దేవీ విరాడ్రూప వైనట్టి నీకు

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ తెలుగు కీర్తనలు

పల్లవి :
దేవీ ...... దేవీ ......
దేవీ విరాడ్రూప వైనట్టి నీకు
ప్రకృతి సర్వమ్ము ముస్తాబు చేయు

ఉదయించు రవి కాళ్ళ పారాణి పెట్టు
శశిలోని కరిమచ్చ కస్తూరిబొట్టు
మధ్యాహ్న రవి మకుట కోటీరము
నక్షత్రతతి రత్న భూషావళి

తుదలందు వెన్నెలల వెలుగీనెడి
మబ్బుల్లు వయ్యారి పైటంచులు
వర్షాలు మెడలోని ముత్యాల సరులు
చీకట్లు నాట్యాన చెలరేగు కురులు

మానవులు అందెల్లొ చిరు గజ్జెలు
పక్షులు వడ్డాణమున గంటలు
దేవతలు అందాల భుజకీర్తులు
సురగంగ మాంగళ్య గళసూత్రము

నిన్ను ఈ రీతి భావించి వీక్షించిన
సచ్చిదానంద భావంబు రాకుండునా


ఈ పాట mp3