Jump to content

ద్విపద భారతము - మూఁడవసంపుటము

వికీసోర్స్ నుండి
​
​Andhra University Series: No. 42

ద్విపద భారతము సంపుటము 3 (భీష్మ, ద్రోణ, కర్ణ, శల్య, సౌప్తిక, స్త్రీ పర్వములు )

గ్రంథకర్తలు: భీష్మపర్వము ద్రోణపర్వము

తిమ్మయ

సోమన

కర్ణ పర్వము శల్య పర్వము సౌప్తిక పర్వ ము

విద్వాన్. గంటి జోగి సోమయాజి. ఎం. ఎ., ఎల్. టీ., ఆంధ్ర విశ్వకళాపరిష త్ప్రచురణ శాఖాధ్యక్షులు :


ఆంధ్రవిశ్వకళాపరిషత్తు చేఁ బ్రచురితము


రాజమహేంద్రవరము: సరస్వతీ పవర్ ప్రెస్ నందు శ్రీ అద్దేపల్లి నాగేశ్వరరావు గారిచే ముద్రితము, 1950

Price Rs. 15/-] [ వెల రూ.15/ ​ ఉపోద్ఘాతము

ఆంధ్ర దేశమునందలి యముద్రితాంధ్రవాఙ్మయమును సేకరించి ప్రచు రించు తలంపుతో, ఆంధ్రవిశ్వకళాపరిషత్తువారు చాలకాలము నుండియు తంజా వూరు మొదలైన స్థలములలోనున్న యముద్రిత గ్రంథములను వాని ప్రతులను సంపాదించుచున్నారు. ఈ సందర్భమున 1938 వ సంవత్సరము నుండియు తంజా వూరు సరస్వతీమహలులోని తాళపత్రగ్రంథములకుఁ బ్రతులు తయారుచేయించు చునే యున్నారు. అట్లు సంపాదించిన యనేక గ్రంథములలో ద్విపద భారతమును సంస్కరించి ముద్రించుట కారంభించిరి. ఆకాలమున ఈ కార్యము సాగించుటకు అధ్యక్షులుగా శ్రీ పింగళి లక్ష్మీకాంతంగారు నియమింపఁబడిరి. 1949 వ సంవ త్సరము జనవరిలో వీరు ఉద్యోగమునుండి విశ్రాంతిపొందిరి. అప్పటికి ద్విపద భారతములోని మొదటిసంపుటము (అనగా ఆది సభా పర్వములు) ముద్రించి ప్రకటింపఁ బడినది. "రెండవ సంపుటము ఉద్యోగపర్వాంతము వారి పర్యవేక్షణము ననే వెలసినది. 1949వ సంవత్సరము అక్టోబరు మాసములో ఆంధ్రవిశ్వక శాపరిషత్తు ప్రచురణశాఖకు నన్నధ్యక్షునిగా నియమించుటచే మిగిలిన గ్రంథమును నేను సరిచూడవలసి వచ్చినది. కర పర్వము తుదియాశ్వాసమునుండియు స్వర్గారోహణ పర్వాంతము పరిశీలించు నవకాశము నాకేర్పడినది.

ఈ ద్విపద భారత ముద్రణమున కాధారము చాలవఱకుఁ దంజావూరిలోని తాళపత్రమాతృక యొక్కటియే. సౌప్తిక స్త్రీ పర్వములకు తిరుపతిలో వేఱక తాళపత్రమాతృక యుండఁగా దానిని తెప్పించి గ్రంథమును బరిశీలించి యా ప్రతులయందలి పాఠాంతరములతో నా రెండు పర్వములను ముద్రించితిమి. తమ తాళపత్రమాతృకలను బంపి మా ప్రయత్నమును సఫలము చేసిన శ్రీ తిరుపతి వెంక టేశ్వర ప్రాచ్య విద్యాపరిశోధనాల యాధ్యక్షులకు మా కృతజ్ఞత.

ఈ ద్విపద భారత ముద్రణము నిర్వహించుటలో మొదటినుండియు సహా యులుగా శ్రీ కొమ్మనమంచి జోగయ్యశర్మగారు పనిచేయుచున్నారు.

వాల్తేరు 7-6-50

విద్వాన్ సోమయాజి, ప్రచురణశాఖాధ్యక్షుఁడు,