నా నొసటనే పొడిచె - నా యేమిరా
Jump to navigation
Jump to search
పల్లవి:
నా నొసటనే పొడిచె - నా యేమిరా ॥నా నొసట॥
అనుపల్లవి:
నానా వర వర్ణినులకు - నావలె కామము లేదా ॥నా నొసట॥
చరణ:
పరమ శివునౌదల గంగా - భామలేదా
పరమేష్ఠి ముఖమున సర - స్వతి వసించలేదా ॥నా నొసట॥
దామోదరు రొమ్మున లే - దా ఇందిర
కామాక్షి హరునర్ధాం - గమున బెనుగొనలేదా ॥నా నొసట॥
నా వేణుగోపాల - నన్నేలరాదా
శ్రీవిలసిత శ్రీదాసు - శ్రీరామకవి వరదా ॥నా నొసట॥