దత్తా దత్తా అనుకుందాం

వికీసోర్స్ నుండి

శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ తెలుగు కీర్తనలు


పల్లవి:
దత్తా దత్తా అనుకొందాం ఆనందంతో ఎగిరేద్దాం

చరణం:
వెనుకటి ఊసులు విసిరేద్దాం ముందటి ఊహలు మానేద్దాం 
తప్పొప్పో తగలేద్దాం పుణ్యం పాపం మంచేద్దాం

ఆకలి దప్పులు మరిచేద్దాం ఆశలు అన్నీ విడిచేద్దాం 
తన పర భేధం తగదందాం ముల్లోకాలే ఇల్లందాం

వీణా వేణువు వాయిద్దాం సన్నాయు నొక్కులు నొక్కేద్దాం
డప్పులు డమరులు మ్రోగిద్దాం తథిగిణ తకతోం సాగిద్దాం

దత్తుని ముందర నిలబడదాం ఆనందాశ్రువు లొలికేద్దాం 
దత్తుని నవ్వులు జుర్రేద్దాం నవ్వుల నాట్యం చేసేద్దాం

దత్తుని పాదం పట్టేద్దాం సంసారపు తుద ముట్టేద్దాం
దత్తుని కౌగిట గుచ్చేద్దాం తన్మయ భావం పొందేద్దాం

దత్తుని కంటికి కనుపిద్దాం కరుణారసమున తడిసొద్దాం
దత్తుని ఉపదేశం పొందుదాం తత్త్వార్థమ్మన నెలకొందాం

దత్తుని అభయం చేకొందాం అందరికభయం మనమిద్దాం
దత్తుడెవరని చర్చిద్దాం సచ్చిదానందం డని యందాం