ద్విపద బసవపురాణము

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

Telugu Classics - Popular Edition Series

ద్విపద

బసవపురాణము

పాల్కురికి సోమనాథకవి ప్రణీతము

[సంక్షిప్తము]

పరిష్కర్త:

గూడ వేంకట సుబ్రహ్మణ్యం ఎం. ఏ.


ప్రచురణ:

ఆంధ్ర ప్రదేశ్ సాహిత్య అకాడమి

కళాభవనము :: హైదరాబాదు - 4.

ప్రథమ ముద్రణ :

జనవరి : 1969

ప్రతులు : 4000మూల్యము : రూ. 2 - 50ముద్రణ :

గ్రీన్ ప్రింటింగ్ ప్రెస్.

బాంబే బజార్ సందు.

ఆబిద్ సర్కిల్, హైదరాబాద్.

తొలిపలుకు

మూఁడు సంవత్సరాలక్రింద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వములో సాంస్కృతిక వ్యవహారాల మంత్రిగా ఉండిన శ్రీ ఎం. ఆర్. అప్పారావు గారు చేసిన సూచనల ననుసరించి తెలుఁగు భాషలోని సాహిత్యము అందఱికి అందుబాటులో నుండునట్లుగా ముద్రించి ప్రకటించవలెనని అకాడమీ నిశ్చయించినది. తెలుఁగుభాషలోని పూర్వగ్రంథసముదాయము ఈనాడు పాఠకునికి సక్రమముగా సరసమైన ధరకు లభ్యమగుటలేదు. ఈ లోటును తీర్చి ప్రాచీన గ్రంథ సంచయమును విడివిడిగా ప్రకటించుటకు సాహిత్య అకాడమీ ఒక ప్రణాళికను సిద్ధము చేసినది. ఈ ప్రణాళిక ప్రకారము ఈ కార్యక్రమము మూఁడు తరగతులుగా విభజించనైనది. మొదటిది ప్రాచీన ప్రబంధాల ప్రకటన. రెండవది మహాభారతము, భాగవతము, హరివంశము, భాస్కరరామాయణము, బసవపురాణము, భోజరాజీయములను సంగ్రహించి ప్రకటించుట. మూఁడవది భారత భాగవతాలనుండియు నాచన సోమన, కంకంటి పాపరాజు, కూచిమంచి తిమ్మకవి రచనల నుండియు భాగాలను ఏర్చి కూర్చి ప్రకటించుట. మొదటి తరగతిలో 29 ప్రబంధాలను 29 సంపుటాలుగా, రెండవ తరగతిలోని గ్రంథాలను 13 సంపుటాలుగా, మూఁడవ తరగతిలోని గ్రంథాలను 8 సంపుటాలుగా, మొత్తము 50 సంపుటాలను ప్రకటించు కార్యక్రమము స్వీకరించవలె నని అకాడమీ తీర్మానించినది.

ఈ ప్రణాళిక ప్రకారము ప్రతిసంపుటము 1/8 డెమ్మీసైజులో క్యాలికో బైండుతో 200 పేజీల గ్రంథముగా నుండవలెనని నిర్ణయించ నైనది. ప్రతి గ్రంథములో గ్రంథకర్తనుగూర్చి, గ్రంథ ప్రాశస్త్యమును గూర్చి వివరించు సుమారు 40 పేజీల పీఠికను చేర్చవలె నని నిశ్చయించనైనది. చౌకగా పాఠకులకు అందజేయవలెనను ఉద్దేశముతో ఈ సంపుటాల వెల తక్కువగా నిర్ణయించ నై నది. ఇప్పటివఱకు మొదటి తరగతిలో 29 పుస్తకాలను ప్రకటించి ముద్రించుట జరిగినది. ప్రస్తుతము రెండవ తరగతిలోని పుస్తకాల ప్రకటన ప్రారంభమైనది. మేము కోరినంతనే యీ సంపుటము సిద్ధముచేయు బాధ్యతను స్వీకరించి నిర్ణయించిన గడువులోపల వ్రాతప్రతిని అందజేసిన శ్రీ జి. వి. సుబ్రహ్మణ్యముగారికి అకాడమీ పక్షాన కృతజ్ఞతలు. ఈ తరగతిలోని మిగిలి పుస్తకాలు ఈ సంవత్సరాంతము వరకు ముద్రితము కాగలవని ఆశించుచున్నాను.

ఈ ప్రణాళికను అమలుచేసి వ్రాతప్రతులను సిద్ధముగావించి ముద్రించుటకు కావలసినడబ్బు మొత్తము అకాడమీకి యిచ్చుటకు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు వాగ్దానము గావించి యిప్పటివఱకు కొంత డబ్బునుగూడ విడుదల చేసినవి. ఇందుకు అకాడమీ పక్షాన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ధన్యవాదాలు. నిర్ణయించిన గడువులోపల ఈ సంపుటా లన్నిటిని ప్రకటించి ఆంధ్ర పాఠకలోకానికి అందజేయగల మని విశ్వసించు చున్నాను.

హైదరాబాదు

6 - 1 -1969

దేవులపల్లి రామానుజరావు,

కార్యదర్శి.


____________

విషయసూచిక

పుట:Dvipada-basavapuraanamu.pdf/9 పుట:Dvipada-basavapuraanamu.pdf/10 పుట:Dvipada-basavapuraanamu.pdf/11