Jump to content

నను బ్రోవమని

వికీసోర్స్ నుండి


   కళ్యాణి రాగం     త్రిపుట తాళం

ప: ననుబ్రోవమని చెప్పవే సీతమ్మతల్లి || ననుబ్రోవమని ||


చ 1: ననుబ్రోవమని చెప్పవే నారీ శిరోమణి

జనకుని కూతుర జనని జానకమ్మ || ననుబ్రోవమని ||


చ 2: ప్రక్కన చేరుక చెక్కిలి నొక్కుచు

చక్కగ మరుకేళి సొక్కు చుండెడివేళ || ననుబ్రోవమని ||


చ 3: ఏకాంతరంగుడు శ్రీకాంత నినుగూడి

ఏకాంతమున నేక శయ్య నున్నవేళ || ననుబ్రోవమని ||


చ 4: అద్రిజ వినుతుడు భద్రగిరీశుడు

నిద్రమేల్కొనువేళ నెలతరో బోధించి || ననుబ్రోవమని ||

This work was published before January 1, 1929, and is in the public domain worldwide because the author died at least 100 years ago.