కురాన్ భావామృతం/తాహా

వికీసోర్స్ నుండి
(తాహా (తాహా ) నుండి మళ్ళించబడింది)
Jump to navigation Jump to search
కురాన్ భావామృతం అధ్యాయములు

1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 | 43 | 44 | 45 | 46 | 47 | 48 | 49 | 50 | 51 | 52 | 53 | 54 | 55 | 56 | 57 | 58 | 59 | 60 | 61 | 62 | 63 | 64 | 65 | 66 | 67 | 68 | 69 | 70 | 71 | 72 | 73 | 74 | 75 | 76 | 77 | 78 | 79 | 80 | 81 | 82 | 83 | 84 | 85 | 86 | 87 | 88 | 89 | 90 | 91 | 92 | 93 | 94 | 95 | 96 | 97 | 98 | 99 | 100 | 101 | 102 | 103 | 104 | 105 | 106 | 107 | 108 | 109 | 110 | 111 | 112 | 113 | 114



కురాన్ భావామృతం
కురాన్ అధ్యాయములు (సూరాలు)
ముందుమాట
1. అల్-ఫాతిహా
2. అల్-బఖరా
3. ఆల్-ఎ-ఇమ్రాన్
4. అన్-నిసా
5. అల్-మాయిదా
6. అల్-అన్ఆమ్
7. అల్-ఆరాఫ్
8. అల్-అన్ఫాల్
9. అత్-తౌబా
10. యూనుస్
11. హూద్
12. యూసుఫ్
13. అర్-రాద్
14. ఇబ్రాహీం
15. అల్-హిజ్ర్
16. అన్-నహల్
17. బనీ ఇస్రాయీల్
18. అల్-కహఫ్
19. అల్-మర్యం
20. తాహా
21. అల్-అంబియా
22. అల్-హజ్
23. అల్-మోమినీన్
24. అన్-నూర్
25. అల్-ఫుర్ ఖాన్
26. అష్-షుఅరా
27. అన్-నమల్
28. అల్-ఖసస్
29. అల్-అన్కబూత్
30. అర్-రూమ్
31. లుఖ్ మాన్
32. అస్-సజ్దా
33. అల్-అహ్ జబ్
34. సబా
35. ఫాతిర్
36. యాసీన్
37. అల్-సాఫ్ఫత్
38. సాద్
39. అజ్-జుమర్
40. అల్-మోమిన్
41. హా మీమ్
42. అష్-షూరా
43. అజ్-జుఖ్రుఫ్
44. అద్-దుఖాన్
45. అల్-జాసియా
46. అల్-అహ్ ఖఫ్
47. ముహమ్మద్
48. అల్-ఫతహ్
49. అల్-హుజూరాత్
50. ఖాఫ్
51. అజ్-జారియా
52. అత్-తూర్
53. అన్-నజ్మ్
54. అల్-ఖమర్
55. అర్-రహ్మాన్
56. అల్-వాఖియా
57. అల్-హదీద్
58. అల్-ముజాదిలా
59. అల్-హష్ర్
60. అల్-ముమ్ తహినా
61. అస్-సఫ్ఫ్
62. అల్-జుమా
63. అల్-మునాఫిఖూన్
64. అత్-తగాబూన్
65. అత్-తలాఖ్
66. అత్-తహ్రీమ్
67. అల్-ముల్క్
68. అల్-ఖలమ్
69. అల్-హాక్ఖా
70. అల్-మారిజ్
71. నూహ్
72. అల్-జిన్న్
73. అల్-ముజమ్మిల్
74. అల్-ముదస్సిర్
75. అల్-ఖియామా
76. అద్-దహ్ర్
77. అల్-ముర్సలాత్
78. అన్-నబా
79. అన్-నాజియాత్
80. అబస
81. అత్-తక్వీర్
82. అల్-ఇన్ ఫితార్
83. అల్-ముతఫ్ఫిఫీన్
84. అల్-ఇన్ షిఖాఖ్
85. అల్-బురూజ్
86. అత్-తారిఖ్
87. అల్-అలా
88. అల్-ఘాషియా
89. అల్-ఫజ్ర్
90. అల్-బలద్
91. అష్-షమ్స్
92. అల్-లైల్
93. అజ్-జుహా
94. అలమ్ నష్‌రహ్
95. అత్-తీన్
96. అల్-అలఖ్
97. అల్-ఖద్ర్
98. అల్-బయ్యినా
99. అజ్-జల్ జలా
100. అల్-ఆదియాత్
101. అల్-ఖారిఅ
102. అత్-తకాసుర్
103. అల్-అస్ర్
104. అల్-హుమజా
105. అల్-ఫీల్
106. ఖురైష్
107. అల్-మాఊన్
108. అల్-కౌసర్
109. అల్-కాఫిరూన్
110. అన్-నస్ర్
111. అల్-లహబ్
112. అల్-ఇఖ్లాస్
113. అల్-ఫలఖ్
114. అల్-నాస్
ముందు పేజీ

20. తాహా
(అవతరణ: మక్కా; సూక్తులు: 135)
కరుణామయుడు, కృపాసాగరుడయిన దేవుని పేరుతో ప్రారంభం
తా-హా. మేమీ ఖుర్‌ఆన్‌ని నీవు కష్టాల్లో పడాలని నీపై దించలేదు. ఇది (దేవునికి) భయపడే ప్రతివ్యక్తి కోసం వచ్చిన జ్ఞాపిక. భూమితో పాటు అత్యున్నతమైన యావత్‌ నభోమండలాన్ని సృష్టించిన శక్తిస్వరూపుని వైపు నుండి ఇది అవతరించింది. (1-4)
(విశ్వప్రభువైన) ఆ కరుణామయుడు అధికార సింహాసనంపై అధిష్ఠించి ఉన్నాడు. భూమ్యాకాశాలకు, వాటి మధ్యవున్న వాటికి, నేల క్రింద నిక్షిప్తమైవున్న వాటికి ఆయనే యజమాని. నీవు బిగ్గరగా మాట్లాడినా, మెల్లిగా మాట్లాడినా లేక అంతకంటే ఎక్కువ నిగూఢ విషయమైనా సరే, ఆయనకు తెలుసు. ఆయనే అల్లాహ్‌. ఆయన తప్ప మరో ఆరాధ్యుడు లేడు. ఆయనకు ఎంతో మంచి పేర్లున్నాయి. (5-8)
నీకు మూసా వృత్తాంతం ఏమయినా చేరిందా? అతనొక అగ్ని (మంట) చూశాడు. అప్పుడతను తన కుటుంబీకులతో “మీరు ఇక్కడే ఉండండి. అక్కడేదో అగ్ని కన్పిస్తోంది. వెళ్ళి మీకోసం కొంచెం నిప్పు తీసుకొస్తాను. లేదా అక్కడ (మనకు) దారి చూపేవారు ఎవరైనా దొరకవచ్చు” అని అన్నాడు. (9-10)
మూసా ఆ ప్రదేశానికి చేరుకోగానే అక్కడ ఓ (అదృశ్య) వాణి విన్పించింది: “మూసా! నేనే నీ ప్రభువును. చెప్పులు విడిచిపెట్టు. నీవిప్పుడు పవిత్రమైన తువా (లోయ)లో ఉన్నావు. నేను నిన్ను (ఓ మహాకార్యం కోసం) ఎన్నుకున్నాను. నీకు అంద జేస్తున్న విషయాన్ని శ్రద్ధగా విను. నేనే దేవుడ్ని. నేను తప్ప మరో ఆరాధ్యుడు లేడు. కనుక నీవు నన్నే ఆరాధించు. నన్ను స్మరించడానికి నమాజ్‌ స్థాపించు. (11-14)
ప్రళయం తప్పకుండా రానున్నది. ప్రతి మానవుడూ తన కృషికి తగిన ప్రతిఫలం పొందడానికి నేను దాని సమయాన్ని రహస్యంగా ఉంచదలిచాను. కనుక ప్రళయ దినాన్ని నమ్మకుండా మనోవాంఛలకు బానిసలైపోయేవారి విషయంలో దాన్ని గురించిన ఆలోచన నిన్ను (మా సందేశప్రచారం నుండి) నిరోధించకూడదు సుమా! అలా జరిగితే నీవు నాశనమైపోతావు. సరే, మూసా! నీ చేతిలో ఉన్నదేమిటీ?” (15-17)
దానికి మూసా “ఇది నా చేతికర్ర. దీన్ని నేను ఊతగాచేసుకొని నడుస్తాను. దీంతో నా మేకల కోసం చెట్ల నుండి ఆకులు రాల్చుతాను. దీంతో నేను ఇంకా ఎన్నో పనులు చేస్తాను” అన్నాడు. “మూసా! దాన్ని క్రింద పడవెయ్యి” అన్నాడు దేవుడు. మూసా దాన్ని క్రింద పడవేశాడు. అంతే, అది ఎకాఎకిన పాముగా మారి పరుగెత్తసాగింది. (18-20)
“దాన్ని పట్టుకో. భయపడకు. మేము దాన్ని మళ్లీ పూర్వస్థితికి మార్చుతాం. నీ చేతిని చంకలో అదిమితీసెయ్యి. ఎలాంటి బాధ లేకుండా అది మెరిసిపోతూ బయటి కొస్తుంది. ఇది రెండో నిదర్శనం. మేమింకా నీకు గొప్పగొప్ప నిదర్శనాలు చూపిస్తాం. నువ్విప్పుడు ఫిరౌన్‌ దగ్గరికెళ్ళు. అతను హద్దుమీరిపోయాడు”అన్నాడు దేవుడు. (21-24)
“ప్రభూ! నాకు మనోస్థయిర్యం ప్రసాదించు. నా పనులు సులభంగా నెరవేరేలా చెయ్యి. ప్రజలు నామాట గ్రహించడానికి నాకు వాక్పటిమ ప్రసాదించు. నాకు సహాయం గా నా కుటుంబంలో ఒకరిని మంత్రిగా నియమించు. నా సోదరుడు హారూన్‌ ద్వారా నాకు బలం చేకూర్చు. అతడ్ని నా పనిలో భాగస్వామిగా చెయ్యి. మేమిద్దరం నీ పవిత్ర తను ఘనంగా కొనియాడుతాం. నీగురించి విస్తృతంగా ప్రచారంచేస్తాం. నీవు ఎల్లప్పుడూ మమ్మల్ని కనిపెట్టుకొని ఉంటున్నావు” అన్నాడు మూసా. (25-35)
“మూసా! నీవు కోరినవన్నీ ఇచ్చాం. మేము నీకు మరోసారి మేలు చేశాం. (నీ బాల్యంసంగతి) గుర్తుకుతెచ్చుకో. మేము నీతల్లికి ప్రత్యేక సూచన చేశాం. దివ్యావిష్కృతి ద్వారా మాత్రమే ఇలాంటి సూచన చేయడం వీలవుతుంది. (మేమిలా సూచించాం:) “ఈ పిల్లవాడ్ని ఒక పెట్టెలో పెట్టి నదిలో వదలిపెట్టు. నది దాన్ని ఒడ్డుకు చేర్చుతుంది. నాకూ, ఈ పిల్లవాడికి (ఉమ్మడి) విరోధి అయినవాడు దాన్ని తీసేసుకుంటాడు.”
(మూసా! నీవు ప్రేమపాత్రుడయ్యేందుకు) నేను నావైపు నుండి నీ మీద మమతా మమకారాలు ఆవరింపజేశాను. నీవు నా పర్యవేక్షణలో పోషించబడేలా ప్రత్యేక ఏర్పాటు చేశాను. నీ సోదరి (ఫిరౌన్‌ దగ్గరకు) వెళ్ళిన సంగతి కూడా జ్ఞాపకం తెచ్చుకో. ఆమె (ఫిరౌన్‌ దగ్గరకు) వెళ్ళి “నేనీ పిల్లవాడ్ని బాగా పోషించే వారెవరో మీకు చూపనా?” అన్నది. ఈవిధంగా మేము నిన్ను మళ్ళీ నీతల్లి దగ్గరకు చేర్చాం. ఆమె సంతోషించాలని, దిగులు చెందకూడదని ఇలా చేశాము.
(మరో సంఘటన) “నీవొక వ్యక్తిని చంపావు. మేము నిన్ను ఆ ఇరకాటం నుండి బయటపడేశాం. ఎన్నో సార్లు నిన్ను పరీక్షకు గురిచేశాము. నీవు మద్యన్‌ (జాతి) ప్రజల్లో అనేక సంవత్సరాలు గడిపావు. ఇప్పుడు తగిన సమయానికి వచ్చావు. మూసా! నేను నిన్ను నాపని కోసం యోగ్యుడిగా చేశాను. ఇక నీవు, నీ సోదరుడు నా(ఈ) నిదర్శనాలు తీసుకొని వెళ్ళండి. గుర్తుంచుకోండి, ఎట్టి పరిస్థితిలోనూ నన్ను స్మరించడంలో అలస త్వం చేయకూడదు. మీరిద్దరు ఇప్పుడు ఫిరౌన్‌ దగ్గరకు వెళ్ళండి. అతను గర్విష్ఠుడై హద్దు మీరిపోయాడు. అతనితో మృదువుగా మాట్లాడండి. దానివల్ల అతను (మా) హితవులు పాటించవచ్చు, లేదా (మాశిక్షకు) భయపడవచ్చు” అన్నాడు దేవుడు. (36-44)
“ప్రభూ! అతను మా మీద దౌర్జన్యం చేస్తాడేమోనని లేదా తిరగబడతాడేమోనని భయంగా ఉంది” అన్నారు వారిద్దరూ. (45)
“భయపడకండి. నేను మీకు తోడుగా ఉన్నాను; సమస్తం వింటున్నాను, చూస్తు న్నాను. ఇక వెళ్ళండి, వెళ్ళి అతనికిలా చెప్పండి: “మేము నీ ప్రభువు తరఫున వచ్చిన దూతలం, ఇస్రాయీల్‌ సంతతిని మావెంట రావడానికి వదలిపెట్టు. వారిని వేధించకు. మేము నీదగ్గరకు నీప్రభువు నిదర్శనాలు తీసుకొచ్చాం. సన్మార్గం అవలంబించేవారికి శాంతి కలుగుగాక! సత్యాన్ని తిరస్కరించి ముఖం తిప్పుకునేవారికి శిక్ష ఉందని మాకు దివ్యావిష్కృతి ద్వారా తెలియజేయబడింది” అన్నాడు దేవుడు. (46-48)
(వారు) ఫిరౌన్‌ (దగ్గరకెళ్ళి ఈమాటలు చెప్పగా అతను విని) “అయితే మూసా! మరి మీరిద్దరి ప్రభువు ఎవరంటా?” అని అడిగాడు. (49)
“ప్రతి వస్తువునూ తగినవిధంగా సృష్టించి, దానికి ఒక (నిర్దిష్ట)మార్గం చూపినవాడే మా ప్రభువు” అన్నాడు మూసా. (50)
“అయితే ఇంతకుపూర్వం గతించిన తరాల సంగతేమిటీ?” అడిగాడు ఫిరౌన్‌. (51)
“వారి సంగతేమిటో అంతా నాప్రభువు దగ్గర ఓ గ్రంథంలో నమోదై సురక్షితంగా ఉంది. నాప్రభువు ఎలాంటి పొరపాటు చేయడు, మరచిపోడు” అన్నాడు మూసా. (52)
ఆయనే మీకోసం భూమిని పాన్పుగా పరచి దానిపై నడవడానికి దారులు ఏర్పరి చాడు. పైనుండి వర్షం కురిపిస్తున్నాడు. ఆ వర్షం ద్వారా రకరకాల ఉత్పత్తులు వెలికి తీస్తున్నాడు. మీరూ తినండి, మీ పశువుల్నీ మేపుకోండి. ఇందులో బుద్ధిమంతులకు నిదర్శనాలున్నాయి. ఈ భూమి నుండే మేము మిమ్మల్ని పుట్టించాము. చివరికి ఇందు లోకే మిమ్మల్ని తీసికెళ్తాము. ఇందులో నుంచే మళ్ళీ బ్రతికించి లేపుతాం. (53-55)
మేము ఫిరౌన్‌కు మా నిదర్శనాలన్నీ చూపాము. కాని అతను (వాటిని) విశ్వసించ కుండా (కడదాకా) తిరస్కరిస్తూనే పోయాడు. (56)
అతను (ఎదురుతిరిగి మాట్లాడుతూ) “మూసా! నీ మంత్రశక్తితో మమ్మల్ని మా దేశం నుండి వెళ్ళగొట్టడానికి వచ్చావా మాదగ్గరికి? అలాగైతే మేము కూడా నీకు పోటీగా అలాంటి మంత్రశక్తినే తీసుకొస్తాము. ఈ పోటీ ఎప్పుడు ఎక్కడ జరగాలో నిర్ణయించుకో. మేమీ మాట నుండి వెనక్కి మరలము. నీవు కూడా మరలకూడదు. రా! బహిరంగ మైదానంలోకి (మా) ముందుకు రా!” అని సవాలు విసిరాడు. (57-58)
“అయితే జాతర దినాన పెట్టుకుందాం. పొద్దెక్కిన తరువాత జనం గుమికూడాలి” అన్నాడు మూసా. ఫిరౌన్‌ వెళ్ళి తన బలగాన్నంతా కూడగట్టుకువచ్చి పోటీకి దిగాడు.
మూసా (పాలకవర్గాన్ని ఉద్దేశించి) “దౌర్భాగ్యులారా! దేవునిపై అసత్యాలు మోప కండి. అలాచేస్తే ఒక మహోపద్రవం ద్వారా ఆయన మిమ్మల్ని సర్వనాశనం చేస్తాడు. అబద్ధం ఎవడు కల్పించినా వాడికి రోజులు మూడినట్లే” అని హెచ్చరించాడు. (59-61)
ఈ మాటలు వినగానే వారిలో (పోటీ గురించి) భేదాభిప్రాయాలు పొడసూపాయి. వారు పరస్పరం రహస్యసమాలోచనలు జరుపుకున్నారు. చివరికి వారిలో కొందరు ఇలా అన్నారు: “వీరిద్దరు మాంత్రికులు మాత్రమే, వారు తమ మంత్రబలంతో మిమ్మల్ని మీ దేశం నుండి వెళ్లగొట్టాలని, మీ మతాన్ని, మీ ఉదాత్తసంస్కృతిని, తుడిచిపెట్టాలని భావి స్తున్నారు. కనుక ఈరోజు మీ శక్తియుక్తులన్నీ సమీకరించుకొని, సేనావాహినిగా బరి లోకి దిగండి. గుర్తుంచుకోండి, ఈరోజు ఎవరిది పైచేయి అవుతుందో వారిదే గెలుపు.”
(ఫిరౌన్‌ తరఫున పోటీకి దిగిన) మాంత్రికులు (ప్రత్యర్థిని సంబోదిస్తూ) “మూసా! ముందు నువ్వు పడవేస్తావా లేక మమ్మల్ని పడవేయమంటావా?” అనడిగారు. (62-65)
“కాదు, మీరే పడవేయండి” అన్నాడు మూసా. (మాంత్రికులు తమ మంత్ర సాధానాలు నేలమీద పడవేశారు.) మరుక్షణమే వారి త్రాళ్ళు, కర్రలు వారి మంత్రబలం తో మూసా కళ్ళకు (పాములుగా మారి) పరుగెత్తుతున్నట్లు కన్పించాయి. వాటిని చూసి అతను మనసులో కాస్త భయపడ్డాడు. (66-67)
అప్పుడు మేము “మూసా! భయపడకు. నీవే గెలుస్తావు. నీ చేతిలో ఉన్నదాన్ని క్రింద పడెయ్యి. ఇప్పుడే అది వారి అభూతకల్పనలన్నిటినీ తృటిలో మింగేస్తుంది. వీరు చేసినదంతా మంత్రజాలం మాత్రమే. మాంత్రికులు ఎంత అట్టహాసంగా వచ్చినా వారు ఎన్నటికీ విజయం సాధించలేరు” అని అన్నాము. (68-69)
చివరికి అదే జరిగింది. మాంత్రికులంతా (ఓటమి నంగీకరించి) సాష్టాంగపడుతూ “మేము మూసా, హారూన్‌ల ప్రభువును విశ్వసించాం” అన్నారు. (70)
“ఏమిటీ, నేను అనుమతి ఇవ్వకముందే మీరితడ్ని విశ్వసించారా? అసలితను మీకు మంత్రవిద్య నేర్పిన గురువయి ఉంటాడు. సరే కానివ్వండి. నేనిప్పుడే మీకాళ్ళు, చేతులు పరస్పరం వ్యతిరేక దిశలో నరికించి మిమ్మల్ని ఖర్జూరపు చెట్లమొదళ్ళ మీద ఉరి తీయిస్తాను. అప్పుడు తెలుస్తుంది మీకు, మా ఇద్దరిలో ఎవరి శిక్ష కఠినంగా, చాలా సేపటిదాకా ఉంటుందో” అన్నాడు ఫిరౌన్‌ మండిపడుతూ. (71)
“మమ్మల్ని పుట్టించిన సృష్టికర్త సాక్షి! మా ముందుకు స్పష్టమైన నిదర్శనాలు వచ్చిన తర్వాత (సత్యాన్ని విశ్వసించకుండా) నీకు ప్రాధాన్యం ఇవ్వడం మావల్ల కాదు. నీవు చేయదలచుకున్నదేమిటో చేసుకో. నీవు మహాఅయితే ఇహలోకజీవితంలో మాత్రమే ఏదైనా చేస్తావు. మేము మా ప్రభువును విశ్వసించాం. ఆయన మా తప్పులు మన్నిస్తాడు. నీ వత్తిడి వల్ల మేము ప్రయోగించిన ఈ మంత్రజాలాన్ని కూడా క్షమిస్తాడు. దేవుడే శ్రేష్ఠుడు, శాశ్వతంగా ఉండేవాడు” అన్నారు మాంత్రికులు నిర్భయంగా. (72-73)
నేరస్థుడయి తన ప్రభువు సన్నిధికి వచ్చిన ప్రతివాడికీ నరకమే గతి. అతనందులో చావడూ, బ్రతకడు. సత్యాన్ని విశ్వసించడంతో పాటు సత్కార్యాలు కూడా చేసిఉండి, తమ ప్రభువు సన్నిధికి వచ్చినవారి కోసం ఉన్నత స్థానాలు, సెలయేరులు ప్రవహించే శాశ్వత స్వర్గవనాలున్నాయి. ఆ వనాలలో వారు కలకాలం (సుఖంగా) ఉంటారు. పవిత్ర జీవితం గడిపేవారికి లభించే ప్రతిఫలం ఇలాగే ఉంటుంది. (74-76)
“ఇప్పుడిక రాత్రికిరాత్రి నా దాసుల్ని తీసుకొని బయలుదేరు. వారికోసం సముద్రం లో నిర్జలమైన దారి ఏర్పరచుకో. మిమ్మల్ని ఎవరూ వెంబడిస్తారన్న భయం ఉండదు. మరెలాంటి భయం కూడా ఉండదు” అని మేము మూసాకు సూచించాము.” (77)
వెనుక నుంచి ఫిరౌన్‌ సైన్యం తీసుకొని (సముద్రతీరానికి) చేరుకున్నాడు. అప్పుడు సముద్రం వారందర్నీ తనలో లీనం చేసుకొని కలిసిపోయింది. ఫిరౌన్‌ తనజాతి ప్రజలను అపమార్గం పట్టించాడు; సరయిన మార్గదర్శనం చేయలేదు. (78-79)
ఇస్రాయీల్‌ సంతానమా! మేము మిమ్మల్ని మీ శత్రువుల నుండి విముక్తి కలి గించాం. తూర్‌ పర్వతం కుడివైపున మీరాక కోసం సమయం నిర్ణయించాం. మీ కోసం మన్న, సల్వాలను[2] దించాం. “మేము ప్రసాదించిన పరిశుద్ధ ఆహారం తినండి. అయితే తిని తిరుగుబాటు వైఖరి అవలంబించకండి. అలా చేస్తే మీపై నా ఆగ్రహం విరుచుకు పడుతుంది. నా ఆగ్రహానికి గురైన వాడికిక రోజులు మూడినట్లే. అయితే పశ్చాత్తాపంతో క్షమాపణ కోరుకొని, సత్యాన్ని విశ్వసించి సదాచారసంపన్నుడయి, సన్మార్గంలోనే (జీవి తాంతం) నడిచేవాడ్ని నేను తప్పకుండా క్షమిస్తాను” (అని చెప్పాము). (80-82)
“మూసా! నిన్ను ఏ విషయం నీజాతి ప్రజల కంటే ముందుగా తీసుకొచ్చింది?” అడిగాడు దేవుడు. “వారు నా వెనకాల వస్తున్నారు. ప్రభూ! నీవు నాపట్ల ప్రసన్నుడవుతా వన్న ఉద్దేశంతో నేను తొందరచేసి నీ సన్నిధికి చేరుకున్నా” అన్నాడు మూసా. (83-84)
“సరే, నీ వెనుక (అంటే నీవిక్కడికి వచ్చిన తరువాత) మేము నీ జాతిని పరీక్షకు గురిచేశాం. సామిరీ (అనేవాడు) వాళ్ళను పెడదారి పట్టించాడు” అన్నాడు దేవుడు. (85)
(ఈమాట వినగానే) మూసా ఎంతో ఆగ్రహం, విచారంతో కూడిన భావోద్రేకాలతో తనజాతి దగ్గరకు తిరిగొచ్చాడు. వచ్చీరాగానే “నాజాతి ప్రజలారా! మీ ప్రభువు మీకు మంచివాగ్దానాలు చేయలేదా? అది మీకు ఆలస్యమైనట్లు అన్పించిందా (సహనం కోల్పోయి ఈ నిర్వాకానికి పాల్పడ్డారు)? లేక నాకు మీరు చేసిన వాగ్దానభంగానికి మీరే మీప్రభువు ఆగ్రహాన్ని ఆహ్వానించదలిచారా?” అని అడిగాడు. (86)
“మా అంతట మేము వాగ్దానభంగం చేయలేదు. అసలేం జరిగిందంటే మేము నగల బరువు మోయలేక చస్తున్నాం. అంచేత వాటిని కాస్తా తీసిపారేశాం, అంతే” అన్నారు వారు. ఆ తర్వాత సామిరీ తన పాత్ర నిర్వహించాడు. అతను వారికోసం ఒక ఆవుదూడ విగ్రహం తయారుచేశాడు. ఆ విగ్రహంలో నుంచి దూడ అరుపులాంటి ధ్వని వినవస్తుండేది. జనం (ఆ చోద్యం చూసి) “ఇదే మన దైవం. మూసా దైవం కూడా ఇదే. మూసా దీన్ని మరచిపోయాడు” అని అరిచారు. (కాని) అది తమకు సమాధానమివ్వ దని, ఎలాంటి లాభనష్టాలు కలిగించలేదని వారు గమనించడం లేదా? (87-89)
హారూన్‌ (మూసా రాకకు) ముందే (నచ్చజెబుతూ) “సోదరులారా! దీని ద్వారా మీరు పరీక్షకు గురయ్యారు. మీ ప్రభువు కరుణామయుడే. కనుక మీరు నన్ను అనుస రించండి. నామాట వినండి” అన్నాడు. కాని వారు (అతని మాటలు పెడచెవిన పెడ్తూ) “మూసా తిరిగి రానంతవరకు మేము దీన్నే పూజిస్తుంటాం” అని చెప్పేశారు. (90-91)
మూసా (హారూన్‌ వైపు తిరిగి) “హారూన్‌! వీరు మార్గభ్రష్టులైపోతుంటే చూసి (నీవు మౌనంగా ఎందుకుండి పోయావు?) వారిని వారించకుండా ఏ విషయం నిన్ను అడ్డుకుంది? నీవు నాఆదేశం ఎందుకు ఉల్లంఘించావు?” అని అడిగాడు. (92-93)
“నా తల్లికుమారుడా! నా గడ్డాన్ని, తలవెండ్రుకల్ని పట్టి లాగకు. నేను ఇస్రాయీల్‌ సంతతిలో చీలికలు తెచ్చిపెట్టానని, నీమాట ఖాతరు చేయలేదని అంటావేమోనని భయపడ్డాను. (దేవుని దయవల్ల అలా అనలేదు నీవు)” అన్నాడు హారూన్‌. (94)
“సామిరీ! ఇక నీ సంగతేమిటీ?” అడిగాడు మూసా. (95)
“నేను ప్రజలకు కనపడని ఒక (విచిత్ర) వస్తువుని చూశాను. నేను సందేశహరుని అడుగుజాడల నుంచి ఓ పిడికెడు (మట్టి) తీసుకొని (విగ్రహంలో) పోశాను. అలా చేయాలని నా మనస్సుకు అన్పించింది” అన్నాడు సామిరి. (96)
“సరే వెళ్ళు (ఇక్కడ్నుంచి). ఇకనుండి నీవు జీవితాంతం ‘నన్ను తాకకండి’ అని చెబుతూ తిరుగుతుంటావు. నీకోసం వాగ్దాన సమయమొకటి నిర్ణయమై ఉంది. అది ఎట్టి పరిస్థితిలోనూ తప్పిపోదు. చూడు, ఇప్పుడు నీ ఇష్టదేవత గతి ఏమౌతుందో! దీన్ని మేము కాల్చి, ముక్కలు ముక్కలుగా చేసి సముద్రంలో విసిరిపారేస్తాము... ప్రజలారా! మీ దేవుడు అల్లాహ్‌ మాత్రమే. ఆయన తప్ప మరో ఆరాధ్యుడు లేడు. ఆయన జ్ఞానం ప్రతి వస్తువునూ పరివేష్ఠించి ఉంది” అన్నాడు మూసా. (97-98)
ప్రవక్తా! ఈవిధంగా మేము గతంలో జరిగిన విశేషాలను గురించి నీకు తెలియ జేస్తున్నాం. మేము ప్రత్యేకంగా మా దగ్గర్నుంచి ఒక జ్ఞాపిక (ఖుర్‌ఆన్‌)ను తీసి నీకు ప్రసాదిస్తున్నాం. దాన్ని విశ్వసించకుండా ముఖం తిప్పుకునేవాడు ప్రళయదినాన అతి దారుణమైన పాపభారం మోయవలసి వస్తుంది. దాన్ని అతడు ఎల్లకాలం మోస్తుంటాడు. ప్రళయదినాన అది అతనికి అత్యంత బాధాకరమైన భారంగా పరిణమిస్తుంది. శంఖం పూరించబడే రోజు మేము నేరస్థుల్ని చుట్టుముట్టి (ఒకచోట) చేర్చుతాం. వారప్పుడు (భీతావహంతో) నిలువుగుడ్లు వేసిచూస్తారు. తర్వాత వారు మెల్లిగా మాట్లాడుకుంటూ “మీరు ప్రపంచంలో మహాఅయితే పదిరోజులు గడిపారేమో” అంటారు. (99-103)
వారు మాట్లాడుకుంటున్నదేమిటో మాకు బాగా తెలుసు. వారిలో కాస్త తెలివిగల వాడు “కాదు, మీరసలు ప్రపంచంలో ఒక్కరోజు మాత్రమే గడిపారు” అనంటాడు#
అయితే ఆరోజు పర్వతాలు ఏమవుతాయని వారు నిన్నడుగుతున్నారు. వారికిలా చెప్పు: “నా ప్రభువు వాటిని ఇసుక రేణువులుగా మార్చి ఎగరేస్తాడు. భూమిని చదునైన మైదానంగా మార్చివేస్తాడు. దానిమీద మీకెలాంటి మిట్టపల్లాలు కన్పించవు.” (104-107)
ఆరోజు ప్రకటనకర్త పిలుపుతో మానవులు కిమ్మనకుండా అతని వెంట నడుస్తారు. ఏ ఒక్కడూ తోక జాడించలేడు. కరుణామయుని సమక్షంలో ధ్వనులన్నీ మూగబోతాయి. తేలికపాటి (అడుగుల) చప్పుడు మాత్రమే కాస్త విన్పిస్తుంది. ఆరోజు కరుణామయుడు ఎవరికైనా అనుమతి ఇచ్చి, అతని మాటలు వినడానికి ఇష్టపడితే తప్ప ఏఒక్కరి సిఫారసూ చెల్లదు. ప్రజల ముందున్నదేమిటో, వారి వెనుకున్న దేమిటో అంతా దేవునికి తెలుసు. ఇతరులకు దాన్ని గురించి తెలియదు. (108-110)
(ఆరోజు) మానవులు సజీవుడు, శాశ్వితుడైన దేవుని ముందు తలలు వంచి నిల బడతారు. దుర్మార్గం, దౌర్జన్యాల పాపభారం మోసుకొచ్చినవాడు ఆరోజు సర్వనాశనమై నట్లే. సత్కార్యాలు చేసివుండటంతో పాటు విశ్వాసి కూడా అయివుండిన వాడికి ఎలాంటి నష్టంగాని, అన్యాయంగాని జరుగుతుందన్న భయమే ఉండదు. (111-112)
ఇలా మేము దీన్ని అరబీభాషలో పాఠ్యగ్రంథంగా చేసి అవతరింపజేశాం. మాన వులు చెడులు మానేసి నీతిమంతులుగా మారడానికి, లేదా ఏమరుపాటు వదలి సృహ లోకి రావడానికి మేమిందులో రకరకాల హెచ్చరికలు చేశాం. కనుక ఆ దేవుడు సర్వోన్న తుడు, సహజచక్రవర్తి. ప్రవక్తా! నీదగ్గరకు ఖుర్‌ఆన్‌ పూర్తిగా రానంతవరకు నీవు దాన్ని పఠించడానికి తొందరపడకు.“ప్రభూ! నాకు మరింతజ్ఞానం ప్రసాదించు” అని వేడుకో#
పూర్వం మేము ఆదంకు ఒక సందేశం ఇచ్చాము. కాని అతను దాన్ని మరచి పోయాడు. అతనిలో మాకు స్థిరత్వం, సంకల్పబలం కానరాలేదు. ఆదంకు గౌరవ సూచకంగా అభివాదం చేయమని మేము దైవదూతల్ని ఆజ్ఞాపించాం. అప్పుడు వారంతా అభివాదం చేశారు. కాని ఇబ్లీస్‌ నిరాకరించాడు. మేము ఆదంకు ఇలా ఉపదేశించాం: “ఆదం! ఇతను నీకు, నీభార్యకు (బద్ధ)విరోధి. ఇతను మీరిద్దర్నీ స్వర్గం నుండి బయటికి తీయడం, దానివల్ల మీరు కష్టాలలో పడిపోవడం జరగకూడదు సుమా! ఇక్కడ మీకు కావలసిన సౌకార్యాలన్నీ ఉన్నాయి. ఎలాంటి ఆకలి బాధగాని, కట్టుబట్టల కొరతగాని ఉండదు. అలాగే ఇక్కడ దప్పికగాని, ఎండబాధగాని ఉండదు.” (113-119)
కాని షైతాన్‌ అతడ్ని మభ్యపెట్టాడు. వాడతని దగ్గరకు వెళ్ళి “ఆదం! నేను నీకు శాశ్వత జీవితం, ఎన్నటికీ పతనంకాని రాజ్యాధికారం ప్రసాదించే కల్పవృక్షాన్ని చూపనా?” అన్నాడు. చివరికి వారిద్దరూ (వాడి టక్కరిమాటలకు మోసపోయి) ఆ చెట్టు పండ్లు తిన్నారు. దాంతో వారి మర్మావయవాలు ఒకరి ముందు ఒకరివి బహిర్గతమై పోయాయి. అప్పుడు వారిద్దరూ స్వర్గవృక్షాల ఆకులతో తమ శరీరాలు కప్పుకోసాగారు. (ఇలా) ఆదం తన ప్రభువు (మాట) జవదాటి సన్మార్గం తప్పిపోయాడు. (120-121)
తరువాత అతని ప్రభువు అతడ్ని పునీతం చేశాడు. అతని పశ్చాత్తాపాన్ని స్వీకరించి అతనికి సన్మార్గభాగ్యం ప్రసాదించాడు. దేవుడిలా ఆదేశించాడు: “మీరిక్కడ్నుంచి దిగి పోండి. మీరంతా ఒకరికొకరు శత్రువులు. ఇకముందు నానుండి మీ దగ్గరకు ఏదైనా హితోపదేశం వస్తే దాన్ని అనుసరించేవాడు దారితప్పడు; దౌర్భాగ్యస్థితికీ గురికాడు. నా హితబోధ నుండి ముఖం తిప్పుకునేవాడు ప్రపంచంలో (మనశ్శాంతికి దూరమై) దుర్భర జీవితం గడుపుతాడు. ప్రళయదినాన మేమతడ్ని అంధుడిగా చేసి లేపుతాం.” (122-124)
అప్పుడతను “ప్రభూ! ప్రపంచంలో నేను కళ్ళున్న వాడినే, ఇక్కడ నన్ను ఎందుకు అంధుడిగా చేసి లేపావు?” అని అడుగుతాడు. దానికి దేవుడు “నీదగ్గరికి మాసూక్తులు వచ్చినప్పుడు నీవు ఇలాగే (అంధుడైపోయి) వాటిని విస్మరించావు. అందువల్ల ఈరోజు మేము నిన్ను (అంధుడిగా చేసి) విస్మరిస్తున్నాం” అని సమాధానమిస్తాడు. (125-126)
అలాగే హద్దుమీరే, తమ ప్రభువుసూక్తులు తిరస్కరించేవారికి (ఇహలోకంలో వాటి) పర్యవసానం చవిచూపిస్తాం. పరలోకశిక్ష మరింత కఠినంగా, సుదీర్ఘంగా ఉంటుంది.#
పూర్వం మేము ఎన్నో జాతుల్ని నాశనం చేశాం. వాటి అవశేషాల మధ్య ఈరోజు వీరు తిరుగుతున్నారుకదా, మరి వాటి(చరిత్ర) నుండి గుణపాఠం నేర్చుకోరా? ఇందులో బుద్ధిమంతులకు ఎన్నో నిదర్శనాలు ఉన్నాయి. (127-128)
నీ ప్రభువు తరఫు నుండి ముందుగానే ఒక మాట, నిర్ణీత గడువు లేకుంటే వారి వ్యవహారం ఎప్పుడో తేల్చబడిఉండేది. కనుక వారి మాటలకు నీవు (బాధపడకు.) సహనం వహించు. నీ ప్రభువు ఔన్నత్యాన్ని ఘనంగా కీర్తిస్తూ ఆయన్ని స్మరిస్తూఉండు. సూర్యోదయానికి పూర్వం, సూర్యాస్తమయానికి ముందు, రాత్రి సమయాల్లో, పగటి వేళల్లో కూడా దైవస్మరణ చేస్తూవుండు. దానివల్ల నీవు బహూశా (భవిష్యత్తులో) సంతోషిస్తావు. (129-130)
మేము ప్రాపంచిక జీవితాన్ని, దాని వైభవం, పటాటోపాలను వారిలో వివిధ ప్రజ లకు ఇచ్చాం. నీవు వాటివైపు కన్నెత్తి కూడా చూడకు. వాటిని మేము వారిని పరీక్షించడా నికి ఇచ్చాం. నీ ప్రభువు ప్రసాదించే ధర్మయుక్తమైన ఉపాధి మాత్రమే నాణ్యమైనది, మన్నికయినది.
నీ భార్యాపిల్లలకు నమాజును గురించి బోధించు. నీవు కూడా దాన్ని క్రమం తప్పక ఆచరించు. మేము మిమ్మల్ని ఆహారం ఇవ్వమని అడగటం లేదు. మేమే మీకు ఆహారం ప్రసాదిస్తున్నాం. సత్ఫలం దైవభీతిపరాయణతకే లభిస్తుంది. (131-132)
వారు “ఈమనిషి తన ప్రభువు వైపు నుండి మహిమ ఎందుకు తీసుకురాడు?” అని అడుగుతారు. వారి దగ్గరకు గతగ్రంథాల బోధనల్లోని సారం చేరలేదా? ఒకవేళ మేము దాని రాకకుముందే ఏదైనా శిక్షద్వారా వారిని నాశనంచేస్తే “ప్రభూ! నీవు మా వద్దకు దైవప్రవక్తను ఎందుకు పంపలేదు? పంపితే నీచులై పరాభవంపాలు కాకముందే మేము నీసూక్తులు పాటించేవాళ్ళంకదా?” అనంటారు. వారికిలా చెప్పు: పర్యవసానం కోసం ప్రతివ్యక్తీ ఎదురుచూస్తున్నాడు. ఇప్పుడు మీరూ ఎదురుచూస్తూ కూర్చోండి. ఎవరు సన్మార్గగాములో, ఎవరు సహృదయులో త్వరలోనే మీకు తెలుస్తుంది. (133-135)