దివ్యదేశ వైభవ ప్రకాశికా/తిరుప్పుల్లాణి

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

44. తిరుప్పుల్లాణి 4 (దర్భ శయనం)

(రామనాధపురం 10 కి.మీ)

శ్లో. శ్రీపుల్లాణి పురేతు పిప్పలనగ శ్రీ చక్ర తీర్థాంచితే
   కల్యాణాఖ్య విమాన మధ్య నిలయ:కల్యాణ వల్లీ ప్రియ:
   కల్యాణాఖ్య జగత్ప్రభు ర్విజయతే ప్రాగాననో రాజతే
   పుల్లారణ్య మహర్షి సేవిత తను:కలిద్వేషిణ:||

వివ: కల్యాణ జగన్నాథన్-కల్యాణవల్లి తాయార్-చక్ర తీర్థము-కల్యాణ విమానము-పిప్పల పర్వతము-తూర్పు ముఖము-కూర్చున్న సేవ-అశ్వత్థవృక్షము-దర్భ శయనము-పుల్లారణ్య మహర్షికి ప్రత్యక్షము.

విశే: ఈ క్షేత్రమునకు దగ్గరలో రామేశ్వరం, ధనుష్కోటి కలవు. ఈ సన్నిధిలో గల అశ్వత్థ వృక్షము క్రింద నాగ ప్రతిష్ఠ చేసిన వార్కి సంతానము కలుగును. పెరుమాళ్లు ఆరగించు పాయసము తప్పక స్వీకరింపవలెను. ఇచట దేవగణములతో పత్నీ సహితుడైన వరుణుడు, విభీషణుడు శరాణాగతి చేయుచుండగా దర్భలపై శయనించిన చక్రవర్తి తిరుమగన్(శ్రీరామచంద్రులు)సేవ సాదింతురు.

మార్గము: రామనాథపురమునకు 10 కి.మీ. కారైక్కుడి నుండి రామనాథపురము బస్‌లో పోవచ్చును.

పా. విల్లాలిలజ్గై మలజ్గచ్చరమ్‌ దురన్ద,
    వల్లాళన్ పిణ్ పోన నె-మ్‌ వరుమళవుమ్;
    ఎల్లారు మెన్ఱన్నై యేశిలుమ్‌ పేశిడినుం
    పుల్లాణి యెమ్బెరుమాన్ పొయ్‌కేట్టిరున్దేనే.
    
    కనై యారిడి కురలిన్ కార్ మణియణ్ నా వాడల్
    తినై యేనుమ్‌ నిల్లాదు తీయిల్ కొడిదాలో
    పునై యార్ మణిమాడ పుల్లాణి కై తొழுదేన్
    వినై యేన్ మేల్ వేలై యుమ్‌ వెన్దழలే వీశుమే.
    
    వేదముమ్‌ వేళ్వియుమ్‌ విణ్ణు మిరుశుడరుమ్‌
    ఆదియుమానా నరుళ్ తన్ద వానమక్కు
    పోదలరుమ్పొన్నై శూழ పుల్లాణికై కొழுదేన్
    ఓదముమ్‌ నాను ముఱజ్గా దిరున్దేనే.
           తిరుమంగై ఆళ్వార్-పెరియ తిరుమొழி 9-4-5,7,9

                       56