పాతఞ్జలమహాభాష్యము - పస్పశాహ్నికము
పాతఞ్జలమహాభాష్యము
పస్పశాహ్నికము
ఆంధ్రానువాదము
శ్రీభాష్యం అప్పలాచార్య, ఎమ్. ఏ.,
విద్యాప్రవీణ, భాషాప్రవీణ,
సంస్కృతప్రచారసభ, రాజమండ్రి.
వలయువారు :మహీధర జగన్మోహనరావు,
విశ్వసాహిత్యమాల,
రాజమండ్రి - 2.
ప్రథమ ముద్రణ :- శార్వరి - మాఘము.
ద్వితీయ ముద్రణ :- సౌమ్య జ్యేష్ఠము.
ముద్రణ : భారతీప్రెస్, రాజమండ్రి.
రు 2-50
బైండు 3-50
ప్రతులు వేయి.
తొలిపలుకు
శ్రీమాన్ శ్రీభాష్యం అప్పలాచార్యులు గారు వ్యాకరణవిద్యాప్ర్రవీణులై. పతజ్ఞలిమహర్షి విరచిత మహాభాష్యము పస్పశాహ్నికమున కాంధ్రానువాదమును దక్షతతో సాగించియున్నారు. ఇది కేవలము మూలానువాదము గాక, కైయటోద్యోతముల సహకారసమన్వితమైన వివరణముతో సాగినది. శాస్త్రీయ విషయముల పఠన పాఠన సంప్రదాయము సడలుచున్న నేఁటిసమయమున, యాంధ్రానువాదరూపమున నిట్టి విషయములను ఆంధ్రపాఠకుల కందీయవలసిన యక్కఱ యేర్పడి యున్నది. దాని కీ యనువాదము మిక్కిలి సహకారకారి కాఁగల దని, ఆంధ్రసాహిత్యపరిషత్సక్షమున ప్రార్థింపఁగా శ్రీమాన్ ఆచార్యులవారు శ్రమకోర్చి యీ యనువాదమును సాగించి, యాంధ్రపాఠకలోకమున కందిచ్చియున్నారు. వ్యాకరణశాస్త్రస్వరూపమును, తదధ్యయన రయోజనమును నెఱుఁగఁగోరు తెలుఁగువారి కీ పస్పశాహ్నికము విశేషసహకారి కాఁగలదు. శాస్త్రీయవిషయములను దేశభాషలలోని కనువదించుట శ్రమసాధ్యమైన విషయము. అట్టి విషయమును జేపట్టి, శక్యమైనంతవఱకు సుబోధమగు పద్ధతిని అనువాదము సాగించి లోకమున కందిచ్చిన యీపస్పశాహ్నికము ఆంధ్రపాఠకలోకమునకు విశేషోపకారి కాఁగలదని యాశించుచున్నాఁడను.
ఇట్లు,
చిలుకూరి పాపయ్యశాస్త్రి,
సంపాదఁకుడు,
ఆంధ్రసాహిత్యపరిషత్ప్ర్పతిక
ఆముఖము
సంస్కృత వ్యాకరణమువలె సమగ్రము నిర్దుష్టము సులభము నగు వ్యాకరణము వేఱొకభాషకు లేదు, దానిలోని సంగ్రహవైశద్యములు అనితరసాధారణము. అట్టి మహోత్కృష్టమయిన వ్యాకరణమునకు బీజావాపమును జేసిన మహాముని పాణిని తన కాలమునకున్న వైదిక లౌకిక భాషలలోని పదముల ననుశాసించుచు, సంగ్రహముగ సూత్రప్రాయమయిన వ్యాకరణమును రచించెను. ఆ సూత్రములు ఎనిమిది అధ్యాయములుగ నుండుటచే దానిని "అష్టాధ్యాయి” అని వ్యవహరించుచున్నారు. అందు మొదట పరమేశ్వరునుండి లభించినవిగా నిబంధించిన 14 మాత్రములలో నిబద్ధ మైనది ఆక్షరసమామ్నాయము. దానిచే సాధించిన ప్రత్యాహారముల సంగ్రహశక్తిని గాంచినవారు ముగ్ధులై యాతని యలౌకికశక్తికి జోహారు లర్పించుచుందురు. మన యాంధ్రభాషకు “అచ్చు" “హల్లు" అను పదము లా మహామహిముని ప్రత్యాహారనిర్మాణదక్షతచే సిద్ధించిన ప్రసాదములే. ఇట్లు 'సూత్రములు 'గ పాణిని వ్యాకరణమును నిర్మించిన తరువాత కొంతకాలమునకు “కాత్యాయనుఁడు” అను మఱియొక యాచార్యుఁడు పాణిని సూత్రములపై 'వార్తికములు' రచించెను.
మఱికొంత కాలమయిన పిదప 'పతంజలి' యను శేషాంశసంభూతుఁడగు నాచార్యుఁడు పాణిని విరచితమగు 'ఆష్టాధ్యాయి'కి వివరణముమ 'మహాభాష్య' మను పేర రచించెను. ఈ మువ్వురు ఆచార్యులు 'మునిత్రయము' అను పేర వ్యవహరింపఁబడుదురు. వీరు సంస్కృత వ్యాకరణ ప్రపంచమున త్రిమూర్తులు.
పాతంజలమగు మహాభాష్యమున ముందు ఉపోద్ఘాతమున, వ్యాకరణ మన నేమి? దాని ప్రయోజన మేమి? దాని నెట్లు రచింపవలెను? మొదలగు ప్రశ్నములకు సమాధానములు వివరింపబడినవి. దానిని 'పస్పశాహ్నికము' అందురు. దాని నాంధ్రమున వ్రాయుట కుపక్రమించుట సాహసమే యని తెలిసియు సాధారణముగా నన్ని వ్యాకరణములకు సుపయోగించు విషయము గావున, ఆమాదితమైన నందఱకును సేవచేసి నట్లగునని తెనిఁగించితిని. అనువాదము చేసి ప్రదీపోద్యోతములలోని విషయములను నా యోపినంతవఱకు వివరణమున నొసంగితిని. నాయీ సాహసమును మన్నించి పండితులు దోషములను సరిచేసికొని యానందింతురుగాక యని యభ్యర్థించుచున్నాను.
ఇట్లు,
అనువాదకుఁడు.
మా మాట సంస్కృతప్రచారసభ స్థాపించవలెనను ఉద్దేశ్యము 1967 ఆరంభంలో కలిగింది. కొందఱు మిత్రులు కలిసి గావించిన యత్నాలు గోదావరి పుష్కర కాలంలో గావిం చిన మహా సభలో పర్యవసించినవి. శ్రీ కామకోటి పీఠాధిపతులు చంద్ర శేఖ రేంద్ర సరస్వతీస్వామి వా రా సభలకు అధ్యక్షత వహించి, మా యత్నముల నామోదించి, ఆశీర్వదించిరి. వారణాసి సార్వభౌమ సంస్కృత ప్రచార కార్యాలయం స్థారు కులు శ్రీ వాసుదేవ ద్వివేదీ, వేదశాస్త్రీ, సాహిత్యాచార్య మహోదయులు ఆసభలకు విచ్చేసి, సభల తరువాక నెల దినములం మాయింటనుండి, తమ కృషిని గురించియు, మా కర్తవ్యమును గురించియు చెప్పి, నాకు ప్రోత్సాహ మిచ్చిరి. నేను తెలుగులో వివిధ విషయములపై వ్రాసిన, ప్రచురించిన గ్రంథములను చూచి, సంస్కృత భాషా సారస్వతమునందున్ను ప్రబోధార్థమై సులభమైన పుస్తకములు వెలువర్చమని ప్రోత్స హించిరి. “అనేకమంది మహాపండితు లున్నారు, వారు తల పెట్టనిది ఆల్పజ్ఞుడనైన నావల్ల నేనుకును ? ఏమి చేరుగలను ?" అన్నాను వారితో. శ్రీ ద్వివేకిగా త పండితులు, కార్యకర్తలూ గూడ, ఈ రెండు గుణాలు ఒకే వ్యక్తియు గుండుట ఆరుము. వారు నావల్ల యీ కార్యక్రమము ఆరంభింపబడాలని నొక్కి చెప్పడమే గాక కాశీ వెళ్ళినతరువాతగూడ అనేక లేఖలద్వారా ఎన్ను తొందర పెట్టుకూ వచ్చిరి - చాలమందితో యీ విషయములపై చర్చించుచువచ్చారు. అనేక నగరాల్లో పండికు అను కలిసి మాట్లాడినాను. శ్రీ జటావల్లభుః పురుషోత్తం ఎం. ఏ. శ్రీమానా ప్రగడ శేషశాయిగార్లను కలిసి, కార్యక్రమము గూర్చి మాట్లాడితిని. సంస్కృత బోధనకు ఉచిత తరగతుల నేర్పాటు చెయడం, కొన్ని చిన్న చిన్న పుస్తకమాలను ప్రచురిం చడం, సంస్కృత ప్రచార సభలను స్థాపించి, అప్పుడపుడు ఉపన్యాసములు యిప్పిం చడం ప్రథమ దశలో కర్తవ్యములుగా భావించాము. ఏలూరులో శ్రీమాన్ యన్. సి. యస్. వేంకటాచార్యులు గారితో పలుమారు కలిసి, సంస్కృతభాషా ప్రచారము విషయమై ఏమి చేయగలమా ? యని ఆలోచిం చాము. అల్పమే గానీ ఆరంభం గావించాలని అప్పుడే నిర్ణయించుకొని, ముందుగా ప్రచురించవలసిన పుస్తకప్రణాళిక సిద్ధపరచితిని. 'భాగవత సుభాషితములు' అను చిన్న పుస్తకమును 151 శ్లోకములు - తెలుగు తాత్పర్యముతో సంకలనం చేసి ప్రచురించితిని, దానితో నే యీ • 'సంస్కృత ప్రచార 31 'సభ' ప్రచురణలు ఆరంభించితిని. ఇందుకు నాకు గల యోగ్యత ఉత్సాహము తప్ప -ము రేమీ లేదు. పాండిత్యమూ, ధనమూ కూడ నాదగ్గర లేవు గదా. ఇవి రెండూ పుష్కలంగా ఉన్న వారు యీ ఉద్యమాన్ని ఆరంభిస్తే మంచికి. గతంలో యిట్టి యత్నము లనేకు లారంభించి, కొంత కృషి గావించి విరమించడం జరుగుతూ వచ్చింది. మరికొందరికి కూడ నా యీ చిన్న ప్రయత్నంవల్ల ఉత్సాహం కలుగవచ్చు నేమో ? అని భావించాను. ఆ ఊహ నిజమే ఐనది. మిత్రులు శ్రీమాన్ శ్రీభాష్యం అప్పలాచార్యులు ఎం. ఏ. గారు తాము అనువదించిన 'పాజ్ఞల మహాభాష్యము' సస్పశాహ్నికమును రాజమండ్రి సంస్కృత ప్రచారపర పక్షిమున ద్వితీ తకుసుమముగా ప్రచురించుటకు దయతో సంగీకరించుటే గాక కానికగు వ్యయమునుతను వారే భరించిరి. ఈ గ్రంథ ప్రశస్తి పండితైక వేద్యము. విపులమైన 'అభివాదము'ను వ్రాసిన శ్రీ వేదుల శ్రీరామ చంద్రకీర్తి ఎం. ఏ. గారు సంస్కృత వ్యాకరణకర్తలలో మఖ్యులైన పాణిని, కాత్యా యసుడు, పతేస్టైలి యీ మహర్షి త్రయము యొక్క అమూల్య కృషిని చక్కగా వివరించిది. - భాషాశాస్త్రజ్ఞులైన అనేకులు పాశ్చాత్య పండితులు వేనోళ్ళ కీర్తించిన సంస్కృత వ్యాకరణ రచన ఎట్టికో? అది మన తెలుగు పౌరులను రుచి చూపించ గల్గినందుకు సంతోషించుచు, తగు ప్రోత్సాహా యున్నచో మరికొన్ని ప్రపంచఖ శాస్త్రీయ గ్రంథములను కూడ వెళ్లు గర్బవలచి యున్నామని మపి చేయుచున్నాము. 'సుభాషితములు' అను మూడిన గ్రంథముహడ త్వరలో నే ఆంధ్ర వారసలకు ఆందీయగలమని తెలుపుటకు సంతోషముగ నున్నవి. సంస్కృత సాహిశ్వములో కొల్లలుగ నున్నవీ, మనోహరములూ, అర్థవంతములు, భీకర్మలూ ఐన వాటిని వేయింటిని ఎంచితీసి, తెనుగు తాత్పర్యముతో ప్రచురించితిమి. వాటిలో ఒక్కొక్క దానిని తీసి, రోజు కొకటిగా విద్యాలయ ప్రవేశద్వారమున ప్రముఖముగ గోడపైన గాని, నల్లబల్ల పైన గాని వ్రాప్తి, విద్యార్థులు చదువునట్లు ప్రదర్శించుచో సక్ఫలి3ములు కలుగునని మనవి. 'ప్రాచీన భారత నీతి' యను దానిని మా నాల్గవ గ్రంథముగా వెలువర్చ నిర్ణ యించితిమి. శుక్రనీతి, భీష్మనీతి, చాణక్యనీతి, కామందక నీతి, విష్ణుశర్మ పంచ తంత్రము, క్షేమేంద్రుడు, సోమదేవుడు, కాశ్మీరకవి గుమానీ, యితరులు కొందరూ వచించిన రాజనీతి బోధనలను తెలుగు తాత్పర్యమూ, వ్యాఖ్యానముతో ప్రచురించు టకు నిశ్చయించితిని. ఆవికాశములనుబట్టి మరెన్నో ఉత్తమ గ్రంథములు ప్రచురణకం సిద్ధముగా ఉన్నాయి. 82 'ధనమూల మిదం జగత్' అనే దొక ప్రాచీన సంభాషితము, 'అర్ధస్య పురుషా దాసః' అనేది మరొకటి. 'జగద్వ్యాపారానికి ఆర్ధార్ధ సంబంధములే వునాది' అని కారల్ మార్క్సు మహాశయుడు నిర్వచించియున్నాడు. ఏ ఆధునిక సిద్ధాంతమును తీసికొన్నా దానిని ఏవో యొకచోట సంస్కృత సారస్వతములో చూడగలను. ఏ. దెట్లున్నా భావముల కేమి భారతీయులలో దారిద్య్ర్యము లేదనిపిస్తుంది. వాస్తవానికి భారతదేశంలో దేవికీ దారిద్య్ర్యం ఉండనవసరంలేదు. కాని, నేటి మన ప్రజలలోని పంగుచిక స్వార్థలు, నిష్కర్మణ్యత తొలగివస్తే మన దేశం తొల్లిటి ఔన్నత్యమునకు రాగలదు. ప్రతి చిన్న విషయానికీ యితరుల పై ఆధారపడు అధమస్థితి తొలగుటకు మన పూర్వస్థితి కొంత తెలుసుకోవాలి గదా. అందుకైన మా యీ చిన్న పుస్తకము తోడ్పడిన ధన్యులము, ఉడుతాభక్తిగా మా గావించు యీబూ కృషి ఆంధ్ర మహో దయుల ఆమోదాన్ని పొందునని ఆశిస్తాము. alp 2 మరొక్కమాట, ఆంధ్రదేశంలో అతి ప్రాచీనమైన శ్రీ గౌతమీ గ్రంథా లయంలో ఉచిత సంస్కృత తిరగతుల నారంభించ నిశ్చయించి, అందులకై కాగల వ్యయమును మా సంస్కృత ప్రచారసభ భరించదలచినది. ఆ ఉద్దేశ్యమున్ను త్వరలో ఆచరణలో పెట్టదలచియున్నాము. మా ప్రచురణములవల్ల లభించు సొమ్ముతో న, ఉదారులిచ్చు విరాళములతోను యీ సంస్కృత బోధనను కొనసాగించవలెనని సంకల్పము. బొంబాయిలో భారతీయ విద్యాధవనమువారు విశ్వవ్యాప్తముగా సంస్కృత ములో పరీక్షలు నడుపుచున్నారు. నే నచ్చటికి బోయి, వారి కార్యక్రమమును చూచి వచ్చితిని. ఆ పరీక్షలకు మన రాజమండ్రిలో కూడ ఒక కేంద్రమను ఏర్పాటు చేయుట యుక్తమని నా భావము. ఈ పథకమునకై తోడ్పడి, భారతీయ సంస్కృతిని నిల్పుటకు, పరిపుష్టు మోన రించుటకు యత్న మొనర్చుట మన విషయని మనవి గావించుకు సెలవు తీసికొందును, 1969 8. మహీధర జగన్మోహనరావు, సంచాలక కార్యకర్త, సంస్కృత ప్రచారక సభ, రాజమండ్రి.