తెలుగు బాల శతకం/55-109 పద్యాలు

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

55. దేహసాధనమున దేహమ్ము దృఢమౌను
మంచి పుసకమ్ము లెంచి చూచి
శ్రద్దతోడ చదువ బుద్ధిపదునుదేరు
తెలిసి మెలగ మేలు తెలుగు బాల.

56. పుస్తకములు మనకు పూజ్యులౌ గురువులై
జ్ఞానధనము నిచ్చి చక్క బరచు
కోపమేమిలేని గురువులే పొత్తముల్‌
తెలిసి మెలగ మేలు తెలుగు బాల.

57. క్రొత్త ప్రాంతములకు కోరి తీసుకపోవు
పుష్టి కలుగు ఓడ పుస్తకమ్ము
వాయి తెరువనట్టి వక్తయే పొత్తమ్ము
తెలిసి మెలగ మేలు తెలుగు బాల.

58. తనువు కవసరమ్ము తగినంత భుక్తియే
చిత్త శుద్ధికి తగుచిన్న వాక్కు
హితము గూర్చు చుండు మితమగు పనులెల్ల
తెలిసి మెలగ మేలు తెలుగు బాల.

59. పసడలోన గలుగు 'ప్రతిసన్న' తీగెకు
విలువ ఉండునంచు తెలిసి కొనుము
కణము కణము విలువ కాలానికుండును
తెలిసి మెలగ మేలు తెలుగు బాల.

60. మనసు గొప్పదైన మనుజుండు ఘనుడగు
కుత్సితంపు మనసు కూల్చునరుని
కపటబుద్ధి వీడి కదలుట హితమౌను
తెలిసి మెలగ మేలు తెలుగు బాల.


16

తెలుగు బాల శతకం
 

61. ఆచరించ వలయు నభ్య సించిన విద్య
ఆచరించకున్న నగును చేటు
అనుభవమ్ము లోనె అలరారు విద్యలు
తెలిసి మెలగ మేలు తెలుగు బాల.

62. స్వార్ధరహతమైన సాంఘక సేవయే
శ్రేష్ట మతమటంచు చెలగుమింక
సేవ వలన కీర్తి చేకూరునెప్పుడు
తెలిసి మెలగ మేలు తెలుగు బాల.

63. పరుష వాక్కులెపు డు పల్కకుండుటమేలు
కరినమెన మాట కాల్చు నరుని
మంచి వాక్కు తోడ మన్ననల్‌ ప్రాప్తించు
తెలిసి మెలగ మేలు తెలుగు బాల.

64. విద్య నేర్చునపుడె విపులాశయమ్ములు
కలిగి యండవలయు కాంక్షచూపి
ఆశసిద్ధి కలుగు నహరహముశ్రమించ
తెలిసి మెలగ మేలు తెలుగు బాల.

65. ధనము వచ్చుచుండు తరిగిపోవుచునుండు
విద్యయనెడి ధనము హృద్యమగుచు
శాశ్వతముగ నిల్చి సత్కీర్తి యొసగును
తెలిసి మెలగ మేలు తెలుగు బాల.

66. బురదలోన పుట్టు పుష్పమ్ము వెదజల్లు
సౌరబమ్ము నెపుడు చక్క గాను
పుట్టు నెలవు కాదు పూతగుణము చూడు
తెలిసి మెలగ మేలు తెలుగు బాల.


తెలుగు బాల శతకం
 

17

67. బద్ధకమ్ము విడుము పనులుచేయునపుడు
బద్ధ శత్రువగును బద్దకమ్ము
బద్ధకమ్ము కలుగ బాగుపడడెవడు
తెలిసి మెలగ మేలు తెలుగు బాల.

68. అక్షరమ్మునైన ననువుగా నేర్పిన
గురువు ఋణము దీర్చు కొరకు చూడ
వస్తువది లేదు వసుధ పౖ యత్నింప
తెలిసి మెలగ మేలు తెలుగు బాల.

69. కష్ట సమయ మందు కంది పోవగరాదు
పొంగరాదు సుఖము పుట్టినపుడు
కష్టమును సుఖమును గణయించు సమముగా
తెలిసి మెలగ మేలు తెలుగు బాల.

70. ఉన్నకాలమందె ఉత్తమ గుణములు
సంక్రమింప చేసి సాగవలయు
మంచి గుణములెపుడు మహనీయతనుగూర్చు
తెలిసి మెలగ మేలు తెలుగు బాల.

71. విద్యా నేర్చుకొనుట పెద్దకష్ట మనుచు
తొలగిపోవరాదు తొందరపడి
వజ్రమునకు సాన వన్నెను చేకూర్చు
తెలిసి మెలగ మేలు తెలుగు బాల.

72. ఉత్తమంపు శ్రేణినుత్తీర్ణతంబొంద
మొదటినుండి బాగ చదువ వలయు
ముందు చూపుతోడ ముప్పులు తప్పును
తెలిసి మెలగ మేలు తెలుగు బాల.


18 తెలుగు బాల శతకం
 

73. మంచి వాడు సతము మాటాడు మెత్తగా
వదరుబోతులెపుడు వాగుచుంద్రు
ఏమిలేని ఆకు ఎగిరిపడుచునుండు
తెలిసి మెలగ మేలు తెలుగు బాల.

74. అవసరమ్ముతోడ నలమటించుచునుండ
దానమొనరచేయ ధర్మ మగును
పాత్ర నెరిగి దాన భావమ్ము చూపుము
తెలిసి మెలగ మేలు తెలుగు బాల.

75. సాిటి వారి గూర్చి చాడీలు చెప్పంగ
స్నేహ భావమునకు చేటు కలుగు
చాడిచప్పు బుద్ధి చంపుట యుక్తమ్ము
తెలిసి మెలగ మేలు తెలుగు బాల.

76. పెద్ద వారి పట్ల వినయమ్ము చూపంగ
బలము పెరుగుచుండు బాగుగాను
అధిక కీర్తి గలుగు నాయువు వర్ధిల్లు
తెలిసి మెలగ మేలు తెలుగు బాల.

77. నిందలేని యట్టి నిజమైన మనుగడ
కోరు కొనగ వలయు కూర్మితోడ
ఒక్క నిందయైన నొన గూర్చునప కీర్తి
తెలిసి మెలగ మేలు తెలుగు బాల.

78. అతిథి దేవుడనెడి ఆర్యోక్తి గమనించి
ఆదరించ వలయు నతిథినెపుడు
అతిథి తృప్తితోడ నరుగుచుండ వలయు
తెలిసి మెలగ మేలు తెలుగు బాల.


                                                     తెలుగు బాల శతకం 19
 



79. జన్మదినము బాగ జరుపుకొనెడు వేళ
పసలు లేని ఖర్చు వదలి వైచి
పేద సాదాలకిడ 'పెను పుణ్య'మబ్బును
తెలిసి మెలగ మేలు తెలుగు బాల.

80. తల్లిదండ్రులెపు డు పిల్లలన్‌పెంచుచు
విద్య నేర్ప వలయు ప్రేమచూపి
విద్య నేర్పకుండు పితరులు శత్రువుల్‌
తెలిసి మెలగ మేలు తెలుగు బాల.

81. చిత్రలేఖనమున చిత్తమ్ము గమియింప
శ్రద్ధ చూపి నేర్వ బుద్ధి పెరుగు
చిన్ననాటి శ్రద్ధ సత్కీర్తి సమకూర్చు
తెలిసి మెలగ మేలు తెలుగు బాల.

82. చదువు గుణముతోడ చక్క గా వినుబుద్ధి
కలిగియుండవలయు గట్టిగాను
ఇట్టి గుణములెల్ల హెచ్చించు ప్రతిభను
తెలిసి మెలగ మేలు తెలుగు బాల.

83. త్యాగ ధనుల గూర్చి యోగజీవుల గూర్చి
తెలిసి కొన్న యపుడు తెలివి పెరుగు
అట్టి వారి గుణము లాశీస్సులైయుండు
తెలిసి మెలగ మేలు తెలుగు బాల.

84. ఇంటిలోని చెత్త వెంట దీసుకుపోయి
వీధిలోన నెపుడు విడువరాదు
శుభ్ర పరిసరాలు సుఖములు చేకూర్చు
తెలిసి మెలగ మేలు తెలుగు బాల.



20 తెలుగు బాల శతకం
 

85. తాను తక్కువనెడి న్యూనతా భావమ్ము
వదలు చుండవలయు బాగుపడగ
అన్ని గూర్చుచుండు ఆత్మవిస్వాసమ్ము
తెలిసి మెలగ మేలు తెలుగు బాల.

86. చెప్పునట్టి మాట చేదుగానున్నను
నిజము చెప్పవలయు నియతరీతి
మాత్ర చేదుదైన మాన్పురోగమ్మును
తెలిసి మెలగ మేలు తెలుగు బాల.

87. శాస్త్ర విద్యలోన సన్నుతి కక్కినన్‌
మానవతయ ముఖ్య మవని మిాద
కరుణలేని విద్య గణుతికెక్కదెపు డు
తెలిసి మెలగ మేలు తెలుగు బాల.

88. నీరు కలుషితమ్ము నింగి కలుషితమ్ము
గాలి చూడ మిగుల కలుషితమ్ము
మనిషి మనసు చూడ మరి యెంతొ కలుషితమ్ము
తెలిసి మెలగ మేలు తెలుగు బాల.

89. ధనము లేని వారు ఘనమైన కోర్కెలన్‌
చదువు నభ్య సింప సాగదిపుడు
విద్య సాగకుండె విత్తమ్ములేకున్న
తెలిసి మెలగ మేలు తెలుగు బాల.

90. చిత్త మిష్ట పడగ శీతల పానీయ
స్వీకరణము మిగుల చేటు కూర్చు
కోరి తాగవలయు 'కొబ్బరిబోండమున్‌'
తెలిసి మెలగ మేలు తెలుగు బాల.


తెలుగు బాల శతకం 21


91. ఆకలన యపుడె ఆరగించవలయు
ఒక్కసారి నోటకుక్కరాదు
నమలి నమలి మ్రింగ నమరునారోగ్యమ్ము
తెలిసి మెలగ మేలు తెలుగు బాల.

92. నమ్మకమ్ము వలయు నరునిపై నరునకు
నమ్మలేనినాడు వమ్ముబ్రతుకు
గుడ్డినమ్మకమ్ముగొడవలు సృషించు
తెలిసి మెలగ మేలు తెలుగు బాల.

93. విద్యలోన నెట్టి విషయమ్ములైనను
కష్టమనుచుతోచ విష్టమున్న
శ్రద్ధ పెంచుచుండు శుద్ధగురులబోధ
తెలిసి మెలగ మేలు తెలుగు బాల.

94. తనను మించున్టి ఘనుడులేడనినమ్మి
విఱ్రవీగు టెల్ల వెర్రితనము
తాడి దన్ను వాని తలదన్ను వాడుండు
తెలిసి మెలగ మేలు తెలుగు బాల.

95. పుస్తకాలు చదువ పోవును కోపమ్ము
పుస్తకాలు చదువపుట్టు తెలివి
పుస్తకాల రచన పుట్టించు సత్కీర్తి
తెలిసి మెలగ మేలు తెలుగు బాల.

96. మనసులోన విషము మాటలో నమృతము
చూపునట్టివాడు సుమతి కాడు
త్రికరణంపు శుద్ధి తేజమ్ము హెచ్చించు
తెలిసి మెలగ మేలు తెలుగు బాల.



22 తెలుగు బాల శతకం
 

97. మాతృభాష నేడు మాకు రాదని పల్కు

జనులు పెరుగు చుండె జగతిలోన 'అమ్మ బాసమరువ నధమాధముండగు తెలిసి మెలగ మేలు తెలుగు బాల.

98. పనికి రాక యెచటొ పదడియున్న రాతిని అందమైన శిల్ప మటుల చెక్కు గురుని మించు శిల్పి గుర్తింప శక్యమే తెలిసి మెలగ మేలు తెలుగు బాల.

99. అందమైన రూపమధికమ్ము గానున్న గణ్యమైన రీతి కలిమి యున్న విద్య లేక నరుడు వెలుగొంద లేకుండు తెలిసి మెలగ మేలు తెలుగు బాల.

100. అధిక బలము గలుగు నధికుండ నేనంచు లెక్క చేయకున్న చిక్కుగలుగు గడ్డి తాటి చేత గజము బంధితమగు తెలిసి మెలగ మేలు తెలుగు బాల.

101. గొప్ప వారలైన తప్పులు చేయుట సహజమగును చూడ జగతిలోన తప్పు దిదిద్దుకొనెడి తత్త్వమ్ము మంచిది తెలిసి మెలగ మేలు తెలుగు బాల.

102. ప్రేమ సుధకు నెలవు ప్రియమైన అమ్మయే సర్వ సద్గుణాల సాక్షి అమ్మ అమ్మ సాటి తెలుపు అమ్మయే అని యెంచి తెలిసి మెలగ మేలు తెలుగు బాల.


తెలుగు బాల శతకం 23


</poem> 103. తాను తినక యున్న తన బిడ్డ నొటికి పెట్టు చుండు నమ్మ ప్రేమమూర్తి సకల దేవతాళి సాకారవు అమ్మ తెలిసి మెలగ మేలు తెలుగు బాల.

104. ఎట్టీ కష్టమైన గుట్టుగా నుంచక ఎఱుక పరుప వలయు నింటి వద్ద కన్నవారి ప్రేమ కడవారి కుండునా? తెలిసి మెలగ మేలు తెలుగు బాల.

105. అమ్మ మొదటి గురువు అనెడి మాట నిజము పదము పదము నేర్పు పంతులమ్మ అమ్మ మించు గురువు అవనిలో లేకుండురా తెలిసి మెలగ మేలు తెలుగు బాల.

106. ముద్దా ముద్దా కలిపి ముద్దుగారెడునట్లు బోసినోిటిలోన బువ్వ పెట్టు అమ్మమించునట్టి ఆరాధ్యులే లేరు తెలిసి మెలగ మేలు తెలుగు బాల.

108. పేరు పొందినట్టి ప్రియమెన బిడ్డలన్‌ కాంచి సంత సింత్రు కన్నవారు అమ్మ నాన్న మించు ఆత్మబంధులు లేరు తెలిసి మెలగ మేలు తెలుగు బాల.

109. తెలుగు బాల పేర వెలువరించినయ్టి శతక పద్య ములను శ్రద్దతోడ చదివినను వినినను జ్ఞానధనము వచ్చు స్పూర్తి గలుగు మరియు కీర్తి పెరుగు 24

తెలుగు బాల శతకం


</poem>