నాటి మాట మరచితివో

వికీసోర్స్ నుండి
త్యాగరాజు కృతులు

అం అః

దేవక్రియ రాగం - ఆది తాళం


పల్లవి

నాటి మాట మరచితివో ? ఓ రామ ! చిన్న !


అనుపల్లవి

మాటి మాటికి నాపై - మన్నన జేయుచు,

యేటికి యోచన ? నీ భాగ్యము నీదన్న


చరణము

తరుణుల బాగు నర్తనముల జూచువేళ;

చరణములను గని నే కరగుచు సేవింప,

భరతుని కర చామరమును నిల్పుచు

కరుణను త్యాగరాజ వరదు డని పల్కిన