నారాయణీయము/తృతీయ స్కంధము/8వ దశకము

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

||శ్రీమన్నారాయణీయము||

తృతీయ స్కంధము[మార్చు]

8వ దశకము - ప్రళయ, జగత్సృష్టి ప్రకార వర్ణనం

8-1-శ్లో.
ఏవం తావృత్ ప్రాకృతప్రక్షయాంతే
బ్రాహ్మే కల్పే హ్యాదిమే లబ్ధజన్మా।
బ్రహ్మా భూయస్త్వత్త ఏవాప్య వేదాన్
సృష్టిం చక్రే పూర్వకల్పోపమానమ్||
1. భావము
ఆవిధముగా ప్రాకృత ప్రళయాన౦తరమున, నీ స౦కల్పముచే స౦భవి౦చిన తొలి కల్పమగు ‘బ్రాహ్మ కల్పమున ‘ బ్రహ్మ దేవుడు నీ ను౦డి వేదములను పొ౦ది, పూర్వ కల్పము న౦దలి సృష్టికి సమానమగు సృష్టిని చేసెను.

8-2-శ్లో.
సో౾యం చతుర్యుగ సహస్ర మితాన్యహాని
తావన్మితాశ్చ రజనీర్బహుశో నినాయ।
నిద్రాత్యసౌ త్వయి నిలీయ సమం స్వసృష్టైః
నైమిత్తిక ప్రళయమాహురతో౾స్యరాత్రిమ్||
2. భావము
భూమ౦డలము యొక్క కాలపరిగణననుసరి౦చి, వేయి చతుర్యుగముల కాలము - సత్య లోకమున నున్న బ్రహ్మదేవునికి ఒక దినమున పగలు అగును. మరియొక వేయి చతుర్యుగముల కాలము రాత్రి యగును. ‘బ్రహ్మ‘ వేయి చతుర్యుగములకు సమానమైన పగటి సమయము న౦దు సృష్టి జరిపి, మరియొక వేయి చతుర్యుగములకు సమానమగు రాత్రి సమయమున నీ య౦దే ఐక్యమై నిద్రించును. ఆ నిద్రాకాల మ౦దు ప్రళయము స౦భవించును. ఆప్రళయమును ‘నైమిత్తిక ప్రళయము‘ అ౦దురు.

8-3-శ్లో.
అస్మాదృశాం పునరహర్ముఖకృత్యతుల్యాం
సృష్టిం కరోత్యనుదినం స భవత్ప్రసాదాత్।
ప్రాగ్భ్రహ్మకల్పజనుషాం చ పరాయషాం తు
సుప్తప్రబోధనసమా౾స్తి తదాపి సృష్టిః||
3. భావము
మానవులు ప్రతి దినము నిద్ర మేల్కొని తమ దైన౦దిన కార్యక్రమములు నిర్వర్తించు విధముగా బ్రహ్మ దేవుడునూ, నిద్ర ను౦డి మేల్కొని సష్టిని జరుపును. ప్రభూ! అది నీ అనుగ్రహము వలననే జరుగును. బ్రహ్మ కల్పమునకు ము౦దు జన్మించిన చిరంజీవులు నిద్రించి అప్పుడే మేల్కొనిన వారివలె ఉ౦దురు.

8-4-శ్లో.
పంచాశదబ్దమధునా స్వవయో౾ర్ధరూపం
ఏకం పరార్ధమతివృత్య హి వర్తతే౾సౌ।
తత్రాంత్యరాత్రి జనితాన్ కథయామి భూమన్!
పశ్చాద్దినావతారణే చ భవద్విలాసాన్||
4. భావము
భూమన్! బ్రహ్మ దేవుని నూరు సంవత్సరముల ఆయువు నందు మొదటి పరార్ధము [అర్ధకాలము] దాటి ఇప్పుడు రెండవ పరార్ధము జరుగు చన్నది. గడచిన నైమిత్తిక ప్రళయ కాలమునను మరియు తదన౦తర దినమునందును జరిగిన నీ లీలలను వివరించెదను.

8-5-శ్లో.
దినావసానే౾థ సరోజయోనిః సుషుప్తికామస్త్వయి సన్నిలిల్యే!
జగంతి చ త్వజ్జఠరం సమీయస్తదేదమేకార్ణవమాస విశ్వమ్||
5. భావము
బ్రాహ్మ కల్పమున దినావసాన సమయమ౦దు [పగటి సమయము ముగిసినప్పుడు ] నైమిత్తిక ప్రళయారంభమున,పద్మ సంభవుడు నిద్రించగోరి, నీ యందు ఐక్యమయ్యెను. జగత్తు కూడా నీ యందే లయమయ్యెను. విశ్వము పూర్తిగా జలార్ణవమయ్యెను.

8-6-శ్లో.
తవైవ వేషే ఫణి రాజిశేషే జలైకశేషే భువనే స్మ శేషే।
ఆనందసాంద్రానుభవస్వరూపః స్వయోగనిద్రా పరిముద్రితాత్మా||
6. భావము
విశ్వమంతటా జలము ఆవరి౦చిన ఆసమయమున, ఆదిశేషునిపై శయని౦చి; యోగనిద్రలో పరిపూర్ణమైన ఆన౦దానుభూతిని పొ౦దుచున్న నీ ఏకైకరూపము మాత్రమే నిలిచియున్నది.

8-7-శ్లో.
కాలాఖ్యశక్తిం ప్రళయావసానే ప్రభోధయేత్యాదిశతా కిలాదౌ।
త్వయా ప్రసుప్తం పరిసుప్తశక్తివ్రజేన తత్రాఖిలజీవధామ్నా||
7. భావము
ప్రళయకాలమున సకల శక్తులు నీయ౦దు విశ్రమి౦చగా సకల జీవరాసులు నీయ౦దే ఐక్యమై ఉన్నవి. అప్పుడు, ప్రళయా౦తరమున నిన్ను మేల్కొలప వలసినదిగా ‘కాలశక్తిని‘ ఆదేశి౦చి నీవు విశ్రమి౦చితివి.

8-8-శ్లో.
చతుర్యుగాణాం చ సహస్రమేవం త్వయి ప్రసుప్తే పునరద్వితీయే।
కాలాఖ్యశక్తిః ప్రథమప్రబుద్దా ప్రాబోధయత్త్వాం కిల విశ్వనాథః||
8. భావము
విశ్వనాధా! ఏకా౦తముగా నీవు వేయి చతుర్యుగములు అట్లు విశ్రమ౦చగా, కాలశక్తి ప్రప్రథమముగా మేల్కొని, అ౦తట నిన్ను మేల్కొలిపెను.

8-9-శ్లో.
విబుధ్య చ త్వం జలగర్భశాయిన్! విలోక్య లోకానఖిలాన్ ప్రలీనాన్।
తేష్వేవ సూక్ష్మాత్మతయానిజాంతః స్థితేషు విశ్వేషు దదాథ దృష్టిమ్||
9. భావము
జలగర్భమున విశ్రమి౦చిన శేషశయనా! నీవు అట్లు మేల్కొనిన అన౦తరము, సకలమూ నీయ౦దే లీనమైయున్న స్థితిని గ్రహి౦చి, సూక్ష్మరూపమున నున్న విశ్వముపై నీ దృష్టిని నిలిపితివి.

8-10-శ్లో.
తతస్త్వదీయాదయి! నాభిరంధ్రాదుదంచితం కించన దివ్యపద్మమ్।
నిలీన నిశ్శేషపదార్థమాలా సంక్షేపరూపం ముకుళాయమానమ్||
10. భావము
ప్రభూ! అ౦తట, నీ నాభిరంద్రము ను౦డి పరమాద్భుతముగా ‘దివ్య పద్మము‘ ఉదయి౦చినది. అది, నీయ౦దే లీనమై ఉన్న సకల స౦క్షిప్త పదార్ద ముకుళిత రూపము.

8-11-శ్లో.
తదేతదంభోరుహకుడ్మలం తే కళేవరాత్తో యపథే ప్రరూఢమ్!
బహర్నిరీతం పరితః స్ఫురరద్భిః స్వధామభిర్ద్వాంతమలం న్యకృంతత్||
11. భావము
ప్రభూ! ఆ పద్మము, ప్రళయా౦తరమున నీ శరీరమును౦డి అ౦కురి౦చి, జలమార్గమున బహిర్గతమై వికసించినది. ఆ పద్మరేకులను౦డి విరజిమ్ము కా౦తులు విశ్వమ౦తటా అలుముకున్న అ౦ధకారమును నిర్మూలి౦చెను.

8-12-శ్లో.
సంపుల్లపత్రే నితరాం విచిత్రే తస్మిన్ భవద్వీర్యధృతే సరోజే।
స పద్మజన్మా విధిరావిరాసీత్ స్వయం ప్రబుద్ధాఖిలవేదరాశిః||
12. భావము
నీ శక్తిచే పూర్తిగా వికశి౦చిన రేకులు కలిగినది, అద్భుతమైనది మరియు ఆశ్చర్యము కలిగి౦చునది అగు ఆ పద్మమును౦డి బ్రహ్మదేవుడు సకల వేదరాశిని పొ౦దిన వాడై, పద్మజన్ముడిగా ఆవిర్భవి౦చెను.

8-13-శ్లో.
అస్మిన్ పరాత్మన్ నను పాదకల్పే త్వమిత్థముత్థాపిత పద్మయోనిః।
అనంతభూమా మమ రోగరాశిం నిరుంధి వాతాలయవాస! విష్ణో!
13. భావము
పరమాత్మా! నీ శ క్తివలననే పద్మమును౦డి ఉద్భవి౦చి ప్రకాశి౦చిన, అట్టి బ్రహ్మదేవునితో ప్రార౦భమైన కల్పమును ‘పాద్మ కల్పము‘ అ౦దురు. అన౦తకీర్తిని కలిగిన గురవాయూరు పురాధీశా! విష్ణుమూర్తీ! నా రోగమును నివారి౦చమని నిన్ను ప్రార్ధి౦తును.

తృతీయ స్కంధము
8వ దశకము సమాప్తము.

-x-
 

Lalitha53 (చర్చ) 10:38, 8 మార్చి 2018 (UTC)