Jump to content

దశరథరాజనందనచరిత్ర/సారస్వతసర్వస్వము

వికీసోర్స్ నుండి

సారస్వతసర్వస్వములోని పద్యములు

దశరథరాజనందనచరిత్ర ము. ప్రలో లేక సా. సర్వస్వమునందున్న పద్యములివి
(సా.సర్వస్వము 1సం. 1సం. రుధిరోదారి భాద్రపదమాసము
1సం. 2సం. రుధిరోదారి ఆశ్వయుజము)

ప్రథమాశ్వాసము

1. క.

ఇల జన్న యైన నిక కా
గలయెల్ల ధరాతలాధికర్తల కెల్లన్
తెలియగ నీనడకల తెర
గలరెన్ నాకెఱుక సేయకయ్య దృఢగతిన్.

55


2. క.

నీ నయగతి నీదృఢక్రియ
నీ నయగతి నీతిదీక్ష నీ సత్యదయా
జ్ఞానస్థితి ధర నొరులకు
నేవాడు ఘటిల్లె చెపుము యనఘచరిత్రా.

56


3. క.

జననాయక నీ హృత్స్థలి
తనయాకాంక్షాతిశయత దాల్చినయది చ
య్యన నేనెరిగించినగతి
గని నడచినఁ గార్యసిద్ధి కడయెట్లన్నన్.

57


4. ఆ.

అనఘ యంగదేశజనకర్త తనకన్య
శాత ఋష్యశృంగ జటిలనేత
కిచ్చి యాతగాని కింటనే టెంకి సే
యించె కాంక్షలెల్ల నెదిగిరాగ.

58


5. మ.

అనతశ్రీనిధి నాతగాని గృహిణిన్ హర్షస్థితిన్ దెచ్చినం
దనకాంక్షేష్టి రచించినన్ సకలశాస్త్రజ్ఞానలాక్షణ్య ధై

ర్యనయాచార దయాకళాతీశయ సారస్యక్రియల్ గన్న రా
చనెల ల్గల్గెదరయ్య యష్టహరిదీశశ్రేణి కీర్తించగన్.

59


6. క.

అన సంతసిల్లి దశరథ
జననాయకహేళి యంగజగతీవరరా
ట్తనయాసాంగత్యక్రియ
ననతస్థితి ఋష్యశృంగ యతిఁ దెచ్చెఁ దగన్.

60


7. ఆ.

ఆజిధరణినేత యతిఁ దెచ్చి నిజశాల
యందె టెంకి జేసి హర్షనియతి
యజ్ఞకరణదీక్ష నఖిలార్థసంఘట
నాతిశయత నిలచె నంతకంత.

61


8. క.

తనయాగరత్నచర్యల్
గనగా హరిదంత రాజఘనులను దగరా
ననిచిన నేతెంచిరి య
త్యానతానందరససిద్ధి యతిశయిలంగన్.

62


9. మ.

హరిగాంగేయశతాంగగంధగజసేనాధ్యక్షసంక్రాంతిచేఁ
గరఘంటానకకాహళాజలజఢక్కాతాళనిస్సాణజ
ర్ఝరనాదక్రియ లంతరిక్షసకలాశల్ ధాత్రియం దానఁగా
నరనేతల్ నగరిస్థలిన్ గలయనిండన్ సాగిరా నాయెడన్.

63


10. తే.

దశరథక్షితినాయక దంతినిష్ఠ
సంధిలగ గేహినీత్రయి చక్కనలర
యజ్ఞదీక్ష నధిష్ఠించె యాజియాజ్ఞ
శాస్త్రజనితార్థసత్క్రియల్ చక్కనలర.

64


11.క.

ఈగతి నిష్టి రచింప(చ)గ
సాగెన్ దశరథనృనేత చక్కఁగా సకలా
శాగతరజచ్ఛటల్ నా
లా గరసి యనేకచర్యలన్ గీర్తించన్.

65

12. వ.

అంత నక్కడ.

66


13. చ.

హరి నిరసించి, కీలి నగి, యర్కి జయించి, ఖగారి గేరి, సా
గరధరణీసుతున్ దెగడి, గాలి నదల్చి, ధరాధినేత గె
ల్చి, రజితశైలకర్త గడఁజేసి, దశానననిర్జరారికే
సరి చరియించె నాగవరచారణహృద్గతశాతహేతియై.

67


14. తే.

నిర్జరీనిర్జరశ్రేణి నిత్యకృత్య
దాసికాదాసచర్యల దండియడఁగి
యార్తి సంధిల్ల నయ్యజియ్యలిడ
ధరణి సంచరించడసాగె నేశంక లేక.

68


15.ఉ.

ఆతరి శైలహంతయనిలార్కనిశాటజలేశకాళికా
నేతలలాటనేత్రహరినిర్జరకిన్నరసిద్ధసాధ్యసం
జాతసహాయతన్ గదలి సత్యజగత్స్థలి చేరనేగె న
త్యాతతహర్షసారజనితాశ్రుకణార్ద్రశరీరయష్టియై.

69


16. వ.

అట్లు చేరి.

70


17. చ.

సనకసనందాదియతిసంతతి కీర్తన సేయ కాంచనా
సన ధరణీసహస్ర జలజాతహితాయత ఘృష్టి యంతటన్
దనరఁగ శారదాసహిత ధాత జగజ్జననేత నక్కరన్
గని నతిఁ జేసి లేచి యలికస్థలి కేలు ఘటించి యాడె దాన్.

71

(2వ సంపుటము)

18. క.

అయ్య దశాస్య ఖలాగ్రణి
కియ్యఁగ రానట్టి నాంక్ష లిచ్చినకతనన్
నియ్యాన యిట్టి యందర
చియ్యల్ తరగంగసాగె క్షితి చరియింపన్.

72


19. క.

చెన్నటి నాతని గణనన్
దిన్నఁగ యందరల యార్తి దిరిచి రక్షిం

చ న్నీక కాక యితరుల
కన్నా దృఢశక్తి గలదె గణియింపంగన్.

73


20. చ.

అనిన ధరాధరారి నయనక్రియ సంధిల నాదరించి యా
చెనటి యనేకకాంక్ష లెడసేయక నాదయ గాంచి యందరన్
బెనకఁగ గాననేరనె నశించఁగ నేటికి దాని గర్హసా
ధనగతి యాలకించి సహితస్థితిచే నిరిగించెదన్ దగన్.

74


21. తే.

దిగధినాయక చారణఖగఖగాహి
యక్షకిన్నర సిద్ధసాధ్య తతిచేత
హానిఁ జెందని కాంక్ష న న్నడిగెగాని
తెలియలేదయ్యె నసురుఁడు దృఢతరార్తి.

75


22. క.

అది గనుక నాతగానిన్
గదనస్థలి నణఁచ నేరికతనన్ గాలే
దది శ్రీహరిచేఁ దక్కఁగ
ద్రిదశ్ఛటలార యార్తి తెరలఁగనేలా?

76


23. తే.

అయినదానికిఁ జింత సేయంగ నేటి
కార్తిచే నతసంత్రాత యఖిలకర్త
ఘనదయానిధి శ్రీహరి గలిగెఁగాన
నతనిసన్నిధి కేగిన నదియె లెస్స.

77


24. సీ.

నన్నాగడించిన నరఖాదనాగ్రణి
             జలచరాకృతిచేత సంహరించె
ఖచరరాక్షసకరాగ్రస్రస్తకఠినాద్రి
             నీరధికడ నిల్చి నిష్ఠ నానె
లీల హిరణ్యాక్షలేఖారి తెగటార్చి
             శృంగసంస్థితి నెత్తి క్షితి ధరించె
సకలచరాచరస్థాయిగాడన్నరా
             కాసి నఖాళిచే డాసి జీరె

నదితీజారాతిఁగ్రిందికి నణగదన్నె
చెనటిరారేండ్ల నందర చేరిచెండె
నట్టి జగదేకకర్త శ్రీహరియె గల్గ
తెలియఁజాలక జాలి చింతించనేల.

78


25. క.

అని గద్దె డిగ్గి కై జేసిన
తనరాయంచ నెక్కి జేజేల జత
ల్తనచెంత నిలచిరాగాఁ
జని తెల్లనికడలి చేరసాగఁగ నచటన్.

79


28. సీ.

రాకాశశాంకనీరంధ్రచంద్రిక లెల్ల
             గలయ నేకాకృతిఁ గాంచె ననఁగ
నాళీకగేహినీనాథదేహచ్చాయ
             సకలాశ లందంగ సాగె ననఁగ
ద్రిదశసంతతి యెడతెగనీక సంతాన
             నగరాజి యంతట నాడె ననఁగ
హారహీరచ్చటాలర్థి దిన్నెలు సేసి
             జగతికి సరిగాగ జరచి రనఁగ
కానఁగానైన తెల్లనికడలిచెంత
నంచితాహ్లాదనియతి రాయంచ డిగ్గి
యష్టదిగ్రాజకీర్తన లతిశయిల్ల
సృష్టిరక్షణకర్త తా స్రష్ట నిలచె.

80


27. క.

నిలచినశతధృతి దిఙ్నే
తలు చేరలిడంగఁజేయ ధారన హరియా
హళహళికల్ హృదయస్థలి
బెలసి దయారసనిధానదృష్టి దనరఁగన్.

81


28. సీ.

శంఖచక్రగదాసిశార్ఙచిహ్నితదీర్ఘ
             కరశాఖ లత్యంతగళఁల దనర
శారదనీరదస్థలతటిల్లతికచం
             దాన గటెఁద లచ్చి కానరాఁగఁ

దేటగా రత్నకిరీటాద్యలంకార
             సంజాతనిగనిగచ్ఛాయ లెసఁగ
నంగయష్టి నలందినట్టి శ్రీచందన
             స్థితి యష్టదిశల రంజిలఁగ జేయ
నెఱ్ఱరెక్కల తత్తడి నెక్కి యెల్ల
దాససంతతి రెండెనల్ దడసి చనఁగ
హరి జగత్కర్త యందఱలర్థి యెన్న
శారదాజాని చెంగట చేరి నిలచె.

82


29. క.

నిలచిన శ్రీహరి గని ని
శ్చలసరణి దిగీశఖచరసంతతి ధర సా
గిలి లేచి స్రష్ట నిటల
స్థలఘటితాంజలి దిశించ సనయక్రియచేన్.

83


30. చ.

శరనిధి రాజగేయ మన శారద నీరద దేహ యీశ శ్రీ
ధర యరుణాస్యయాన హితదాన జనత్రిదశాగహేళిచెం
దిర శిఖినేత్ర మిత్త్ర హృత తీక్ష్ణ నిశాట యనాథనాథ సం
గర జయశీల నాహృదయకాంక్ష ఘటిల్లఁగఁ జేయవే దయన్.

84


31. తే.

ఇల రజచ్ఛటలైన నదీశజాత
నీరకణరేఖలైన నా నింగితార
లైన గణియించఁగలకాని యనఘ నీ క
థాతిశయలేఖ ళ లెన్న నరిదిగాదె.

85


32. చ.

ఇనశశితారకానల నదీశ దిగీశ నరేంద్ర నీరదా
శనిదటి దంగదాచల దశాకరటిక్షితి సింహనాగరా
డనిల ధరాంతరిక్ష జటిలాతత రత్నతటాక తీర్థకా
ననతతి నీ సదాకృతిగ నాకిటఁ గానఁగనయ్యె శ్రీధరా!

86


33. క.

ఎంచఁజరాచరతతి సృజి
యించగ రక్షించఁ నిగ్రహించగల య

త్యంచితచర్యలచే న
ర్తించెడి నీనటన లనఘ! తెలియఁగనేరన్.

87


34. క.

అని గణియించిన ధాతన్
గని యానందించి హృదయకంజస్థలసం
జనితదయారసధారల్
చినకఁగ నాశేషశాయి చీరి నయగతిన్.

88


35. చ.

అనఘచరిత్ర నీనడక లన్నిట లెస్సలె యర్ధిశైలశా
సనశిఖిహేళినందన నిశాచరనాయక నీరరాశినే
త్త్రనిలధరాధినాథ గిరిశాదిఖగస్థితి యంతకలత చ
క్కనె రజనీచరేంద్రకృతకాతరతల్ కడయయ్యెనేకదా!

89


36. తే.

కలక నీచెంత నిలిచిన ఖచరఘటల
యాన్యకళలెల్లఁ దిగజాఱె నరయ దాని
కేదిగతి యది లెస్సగా నెరుకసేయఁ
జక్కజేసెద నందఱు సంతసిల్ల.

90


37. వ.

అని యాడిన శేషశాయిం గాంచి.

91


38. క.

ఏ నజ్ఞానక్రియచే
గానక దశకంధరాఖ్యగలయమరున కీ
రానట్టి కాంక్ష లిచ్చితిఁ
గాన జగత్రయిఁ గలంచఁగాసాగెనయా!

92


39. సీ.

కన్నిచ్చ నచ్చరకన్నెల చెరసాగె
             నగ్రహారశ్రేణి నిగ్రహించె
నిఖిలధాత్రీలేఖనేతల చెండాడె
             యజ్ఞాదిసత్క్రియ లన్ని చెరచె
నతిథిజనార్చన లార్చె ఋషిశ్రేష్ఠ
             సంతతాచారనిష్టల హరించె

జలజనేత్రస్థానశాలలఁ గెంటించె
             సత్యదయాతితీక్షల నడల్చె
ననృతగాథల కిక్కయై యాగడాల
కాదియై యఘచింతన కడలియై ది
గంతనాయకహృదయశాంతాసియై ద
శాస్యఖచరారి యెంతైన యాజ్ఞ లేక.

93


40. వ.

అట్లాడిన యాస్రష్టం గాంచి.


41. క.

ఆనరభాదాగ్రణి యా
శానాయక సకలఖచరసంతతిచేతన్
హానిం జెందని తెర గా
హా! నీచే గాంచె దీని కలుగఁగనేలా?

94


42. క.

తెలియక నరకృతహాని
న్దధలచక చెడెగాక దాని దలఁచిన నేనా
ఖలదశకంఠఖగారి
న్గలన జయించంగగలనె గడతేరంగన్.

95


43 వ.

అదిగాన నే నింకఁ గల తెఱం గెఱింగించెద.

96


44. చ.

ధర నతినిష్టచే దశరథక్షితినేతయు యజ్ఞదీక్షతన్
స్థిరగతి నిల్చె నాతనికిఁ జిత్రత నేఁ నరదేహధారినై
యరయ జనించెదన్ దశగళాదినిశాచరరాజసంతతిన్
సరగ హరించి యందఱలఁ జక్కగఁ గాచెదఁ జింత లేటికిన్.

97


45. తే.

చక్క నేకాదశసహస్రసంఖ్యలైన
యేండ్లదనుక ధరిత్రి నే నేలి త్రిజగ
దంతస్థలసకలఖగాళి చింత
యడఁగఁజేసెద శ్రీలచే నతిశయిలఁగ.

98


46. క.

ఈయేతెంచినయందఱ
లాయతగిరిచారినేతలై నిజకళలన్

శ్రేయస్థితి జనియించర
యాయన నంగీకరించి రాదరసరణిన్.

99


47. వ.

ఇట్లంగీకరించిన ధాత్రాదినిర్జరచ్ఛటల నందఱ ననిచి యా శేషశాయి
యథాస్థలికిం జనియె నంత నక్కడ.

100

దశరథుండు యజ్ఞదీక్ష నుండుట

48. చ.

అని ఘనుఁ డైనశృంగజటిలాగ్రణియానతి శాస్త్రచర్య తి
య్యన యజజాతరాజనిధి యక్కర నిష్ఠ రచించి యండఱ
న్ఘనతరఘృష్టరంజితజగత్తతి యైన నతం డగణ్యకీ
ర్తన జనియించె నెల్లెడల రాచనెలల్ గని సంతసిల్లగన్.

101

This work was published before January 1, 1929, and is in the public domain worldwide because the author died at least 100 years ago.