దివ్యదేశ వైభవ ప్రకాశికా/తిరువాఱన్ విళై

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

అనునటుల నా హృదయమునందు వాసము చేయుచున్నాడు. అంతేకాక అందుకు కారణమైన తిరుక్కడిత్తాన క్షేత్రమున వేంచేసియున్నాడు. ఈ రెండును స్వామికి దాయప్రాప్తములుగదా!" అని ఆళ్వార్లు సర్వేశ్వరుని కృతజ్ఞతా గుణమును ప్రకాశింపజేసిరి. ఈ క్షేత్రము సహదేవునిచే ప్రతిష్ఠింపబడినట్లు చెప్పుదురు. చిన్న గ్రామము. సమీపమందలి శెంగనాంచేరిలో మకాంచేయవలెను. లేక తిరువల్లవాழ் నుండి పోవచ్చును.

పా. తాన నగర్ గళ్; తలైచ్చిఱన్దెజ్గెజ్గుమ్;
   వానిన్నిలమ్‌ కడల్; ముత్‌త్తు మెమ్మాయఱ్కే;
   ఆనవిడత్తు; మెన్నై--మ్‌ తిరుక్కడిత్
   తాననగరుమ్; తన తాయప్పదియే.
         నమ్మాళ్వారు-తిరువాయిమొழி 8-6-8

71. తిరువాఱన్ విళై 13 (ఆరుముళై)

శ్లో. తిరువారన్ విళాఖ్యానే పురేవ్యాస స్పర స్తటే|
   కురళప్పవితి శ్రీమాన్ పద్మాసన రమాపతి:||
   విమానం వామనం ప్రాప్త: కుబేర హరి దానన:|
   బ్రహ్మేక్షితస్థితో రేజే పరాంకుశ మునిస్తుతు:||

వివ: తిరుక్కుఱళప్పన్-పద్మాసనవల్లి త్తాయార్-వ్యాస పుష్కరిణి-వామన విమానము-ఉత్తర ముఖము-నిలచున్నసేవ-బ్రహ్మకు ప్రత్యక్షము-నమ్మాళ్వార్ కీర్తించినది.

విశే: ఈ క్షేత్రము అర్జునునిచే ప్రతిష్ఠింపబడినట్లు చెప్పుదురు. ఇచట మూలవరులకు ప్రతి నిత్యము తిరుమంజనము, పుష్పాలంకరణము కలదు. తప్పక సేవింపదగినది. నమ్మాళ్వారు తిరువాయిమొழி ఏడవశతకం పదవ దశకమగు "ఇన్బం పయక్క" అను తిరువాయిమొழிలో "ఇన్బమ్ పయక్క ఇవితుడన్‌వీత్తిరున్దు" (సుఖము కలుగునట్లుగా ప్రీతితో వేంచేసియుండి) అని సమస్త లోకములకు స్వామియగు సర్వేశ్వరుడు పిరాట్టితో (శ్రీదేవి) పాటు నా తిరువాయిమొழி వినుటకై తిరువాఱన్‌విళై క్షేత్రమున వేంచేసియున్నాడు." అని సర్వేశ్వరుని ఆనందాతిశయము అను గుణమును ప్రకాశింపజేసిరి. ఈ క్షేత్రమునకు "వీణగర్"(మహానగరము) అను తిరునామము కలదు. తి.వా.మొ. 7-10-6

మార్గము: శెంగణూర్‌కు తూర్పున 10 కి.మీ. సత్రము కలదు. వసతులు స్వల్పము.

87

పా. ఆగుజ్కొల్ ఐయమొన్ఱిన్ఱి; యగలిడ ముత్‌తవుమ్‌ ఈరడియే
   ఆగుమ్‌ పరిశు నిమిర్‌న్ద; తిరుక్కుఱళప్ప నమర్‌న్దుఱై యుమ్;
   మాగమ్‌ తిగழ் కొడిమాడజ్గళ్; నీడుమదిళ్ తిరువాఱన్‌విళై
   మాకన్ద నీర్ కొణ్డు తూవి వల--య్‌దు; కై తొழ క్కూడుజ్గొలో.
         నమ్మాళ్వార్-తిరువాయిమొழி 7-10-2

శ్లో. ఇత్థం శ్రీమళయాళస్థ దివ్యదేశా స్త్రయోదశ|
   మయా సంకీర్తితా శ్రీమత్ రామానుజ కృపాబలాత్||

వివ: భగవద్రామానుజులవారి కృపాబలము వలన మళయాళ దేశమున గల పదమూడు క్షేత్రములు వర్ణింపబడినవి.

శ్లో. అథద్వే మధ్య దేశస్థా వర్ణ్యతే క్షేత్ర సత్తమౌ|
   రామానుజార్య కరుణా కటాక్ష బలతోమయా !

వివ: భగవద్రామానుజులవారి కరుణా కటాక్ష బలముచేత మధ్య దేశమున గల రెండు క్షేత్రరాజములు వర్ణింపబడుచున్నవి.

72. తిరువయిందిర పురమ్‌

శ్లో. శ్రీమత్ తార్ద్య తరజ్గిణీ తటతలే శేషాఖ్య తీర్థాంచితే
   దేవ శ్శ్రీమదహేంద్ర పట్టణ వరే చంద్రాఖ్య వైమానగ:|
   వైకుంఠాఖ్య రమాయుతో విజయతే శ్రీ దేవనాథ ప్రభు:
   ప్రాగాస్య స్థితి రిందు తార్ద్య విషయ స్తుత్య: కలిద్వేషిణ:||

వివ: దెయ్‌వనాయకన్(దేవనాథన్)-వైకుంఠనాయకి(హేమాబ్జవల్లి)-గరుడనది-శేషపుష్కరిణి-చంద్రవిమానము-తూర్పు ముఖము-నిలచున్న సేవ-చంద్రునకు, గరుత్మంతునుకు ప్రత్యక్షము-తిరుమంగై ఆళ్వార్ కీర్తించినది.

విశే: శ్రీమత్ వేదాంత దేశికులు తపమాచరించిన ప్రదేశము. ఇచటనేవారు గరుడోపాసన చేసి వారి వలన హయగ్రీవుల యనుగ్రహము పొందుటకై హయగ్రీవ మంత్రమును పొందిరి. ఇచటగల కొండపై వారు ఆరాధించిన హయగ్రీవుల సన్నిధి కలదు. ఈ కొండకు ఔషధాద్రి యనిపేరు. ఈక్షేత్రమున శ్రీమద్వేదాంతదేశికులు నలుబది సంవత్సరములు వేంచేసియుండిరి. వారి తిరుమాళిగ (ఇల్లు) వారు స్వయముగా స్వహస్తములతో నిర్మించిన కిణర్ (నుయ్యి) ఇప్పటికిని గలవు.

ఈక్షేత్రస్వామి విషయమై శ్రీవేదాంత దేశికులు దేవనాయక పంచాశత్, అచ్యుతశతకం(ప్రాకృతభాష)-గరుడదండకం, గరుడ పంచాశత్, హయగ్రీవ స్తోత్రములను అనుగ్రహించిరి. ఇచట శ్రీమణవాళమహామునులకును సన్నిధి గలదు. మేషము-పౌర్ణమి తీర్థోత్సవము-కన్యాశ్రవణం వేదాంతదేశికుల తిరునక్షత్ర మహోత్సవం చాలా వైభవముగా జరుగును.

                       88