పలుకరాదటే చిలుకా పలుకరాదటే
Appearance
ఇది షావుకారు (1950) సినిమా కోసం సముద్రాల రాఘవాచార్య రచించిన లలితగీతం.
పలుకరాదటే చిలుకా పలుకరాదటే
సముఖములో రాయబారమెందులకే
పలుకరాదటే చిలుకా పలుకరాదటే
ఎరుగని వారమటే
మొగ మెరుగని వారమటే
పలికిన నేరమటే
పలుకాడగ నేరమటే
ఇరుగు పొరుగు వారలకే
అరమరికలు తగునటనే
పలుకరాదటే చిలుకా పలుకరాదటే
మనసున తొణికే మమకారాలు
కనులను మెరిసే నయగారాలు
తెలుప రాదటే సూటిగా
తెరలు తీసి పరిపాటిగా
పలుకరాదటే చిలుకా పలుకరాదటే