Jump to content

పరమభాగవతచరిత్రము

వికీసోర్స్ నుండి

పరమభాగవతచరిత్రము

కట్టా వరదరాజు

పరమభాగవతచరిత్రమను నేడాశ్వాసములగ్రంథ మేతద్గ్రంథకర్తృకర్తృక ముండితీరవలయునని తోఁచుచున్నది. అది గన్పట్టుట లేదు.

అష్టమాశ్వాసము

రుక్మాంగదుచరితంబు

క. శ్రీగంధగంధితసమ
    స్తాగశిఖాసంవృతాశితాగనిజగుణో
    పాగమవరపరిమళశే
    షాగవనిల వెంకటాచలనిలయా.
వ. అవధరింపు మిట్లు జనమేజయుం జూచి వైశంపాయనుం డిట్లనియె.

  • * *

తే. భోగరుచిధర్మవిక్రమస్ఫూర్తినిర్మ
    లత్వసౌరభ్యధనభూతులను దలంప
    సాటిరావని తెగడు నెప్పాట నద్ది
    శాపురంబుల నవ్విదిశాపురంబు.

ఆశ్వాసాంతము


మాలిని హతహితజనదైన్యా ఆదిమధ్యాంతశూన్యా
    వితతసుకృతపద్యా వేదవేదాంతవేద్యా
    దితితనయవిరామా దేవతాసార్వభౌమా
    జితరవిశతతేజా సేవకాదిత్యభూజా.
గద్య. ఇది శ్రీమదలమేల్మంగాసనాథ తిరువెంగళనాథకరుణాకటాక్షరక్షితసకలసామ్రాజ్యవైభవ కట్ట హరిదాసతనూభవ సాహితీభోజ వరదరాజప్రణీతంబైన పరమభాగవతచరిత్రంబను మహాప్రబంధంబునం దష్టమాశ్వాసము.

పుండరీకచరిత్రము


క. శ్రీమద్గార.....శిఖరిజా
    రిమిషకరుణి రసారచరిత సురయోగి
    గ్రామణి శుభలసదరుణి
    త్వామిషహృ.......వేంకటాద్రీంద్రమణీ.
వ. అవధరింపు మిట్లు జనమేజయుం జూచి వైశంపాయనుం డిట్లనియె.

ఆశ్వాసాంతము


మ. నినుబోలన్ రచియింప నొక్కఘనుఁ డెందే కంటిమే కాన మ
    జ్జననంబున్ సఫలంబు సేయుమన వైశంపాయనుం డిట్లనున్
    వినిపింతున్ ఘనుఁ డమ్మహారథునిసద్వృత్తంబు నానాసభా
    జనసంభావన మిష్టకామితము లీజాలున్ విశేషించియున్.
గద్య. ఇది శ్రీమదలమేల్మంగాసనాథ తిరువెంగళనాథకరుణాకటాక్షరక్షితసకలసామ్రాజ్యవైభవ కట్ట హరిదాసతనూభవ సాహితీభోజ వరదరాజప్రణీతంబైన పరమభాగవతచరితంబను
పుండరీకమహాప్రబంధంబునందు సర్వం సంపూర్ణం.

from
A Descriptive Catalogue of the Telugu Manuscripts in the Tanjore Maharaja Serfoji's Sarasvati Mahal Library.
Published by Andhra Visvakala Parishat 1933)