Jump to content

నా తప్పులన్ని క్షమియించుమీ

వికీసోర్స్ నుండి


   అసావేరి రాగం    ఆది తాళం


ప: నా తప్పులన్ని క్షమియించుమీ జగ

న్నాథా నీవాడ రక్షింపుమీ || నా తప్పులన్ని ||


అ.ప: పాతకుడని ఎంచక పోషించు

దాత వనుచు నీ పదములె నమ్మితి || నా తప్పులన్ని ||


చ 1: ఈయెడ నానేరము లెంచక హిత

వై తే ద్వేషము లెంచకు మ్రొక్కెద

చేయరాని పనులెన్నో చేసితి

కాయ తీగ కెక్కువ కాదు గదా || నా తప్పులన్ని ||


చ 2: కడుపున బుట్టిన తనయుడు ఎంతో

దుడుకుతనము చేసిన గాని

కొడుకా రమ్మని పిలుచును నూతిలో

పడత్రోయునా తండ్రి ఎవరైన || నా తప్పులన్ని ||


చ 3: దాసుని మనవిని వినుము చక్రధర

వాసవ నుత నన్నేలుకొంటివా

నా స్వామి నమ్మితిని భద్రాద్రి ని

వాసుడ రామదాసు నేలు తండ్రి || నా తప్పులన్ని ||

This work was published before January 1, 1929, and is in the public domain worldwide because the author died at least 100 years ago.