తాళ్ళపాక పదసాహిత్యం/ఐదవ సంపుటం/రేకు 494
రేకు: 0094-1 కేదారగౌళ సం: 05-374
పల్లవి:
దశవిధాచణం తన్నభవతి దశవిథావస్థార్థం తే తత్ర
చ. 1:
స్థాపయిష్యామి వేదానితి వ్యాజేన దీపితోయం మత్స్యదేహ: పురా
వ్యాపారోయ మేవం నచ తరుణ్యా రూపజలధౌ కేళిరుచయే తత్ర
చ. 2:
ధారయిష్యామి మందరమితి వ్యాజేన చారుకచ్ఛప విధాచ. పురా
నీరసేయం తవ మనీషా ప్రియవధూ భారకుచమందరౌ భర్తుం తత్ర
చ. 3:
భువముద్ధరిష్యామి పునరితి వ్యాజేన ధవళ కిటి వైభవం ధత్సే పురా
వ్యవహృతీరియం నచ మహామహికుచతటే తవ దంతక్షతం దాతుం తత్ర
చ. 4:
దనుజం హరిష్యామి తమితి వ్యాజేన ఘన నారసింహవిక్రమణం పురా
దనుజర తవ మహత్త్వం తన్నచ నఖార్జనమిందిరాయా ప్రసర్తుం తత్ర
చ. 5:
అపరిహరిష్యామి బలిమహమితి వ్యాజేనకపటవామనరూపకలనం పురా
నిపుణ ఏవం నఖలు నియతిస్సతీషు తే కపటాచణం ఘటయితుం తత్ర
చ. 6:
సంహరిష్యామి నృపజనమితి వ్యాజేన బహ్వరుణతోయేప్రాప్తి: పురా
సింహవిక్రమణతే స్థితిరియం నచ సతీ విహ్వలత్వం తదా వేత్తుం తత్ర
చ. 7:
రావణం జేష్యామి రణ ఇతి వ్యాజేన భూవరత్వే తే భోగ: పురా
ఏవం నభవతి మహీసుతా విరహంసావధానేన ప్రహర్తుం తత్ర
చ. 8:
కంసం హనిష్యా మి ఖలమితి వ్యాజేన సంసారోయమాచరిత: పురా
హింసాదూర నచ హితమిదం వ్రజవధూసంసరణలీలాం ప్రసక్తుం తత్ర
చ. 9:
పాతయిష్యే ప్రలంబమితి వ్యాజేనజాతరోషస్య తే జననం పురా
భూతరక్షక తే ప్రభుత్వం తన్నఖలు భూతలే రేవతీం భోక్తుం తత్ర
చ. 10:
బుద్ధో భవిష్యామి పురహృతివ్యాజేన బద్దరోష ఇతి తేప్రాప్తి: పురా
తద్ధితం నహిఖలు తదా వధూహస్త సిద్ధ ప్రసారేణ సేవితుం తత్ర
చ. 11:
మారయిష్యామి కలిమతమితి వ్యాజేన క్రూర కల్క్యవతారకోప: పురా
ధీర వేంకటనగాధీశ ఏవం నఖలుభీరుముర్వీంసంప్రిణయితుమత్ర
రేకు: 0094-2 ముఖారి సం: 05-375
పల్లవి:
ఎంత సేయఁగనేరదింతి గోపించినను
కంతుని గెలిపించెను ఘనుఁడైన విభుని
చ. 1:
సతవింత తాపాన చందురుఁడేఁపఁగఁ బో
ప్రతిచందురుండాయ పడఁతిమోము
అతివఁ గోవిలకూఁతలలయించఁగాఁ బో
తతిఁ గోవిలలకూఁత తానాయఁ బలుకు
చ. 2:
మలయానిలుఁడు దన్ను మలసి యేఁచఁగఁ బో
చెలివూర్పు చిరుగాలిఁ జిత్రెంచెను
తలపోఁతచింత చిత్తము సేయఁగాఁ బో
కలికిచిత్తము పతికడకంటెనిపుడు
చ. 3:
తిరుగఁ జంద్రుఁడు తన్ను తిలకించగాఁ బో
ధరియించెఁ గుచముల తానతని
తిరువేంకటగిరిదేవునికౌఁగిటి-
సిరులఁబో యిన్నిటాఁ జెలువాయె నిపుడు
రేకు: 0094-3 ఆహిరి సం: 05-376
పల్లవి:
నిన్నుఁ గూడిన విభుని నిలువెల్ల సొంపాయ
నిన్నియును నొనగూడె నింతలోపలనె
చ. 1:
సొలపు నీ కడగంటిచూపు హృదయము గాఁడి
లలినితఁడు శ్రీవత్సలాంఛనుండాయ
వెలఁది నినుఁ బెడఁ బాసి విరహంపుమెయికాఁక -
వలన నీతఁడు నీలవర్ణుఁడైనాఁడు
చ. 2:
అదన నీ చనుగుబ్బలను చక్రముల చేతఁ
బదిలపరపుచు చక్రపాణియైనాఁడు
సుదతి నీ దేహమున సొబగు కుంకుమపూఁత-
లెదిగి పీతాంబరంబీతనికి నాయ
చ. 3:
ఆలింగనాపేక్షననయంబు నినుఁగూడ
లోలుఁడటుగాన నాలుగుచేతులాయ
శ్రీలలితమూ ర్తియగు శ్రీ వేంకటేశ్వరుఁడు
పాలించె నిను నీకుఁ బరితోషమాయ
రేకు: 0094-4 ముఖారి సం: 05-377
పల్లవి:
కందువ నేఁడెందరైనాఁ గలరు నీకు
యిందరిలో నాప్రియమీడేరీనా
చ. 1:
సన్నలు సేసేటి వారు సరసమాడేటివారు
కన్నుల మొక్కేటివారు గలరు నీకు
విన్ననై యిందరికిని వెరవనే కాక నాఁ
విన్నపమెంతైన నీకు వినఁదీరీనా
చ. 2:
తేఁకువఁ జేరేటివారు తేనెల మాఁటలవారు
కాఁకలు సేసేటివారు గలరు నీకు
యేఁకటనిందరికడ నెడతాఁకనేకాక
సోఁకనాడే నావంక చూడఁగూడీనా
చ. 3:
ముద్దులు గునియువారు ముచ్చటలాడెడివారు
గద్దించి తిట్టెడివారు గలరు నీకు
తిద్దిన నీవిద్యలివి తిరువేంకటేశ నా-
వొద్దఁ గూడి యిట్ల నీకు వుండఁగూడీనా