నానాటి బతుకు తాత్పర్యము

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

ప్రతిపదార్ధములు[మార్చు]

నానాటి =ప్రతి రోజు Every Day. ఇప్పటికీ మనకు నానాటికి, నాటికి అనే పదాలు బహుళ వాడకములో ఉన్నాయి। ఉదాహరణకు "నానాటికీ పరిస్థితులు దిగజారసాగినాయి" , "నాటికీ నేటికీ పెద్దగా తేడాలు లేవు" నానాటికి అంటే రోజురోజుకి అనే అర్థము చెప్పుకొనవచ్చు। నాటికి అంటే నిన్నటికి అని అర్థము చెప్పుకొనవచ్చు। నానాటి అంటే నాటి నాటికీ అంటే ప్రతి రోజూ అని అర్థము చెప్పుకోవచ్చు।
బదుకు = బతుకు, బ్రతుకు, జీవితం (Life)
నాటకము = drama
కానక = చూడక (without seeing)
కన్నది = చూసినది (which was seen)
కైవల్యము = మోక్షము (salvation)
పుట్టుటయు = Taking birth
నిజము = is truth
పోవుటయు = leaving (+this body)
నిజము = is truth
నట్టనడిమి = మధ్యలోని (in the middle )
పని = work
నాటకము = Drama
యెట్ట నెదుట = యెట్ట నెదుట, = యెట్ట యెదుట = ఎదుట + ఎదుట = చక్కగా ఎదురుగా ఉన్న (very clearly lies before eyes)
గల దీ = గలదు + ఈ = కలదు ఈ => కలదు = exists, lies,
= this
ప్రపంచము = World
కట్ట గడపటిది = చిట్ట చివరిది The last one
కైవల్యము = మోక్షము (salvation)
కుడిచే దన్నము = కుడిచేది + అన్నము =

కుడిచేది = తినేది (that which is eaten is ) ఇప్పటికీ "దూడలు పాలు కుడవటానికి వదులు" అనే వ్యవహారము బహుళ ప్రాచుర్యములో ఉన్నది

అన్నము = భోజనము ,( food )
కోక = చీర, Saree
చుట్టెడిది = కట్టుకునేది, చుట్టెడిది అంటే encircling అని అర్థము చెప్పుకొనవచ్చు। కానీ ఇక్కడ చీర కాబట్టి సరిపోతుంది।
నడ మంత్రపు ఇప్పుడు కూడా "నడ మంత్రము సిరి" అని ఓ ప్రయోగమునకు బహుళ ఆదరము గలదు।

= నడుమ వచ్చిన, మధ్యలో వచ్చిన, which came in between. i.e not there in the begining.

పని = work
నాటకము = Drama
వొడి గట్టుకొనిన ఒడి కట్టుకోవడం అంటే ఒడిలో నింపుకోవడం, మన ఆడవాళ్లు పొలాల్లో పనిచేసేటప్పుడు కాయలూ, (పత్తి, ఇప్పుడయితే) ఒడిలోనే నింపుకుంటారు, అలాగే కొన్ని కొన్ని సయ్యాలలో వివిధరకాలయిన పండ్లతో ఒడినింపుతారు। ముఖ్యముగా శ్రీమంతమప్పుడు।

= కూడ బెట్టుకొనిన, సంపాదించుకొనిన (gathered, acquired)

వుభయ కర్మములు = రెండు కర్మములు, మంచీ, చెడుల ఫలితములు। (Two deeds, results of both good and bad deeds)
గడి = గడప, door, outer gate of house.
దాటినపుడె = only when crossed
కైవల్యము = మోక్షము salvation.
తెగదు = won't cut
పాపము = evil , bad
తీరదు = will not be fulfilled
పుణ్యము = good deed.
నగి నగి = నవ్వి నవ్వి, లేదా నవ్వుతూ గడిపిన
కాలము =time
నాటకము = drama
యెగువనె = పైననే , ఈ కొండపైననే, Here on this top itself.
శ్రీ వేంకటేశ్వరుడేలిక = శ్రీవేంకటేశ్వరుడె + ఏలిక = Only Lord VenkaTESvara is the ruler.
గగనము = ఆకాశము sky
మీదిది = పైనున్నది on top of
కైవల్యము = మోక్షము , salvation

భావము[మార్చు]

నానాటి బదుకు నాటకము
కానక కన్నది కైవల్యము

Everyday's life is a drama.
The second line, I am unable to get the meaning exactly. If we translate exact meaning then it comes to "That which is not seen, but seen is salvation" కానక కన్నది కైవల్యము గా మారిస్తే , Thus What is seen is salvation. అనే అర్థము చెప్పుకోవచ్చు . The meaning of కానక కన్నది కైవల్యము is that salvation is very rare and hard to see (or rather achieve).

పుట్టుటయు నిజము పోవుటయు నిజము
నట్టనడిమి పని నాటకము
Only birth and death are truth, the life in the middle is a drama.

యెట్ట నెదుట గల దీ ప్రపంచము
కట్ట గడపటిది కైవల్యము

The one before you is the world, but which is at the last is salvation.

కుడిచే దన్నము కోక చుట్టెడిది
నడ మంత్రపు పని నాటకము

Which is eaten is food, Which is encirled to body is saree, the middle (or other works) is a drama. తినే అన్నము, కోక చుతట్టు కొనినది (భార్య), అనుకోకుందడా జరిగే పనులు అన్ని నాటకములు. అంటే, తినే తిండి, వుండే భార్య, చేసే పని, అన్నీ నాటకములే.

వొడి గట్టుకొనిన వుభయ కర్మములు
గడి దాటినపుడె కైవల్యము

తెగదు పాపము తీరదు పుణ్యము
నగి నగి కాలము నాటకము

To understand these four lines we need some background information.

మనము చేసే ప్రతిపనికీ రెండు రకాల ఫలితాలు వస్తాయి। మంచిపనులకు పుణ్యము, చెడు పనులకు పాపము। మనము ఎంత పుణ్యము వస్తుందో అంత కాలము మనము స్వర్గములో స్వర్గ సౌఖ్యములు అనుభవిస్తాము, (లేదా మరో లోకంలో సౌఖ్యములు అనుభవిస్తాము, గమనిక: ఇక్కడ స్వర్గము మరియూ ఇతర లోకములు వైకుంఠములు కావు - వైకుంఠములోనికి చేరడము మోక్షము లేదా కైవల్యము ) ఎంత పాపము చేస్తామో అంత కాలము నరకములో లేదా మరో లోకములో అంత కష్టాలు అనుభవిస్తాము। అంతే కానీ ఈ పాపాలు, పుణ్యాలను nallify చేయవు। కొన్ని కొన్ని పనుల (యజ్ఞాలు, పూజలు, వ్రతాల వంటివి) ద్వారా మనము ఇప్పుడు రానున్న కష్టాలు వాయిదా వేయవచ్చు, లేదా తరువాత రానున్న సుఖాలు ఇప్పుడే అనుభవించవచ్చు। This is called law of karma.

Whatever we do, we will get two kinds of results. punya and papa, punya for good things and papa for bad things. Depending upon amount of punya we will enjoy life in svarga or other earthly planets. And for the amount of papa we will suffer either in naraka or in other earthly planets. Note that moxa or salvation is different than going to this svarga. Salvation is entering into vaikuMTha, or planet of vishnu. To get salvation we need to nullify both punya and papa. This is called law of karma.

In the above four lines Annamayya is telling the same thing. మోక్షము రావాలంటే పుణ్యాలు పాపాలు రెండూ ఉండకూడదు అదే విషయాన్ని ఈ పై నాలుగు చరణాలలో అన్నమయ్యగారు చెప్పుతున్నారు।

యెగువనె శ్రీ వేంకటేశ్వరుడేలిక
గగనము మీదిది కైవల్యము


Who resides on the hill is Lord venkaTEsvara and he is the only ruler. Which is beyond sky is salvation.


విశేషములు[మార్చు]

ఈ పదములోని కోక చుట్టుకోవడము, ఒడి నింపుకోవడము వంటి పదాల వాడుక వల్ల ఇది ఎవరో స్త్రీకి భోధిస్తూ చెప్పిన హితములాగా కనిపిస్తుంది

నాటకము అంటే అన్నమయ్య గారి ఉద్దేశ్యము మాయ లేదా మిథ్య అనా? కానీ అన్నమయ్య వైష్ణవుడు, వీరు శంకరుల సర్వం మిథ్య అనే బావామును పూర్తిగా విమర్శిస్తారు, ఇదే విషయంపై అన్నమయ్య పాటలు కూడా ఉన్నాయి, కనుక నేను పూర్తిగా ఈ విషయములో ఓ నిర్ణయమునకు రాలేకపోతున్నాను


అదే కాకుండా మిథ్య అంటే మనము జీవితాన్ని ఎలా వస్తే అలా తీసుకోవాలి, "నాటకము" అంటే "సూత్రదారి" (లేదా డైరెక్టరు) చెప్పినట్లు నటించాలి, అనగా ఆ "నటనసూత్రదారి" అయిన దేవదేవుడు చెప్పినట్లు నటించాలి అని వారి ఉద్దేశ్యము అయిఉండవచ్చు

Thanks for the Telugu translations with meaning. Annamayya is truly philosophical in this kriti because he asserts birth (puttutayu) and death (povutayu) are true (nijamu) but only the in-between is like a drama. Therefore, everything is not mithya (illusion) but only the drama is mithya. It is as if GOD brings humans to this earth, makes them dance like puppets and pulls back when HE wishes. This kriti (sung in Revathi raaga) brings one to (feel) contemplation.