Jump to content

నగు మోము గనలేని

వికీసోర్స్ నుండి
త్యాగరాజు కృతులు

అం అః

నగు మోము గనలేని (రాగం: ఆభేరి) (తాళం : ఆది)


పల్లవి

నగు మోము గన లేని నా జాలిఁ దెలిసి

నన్ను బ్రోవగ రాద ? శ్రీ రఘువర ! నీ | | నగు మోము | |


అనుపల్లవి

నగరాజధర ! నీదు పరివారు లెల్ల =

ఒగి బోధన జేసెడువారలు గారె ? యిటు లుండుదురే ? నీ


చరణము

ఖగరాజు నీ యానతి విని వేగ చనలేడో ?

గగనాని కిలకు బహుదూరం బనినాడో ?

జగమేలెడు పరమాత్మ ! యెవరితో మొఱలిడుదు ?

వగ చూపకు తాళను న న్నేలుకోరా; త్యాగరాజనుత !


nagumOmu ganalEni (Raagam: aabhEri) (Taalam: aadi)


pallavi

nagumOmu ganalEni nAjAli telisi nanu brOvaga rAdA shrI raghuvara nI


anupallavi

nagarAjadhara nIdu paraivAra lella ogibOdhana jEsE vAralu gArE yiTu luNDudure


caraNam

khagarAju nI yAnati vini vEga canalEdO gaganAni kilaku bahu dUrambaninAdO jagamEle paramAtma evaritO moraliDudu vaga jUpaku tALanu nannElukOra tyAgarAjanuta nI