తెల్లావారక ముందే

వికీసోర్స్ నుండి

ఈ గీతాన్ని ముత్యాలపల్లకీ చిత్రం కోసం మల్లెమాల రచించారు. సంగీతం కూర్చినది సత్యం. పాడినవారు పి.సుశీల


తెల్లావారక ముందే పల్లె లేచింది
తనవారినందరినీ తట్టీ లేపింది
ఆదమరచి నిద్ర పోతున్న తొలి కోడి
అదిరిపడి మేల్కోంది... అదే పనిగ కూసింది ||

వెలుగు దుస్తులేసుకొని సూరీడు
తూర్పు తలపు తోసుకొని వచ్చాడు
పాడు చీకటికి ఎంత భయమేసిందో
పక్కదులుపుకొని ఒకే పరుగుతీసింది
అది చూసి... లతలన్నీ... ఫక్కున నవ్వాయి
ఆ నవ్వులే ఇంటింట పువ్వులైనాయి ||

పాలావెల్లిలాంటి మనుషులు
పండు వెన్నెల వంటి మనసులు
మల్లేపూల రాశివంటి మమతలు
పల్లేసీమలో కోకొల్లలు
అనురాగం... అభిమానం..
అనురాగం... అభిమానం.. కవలపిల్లలూ
ఆ పిల్లలకు పల్లేటూర్లు కన్నతల్లులు ||