పదబంధ పారిజాతము/అన్యథా భావించు

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

అన్ని____అన్ను 67 అన్ను____అన్య

పైన ఇలా క్రమానుసారం పేరుస్తారు.

 • "పరము తపం బడంచి మఱి పార్వతి యం దనురక్తు జేయ మా, యిరువురకుం గుమారు డుదయించిన మాపగ దీరు నంచు నచ్చెరువుగ నన్ని దొంతులును జెప్పగ నేటికి." కుమా. 4. 50.

అన్నినయట్ల

 • నోటికి వచ్చినట్లు - అందిన అట్లెల్లా....

"అన్నినయట్ల యమ్ముని సురాధిపులం
జెడనాడుచున్న నీయున్న తికంటె." కుమా. 2. 28.

అన్ని యున్న విస్తరి

 • నిండుకుండ లాంటి పలుకుబడి. అన్నీ వడ్డించిన విస్తరి యెగిరి పడదు. అందుపై వచ్చిన పదబంధం.
 • "ఆయన అన్నీ ఉన్న విస్తరి. ఏమాత్రం తొణకకుండా తూచి మాట్లాడతాడు." వా.

అన్నీ అతుకులే

 • ఒకటీ పూర్తిగా, చాలి నంతగా లే దనుట.
 • "పొద్దున్నుంచీ లేనివి వెతుక్కోవ డానికే సరిపోతుంది. అన్నీ అతుకులే నాయె." వా.

అన్ను కొను

 • మద మెత్తు.
 • కాశీ. 2. 138.

అన్ను కొలుపు

 • ప్రోత్సహించు.
 • "... ఒక కొందఱు దాల్తు రప్పటి కలుషపథ ప్రవర్తనమె కర్మ పువాసన లన్ను గొల్పగన్." కళా. 2. 108.

అన్ను పట్టు

 • గర్వించు.
 • "అదన నన్నపు నామేన నన్ను పట్టెన్." తాళ్ళ. సం. 10. 258.

అన్నెకాడు

 • అన్యాయస్థుడు.
 • "అన్నె కాడై చాడు నావల పెల్ల నారు దూఱు చేసెనే." క్షేత్రయ్య.

అన్నెము పున్నెము తెలియని

 • అమాయక మయిన; పుణ్యం పాపం తెలియని అనుట.
 • "అన్నెమూ పున్నెమూ మనకు తెలీదు. ఆ భగవంతుడి కెరుక." వా.
 • "ఆ పిల్లకు అన్నెం పున్నెం తెలియదు. దాన్ని యేడిపిస్తా వెందుకు రా." వా.

అన్యథా భావించు

 • అపోహపడు./
 • "నే నేదో అనా నని అన్యథా భావించకండి." వా.

అన్యథా శరణం నాస్తి

 • ఇక గత్యంతరం లేదు అనుట. అన్యధా శరణం నాస్తి త్వ మేవ శరణం మమ - అను శ్లోకంలోని భాగం.

అన్యథా శరణం బొండు లేదు

 • వేఱే దిక్కు లేదు.
 • సంస్కృతవాక్యం - అన్యథా శరణం నాస్తి - కూడా శిష్ట అన్యా____అప 68 అప_____అప

వ్యవహారంలో పలుకుబడి అయి పోయినది.

 • పండితా. ప్రథ. దీక్షా. పుట 102.

అన్యాయ మింత గలదె

 • ఇంత అన్యాయం ఎక్క డైనా ఉందా? ఏ దైనా అత్యా హితం జరిగినప్పుడు అనుమాట.
 • "నీ వింత లన్యాయ మింత గలదె." కకా. 5. 18.

అవ ఉపస్పృశ్య

 • చేతులు కడుగుకొని అనే అర్థంలో నేటికీ ఉపయోగిస్తారు.
 • వైదిక పరిభాష.
 • "ఆ వ్యవహారం ఇంక లాభం లే దని అపౌపస్పృశ్య అనుకొని వచ్చేశాను." వా.

అపదూఱు

 • అపవాదు.

అపథ్యం చేయు

 • రోగి తినగూడని వస్తువులు తిను.
 • "వాడు అపథ్యం చేశాడు. రోగం మరీ తిరగ బెట్టింది." వా.

అపనమ్మకపు మనిషి

 • నమ్మరానివా డనుట.
 • "వాడు చాలా అపనమ్మకపు మనిషి. చేస్తా నని ఒకవేళ వాడు మాట చెప్పినా మనం నమ్ముకొని కూర్చోవడానికి వీలు లేదు." వా.

అపనమ్మిక

 • అనుమానము, నమ్మకము లేమి.
 • "సొ మ్మొకచో నుండగ నపనమ్మిక యొకచోట నుండు." హరిశ్చ. 5. 316.

అపనయించు

 • ఆపు, తొలగించు, చాలించు.
 • "అతనితో సల్లాపంబుల నపనయించి." భీమ. 4. 39.

అపనింద

 • అపవాదు.
 • "వాడు అన్యాయంగా నా మీద అపనింద వేసి పోయాడు." వా.
 • చూ. అపవాదు.

అపనింద పాలుసేయు

 • అపవాదు వేయు.
 • "వాడికి ఏ పాపం తెలీదు. అన్యాయంగా వాణ్ణి అపనిందపాలు చేశారు." వా.

అపనింద మోపు

 • చూ. అపనింద వేయు.

అపనింద వేయు

 • అపవాదు మోపు.
 • "ఏ పాపమూ యెఱగని ఆ అమ్మాయి మీద అపనింద వేసి ఏమి బావుకుంటావు రా?" వా.
 • చూ. అపనింద మోపు.

అపనెపము

 • అపనింద.
 • "అట బోయినంతలో నపనెపమాను." ద్వి. సారంగ. 1 భా. 387.
 • "వాడు నామీద ఉట్టినే అపనెపం వేశాడు." వా. అప_____అప 69 అప_____అప

అపపాడి

 • అన్యాయము.
 • "అవనిపతులు పలువు రపపాడి నొక్కనిం, దన్ను బొదివికొనిన దరల కెదిరి." మార్కం. 8. 113.

అపప్రథ

 • ప్రవాదము. నిజము కాదన్న సూచన ఇందులో ఉన్నది.
 • "వాడు చాలా గర్విష్ఠి అని ఒక అప ప్రథ యేర్పడింది. వాడితో నాలుగు మాటలు మాట్లాడితే అది వట్టిఅపప్రథ అని యిట్టే తెలిసి పోతుంది." వా.

అప భ్రంశపు మనిషి

 • వక్రపు మనిషి.
 • "వాడు వట్టి అపభ్రంశపు మనిషి." వా.
 • చూ. అపసవ్యపు మనిషి.

అపరం

 • ఉత్తరక్రియలను చేయించే కల్పం.
 • "వాడు అపరం చెప్పుకొన్నాడు ఆయన దగ్గఱ." వా.
 • "నేను అపరం చేయించను. పై ఊరి నుంచీ మీ రెవరి నైనా పిలుచోకో వలసిందే."
 • చూ. అపరక్రియలు.

అపర క్రియలు

 • ఉత్తరక్రియలు.
 • "మా నాన్న అపరిక్రియలకు మా మేన మామే రాలేదు. ఇంక తక్కిన వారి మాట ఎందుకు?" వా.
 • చూ. అపరం.

అపరబృహస్పతి

 • చాలా తెలివితేటలు గలవాడు.
 • ఇది వ్యంగ్యంలో ఎక్కువగా వినబడుతుంది.
 • "వాడు అపరబృహస్పతి కదా! వాణ్ణి వెళ్లి అడగండి. న న్నడిగి ఏం ప్రయోజనం?" వా.
 • చూ. అపరవాచస్పతి.

అపరవాచస్పతి

 • చూ. అపరబృహస్పతి.

అపరాతిరి

 • అర్ధ రాత్రి.
 • "వాడు అపరాతిరివేళ వచ్చి నన్ను నిద్ర లేపాడు. ఇంతకూ సంగ తేమయ్యా అంటే వడ్లగింజలో బియ్యపుగింజ.: వా.

అపరాధము చెల్లించు

 • జరిమానా కట్టు.
 • "అపరాధం చెల్లించితే కానీ వాడు విడుదల అయ్యే సావకాశం కనపడదు." వా.

అపరాధము వేయు

 • జరిమానా వేయు.
 • దక్షిణాంధ్రంలో నేటికీ వాడుకలో ఉంది.
 • "వాడికి యాభైరూపాయలు అపరాథం వేశారు." వా.

అపవర్గము

 • మోక్షము.

అపవాదం (దు)

 • చెడ్డ పేరు.
 • "ఏమీ చేయక పోయినా ఉత్తపుణ్యానికే నామీద అపవాదు వచ్చి పడింది." వా.

అపశకునపు పక్షి

 • ఎప్పుడూ అశుభం పల్కేవాడు. అప____అప 70 అప____అపో
 • "శుభమా అని వెడుతుంటే ఈ అపశకునపు పక్షి ఎదురయ్యాడే! ఏ వెధవ మాట అంటాడో." వా.

అపశబ్దపుకూతలు

 • అశుభసూచక మైన మాటలు.
 • "వాడు నో రెత్తితే అపశబ్దపుకూతలే. శుభం పలకరా పెండ్లికొడకా అంటే పందిటి నిండా ముండమోపులే అంటాడు." వా.
 • చూ. అపసవ్యపు కూతలు.

అపశబ్దభయం నాస్తి అప్పళాచార్యసన్నిధౌ

 • వాడి వన్నీ అపశబ్దాలే అనే అర్థంలో వ్యంగ్యంగా ఉపయోగించే పలుకుబడి.
 • తాతాచారుల కథపై వచ్చిన దని ప్రతీతి.
 • "అపశబ్ద భయంనాస్తి అప్పళాచార్య సన్నిధౌ, అనాచార భయం నాస్తి తిష్ఠన్మూత్రస్య సన్నిధౌ." చా.

అపసవ్యపు కూతలు

 • "వాడి వన్నీ అపసవ్యపు కూతలే." వా.
 • చూ. అపశబ్దపుకూతలు.

అపసవ్యపు మనిషి

 • స రైనమనిషి కా దనుట.
 • "వాడు వట్టి అపసవ్యపు మనిషి. అన్నీ లోకవిరుద్ధంగానే చేస్తాడు." వా.

అపస్వరం

 • "వేదోచ్చారణలో ఉదాత్తాను దాత్త స్వరిత స్వరాలను తప్పుగా నుచ్చరించుట.
 • "వాడు పంచదశకర్మలూ చేయిస్తాడు. కానీ, అడుగడుగునా అపస్వరాలే." వా.

అపస్మార మెత్తు

 • పిచ్చి యెత్తు.
 • కాశీ. 2. 138.

అపాత్రదానం

 • అనర్హుడికి దాన మిచ్చుట.
 • "అపాత్రదానం పుణ్య హేతువు కాజాలదు." వా.

అపార్థం చేసుకొను

 • అపోహ పడు అనేఅర్థంలో నేటి వ్యవహారం.
 • "వాడు నన్ను అపార్థం చేసుకొన్నాడు. నే నేపాపం యెఱగను." వా.
 • నాపై అపోహ పడె ననుట.

అపురూపము

 • అమూల్యము, అరుదు.
 • "ఈ కావ్యం చాలా అపురూపంగా ఉంది."
 • "ఆ అమ్మాయిది చాలా అపురూపమైనపుట్టుబడి."
 • "ఆ అమ్మాయిని వాళ్లు చాలా అపు రూపంగా చూచుకుంటారు."
 • "ఈమధ్య మంచినెయ్యే యీ వూళ్లో అపురూప మయిపోయింది." వా.

అపేక్ష చేయు

 • కోరు.
 • "రాగంబు నొడిచి ముక్తి, శ్రీ గౌరవముల కపేక్ష చేయు మునులకున్." విప్ర. 2. 80.

అపోహము పుచ్చు

 • పాడు చేయు.

"లోలదృగ్రుచు లపోహము పుచ్చియు
భోగవృద్ధి నిష్ఫలముగ జేసియున్."
                        కుమా. సం. 7. 41.

అప్ప_____అప్ప 71 అప్ప_____అప్ప

అప్పగింత పాటలు

 • నూతనవధువును అ త్తవారింటికి పంపునప్పుడు పాడే పాటలు.

అప్పగింత పెట్టు

 • 1. నూతనవధువును అ త్తవారి కప్పగించు.
 • 2. చిన్న పిల్ల లను మరొకరికి అప్పగించు.

అప్పగింతలు

 • 1. నూతన వధువును అత్తవా రింటి కంపుట.
 • 2. ఇంటి యజమాని చనిపోతూ చిన్న పిల్ల లను మరొకరికి అప్పగించుట.

అప్పటి కప్పటికి

 • అప్పుడప్పుడు, తఱుచు.
 • "...తప్ప కత డమరమౌనియ, యప్పటి కప్పటికి వచ్చు యదుపతికడకున్."
 • కళా. 1. 172.
 • "అప్పటప్పట వాడు మా యింటికి రావడం కద్దు." వా.

అప్పడములుగా నమలు

 • అవలీలగా నమలు.
 • నారా. రుక్మిణీకల్యాణము.

అప్పనగొను

 • పైవా రాదరపూర్వకముగా నిచ్చుదానిని స్వీకరించు. అప్పనపెట్టు అన్నది వైష్ణవ పరిభాషగా వినబడుతుంది.
 • దేవాలయాదులలో ప్రసాదాన్ని భక్తులు అప్పన పెట్టమంటారు. దీనిమీద మరింత సాగి, అప్పనము-ఊరక వచ్చినది అన్న అర్థాలలో కొన్ని ప్రాంతాలలో 'ఇదేమి అప్పనంగా వచ్చిందా' అని వాడుకలో వినబడుతుంది.
 • ఇదే అర్థంలో 'ఉద్ద రకు వచ్చిందా' అని రాయలసీమలో అంటారు.
 • "....గణనాథున కీవచ్చు గదా యని కోమటి కొమిరె వాని యప్పన గొనుచుం." శు.క. 2 ఆ. 216 ప.

అప్పన పంపు

 • కానుక లిచ్చు.
 • "వలసలు పోవు వారు, దగు వస్తువు లప్పన పంపువారు గే, వలవినయంబుతో గొలుచు వారును నైరి."
 • కళా. 8. 45.

అప్పప్ప

 • ఆశ్చర్యార్థకము.
 • "అప్పప్ప భవత్ప్రభావవిభ వాఢ్యత." సారం. 1. 31.

అప్పలప్ప లను

 • పిల్ల లను దగ్గరకు పిలుచుటలోని అనుకరణము.
 • "అప్పలప్ప లనినంత గద్దించి యశోద మేను కౌగలించుశిశువు."
 • తాళ్ళ. సం. 4. 1.

అప్పవిందులయాట

 • ఒక బాలక్రీడ.
 • పండితా. ప్రథ. పురా. పుట. 460. అప్ప_____అప్పీ 72 అప్పు_____అప్పు

అప్పసంలో పెల్ల వేసినట్లు

 • బురద కాలువలో మట్టిపెళ్ళ వేసినట్లు.
 • చెడ్డవాని నోటికి పోయి తిట్లు తెచ్చుకొనే సందర్భంలో ఉపయోగించే పలుకుబడి.

అప్పా:

 • ఆశ్చ ర్యార్థకము.
 • "అప్పా యప్పురి జెప్ప నొప్పుదురు రూపాజీవికారత్నముల్." రా. వి. 1. 58.

అప్పాట.

 • ఆవిధంగా - ఆసమయంలో, ఆపాట్న అనే రూపంలో రాయలసీమలో వినబడుతుంది.
 • "పాక దశ బొందు సెప్పు డప్పాట గాని." భీమ. 3. 72.

అప్పా నాయనా అను

 • ఎదుటివానిని గౌరవముతో చూచు.
 • "ఎవరువచ్చినా అప్పా నాయనా అని ఎంతో ఆదరిస్తాడతను." వా.

అప్పీలు లేదు

 • తిరుగు లేదు.
 • ఇది కోర్టువ్యవహారాలద్వారా వచ్చినపలుకుబడి.
 • అపీ లున్న దనగా దానిపై తిరిగి విచారించి తప్పో ఒప్పో నిర్ణయించే అధికారం మరొకరి కుంటుం దనుట, అది లేదంటే వాడిదే తుదిమాట.
 • "వాడిమాట కిక అప్పీలు లేదు." వా.

అప్పు చేసి పప్పుకూడు తిను

 • ఏవిధంగా చేసి అయినా సుఖ మనుభవించు.
 • తగనిపని చేసి భోగ మనుభ వించు.
 • పప్పుకూడు భోగ సూచకము.
 • "వాడి కేం? ఎప్పుడూ సుఖమే. అప్పుచేసి పప్పుకూడు తినేరకం." వా.

అప్పుపుట్టు

 • అప్పు దొరకు.
 • "ఆ ఊళ్లో గింజుకొన్నా అప్పు పుట్టదు." వా.
 • దీనినే పరపతికల్గు అనే అర్థంలో కూడా ఉపయోగిస్తారు.
 • "వాడికి ఎక్కడా దమ్మిడీ అప్పు పుట్టదు." వా.
 • అనగా పరపతి లేనివా డనుట.

అప్పు పెట్టు

 • అప్పిచ్చు.
 • "నాలుగు రూపాయలు అప్పు పెట్ట వోయ్. తర్వాత ఇస్తాను." వా.

అప్పులగంప

 • అప్పులమయము.
 • భద్రగిరి. 71.

అప్పులపా లగు

 • ఋణగ్రస్తు డగు.
 • "ఎంద అప్పులపా లగు టెఱుగ బడదు." శ్రవ. 2. 60.

అప్పుల ముంచు

 • అప్పులపాలు చేయు.
 • యామున. 4. 42. అప్పు_____అబ 73 అబ____అబ్బ

అప్పులలో మునుగు

 • అప్పుల పాలగు.
 • "వాడు అప్పులలో మునిగి పోయాడు." వా.

అప్పులు పుట్టు

 • అప్పు దొరకు.
 • "అప్పులు పుట్టక పరపతి తప్పి." రుక్మాం. 4. 110.

అప్పులు పొడుచు

 • అప్పులు చేయు.
 • "పొందుబట్టుల నప్పులు పొడిచి పొడిచి." పాండు. 3. 18.

అప్పుసప్పులు

 • అప్పులు. జం.
 • "అప్పుసప్పులు దీసి యడిగిన నియ్యక బహుఋణంబుల పాలు పడెను వీడు." సానం 2. 106.
 • చూ. అప్పూ సప్పూ.

అప్పూ సప్పూ

 • అప్పు. జం.
 • "అప్పోసప్పో చేసైనా పిల్లకు చీర పెట్టాలి."
 • చూ. అప్పుసప్పులు.

అప్రస్తుత ప్రసంగం

 • అసందర్భ మైనమాట.
 • "అప్రస్తుతప్రసంగం చాలు. కట్టిపెట్టు." వా.

అబద్ధం వా సుబద్ధం వా కుంతీ పుత్రో వినాయక:

 • అదంతా అబద్ధణ్ అనేటప్పుడు ఉపయోగించే పలుకుబడి.
 • నిజమో అబద్దమో కుంతి కొడుకు వినాయకుడు అంటే అంతా అబద్ధమే కదా.
 • "నీ యిష్టం వచ్చినమాట అడుగు. వాడు వెంటనే అర్థం చెప్పి పారేస్తాడు. అంతే. అబద్ధం వా సుబద్ధం వా కుంతీ పుత్రో వినాయక: వా.

అబద్ధాలకోరు

 • అబద్ధీకుడు.
  వాడు వట్టి అబద్ధాలకోరు. వాణ్ణి నమ్మడానికి వీలు లేదు." వా.

అబద్ధాక పుట్ట

 • వా డాడేవన్నీ అబద్ధాలే అనుట.
 • చూ. రోసాల పుట్ట.

అబ్బగంటు

 • ఇది నీసొత్తు కాదు అని గట్టిగా అనవలసినప్పుడు ఉపయోగించేమాట.
 • "ఇదేం నీ అబ్బగంటా? మమ్మల్ను ఎవరినీ ఇక్కడికి రావ దంటావు." వా.

అబ్బగాడుగ పోవు

 • దిక్కులు పట్టి పోవు.
 • "మునిగాల దన్ని చనుగతి ఘనజఘనం బాసి యబ్బ గాడుగ బోయెన్." పంచ. (వేం) 4. 169.

అబ్బగించు

 • ఓర్చు, నిలువ గలుగు.
 • "మహాప్రభంజనహతికి గుంజర ఘట లబ్బగింపక." కుమా. 12. 31.

అబ్బగింపక

 • సహింపక, తాళ లేక.
 • "అతిభీషణశాసను లైన గణాధీ శ్వరుల కవిదల కబ్బగింపక." కుమా. 2. 69.
 • "వాని పటుదండముల కమరానీకము లబ్బ గింపక." కుమా. 4. 5. అబ్బ____అభ 74 అభ____అభో

అబ్బబ్బ

 • భరింప రాని దనుపట్ల అనే ఉపస్కారకం.
 • "అబ్బబ్బ! ఏమి అల్లరి చేస్తున్నా ర్రా." వా.

అబ్బురమా?

 • అరుదు కా దనుట.
 • "అ దేమి అబ్బరమా? ఎవడు పడితే వాడే చేస్తాడు." వా.
 • చూ. అదేం గగనమా?

అబ్రహ్మణ్యము

 • ఏ దైనా అనాహూతం జరిగినప్పుడు అనుమాట. సంస్కృత నాటకాల్లో తరచూ ద్విరుక్తమై వినబడుతుంది.
 • "అబ్రహ్మణ్యము! లోన వైచుకొనె నన్యాయంబునన్ మత్సుతన్." ఆము. 7. 44.

అభయము

 • శరణు; నన్ను రక్షించు మంటూ ఒకరిని శరణు చొచ్చే వారు అనేమాట. అభయ మివ్వుడని భావం.
 • "అభయ మభయ మయ్య అంబికా నాథ?"
 • పండితా. ప్రథ. వాద. పుట. 631.

అభయదానం బిచ్చు

 • రక్షింతు నని మాట యిచ్చు.
 • "సాధ్వసంబున జనుల్ శరణంబు వేడిన, నభయదానం బిచ్చునట్టి వారు." రుక్మాం. 2. 89.

అభయహస్త మిచ్చు

 • భయము లేదని ధైర్యమిచ్చు.
 • "కంపము నొంద నోడకుం డని తిమిరంబు తా నభయహస్తము లిచ్చె ననంగ." పారి. 2. 36.

అభాండము వేయు

 • అపవాదు వేయు.
 • "పాపం ! అలాంటి అమ్మాయిమీద అభాండాలు వేసి వాళ్ల కాపురం తీశాడు." వా/

అభినవించు

 • కొత్తదనము లొల్కు.
 • "వెలయ రసంబులం దభినవించె రసంబులు..." కుమా. 9. 38.

అభిషేక మాడు

 • స్నాన మాడు.
 • "అభిషేక మాడు నేయభివర్ణి తాచార దిగ్గజానీతమా తేటనీట." పాండు. 1. 2.

అభిషేకించిన అగ్నిహోత్రములా

 • బొగ్గులాగ నల్లగా.
 • "నేను ఆ మాట అనేసరికి వాడి మొహం అభిషేకించిన అగ్నిహోత్రంలా అయి పోయింది." వా.

అభోజనం పడుకొను

 • పస్తు పరుండు.
 • కన్యా. శు.
 • "వాడు రాత్రి అభోజనం పడుకొన్నాడు." వా. అభ్య_____అభ్ర 75 అమ_____అమా

అభ్యంగము

 • నూనె అంటుకొని చేయు స్నానము.
 • హర. 4. 79.

అభ్యంజనోద్వర్తన స్నానంబులు

 • తలంటుకొని నలుగు పెట్టుకొని స్నానము చేయుటలు. ఇది కలిసే వాడడం అలవాటు.
 • "అభ్యంజనోద్వర్తన స్నానానంతరం బన."
 • కుమా. 9. 23.

అభ్యుదయ పరంపరాభివృద్ధిగా

 • శుభపరంపరలు కలుగు నట్లుగా.
 • ప్రబంధాల అవతారికలలో విరివిగా కానవచ్చే పలుకుబడి.
 • "(కృతిపతికి) అభ్యుదయ పరంపరాభివృద్ధిగా నా యొన్పరం బూనిన...కథా ప్రారంభం బెట్టి దనిన."
 • చాలా ప్రబంధాలలో.

అభ్యుదయించు

 • అభివృద్ధిపఱచు, పెంచు.
 • "అధ రారుణద్యుతి నభ్యుదయింపనే పొలతి నీయాన నాంభోజ మలర."
 • కుమా. 5. 131.

అభ్రచ్ఛాయ

 • అస్థిరము.
 • మేఘమునీడ కాసే పయినా ఉండదు కనుక.
 • పాండు. 3. 72.

అభ్రపుష్పము

 • గగనకుసునము.

"పాపము లభ్రపుష్పములు, బంధనముల్
శశశాబశృంగముల్, తాపవికారముల్
మరుజలంబులు పుట్టువు లశ్మతైలముల్."
                            పాండు. 5. 72.

అమందానంద కందళిత హృదయారవిందు డై

 • సంతోషించి అనుపట్ల విరివిగా ఉపయోగించేపలుకుబడి.

అమాంతంగా

 • ఉన్నట్టుండి - పూర్తిగా.

అమాంబాపతు

 • చిల్లర, అన్నిరకాల-
 • "అమాంబాపతు కాగితా లన్నీ ఇందులోనే ఉన్నాయి." వా.
 • "అమాంబాపతు జనం అంతా ఆ యింట్లో చేర్తారు." వా.

అమానుషమైన

 • అవమానకర మైన.
 • "ఇంత అమానుష మైన పని చేస్తుం దని నే ననుకో లేదు." వా.

అమారుగా

 • సిద్ధంగా.
 • "ప్రయాణానికి అమారుగా ఉన్నారు." వా.

అమావస్యమందు

 • చూ. అమాసమందు.

అమాసమందు

 • ఇది రాయలసీమలో ప్రచురంగా ఉన్నమాట. నాగలాపురందగ్గర ఒక కుటుంబం వారు ప్రతీ అమావాస్య నాడూ ఆ మందిస్తారు. ఏవో అము____అమృ 76 అమ్మ_____అమ్మ

కొన్ని ఆకులు దంచిన పొడి అది. ఆ పొడి తిని జొన్న సంకటి తింటే సర్వరోగాలూ నివారణ అవుతా యని గొప్ప నమ్మకం. నేటికీ కొన్ని వేల మంది అక్కడ చేరుతుంటారు.

 • ఇది తరువాత పలుకుబడిగా మారింది. అమావాస్యమందు అని తొలిరూపము.
 • "ఓ యబ్బా ! యి దేమి అమాస మందా? ఈన ఇస్తానే బాగు కావడానికి?" వా.

అములు చేయు

 • అధికారము చెలాయించు.
 • కొత్త. 33.

అమృతకలశం

 • ఒక తినుబండం.

అమృతఘటికలు

 • ఒక తినుబండం.

అమృతహస్తము

 • వ్యాధినివారకమైనచేయి.
 • చెయివాసిగలది.
 • "ఆయనది అమృతహస్తం. మన్ను మాత్ర చేసి యిచ్చినా రోగం నయమవుతుంది." వా.

అమృతహస్తుడు

 • అత నేమిచ్చినా రోగనివారణ అగును అనుపట్ల ఉపయోగిస్తారు.
 • వెంకటేశ. 15.

అమ్మక చెల్ల

 • ఆశ్చర్యార్థకము.
 • "అమ్మకచెల్ల ! నా హృదయ మమ్మక చెల్లదు." విజయ.
 • చూ. అమ్మ నే జెల్ల.

అమ్మకు రెండు అబ్బకు రెండు వచ్చు

 • తలిదండ్రులకు చెడ్డ పేరువచ్చు.
 • కుమారీ. శత. 19.
 • "ఈ పిల్ల అత్తవారింటికి వెడితే అమ్మకు రెండు అబ్బకు రెండు వస్తాయి. అలా పెంచారు మీరు." వా.

అమ్మక్క

 • ఆశ్చర్యార్థకము.
 • "అమ్మక్క యని సతు లక్కజం బంద." రా బాలకాండ.
 • చూ. అమ్మక చెల్ల.

అమ్మగా చిక్కిన మేకవలె

 • ఏకాకిగా ; బక్క చిక్కి, మేక లన్నీ అమ్మి వేయగా మిగిలి పోతిన మేక అతి దుర్బలమైనదిగా ఉంటుంది.

"హత శేష సైన్యముల్, గ్రక్కున విచ్చె
వీపు వెనుకన్ మఱి మానిసి లేక యమ్మ
గా జిక్కినమేకవోలె వగ జెంది
నిజాధిపు డొంటి జిక్కగం."
                 కళా. 8. 65.

అమ్మతోడు

 • అమ్మసాక్షిగా, ఒకరక మైన ప్రమాణవాక్యము.
 • గుంటూ. పూ. 16 పు. అమ్మ_____అమ్మ 77 అమ్మ_____అమ్ము

అమ్మను పట్టి వసంతము చిమ్మినట్టు

 • వరుసాడ తగని వారితో సరసములకు దిగినట్లు.
 • వాడుకలో అవ్వను పట్టుకొని వసంతా లాడినట్లు అన్న రూపంలో కానవస్తుంది.

"కమ్మని తేనెలు జడిగొన
నమ్ముల నిటు నింతు రయ్య యబ్జాలయపై
నమ్మను బట్టి వసంతము
జిమ్ముద మనుపలుకునిజము చేసి మనోజా!"
                లక్ష్మీ వి. 4. 68.

అమ్మనే జెల్ల

 • ఆశ్చ ర్యార్థకం.
 • "అమ్మ నే జెల్ల నెవతయో యవల నొక్క, కొమ్మ నా ప్రాణవిభు నేలుకొనియె నేమొ. శుక. 1 ఆ. 396 ప.
 • చూ. అమ్మక చెల్ల.

అమ్మయ్య

 • ఏదో బరువు తీరినట్లు ఊరటతో అనుమాట.
 • "అమ్మయ్య! యిప్పటి కీపని ముగిసింది." వా.

అమ్మయ్య యను

 • ఆశ్చర్యము ప్రకటించు, ఊరటను తెలుపు.
 • "సతీపతుల జాతిరీతు లమ్మయ్య యని రతిప్రియుడు వొగడ." రాధి. 1. 67.
 • "అమ్మయ్య! అనుకోవచ్చు ఈపని అయిపోయింది." వా.

అమ్మలక్కలు

 • ఇరుగుపొరుగు స్త్రీలు.
 • "ఇరుగుపొరుగున అమ్మలక్కలు చేరి మొగమోటము పెట్టి అడిగిన తప్పించు కొన లేక ఆమె సర్వము వారలతో చెప్పి వైచెను."
 • కవిమాయ. అం. 4. పే. 65 పం. 7.

అమ్మలక్క లని తూలు

 • అమ్మా అక్కా అని ప్రాధేయ పడు.
 • "తొడిబడ నమ్మలక్క లని తూలుచు దీనత దోయి లొగ్గుచున్."
 • ఆము. 2. 59.

అమ్మవారు

 • మశూచికము.
 • "ఆ ఊళ్లో అమ్మవారు ప్రబలంగా ఉందట! అక్కయ్యపిల్లలను వెంటనే పిలిపించి వేస్తే బాగుండును." వా.

అమ్మశక్తిలాగా

 • భయంకరంగా.
 • దుర్గ, కాళి యిత్యాదులను అమ్మశక్తులు అంటారు.

అమ్మా ఆలీ అను

 • బూతులు తిట్టు.

అమ్మా ఆలీ ఎంచు

 • బూతులు తిట్టు.
 • చూ. అమ్మా ఆలీ అను.

అమ్మా ఆలీ తిట్టు

 • బూతులు తిట్టు.
 • చూ. అమ్మా ఆలీ ఎంచు.

అమ్ముడు గడచు

 • అమ్ముడు పోవు. వివాహమై అత్తవారింటికి పోవు. పూర్వపు రోజుల్లో కన్యను