నిను పోనిచ్చెదనా సీతారామ

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search


  మధ్యమావతి రాగం   త్రిపుట తాళం

ప: నిను పోనిచ్చెదనా సీతారామ

నిను పోనిచ్చెదనా సీతారామ || నిను పోనిచ్చెదనా ||


అ.ప: నిను బోనిచ్చెదనా నన్ను రక్షింపక ఏ

మైనగాని నా కనులాన శ్రీరామ || నిను పోనిచ్చెదనా ||


చ 1: రట్టుసేసెద నిన్ను అరికట్టుదు నింక దిక్కు కలిగితే మొరపెట్టుకోరా రామ

గట్టిగ నీపాద కమలము లెప్పుడు

పట్టి నా మదిలో గట్టివెతును శ్రీరామా || నిను పోనిచ్చెదనా ||


చ 2: పడి పడి మీవెంట పడి తిరుగ నెంతో

జడియను నీవెందు జరిగెదవురా రామ

తడయక నీ తల్లి తండ్రులు వచ్చినగాని

విడిచిపెట్టిన నీ కొడుకునురా శ్రీరామా || నిను పోనిచ్చెదనా ||


చ 3: మావాడని మొగమాటము లేకండ సేవజేసి రవ్వ సేయుదురా రామ

నీవు భద్రాచల నిలయుడవై నన్ను

కావవయ్యా రామదాస పోషక శ్రీరామా || నిను పోనిచ్చెదనా ||

This work was published before January 1, 1925, and is in the public domain worldwide because the author died at least 100 years ago.