తులసీదళములచే

వికీసోర్స్ నుండి
(తులసీ దళములచే నుండి మళ్ళించబడింది)
Jump to navigation Jump to search
త్యాగరాజు కృతులు

అం అః

  • రాగం: మాయామాళవగౌళ

పల్లవి:
తులసీదళములచే సంతోషముగా పూజింతు

అనుపల్లవి:
పలుమారు చిరకాలము పరమాత్ముని పాదములను ||తులసీ||

చరణం:
సరసీరుహ పున్నాగ చంపక పాటల కురవక
కరవీర మల్లిక సుగంధరాజ సుమముల్
ధరణిని యొక పర్యాయము ధర్మాత్ముని
సాకేతపురవాసుని శ్రీరాముని వరత్యాగరాజనుతుని ||తులసీ||