పల్లెపదాలు/నాట్లు నాటుతూ

వికీసోర్స్ నుండి

7 నాట్లు నాటుతూ

గట్టూమాకులుగట్టి గడలూ బొందిచ్చి
గట్టురాయని ఇంట్లోపుట్టె గౌరమ్మ
పుట్టుటే గౌరమ్మ ఏమేమిగోరు
కుట్టూ వయ్యారిరవికె, కుంకుమాకాయ
జాలవయ్యారిరవికె జామాలపేరు
వంకా చక్కటికుడుక వజ్రాలపేరు
నీచేతి కంకణము ఏదే శ్రీగౌరు
ఆడబోయినకాడ ఏడబోయినదో


కల్పన పొలాన్ని దాటి గౌరమ్మను మలచింది. గౌరమ్మ రత్నాల గట్టురాయని గాదిలిబిడ్డ. కంకణము జారుటను గుర్తించునవసర మామెకేల? తల్లి అయినా కూతురు చేతి కంకణము 'ఏది?' అనే అడిగినది. "ఆడబోయినకాడ ఏడబోయినదో" నట! ఈ వాతాయనములోనుండి గట్టురాయని సిరికొండయై గోచరించగలదు.