నీతిచంద్రిక/నీతిచంద్రిక

వికీసోర్స్ నుండి

నీతిచంద్రిక

మంగళము

ఉ.

శ్రీ యనుమించుమిం చొలయ సేవకచాతకలోకమోదసం
ధాయకుఁ డై యుదారకరుణారసవృష్టి దురాపతాపముల్
వాయఁగఁ జేయుచున్ సకలవాంఛితసస్యము లుల్లసిల్లఁగాఁ
జేయుచు వేంకటాద్రి నివసించుఘనుం డిడుఁగాత భద్రముల్.


క.

కరుణ తెఱంగున హరియెద
నిరవుకొని యఘాళి నరయనీక యతనిచే
నిరతము సంశ్రితజనులం
బరిరక్షింపించుతల్లి భజియింతు మదిన్.


చ.

వనజభవాండభాండము
లవారిగ నెవ్వనితుందకందరం
బున నొకమేలనింటరముఁ బొందక పొందుగఁ బొల్చు నమ్మహా
త్మునినిజభోగశయ్య నిడికపొత్తులకందువునట్లు లాలనం
బొనరుచు నయ్యనంతు మహిమోన్నతు సన్నుతియింతు నిచ్చలున్.

ఆదికవిస్తుతి

క.

ఘను నన్నయభట్టును ది
క్కన నేఱాప్రెగడఁ బొగడి యలికంబున య

క్షిని డాఁచినట్టిసర్వ
జ్ఞుని నాచనసోమనాథు స్తుతి యొనరింతున్.

ప్రతిజ్ఞాదికము

తే.

ఒనరఁగాఁ బంచతంత్ర హితతోపదేశ
ములను బరికించి వానిలో వలయు నంశ
ములను గొని కొంతయభినవంబుగను గూర్చి
కృతి యొనర్చెద నీతిచంద్రిక యనంగ.


క.

తుదముట్టఁగ నీకబ్బము
పదిలముగాఁ జదివినట్టిబాలుర కోలిం
బొదలును భాషాజ్ఞానము
కుదురుం గొద లేక నీతికుశలత్వంబున్.


తే.

విద్య యొసఁగును వినయంబు వినయమునను
బడయుఁ బాత్రతఁ బాత్రతవలన ధనము
ధనమువలనను ధర్మంబు దానివలన
నైహికాముష్మికసుఖంబు లందు నరుఁడు.


ఆ.

జరయు మృతియు లేని జనునట్లు ప్రాజ్ఞుండు
ధనము విద్యఁ గూర్పఁ దలఁపవలయు
ధర్మ మాచరింపఁ దగు మృత్యుచేఁ దల
వట్టి యీడ్వఁబడినవాఁడుఁబోలె.


ఆ.

నీతి లేనివాని నిందింత్రు లోకులు
లేదు నేగి లాఁతి లేక యున్నఁ
గాన మానవుండు పూనిక నయవిద్య
గడనసేయ మొదలఁ గడఁగవలయు.

క.

నవభాజనమున లగ్నం
బవు సంస్కారంబు వొలియ దటు గావున మా
ణవులకుఁ గథాచ్ఛలంబునఁ
జివి యుట్టఁగ నీతివచనసరణిఁ దెలిపెదన్.

కథాప్రారంభము

గంగాతీరమందు సకలసంపదలు గలిగి [1]పాటలిపుత్ర మను పట్టణము గలదు. ఆపట్టణము సుదర్శనుఁ డనురాజు పాలించుచుండెను. అతఁ డొకనాఁడు వినోదార్థము విద్వాంసులతో సల్లాపములు జరుపుచుండఁగా నొక బ్రాహ్మణుఁడు —

"పరువంబు కలిమి దొరతన
మరయమి యనునట్టివీనియం దొకఁ డొకఁడే
పొరయించు ననర్ధము నా
బరఁగినచో నాల్గుఁ జెప్పవలయునె చెపుమా.”
"పలుసందియములఁ దొలఁచును
వెలయించు నగోచరార్థవిజ్ఞానము లో
కుల కక్షి శాస్త్ర మయ్యది
యలవడ దెవ్వనికి వాఁడె యంధుఁడు జగతిన్. "

యని ప్రస్తావవశముగాఁ జదివెను. ఆపద్యములు రాజు విని చదువులేక మూర్ఖులయి సదా క్రీడాపరాయణులయి తిరుగుచున్నకొడుకులను దలంచుకొని యిట్లని చింతించె. “తల్లిదండ్రులు చెప్పినట్టు విని చదువుకొని లోకులచేత మంచివాఁ డనిపించంకున్నవాఁడు బిడ్డఁడుగాని తక్కినవాఁడు బిడ్డఁడా? మూర్ఖుఁడు ఎల్లకాలము తల్లిదండ్రులకు దుఃఖము పుట్టించుచున్నాడు. అట్టి

వాఁడు చచ్చెనా తల్లిదండ్రులకు దుఃఖము నాఁటితోనే తీఱుచున్నది. కులమునకు యశము తెచ్చినవాఁడు పుత్రుఁడుగాని కడుపు చెఱుపఁబుట్టినవాఁడు పుత్రుఁడు గాఁడు. గుణవంతులలోఁ బ్రథమగణ్యుఁడు గానికొడుకును గన్నతల్లికంటె వేఱుగొడ్రాలు గలదా? గుణవంతుఁడైనపుత్రుఁ డొకఁడు చాలును. మూర్ఖులు నూఱుగురవలన ఫల మేమి? ఒకరత్నములో గులకరాలు గంపెఁడయినను సరిగావు. విద్యావంతులయి గుణవంతులయినపుత్రులను జూచి సంతోషించుట యనుసంపద మహాపుణ్యులకుఁగాని యెల్లవారికి లభింపదు” అని కొంతచింతించి యుంకించి తల పంకించి “యూరక యీచింత యేల? నీపుత్రులు చదువ మనిగా? పరామరిక మాలి తగిన విద్యాభ్యాసము చేయింపనయితిని. బిడ్డలకు విద్యాభ్యాసము చేయింపమి తల్లిదండ్రులదోషము. తల్లిదండ్రులచేత శిక్షితుఁడయి బాలుఁడు విద్వాంసుఁడగునుగాని పుట్టఁగానే విద్వాంసుఁడు కాఁడు. పురుషకారముచేతఁ గార్యములు సిద్ధించును; రిత్తకోరికలచేత సిద్ధింపవు. నిద్రించుసింహమునోరను మృగములు తమంత వచ్చి చొరవు. కాబట్టి యిప్పుడునాపుత్రులకు విద్యాభ్యాసముకయి వలయుప్రయత్నము చేసెద" నని చింతించి యచ్చటి విద్వాంసులతో నిట్లనియె. “నాపుత్రులు విద్యాభ్యాసము లేక క్రీడాసక్తులయి తిరుగుచున్నవారు. ఎవ్వరయినను వీరిని నీతిశాస్త్రము చదివించి మంచిమార్గమునకుఁ ద్రిప్పఁజాలినవారు కలరా?” యనిన విష్ణుశర్మ యనుబ్రాహణుఁ డిట్లనియె. "రాజోత్తమా! యిది యెంతపాటిపని? మహావంశజాతు లయిన దేవరపుత్రులను నీతివేదులను జేయుట దుష్కరము గాదు. కొంగను మాటలాడించుట దుష్కరము గాని చిలుకను బలికించుట దుష్కరము గాదు. సద్వంశ మందు గుణహీనుఁడు పుట్టఁడు. పద్మరాగములగనిలో గాజు పుట్టునా? ఎట్టిరత్నమయినను సాన పెట్టక ప్రకాశింపనట్టు బాలుఁ డెట్టివాఁడయిన గురుజనశిక్ష లేక ప్రకాశింపఁడు. కాఁబట్టి నేనాఱుమాసములలో దేవరపుత్రులను నీతికోవిదులను జేసి మీకు సమర్పించెదను.” అనిన రాజు సంతోషించి యిట్లనియె; “పూవులతోఁ గూడిన నారకు వాసన గలిగినట్లు సజ్జనులతోడ సావాసించు మూర్ఖునకు మంచిగుణము గలుగుట సాజము.” అంతే కాదు. 'సాధుసాంగత్యము సర్వశ్రేయములకు మూలము.' అని సాదరముగా వచియించి యాతనికిఁ బసదన మిచ్చి తన కొడుకులను రప్పించి చూపి “విద్యాగంధము లేక జనుషాంధులవలె నున్నారు. వీరిని గన్ను దెఱపి రక్షించుట మీభార” మని చెప్పి యొప్పగించెను. అనంతర మాబ్రాహ్మణుఁడు వారల నొకరమణీయసౌధమునకుఁ దోడుకొనిపోయి కూర్చుండఁ బెట్టుకొని యిట్లనియె. “మీకు వినోదార్థ మొకకథ చెప్పెద. అది మిత్రలాభము, మిత్రభేదము, విగ్రహము, సంధియు నని నాలుగంశములచేత నొప్పుచుండును వినుండు.

మిత్రలాభము

“ధనసాధనసంపత్తి లేనివారయ్యు బుద్ధిమంతులు పరస్పరమైత్రి సంపాదించుకొని కాక కూర్మ మృగ మూషికములవలె స్వకార్యములు సాధించుకొందురు.” అనిన రాజపుత్రులు విని “యేకార్యములు కాక కూర్మ మృగ మూషికములు సాధించెను. మాకు సవిస్తరముగా వినిపింపు" డనిన విష్ణుశర్మ యిట్లని చెప్పఁదొడంగెను.

గోదావరీతీరమందు గొప్పబూరుగువృక్షము గలదు. అందు నానాదిక్కులనుండి వచ్చి పక్షులు రాత్రి వసించుచుండును. ఒకనాఁడు వేకువ లఘుపతనక మనువాయసము మేలుకొని రెండవయమునివలె సంచరించుచున్న కిరాతకునిఁ జూచి 'వఱువాత లేచి వీనిమొగము చూచితిని. నేఁ డేమి కీడు రాఁగలదో తెలియదు. వీఁడు వచ్చినచోట నిలువఁ దగదు. జాగు చేయక యీచోటు విడిచి పోవలె' నని యత్నము చేయుచుండఁగా వాఁ డావృక్షమునకు సమీపమందు నూకలు చల్లి వలపన్ని పోయి చేరువ పొదలో దాఁగి పొంచి చూచుచుండెను. అనంతరము చిత్రగ్రీవుఁ డను కపోతరాజు నింగిని సంచరించుచు నేలమీఁది నూకలు చూచి తనతోడి కపోతములతో నిట్లనియె, 'ఈనిర్జనవనమందు నూకలు రా నిమిత్తమేమి? మన మీనూకల కాశపడరాదు. తొల్లి యొకతెరువరి కంకణమున కాశపడి పులిచేతఁ దగులుకొని మృతిబొందెను. మీ కాకథ చెప్పెద వినుండి.

ఒకముసలిపులి స్నానము చేసి దర్భలు చేతఁబట్టుకొని కొలనిగట్టున నుండి, యోయి తేరువరి, యీపయిఁడికంకణము వచ్చి పుచ్చుకో మని పిలిచి చెప్పెను. ఒకపాంథుఁ డామాటవిని యిది నాభాగ్యముచేతనే వచ్చుచున్నది. ఏల సందేహపడవలె నని చింతించి, యేదీకంకణము చూపు మని యడిగెను. పులి చేయి చాఁచి యిదిగో హేమకంకణము చూడుమని చూపెను. నీవు క్రూరజంతువవు కాఁబట్టి యేలాగున నిన్ను నమ్మవచ్చు నని పాంథుఁడు పలికెను. ఆమాట విని పులి యిట్లనియె: "ఓరీపాంథ! విను. మునుపు యౌవనమందు మిక్కిలి దుష్టుఁడనయి యుంటిని. అనేకము లగుగోవులను మనుష్యులను వధించి మితిలేనిపాపము సంపాదించి భార్యాపుత్రులను బోఁగొట్టుకొని యేకాకి నయి నిలిచితిని. అనంతర మొకపుణ్యాతుఁడు నాయందు దయచేసి, 'యిఁకమీఁదట గోవులను మనుష్యులను వధింపకు, సత్కార్యములు చేయు'మని చెప్పెను. అది మొదలుకొని పాపకృత్యములు విడిచి మంచికార్యములు చేయుచున్నవాఁడను. వృద్ధుఁడను, బోసినోరివాఁడను. గోళ్లు పోయినవి. లేవ సత్తువ లేదు. నన్ను నీవేల నమ్మవు ? నీవు దరిద్రుఁడవు కాఁబట్టి యిది నీకు దానము చేయవలెనని కోరితిని, సంశయపడక యీ కొలనిలో స్నానము చేసి వచ్చి పసిఁడికంకణము పుచ్చుకొమ్ము." అనఁగానే వాడు పేరాసచేత దానిమాటలకు లోపడి కొలనిలో స్నానము చేయఁబోయి మొలబంటిబురదలో దిగఁబడెను. అప్పుడు పులి చూచి 'యయ్యయ్యో పెనుగొంపిలో దిగఁబడితివిగదా! నేను వచ్చి నిన్ను లేవనెత్తెదను. భయపడకు' మని తిన్న తిన్నగా సమీపించి వానిని బట్టుకొనెను. ఈలాగున వాఁడు తగులుకొని 'క్రూరజంతువును నమ్మరాదు. నమ్మి యీగతి తెచ్చుకొంటిని. మించినదానికి వగచి యేమి ప్రయోజనము ఎవ్వరికైన విధి తిప్పించుకో వశముగాదు.' అని చింతించుచు దానిచేత భక్షింపఁబడియె.

కాఁబట్టి సర్వవిధముల విచారింపనిపని చేయరాదు. చక్కఁగా విచారించి చేసినపనికి హాని యెప్పటికి రాదు.' అని చెప్పఁగా విని యొకకపోతవృద్ధము నవ్వి యిట్లనియె. 'ఆ! యివి యేటిమాటలు? ఒక యిక్కట్టు వచ్చినప్పుడు వృద్ధునిమాట వినవలసినది. వినుండు. స్థానాస్థానములు వివేకింపక సర్వత్ర యిట్టివిచారము పెట్టుకోరాదు. కొఱమాలినశంకలు తెచ్చుకొని భోజనము మానుకోవచ్చునా? మానుకొని యేలాగున బ్రతుకవచ్చును? ఈర్ష్యాళువు, జుగుప్సావంతుడు, నిస్సంతోషి, క్రోధనుఁడు, నిత్యశంకితుఁడు, పరభాగ్యోపజీవియు ననువారాఱుగురు దుఃఖభాగు లని నీతికోవిదులు చెప్పుదురు.' అనఁగా విని కపోతము లన్ని నేల వ్రాలెను.

గొప్పశాస్త్రములు చదివి మిక్కిలి వినికి గలిగి పరులసంశయములను వారింప నేర్పుగలవారు సహితము లోభమువల్ల వివేకము పోఁగొట్టుకొని క్లేశపడియెదరు. ఆహా! లోభ మెంత చెడుగుణము! అన్ని యిడుమలకు లోభము కారణము.

అనంతరము పావురములన్ని వలలోఁ దగులుకొని కపోతవృద్ధమును జూచి ‘నీవు వృద్ధుఁడవు. తెలిసినవాఁడ వని భ్రాంతిపడి నీమాటలను విని యీవిపత్తు తెచ్చుకొంటిమి. ఎవ్వఁడు బుద్ధిమంతుఁడో వాఁడు వృద్ధుఁడుగాని యేండ్లు మీఱినవాఁడా వృద్ధుడు?' అని కపోతములు నిందింపఁగా విని చిత్రగ్రీవుఁ డిట్లనియె. 'ఇది యీతనిదోషము గాదు. ఆపదలు రాఁగలప్పుడు మంచిసహితము చెడు గగుచున్నది. మనకాలము మంచిది కాదు. ఊరక యేల యీతని నిందించెదరు. ఈతఁడు తనకుఁ దోఁచినది చెప్పినాఁడు. అప్పుడు మనబుద్ధి యేమయ్యె? ఆపద వచ్చినప్పుడు తప్పించుకొనుసాధనము విచారింపవలెఁగాని యీమాటలవల్ల ఫలమేమి? విపత్కాలమందు విస్మయము కాపురుషలక్షణము. కాఁబట్టి యిప్పుడు ధైర్యము తెచ్చుకొని ప్రతీకారము చింతింపుఁడు. ఇప్పటికి నా కొకటి తోఁచుచున్నది. మీరందఱు పరాకు లేక వినుఁడు. ఒక్కసారిగా మనమందఱము వల యెత్తుకొని యెగిరిపోవుదము. మన మల్పులము; మన కీకార్యము సాధ్యమవునా యని విచారింపఁ బని లేదు. సంఘీభవించి యెంతటికార్యమయిన సాధింప పుట:నీతిచంద్రిక (పూర్వార్ధము).pdf/20 పుట:నీతిచంద్రిక (పూర్వార్ధము).pdf/21 పుట:నీతిచంద్రిక (పూర్వార్ధము).pdf/22 పుట:నీతిచంద్రిక (పూర్వార్ధము).pdf/23 పుట:నీతిచంద్రిక (పూర్వార్ధము).pdf/24 పుట:నీతిచంద్రిక (పూర్వార్ధము).pdf/25 పుట:నీతిచంద్రిక (పూర్వార్ధము).pdf/26 పుట:నీతిచంద్రిక (పూర్వార్ధము).pdf/27 పుట:నీతిచంద్రిక (పూర్వార్ధము).pdf/28 పుట:నీతిచంద్రిక (పూర్వార్ధము).pdf/29 పుట:నీతిచంద్రిక (పూర్వార్ధము).pdf/30 పుట:నీతిచంద్రిక (పూర్వార్ధము).pdf/31 పుట:నీతిచంద్రిక (పూర్వార్ధము).pdf/32 పుట:నీతిచంద్రిక (పూర్వార్ధము).pdf/33 పుట:నీతిచంద్రిక (పూర్వార్ధము).pdf/34 పుట:నీతిచంద్రిక (పూర్వార్ధము).pdf/35 పుట:నీతిచంద్రిక (పూర్వార్ధము).pdf/36 పుట:నీతిచంద్రిక (పూర్వార్ధము).pdf/37 పుట:నీతిచంద్రిక (పూర్వార్ధము).pdf/38 పుట:నీతిచంద్రిక (పూర్వార్ధము).pdf/39 పుట:నీతిచంద్రిక (పూర్వార్ధము).pdf/40 పుట:నీతిచంద్రిక (పూర్వార్ధము).pdf/41 పుట:నీతిచంద్రిక (పూర్వార్ధము).pdf/42 పుట:నీతిచంద్రిక (పూర్వార్ధము).pdf/43 పుట:నీతిచంద్రిక (పూర్వార్ధము).pdf/44 పుట:నీతిచంద్రిక (పూర్వార్ధము).pdf/45 పుట:నీతిచంద్రిక (పూర్వార్ధము).pdf/46 పుట:నీతిచంద్రిక (పూర్వార్ధము).pdf/47 పుట:నీతిచంద్రిక (పూర్వార్ధము).pdf/48 పుట:నీతిచంద్రిక (పూర్వార్ధము).pdf/49 పుట:నీతిచంద్రిక (పూర్వార్ధము).pdf/50 పుట:నీతిచంద్రిక (పూర్వార్ధము).pdf/51 పుట:నీతిచంద్రిక (పూర్వార్ధము).pdf/52 పుట:నీతిచంద్రిక (పూర్వార్ధము).pdf/53 పుట:నీతిచంద్రిక (పూర్వార్ధము).pdf/54 పుట:నీతిచంద్రిక (పూర్వార్ధము).pdf/55 పుట:నీతిచంద్రిక (పూర్వార్ధము).pdf/56 పుట:నీతిచంద్రిక (పూర్వార్ధము).pdf/57 పుట:నీతిచంద్రిక (పూర్వార్ధము).pdf/58 పుట:నీతిచంద్రిక (పూర్వార్ధము).pdf/59 పుట:నీతిచంద్రిక (పూర్వార్ధము).pdf/60 పుట:నీతిచంద్రిక (పూర్వార్ధము).pdf/61 పుట:నీతిచంద్రిక (పూర్వార్ధము).pdf/62 పుట:నీతిచంద్రిక (పూర్వార్ధము).pdf/63 పుట:నీతిచంద్రిక (పూర్వార్ధము).pdf/64 పుట:నీతిచంద్రిక (పూర్వార్ధము).pdf/65 పుట:నీతిచంద్రిక (పూర్వార్ధము).pdf/66 పుట:నీతిచంద్రిక (పూర్వార్ధము).pdf/67 పుట:నీతిచంద్రిక (పూర్వార్ధము).pdf/68 పుట:నీతిచంద్రిక (పూర్వార్ధము).pdf/69 పుట:నీతిచంద్రిక (పూర్వార్ధము).pdf/70 పుట:నీతిచంద్రిక (పూర్వార్ధము).pdf/71 పుట:నీతిచంద్రిక (పూర్వార్ధము).pdf/72 పుట:నీతిచంద్రిక (పూర్వార్ధము).pdf/73 పుట:నీతిచంద్రిక (పూర్వార్ధము).pdf/74 పుట:నీతిచంద్రిక (పూర్వార్ధము).pdf/75 పుట:నీతిచంద్రిక (పూర్వార్ధము).pdf/76 పుట:నీతిచంద్రిక (పూర్వార్ధము).pdf/77 పుట:నీతిచంద్రిక (పూర్వార్ధము).pdf/78 పుట:నీతిచంద్రిక (పూర్వార్ధము).pdf/79 పుట:నీతిచంద్రిక (పూర్వార్ధము).pdf/80 పుట:నీతిచంద్రిక (పూర్వార్ధము).pdf/81 పుట:నీతిచంద్రిక (పూర్వార్ధము).pdf/82 పుట:నీతిచంద్రిక (పూర్వార్ధము).pdf/83 పుట:నీతిచంద్రిక (పూర్వార్ధము).pdf/84 పుట:నీతిచంద్రిక (పూర్వార్ధము).pdf/85 పుట:నీతిచంద్రిక (పూర్వార్ధము).pdf/86 పుట:నీతిచంద్రిక (పూర్వార్ధము).pdf/87 పుట:నీతిచంద్రిక (పూర్వార్ధము).pdf/88 పుట:నీతిచంద్రిక (పూర్వార్ధము).pdf/89 పుట:నీతిచంద్రిక (పూర్వార్ధము).pdf/90 పుట:నీతిచంద్రిక (పూర్వార్ధము).pdf/91 పుట:నీతిచంద్రిక (పూర్వార్ధము).pdf/92 పుట:నీతిచంద్రిక (పూర్వార్ధము).pdf/93 పుట:నీతిచంద్రిక (పూర్వార్ధము).pdf/94 పుట:నీతిచంద్రిక (పూర్వార్ధము).pdf/95 పుట:నీతిచంద్రిక (పూర్వార్ధము).pdf/96 పుట:నీతిచంద్రిక (పూర్వార్ధము).pdf/97 పుట:నీతిచంద్రిక (పూర్వార్ధము).pdf/98 పుట:నీతిచంద్రిక (పూర్వార్ధము).pdf/99 పుట:నీతిచంద్రిక (పూర్వార్ధము).pdf/100 పుట:నీతిచంద్రిక (పూర్వార్ధము).pdf/101 పుట:నీతిచంద్రిక (పూర్వార్ధము).pdf/102 పుట:నీతిచంద్రిక (పూర్వార్ధము).pdf/103 పుట:నీతిచంద్రిక (పూర్వార్ధము).pdf/104 పుట:నీతిచంద్రిక (పూర్వార్ధము).pdf/105 పుట:నీతిచంద్రిక (పూర్వార్ధము).pdf/106 పుట:నీతిచంద్రిక (పూర్వార్ధము).pdf/107 పుట:నీతిచంద్రిక (పూర్వార్ధము).pdf/108 పుట:నీతిచంద్రిక (పూర్వార్ధము).pdf/109 పుట:నీతిచంద్రిక (పూర్వార్ధము).pdf/110 పుట:నీతిచంద్రిక (పూర్వార్ధము).pdf/111 పుట:నీతిచంద్రిక (పూర్వార్ధము).pdf/112 పుట:నీతిచంద్రిక (పూర్వార్ధము).pdf/113 పుట:నీతిచంద్రిక (పూర్వార్ధము).pdf/114 పుట:నీతిచంద్రిక (పూర్వార్ధము).pdf/115 పుట:నీతిచంద్రిక (పూర్వార్ధము).pdf/116 పుట:నీతిచంద్రిక (పూర్వార్ధము).pdf/117 పుట:నీతిచంద్రిక (పూర్వార్ధము).pdf/118 పుట:నీతిచంద్రిక (పూర్వార్ధము).pdf/119 పుట:నీతిచంద్రిక (పూర్వార్ధము).pdf/120 పుట:నీతిచంద్రిక (పూర్వార్ధము).pdf/121 పుట:నీతిచంద్రిక (పూర్వార్ధము).pdf/122 పుట:నీతిచంద్రిక (పూర్వార్ధము).pdf/123 పుట:నీతిచంద్రిక (పూర్వార్ధము).pdf/124 పుట:నీతిచంద్రిక (పూర్వార్ధము).pdf/125 క్రోధుండయి మరలి యిరవున కరిగి యనుతాపపరీతమానసుం డగుచు డాయవచ్చిన కరటకదమనకులం జూచి యిట్లనియె.

'కటకటా! ఎంతదారుణకర్మంబు గావించితిని. భరణరక్షణంబులం బ్రకృతిరంజనంబు గావించువానికిం జెల్లుం గాని నాకు రాజనామంబు గాల్పనే! దూరము విచారింపక సంజీవకునిఁ జంపుకొంటిని. విషవృక్ష మేని సంవర్ధించి తాన ఛేదింపఁజనదు. ఎఱిఁగియే నెఱుఁగకే నేరమి యొక్కండు వొనరించినభృత్యుని నయంబు భయంబుఁ జూపి వాని వేఁడుకోలునం దెలవంబడిన ట్లభినయించి తొలుత మిన్నక విడువవలయు. ఆవల మఱి కావించిన వాని నిజాధికారంబువలనఁ దలంగవలయు. ఇంతకు హెచ్చుఁదీండ్రంబు గానిపింపంబోలదు. కానిపించినం దక్కుంగల లెంకకూటవు కాయువుం దొఱంగు. దాన ఱేనికి దొసంగు పొసంగు నిందు సంశయంబు లేదు. ఎట్టికడిందికర్ణంబయిన సాధింపవచ్చుఁగాని తగినభృత్యుని గడియించుట సుకరంబుగాదు. అది యట్లుండనిమ్ము. లోకంబునందుఁ గలకాలము దుర్వారంబయిన దుర్యశంబు దెచ్చుకొంటి. ఇంక నేమి చేయుదు' ననిన మిన్నక క్రిందుచూచుచుండె. అంత దమనకుం డిట్లనియె. 'స్వామి! దాయం బరిమార్చి యివ్వడువున సుమ్మలంపడంబోలదు. ఱేఁడు తను నెరగుపఱుపం గడంగువానినేని నొప్పరికింపక దోరింపవలయునని పాడినెఱి నెఱిఁగినగఱువలు పలుకుదురు. నేరమిం బొనరించినవారియం దోరిమి తాపసులకుంగాని భూపాలురకుం జనదు. రాజ్యలోభంబువలనం గాని హంకారంబువలనంగాని స్వామిపదంబుం గోరువానికి వధంబు దక్క దండంబు లేదు. ఈయర్థంబు సర్వసమ్మతంబు' నా విని పింగళకుండు సంతుష్టుండయి భద్రాసనంబు నధిష్టించె. దమనకుండు ప్రహృష్టుండయి 'మహాస్వామి! దేవరకు లోకంబులకు స్వస్తియగుం గావుత' మని వచియించి తానును సకలపరిజనంబులును సుఖంబుండె.

అని విష్ణుశర్మ సుహృద్భేదంబు సాంతంబుగ వచియించి యిట్టిభేదంబు మీరు మీశత్రువులందుం బ్రయోగించి విజయంబుఁ బొందుండన రాజపుత్రులు కరంబు హర్షంబు నొందిరి.

పూర్వార్ధము సంపూర్ణము.

————

  1. పాటలీపుత్రమను దీర్ఘమధ్యముం గలదు.