తెలియలేరు రామ భక్తి మార్గమును

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
త్యాగరాజు కృతులు

అం అః

ధేనుక రాగము - దేశాది తాళం


పల్లవి 

తెలియలేరు, రామ ! భక్తి మార్గమును


అనుపల్లవి 

ఇలనంతట దిరుగుచును గలువరించెదరు గాని


చరణము 

వేగ లేచి నీట మునిగి భూతి బూసి,

వేళ్ల నెంచి వెలికి శ్లాఘనీయులై,

బాగుగపైక మార్జనలోలు లై -

రేగాని, త్యాగరాజనుత !