తాళ్ళపాక పదసాహిత్యం/ఐదవ సంపుటం/రేకు 407
రేకు: 0007-1 మంగళకౌశిక సం: 05-038
పల్లవి:
తన్నుఁ బాసి నేనింత దంటనట యీ
వెన్నెలబాయిట రేయి వేగుఁటింతి చాలదా
చ. 1:
ఇంటికి రాకుమని నేనంటినట చూడవే
అంటఁగాక వున్న దాన నంటినో యేమో
కంటికి నిద్దురరాక కాఁకలనే పొద్దువోక
వొంటి నేఁ బానుపున రేయుంటి నింత చాలదా
చ. 2:
అప్పటి దగ్గరి నే రానై తినట చూడవే
కొప్పు జారి సిగ్గుతోడఁ గొంకితి నేమో
చిప్పల రెప్పల జంకించితినట చూడవే
చెప్పరాని మాట నీతో జెప్పుటింత చాలదా
చ. 3:
ఊరకే మాటాడక నే నుంటినట చూడవే
ఆరడి పరవశాన నైతినో యేమో
గోరికొనఁ దనుఁ దక్క, గొంటినట చూడవే
యేర వేంకటేశ నాతోనింత నీకుఁ జాలదా
రేకు: 0007-2 శుద్ధవసంతం - రచ్చెతాళం సం: 05-039
పల్లవి:
ప్రలపనవచనైః ఫలమిహకిం
చల చల కుడ్యక్షాళణనయా కిం
చ. 1:
ఇతర వధూమోహితం త్వాం ప్రతి
హితవచనై రీహితు మిహ కిం
సతతం తవానుసరణమిదం మమ
గతజల సేతూకరణ మిదానీం
చ. 2:
వికలవినయ దుర్విటం త్వాం ప్రతి
సుకుమారార్దృస్తుత్యా కిం
ప్రకటబహల కోపనం మమతే
సకల చర్విత చర్వణమేవ
చ. 3:
శిరసా నతసుస్థిరం త్వాం ప్రతి
విరసాలాపన విధినా కిం
తిరువేంకటగిరి దేవ త్వదీయ-
విరహవిలపనం వృథాచరణం
రేకు: 0007-3 వరాళి సం: 05-040
పల్లవి:
ఆఁగఁ జేసు నా చూపులటు వోవయ్య
మూఁగిన నా వలపుల మూలకు రానేలా
చ. 1:
ఇమ్ముల నొల్లని వారమేల నీకు నామేని-
అమ్ముల పులకలొత్తీ నటు వోవయ్య
కమ్మవిలుతునిచేతఁ గాఁగెడి నన్నొరసేవు
నెమ్మది నుండి యుండి నీకు నొవ్వనేలా
చ. 2:
ఇతవు గాని వారమేల నీకు నామేని-
ఆతితాపమంటుఁ జేసు నటు వోవయ్య
రతిరాజుచేత నారడిఁబడ్డ ననుఁ జేరి
జతనాన వుండివుండి జాలిఁబొంద నేల
చ. 3:
ఇంతటి నీ కౌగిటికి నేల నేము మాకోప-
మంతరమెఱఁగనేరదటు వోవయ్య
పంతగాఁడ వెంకటపతి నీవు ననుఁ గూడి
చింతతోడఁ బొరలుచు సిలుగంద నేలా
రేకు: 0007-4 శ్రీరాగం సం: 05-041
పల్లవి:
ఎన్నఁడునుఁ గోపగించవిందుముఖి నీవిట్లా
విన్నవి వదనమెల్లా వింతలాయ నిపుడు
చ. 1:
ఇంతలోని పనికిఁగా నెంత చేసినాఁడవు
కాంత నిన్నటినుండి కనుమూయదాయను
బంతికూటి సతులెల్లా బలుమారు నేఁపగా
చింతతోఁ బళ్ళెము మీఁద జెయి చాఁచదాయెను
చ. 2:
ఏమిసేయఁబోయి నీవుయేమి సేసినాఁడవు
సాముకు విచ్చేయదు జవరాలు నేఁడు
దోమతెర మంచముపై తురుము వీడఁగను
తామసించి లేవదిదె తల నొచ్చీననుచు
చ. 3:
ఎవ్వరిని దూరవచ్చు నెవ్వరున్నారిఁకను
పువ్వు సజ్జమీఁదఁ గాఁగె పొలఁతికి దేహము
రవ్వగ వేంకటగిరి రమణ నీ కౌఁగిటఁ
బవ్వళించి యింతలోనె పరవశమందెను
రేకు: 0007-5 ముఖారి సం: 05-042
పల్లవి:
మతికంటె వెలినున్న మంట మేలు
చతురులౌట కంటె జడుటౌట మేలు
చ. 1:
ఇంటిలోననె వుండి హీతవరులై యుండు-
కంటెఁ బగయై యుండు కసరు మేలు
అంటుకొని మరుఁడొంటి అతివనేఁ పుటకంటె
పుంటినొవ్వల విరుల పోట్లె మేలు
చ. 2:
తల్లివలె దానుండి తాపమవుటకంటె
అల్లంతనుండి కీడౌట మేలు
వెల్లిగొని నిటపర్పు వేడి చల్లెడికంటె
పల్లదపు చలిగాలి బాదలే మేలు
చ. 3:
అలయించి దొరకెడి అమృతపానముకంటె
అలమి ఫైకొనెడి చేఁధైన మేలు
కలయక కలయు వేంకటశై లపతికంటె
తలపోఁత వేదనల తమకమే మేలు
రేకు: 0007-6 సామంతం సం: 05-043
పల్లవి:
అప్పుడే నే నీకు మోహపుటాలనై తినా
కప్పకు నీ చేఁత లంతకంటెఁబో నేను
చ. 1:
ఇంచుకంత పనికైన నిల్లుచొరనీక నిన్ను
లంచములడుగను నే లకిమమ్మనా
వంచనల నీకు నిట్టె వలలఁ జిక్కితిఁ గాక
కంచుఁ బదనునకంత కంటెఁబో నేను
చ. 2:
సొలపు మాటల నిట్టే చూపులనె జంకించి
చలము సాదించ నీ సత్యభామనా
వలచి నేనిదె నీకు వసమై చిక్కితిఁగాక
కలికి చేఁతలనంత కంటెఁబో నేను
చ. 3:
రేపు మాపు గోరఁ దమ్మి రేకులనే లేఖవ్రాసి
రూపు నీకు జెప్పిపంప రుకిమిణినా
తీపుల నిన్నుఁ గూడి తిరువేంకటేశ విరిఁ
గైపు సేయఁగాని అంతకంటెఁబో నేను