నమ్మినవారిని

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

ప : నమ్మినవారిని మోసము చేయుట - న్యాయము గాదుర నా తండ్రి సమ్మతమౌన చూచేవారికి – చక్కన గాదుర రఘునాథా ||నమ్మిన||

చ:

విన్నరంటే పరులందరు నిను - విడనాడుదురే రఘునాథా అన్నా నీకిది చిహ్నము గాదుర - ఆదుకోవలెనురా రఘునాథా ||నమ్మిన||

నిన్నా నేడా నిన్ను కొలిచేది - నీకేంల తెలియదు రఘునాథా ఎన్నాళ్ళీ కష్టము పదుడు - నిక తాళనురా రఘునాథా ||నమ్మిన||

డబ్బులకై నేను దెబ్బలు పడినది - దబ్బరగాదుర రఘునాథా నిబ్బరముగ రామదాసు నేలుము మా – అబ్బ తాళనుర రఘునాథా ||నమ్మిన||