddi 1991 123 P.pdf

అంతములేని యీభువనమంత పురాతనపాంథశాల; వి
శ్రాంతి గృహంబు; నందు నిరుసంజలు రంగుల వాకిళుల్‌; ధరా
క్రాంతులు పాదుషాలు బహరామ్‌ జమిషీడులు వేనవేలుగాఁ
గొంత సుఖించి పోయిరెటకో పెఱవారికిఁ జోటొసంగుచున్‌.

అంబరం బొక చిత్రగీతంబు; రవియు
దీపపున్‌ శెమ్మె, లోకంబు తెరపటంబు;
నీడబొమ్మలు మనుజులు; నిఖిలమునకుఁ
గాలచక్రంబు నిర్ణేత; గతి యనాది.

ఆదిమధ్యాంత రహితమై యలరుచుండు
కాలయవనిక భేదింపఁ గలమె మనము?
ఇటకు నెందుండివచ్చె నింకెటకుఁ బోవు
ప్రాణి యను ప్రశ్న కెవ్వాఁడు బదులు సెప్పు?

Panasala Duvvuri Ramireddi 1991 123 P.pdf

కానలేము కాలపు మర్మమేను నీవు;
ఆ జిలుగు వ్రాఁత చదువ సాధ్యంబె మనకు
తెరవెనుక నేను నీవను పొరపు గలదు;
ఆ విభేదము తెరయెత్త నంతరించు.

Panasala Duvvuri Ramireddi 1991 123 P.pdf
Panasala Duvvuri Ramireddi 1991 123 P.pdf

అణుజునై యెగిరితి రహస్యాంబరమునఁ;
బిన్న పెద్దల శుశ్రూషవేత్త నైతిఁ;
గాని, లోగుట్టూఁదెలుపు నొక్కనిని గనను;
మఱలివచ్చితిఁ బోయిన మార్గమందె.
    
సతముఁ దత్త్వవిచారంబు సలిపిసలిపి
మూలసూత్రంబు నెవరైన ముట్టినారె?
నేఁడు నిన్నట్లు; రేపును నేఁటియట్లు;
అందనిఫలంబు చేచాఁప నందుటెట్లు?
      
అఖిల శాస్త్ర పురాణ తత్త్వాబ్ధు లీఁది
పరమ విజ్ఞానదీపమౌ పండితుండు
కాళరాత్రిని మార్గంబు గానలేక
యల్ల మామూలుకథఁ జెప్పి యంతరించు!

జీవితంబెల్ల బహుశాస్త్ర సేవలందుఁ
గడపితి, రహస్యములు చాల గ్రాహ్యమయ్యె;
నిప్పుడు వివేకనేత్రంబు విప్పిచూడఁ
దెలిసికొంటి నాకేమియుఁ తెలియదంచు.
  
మనకు ముందేఁగినట్టి యా మాన్యులెల్లఁ
బ్రబల గర్వాంధ నిద్రాబద్ధులైరి;
నెలఁత, మధువాని నావల్ల నిజము వినుము;
వారు చెప్పిన చదువెల్ల వట్టి కల్ల!

Panasala Duvvuri Ramireddi 1991 123 P.pdf

నే నొక తత్త్వవేత్తనని నిందయొనర్చిరి కానివారు; నా
మానసవృత్తి వార లణుమాత్ర మెఱింగిన నట్టులందురే?
కాని, మఱేమి దేవుఁడెఱుఁగండె మనంబు; వ్యధాకులాయమౌ
ఈనిలయంబుఁ జేరితి; గ్రహింప నసాధ్యము జన్మమర్మముల్‌.

Panasala Duvvuri Ramireddi 1991 123 P.pdf

పూవుఁ జెక్కిళు లందంబు దావి రంగు
నిక్కునీటును గలదు వర్ణింపనేల;
బోధపడదేమొ యైహిక భోగశాల
సృష్టికర్త యిట్లేల చిత్రించె నన్ను?

ఏమి ప్రయోజనంబు గన నిష్టములేనిదె నన్నుఁ దెచ్చె; నిం
కేమి యశంబు గౌరవము హెచ్చును నన్‌ సమయింప; దైవలీ
లామహిమోన్నతిన్‌ మదిఁదలంప నసాధ్యము; రాకపోకలే
లా? మన జీవితంబునకు లాభము కేవలజీవితంబెకా!

లలనరో, మున్ను నస్థితిజలంబున 'నే'నను విత్తునాటి, య
వ్వలఁ బరివేదనాగ్నిశిఖఁ బ్రాణము వోసెను; గాలిపోల్కిని
య్యిలసకలంబుఁ గ్రుమ్మరుదు; నెచ్చటిమృత్తికతోడఁ జేసెఁ గ్రం
తల కిరవైన యీతనువుఁ? దాఁకినఁ దప్పిన మన్ను దుమ్మగున్‌.

ఇలకు రాకపోకల నాకు స్వేచ్ఛయున్న
రాకయుందును; వచ్చినఁ బోకయుందు;
వీలుపడునేని యీపాడునేలయందు
ఉనికిపుట్టువు చావులేకున్న మేలు.

    
అయయో! మూలధనంబు హస్తగళితంబౌచుండె నానాఁటికిన్‌;
వ్యయమైపోయిరి మానవుల్‌ మరణశయ్యాసుప్తులై; తన్మృతా
లయ వృత్తాంత మెఱుంగ గోరి వయసెల్లన్‌ వేచుటేకాని యా
రయ లేనైతి దివంబునుం డిటకు యాత్రల్‌ సేయు దేశాటులన్‌.

తనచేచేత నొనర్చినట్టి యొకపాత్రన్‌ భగ్నముంజేయ నే
మనుజుండైనఁ దలంప; డంగములు నిర్మాణంబు గావించి మో
హన రూపంబులు, మోవిఁదేనె యెదలో నత్యంతరాగంబుఁ గూ
ర్చినదేవుండు మఱేల యిట్లు నిజసృష్టింగూల్చు నున్మత్తుఁడై?

ధారుణినుండి యుచ్చశనిదాఁక కలట్టి కడింది చిక్కులం
బూరితిగా సడల్చితిని; మోసపుటక్కుల బందెగాను; దు
ర్వార నిరోధముల్‌ గడచివచ్చితి; నయ్యును, సాయశక్తులం
బోరి వదల్పకే విసిగిపోయితి మృత్యురహస్యబంధమున్‌.

Panasala Duvvuri Ramireddi 1991 123 P.pdf

మానవులైనవా రెపుడొ మ్రందుట నిశ్చిత మౌట బాగదా
దైనను బల్ఖయైన సమమౌను; సితాసిత పక్షమధ్య యా
త్రా నియతిం జిరంబుగ సుధాకరుఁడున్‌ మన మట్టిమీఁద ము
గ్ధానన సంచరించు; మధువానుము; మానుము తక్కుచింతలన్‌.

Panasala Duvvuri Ramireddi 1991 123 P.pdf

సమయపుఁ బాత్ర లోఁతుఁగన శక్యముగాదు; జగంబు దుర్జన
త్వముపయినూనియుండు మగువా, వగపేటికొ మద్యముండఁగన్‌
గుములకు వెల్లఁబోకు విషకుండిక మృత్యువుదెచ్చియీయఁ; గా
లముబడి నీవునేను సకలప్రజ యారుచిఁ జూడఁగా వలెన్‌.

Panasala Duvvuri Ramireddi 1991 123 P.pdf

మరణభయంబు నాకు నణుమాత్రము లేదు; మదీయ జీవ సం
భరణభయంబె మిక్కుటము; ప్రాణము దైవము నొద్ద వడ్డి బే
హరమున కప్పుకొంటి; ఋణమంతయు నిమ్మని తల్పు దట్టినన్‌
సరసర హేమనిష్కముల సంచులు ముందఱ విప్పిపోసెదన్‌.

Panasala Duvvuri Ramireddi 1991 123 P.pdf

కాలము రోషసంకులవికారముఁ జూపకపూర్వమే సుహృ
త్పాళులఁ గూడిమాడి జరుపందగు వెన్నెల పానగోష్ఠి; చం
డాలయముండు ద్వారముకడన్‌ నిలుచుండినయప్డు ఱెప్పపా
టాలము సేయునే? గుటికెఁడైన జలంబును ద్రావనిచ్చునే?

Panasala Duvvuri Ramireddi 1991 123 P.pdf

పరమొ గిరమ్మొ దానితలపై నొక దోసెఁడు మన్నుచల్లి సుం
దరి మెఱుగుంగపోలములు దాఁచిన ముద్దులు దొంగిలించి సం
బరముగ శీధువానుము; నమాజులు పూజలుఁ జేయనేల? యె
వ్వరయిన వచ్చినారె మృతివాటిక కేఁగిన పూర్వయాత్రికుల్‌?

Panasala Duvvuri Ramireddi 1991 123 P.pdf

మాటికి మాటికిం దెలివిమాలి తలంతువు స్వర్గమంచు; న
చ్చోట నిలింపకామినులుఁ, జొక్కపుటాసవమున్‌, గులాబిపూఁ
దోఁటలు నుండునన్న భ్రమతో మన కేటికొ యవ్వి యియ్యెడన్‌
నీటలఁ; జేతివెన్న విడి నేతికిఁబోదురు మూఢమానవుల్‌.

Panasala Duvvuri Ramireddi 1991 123 P.pdf

కొందఱు దేవకన్యకల కూటమి పండుగ యంద్రుగాని, నే
నందు మధూళి పానమె ప్రియంబని; తీరనియప్పుబేర మిం
కెందుకు, ముందుచేతగ్రహియింపుమురొక్కముఁ, దూర్యరావమా
నందముఁ గొల్పు దవ్వుల వినంబడియుం; దడవేల మిత్రమా?

ఎవఁడో భగ్నమనోరథుం డిహమునే హేయంబుగావించి భా
వ వినోదంబుగ నందనంబు, దివి, రంభాభోగ మూహించుకొ
న్న విధానంబగుపట్టు; బైళుల ఝరీనాదంబు, ప్రత్యూషవై
భవముల్‌ సంధ్యల రక్తికన్నఁ గలదే స్వర్గంబు యోచింపఁగన్‌?

Panasala Duvvuri Ramireddi 1991 123 P.pdf

అలవడ దస్తినాస్తుల యథార్థత, నాకము సత్యమన్న పె
ద్దలనుడి యొప్పుకొన్నను, బదంపడి నమ్మకమేమి యందఱా
స్థలమున కేఁగువారలని? చచ్చిన నెవ్వరికెవ్వరో! వృథా
పలుకు లిఁకేల భూతలము స్వర్గమొనర్పుమ సాఖి, పాత్రికన్‌.

చకచకలాడు ద్రాక్షఫలసారము వేణురవంబు, గానమున్‌
నికటమునన్‌ నిలింపరమణీమణిఁ బోలిన యెమ్మెలాఁడి! నా
కిఁక మఱియేమిలోటు? సగమెత్తియు వ్రాలెడికన్నుదమ్ములన్‌
సకియ, జయింపనే సమయసంకటముల్‌ త్రుటిలోన వారెవా!

Panasala Duvvuri Ramireddi 1991 123 P.pdf

నాదు యశోవగుంఠనమునం గనుపట్టెను జిల్లుచీలికల్‌;
పైదలి, యైనఁగాని మధుపానము మానను బ్రాన ముండఁగన్‌;
ఆ దరిబేసు లాసవము నమ్మి మఱేమి యమూల్యవస్తు సం
పాదన సేయువారొ విసుమానము నొందుదు వారి చేఁతకున్‌.
      
నిరతముఁ బానమత్తులము, నీతులు గీతులుఁ దెల్పఁబూన కో
విరసుఁడ, పానపాత్ర నులివెచ్చని ద్రాక్షరసంబుదప్ప మా
సరసపు గోష్ఠి వేఱొక విచారములేదు, ప్రియాంగనా మనో
హర మధురాధరామృతము నానుటొ, యాసవ మానుటోగదా!

Panasala Duvvuri Ramireddi 1991 123 P.pdf

వారుణి నానుచుండఁ బ్రతిపక్షులు పల్కిరి: 'వద్దు ఛీ! మతా
చారవిరోధి పానకలశం' బని; యయ్యది సత్యమేని వ
హ్వారె! మతాపకృద్రుధిరపానముఁ జేసెద; ధర్మశత్రుసం
హారము శాస్త్రసమ్మతము నౌనని చెప్పరె పండితోత్తముల్‌!

త్రావము జాహిదీలమని దంబము గొట్టెదవేల? యంతక
న్నా విపరీతకృత్యము లొనర్తువు నిత్యము; మాయవేషముల్‌
భావములోని కల్మషముఁ బాపునె? మానవసంఘ రక్తముం
ద్రావెదవీవు; ద్రాక్షఫలరక్తము మాకు రుచించు నెప్పుడున్‌.

చిరిగిన బొంతలం దొడిగి సిద్ధుల మంచవివేకలోకమున్‌
మొఱఁగి చరించు దుర్జనుల మోసముకంటెను మేలుగాదె యో
గురువర, కామినీ ప్రణయ గోష్ఠుల నాసవసేవ; త్రావినన్‌
నిరయము దప్పదన్న, మఱి నీ సురలోకము పాడుగాదొకో?

Panasala Duvvuri Ramireddi 1991 123 P.pdf

గురువ, సలాము, దైవమునకున్‌ మము వీడుము; మీకు మౌనమే
పరమహితంబు; అజ్ఞతను బల్కక యుండినఁ జాలు; మేము గ్రు
మ్మరునది సత్పథంబు గనుమా, నయనార్తుఁడవౌట దారి వ
క్కరముగఁదోఁచుఁ; గన్నులకు కాటుకవెట్టుము, చూపుమేలగున్‌.

Panasala Duvvuri Ramireddi 1991 123 P.pdf

తెఱవ కడాని ఱొమ్మొఱగుదిండున మే నరమోపి పూవుఁజ
ప్పరములఁ గూరుచుండి మధుపాన వినోద విపంచికా రవ
స్ఫురిత ముదాత్ములైననె రుచుల్‌ వచియింపఁగవచ్చుఁగాని, నే
ర్చిరె యలరెంటికిం జెడిన రేవళు లందు మజా నెఱుంగఁగన్‌.

Panasala Duvvuri Ramireddi 1991 123 P.pdf

కనుఁగొను శబ్దరూపరస గంధములన్‌ సుఖమైనస్పర్శ మో
హనమగు నీప్రపంచము ననంతముగా సృజియించి ధాత చే
సెనె శిలతోడ మానవుని చిత్తము? సద్ధృదయంబు లేనిచో
జనులఁ బరస్పరప్రణయ సఖ్యము మందున కైనఁ జిక్కునె?

Panasala Duvvuri Ramireddi 1991 123 P.pdf

కలపయు మట్టి ఱాల నిడి కట్టిన దేవళమందు నీకు నే
ఫలము లభించు? ప్రేమరస భావయుతుండవయేని కామినిన్‌
వలవుము; ప్రాణహీనమగు బండలు వేయిటికన్న శ్రేష్ఠమై
యలరుఁగదా మనుష్యహృదయంబు ప్రతిప్రణయానురక్తులన్‌.

Panasala Duvvuri Ramireddi 1991 123 P.pdf

దేవ, నీవులేని గుడిఁ బ్రార్థించుకంటెఁ
బానశాలను సత్యంబు పలుక మేలు;
సృష్టి కాద్యంతములు నీవె; స్రష్టవీవె;
పాలముంచ నీటను ముంచఁ బ్రభువు నీవె.


కొందఱు ధర్మమున్‌ మతముఁగూర్చి నిరంతము చింతసేయ నిం
కెందఱొ సత్యసంశయము లేర్పఱుపం దలదిమ్ము గాంచ, నా
సందున మాటువీడి "యిఁకఁ జాలును లెండు వెడంగులార, మీ
కందును నిందు లేదు పథ" మంచు మునాది వచించువారికిన్‌.

Panasala Duvvuri Ramireddi 1991 123 P.pdf

మునుపు మసీదువాకిటను ముచ్చెలు దొంగిలిపోతిఁ; బ్రాతవై
చినిఁగెను; నేఁడునున్‌ మరలఁ జెప్పులకోసము వచ్చినాఁడ; నె
మ్మనము సెడంగ నియ్యెడ నమాజొనరింపఁగరాను; నీవు చ
చ్చినయెడ వీడిపోయెదవు చెప్పులువోలె నమాజు సైతమున్‌.

Panasala Duvvuri Ramireddi 1991 123 P.pdf

సలలితగోస్తనీ ఫలరసంబునుగ్రోలెడువారు, దేవళం
బుల నిశియెల్లఁ బ్రార్థనలఁ బుచ్చెడువారు; జలప్రవాహవీ
చులఁబడి మున్గినారు; పొడిచోటి కొకండును జేరఁ; డొక్కఁడే
యలరుఁ బ్రబుద్ధుఁడై; మిగతయందఱు మత్తులు పెద్దనిద్దురన్‌.

Panasala Duvvuri Ramireddi 1991 123 P.pdf

మితిసెడ, సృష్టివేళ్‌ఁ దనుమృత్తిక నెవ్వఁడు మేళవించె; జీ
విత సిచయంబునం బడుగుపేకల నున్నియుఁ బట్టుగల్పె; దు
ష్కృతులను బుణ్యకార్యములఁ జేయ లిఖించెను నొష్ట, వాఁడె మ
త్కృతులకు మూలకారణము, కీడును మేలును వాని సేఁతలే.

పాపముఁ జేసితంచుఁ దలఁపం బనియేమి ఖయామ? దుఃఖ సం
తాపము నిష్ఫలంబగు; వృథా వగపిల్లుట మాను; మెవ్వరుం
బాపము సేయకున్నఁ దన మన్నన యెందుకు? కల్మషాత్ముల\న్‌
'రేపు' క్షమించుఁ; బాపము హరించును దైవము; సంతసింపుమా.

Panasala Duvvuri Ramireddi 1991 123 P.pdf
Panasala Duvvuri Ramireddi 1991 123 P.pdf

ఎవ్వఁడు తప్పుసేయఁ; డిల నెట్టుల జీవిక సాగుఁ జేయఁడేన్‌;
అవ్వలఁబాపి వీఁడనుచు నక్రమశిక్ష విధింతువయ్య! యీ
రవ్వయు రచ్చయేల యపరాధుల మిద్దఱ మౌట; నీకు నా
కెవ్విధమైన భేదము రహించునొ కాస్త వచింపు మీశ్వరా?

మును నే నస్థితి నిద్రనుండ నిలకుం బోఁదోలి దుఃఖంబులం,
దను సౌఖ్యంబుల నందఁజేసి మరలం దర్జించు వౌరౌర! పా
పిని శిక్షింతు వటంచు; నీచతురతన్‌ వేనోళ్ళఁ గీర్తింతు రీ
వినయార్తుల్‌; మఱి శిక్షకర్హుఁడవు నీవేకావె లోకేశ్వరా?

కరుణావార్ధివి నీవు, నే నిఁకను దుష్కర్మంబు వర్జించి ని
ర్భరవైరాగ్యముఁ బూన నీవు కృపఁజూపంబాత్రులెవ్వారు? నీ
బిరుదున్‌ నిల్పుట కే నొనర్చితిని నిర్భీతిన్‌ సమస్తాఘముల్‌;
సరకం బంటకయున్న వీలగునె పశ్చాత్తాపముం బొందఁగన్‌.

Panasala Duvvuri Ramireddi 1991 123 P.pdf

నీవు కృపాంబురాశివివఁట! నిక్కమయేని ఇరాముతోఁటకుం
బోవఁగనీక పాపిజనము\న్‌ మరలించుటయేల? భక్తులం
గావఁగ వత్తువేని కృపగాదది, బేహర; మింద నున్న మీ
యాపుల కన్నఁ, బాల్వలయునా పసిపాప కటన్న సామెతౌ!
     
అంబరు ముంగురుల్‌ నొసలి యంచుల వ్రేలఁగఁ జూచినంత మో
హం బెసకొల్పు కోమల లతాంగినిఁ గల్పనచేసి నీకు న్యా
యంబె మఱెవ్వరు\న్‌ మొగమునారయరాదని యాజ్ఞవెట్టఁ; బూ
పంబును చేతికిచ్చి తినవద్దని చెప్పుట యేల దైవమా?

మనుజుని వారుణిం బ్రణయమాధురి సుందరిఁ జేసి భూమినం
దనమున కంపినాఁడవు; మనంబగుఁ బ్రేరక మెల్లకర్మకు\న్‌;
వెనుక నదేల మాతలను వేసెద వీ యపదూఱు? నీవె శా
సన మపరాధియు\న్‌ మఱి విచారణకర్తయు; చిత్రమీశ్వరా?

Panasala Duvvuri Ramireddi 1991 123 P.pdf

అలరె విమర్శనంబు! కననయ్యె వివేకము; సర్వశాస్త్రముల్‌
దెలిసిన పండితోత్తములనే నిఱుపేదలఁ జేసినాఁడ; వం
జలిని ప్రసాదమై పిడుగు జాఱును భక్తుల; కింతయేల? దు
ష్టులకు సుఖంబు సంపదలు చొప్పడు, నింపగునీకుఁ బాపముల్‌.
 
నెలఁతా, దేవునికట్లు నాకును జగన్నిర్మాణమర్మక్రియల్‌
గలవే\న్‌, దుర్విషమప్రచారి యగు లోకంబు\న్‌ యథేచ్ఛామతిం
జెలువంబౌనటు సంస్కరించి నవసృష్టింగూర్తు సన్మార్గవ
ర్తులు ప్రాజ్ఞుల్‌ భువి సర్వసంపదల సంతోషంబుగ\న్‌ వర్ధిల\న్‌.

Panasala Duvvuri Ramireddi 1991 123 P.pdf

ఈ విషవృక్షలోకమును నింకొకరీతిఁ బునః సృజింపుమం
చే వినతి\న్‌ వచింతు; నది యిష్టమయేని రచించు చెచ్చెర\న్‌;
దేవ, మదీయ నామమును దెప్పునఁ బట్టికఁ గొట్టివేతువో,
నావయసు\న్‌ శతాధిక మన\న్‌ సవరింతువొ చూడఁగావలె\న్‌.

     
కోరిక లన్నియు గుడుపుగూరవు, సౌఖ్యము దుఃఖమెప్పు డం
గూరురసంబుఁ జేఁదటులు గూడియెయుండు, గులాబి కంటకాం
కూరము లంటియుంట మనకుం బరివర్జ్యమె? ఱంపకోఁతలం
జీరికలౌట దువ్వెనయుఁ జేకొను జవ్వని తావిముంగురుల్‌.

ధనము నలక్ష్యభావమునఁ దత్త్వవిదుండు నుపేక్షచేసినం
తినగతిలేని పేదలకు, దివ్యవనంబగు నిజ్జగంబు బం
ధనమగు; పైఁడిసంచుల మదంబున విప్పి గులాబి నవ్వఁ గం
బనవును నీలకాంత వని బాఱలుచాఁపుచు నుత్తచేతుల\న్‌.

Panasala Duvvuri Ramireddi 1991 123 P.pdf

కనుల హిమాంబుబాష్పములుగాఱవచించె గులాబి, ముద్దు మో
మును నగుసోయగంబుఁ దలపోయక, నన్ను సుగంధకారి కాఁ
చునకట యన్న, బుల్బులియు, సుందరి, సామెతవింటె; నేఁడువిం
దును నొకయేఁడుకుందు; విధిదుష్టమవార్యమటంచుఁ బల్కెడిన్‌.

Panasala Duvvuri Ramireddi 1991 123 P.pdf


కాలశరాసనోత్పతితకాండము తీక్ష్ణము; తచ్ఛిలీముఖ
జ్వాలల మాడకే మనుము; వాడనిపుంటను చౌడుఁ జల్లు దు
ష్కాలము నీకు నోటఁ బులకండము బాదముఁ బెట్టవచ్చినన్‌
నాలుకఁ జాఁపఁబోకు మొకనాఁడయినన్‌, విషదిగ్ధ మద్దియున్‌.

విధి నిబద్ధములైవచ్చు వెడలిపోవు
నఖిల సుఖదుఃఖములు నీ కయాచితముగ;
జడియ బోకు రుస్తుముజాలు శత్రుఁడైన,
తాయి సఖుఁడైన విందులఁ దలఁపఁబోకు.

Panasala Duvvuri Ramireddi 1991 123 P.pdf
Panasala Duvvuri Ramireddi 1991 123 P.pdf

రెండుదినముల కొకతూరి యెండురొట్టె
బోసిముంతెఁడు చలినీళ్ళు పుట్టునేని
ఏల నినుఁబోలువానికిఁ గేలుమోడ్ప?
నొకనికి గులామవై యెందుకూడిగింప?

      
విషము నమృతంపు మసిబుడ్ల విధి కలంబు
ముంచి లోకుల నుదుట లిఖించు మొదటఁ;
గరఁగ దఱుఁబేద కన్నీటి కాల్వనదియుఁ,
బరమభక్తుని యనుతాప వహ్నిఁ జెడదు.

 
కాన నెదిప్రాప్తమైనను గారవించు,
వలయు వలదని యేర్పఱుపంగ లేవు;
అంబరంబును నీకు సహాయపడదు,
తానె తలక్రిందుగా వ్రేలుఁ; దడవు నిలదు.

Panasala Duvvuri Ramireddi 1991 123 P.pdf

ఇల చదరంగ; మందు జనులెల్లరు పావు, లహస్సులున్‌ నిశల్‌
తెలుపును నల్పుగళ్ళు; కదలించును రాజును బంటుఁ దక్కు పా
వుల విధియాటకాఁడు; పలుపోకలఁ ద్రిప్పును గళ్ళుమార్చు, న
వ్వల నొకటొక్కటిం జదిపివైచు నగాధ సమాధిపేటికన్‌.


జ్ఞానపటాలయమ్ము నొడికమ్ముగఁ గుట్టు ఖ్యామ నేఁడు దుః
ఖానలదగ్ధుఁడయ్యె, యముఁడన్‌ బెనుకత్తెర జీవితంపు బి
ఱ్ఱూను గుడారుమోకుఁ దెగనొత్తెఁ; బ్రపంచపుసంతలోన దు
గ్గానికి నమ్మె నిన్నుఁ బలుగాకిదలాలి విధాయి, యయ్యయో!

మనమున కెక్కినట్టి యభిమానులు మిత్రులుఁ జెల్లినారు; యౌ
వన మధుమాసముం గుసుమభారము రాలిచిపోయె; జీవితం
బను సరకంబునందు నడుగంటె మధూళియు; నేదినంబు వ
చ్చెనొ మఱియెప్పుడేఁగెనొ దిసింపదు హర్షవిహంగమిప్పుడున్‌.

Panasala Duvvuri Ramireddi 1991 123 P.pdf

పూవులకారు రాకలకుఁ బోయెడిసీతులకున్‌ రసోజ్జ్వల
జ్జీవిత కావ్య పత్రములఁ జెచ్చెఱఁద్రిప్పితి; శోకసర్పద
ష్టావిలమౌ హృదంతరము నాసవమన్‌ ప్రతియోగమొక్కటే
కావ సమర్థ; మింక ముదికాయము లేఁతగిలంగఁ ద్రావెదన్‌.

Panasala Duvvuri Ramireddi 1991 123 P.pdf
108

నిన్నటిరోజు కుమ్మరిని నేఁగనుఁగొంటి బజారువీథిలో
మన్నొక ముద్దఁజేసి మడమం జెడఁద్రొక్కుచునుండ, వానితోఁ
దిన్నగ మందలించె నది దీనత "మెల్లఁగ నల్లఁ ద్రొక్కుమో
యన్న, యెఱుంగవే నను? నొకప్పుడు నీవలె నందగాఁడనే!"

మానగదోయి, యెందనుక మానవమృత్తికఁ దెచ్చి ముంతలున్‌
బానలుఁజేసెదీవు మఱవందగ దందఱు నట్లెయౌట; య
జ్ఞానముచే నిజంబెఱుఁగఁ జాలవు; నేనుగ్రహించితిన్‌; ఫరీ
దూను శిరంబుఁ గాంచుమ యదో! దరిబేసి కరంబు దగ్గఱన్‌.

Panasala Duvvuri Ramireddi 1991 123 P.pdf

పొలుపుగ మాటనేర్చినవి మూగవి కుండలురెండువేలు లో
పల నొకమూలనుండి యిటువల్కె ననుంగని "కుంభకారులున్‌
విలిచినవారు, మమ్ముఁ బురవీథులనమ్మిన వారలేరి? యే
తలమున కేఁగినారలు? వదంతి యెదేనియు విన్నఁ దెల్పుమా."

 
ఎందుకుఁ జూచినన్‌ గనక యేఁగెదు? చక్కని గిండిగానొ, న
న్నందఱు వ్రేలుచూపి పరిహాసము చేయుదు; రైపు నాది గా
దిందుఁ, గులాలశిల్పి నను నిట్లొనరించె; రచించు నప్పుడుం
దందరలాడె నేమొ చెయి త్రావుడుమత్తున, నొక్కె సొట్టగన్‌.

ఓరీకుమ్మరి, పిల్పువచ్చు; వినుమా యొక్కింత నాకోర్కె; నా
గోరీమృత్తికఁ బానపాత్ర లిటికల్‌ కూజాలు జాడీలు సొం
పారం దీరిచి యమ్మవోయి మదిరాపణ్యంబులన్‌; గోస్తనీ
సారస్పర్శఁ బునఃప్రబోధితుడనై సత్యంబుఁ జాటించెదన్‌.

Panasala Duvvuri Ramireddi 1991 123 P.pdf
111

కడుగుఁడు నాశవంబుఁ దడిగా మధుధారల; ద్రాక్షపుల్లలుం
బుడకలు పెట్టెయల్లి ననుబూడిచి పెట్టుఁడు; శీధుబిందులన్‌
వడిసెడి నాదుమృత్తికల వాసన గుర్తగుమీకు; 'రేపు' నన్‌
బడయుదు రాసవాలయము వాకిటనో, చెలి కాలిధూళినో!

Panasala Duvvuri Ramireddi 1991 123 P.pdf
112

ఉత్తమోత్తమ గురుల శిష్యుండ నైతి,
గురువునెత్తిని సచ్ఛిష్య కోటులకును;
మరణశయ్య నంత్యార్థము మందలింతు;
ధూళి జనియించితిని; గాలిఁ దేలిపోదు!