Jump to content

తాళ్లపాక అన్నమాచార్యుల జీవితచరిత్రము/సంకెల వేయించుట

వికీసోర్స్ నుండి

బరమపతివ్రతాభావంబుఁ బూని
హరి ముకుందునిఁ గొనియాడు నాజిహ్వ
నిను గొనియాదంగనేర దెంతైన
నను నెట్లు పలికితి నైచ్యంపుఁబలుకు-
నాయచ్యుతునిఁ దక్క నన్యుల వినుతి-
సేయుట నా కన్న చెలియలి వావి

సంకెల వేయించుట



నిను నొల్ల నిటువంటి నీపొందు నొల్లఁ
జనియెద వేంకటేశ్వరుఁ గొల్వ నేను
అనుచు దిగ్గన లేచి యరిగెడు గురుని
పనిఁబూని భటులచేఁ బట్టి తెప్పించి
తన బాల్యసఖ్యంబుఁ దలచి సంపదలఁ
దనయంతవానిఁగా దనరఁజేసితిని
గబ్బిమై నొక మాట కావలెనన్న
గొబ్బునఁ గోపించుకొన నేలవచ్చె
నీవేమి సేయుదు నిను నింత సేయు-
నావల్ల నేరము నను నింతసేసె-
నని కనుఁగవ యెఱ్ఱనై నిప్పు లురుల
ననుచరవర్గంబు నదలించి పిలిచి
లోఁగి నే నెంత దాళుచు వేఁడుకొనిన
లోఁగని పుడమివేలుపుదంట కోడె-
ఱంకెలు చన మూరురాయరగండ-
సంకెల నిడి మెుగసాలలో నిడుఁడ
యన నూడిగెలవార లాచార్యుఁ దోడు
కొనిపోయి మెుగసాలఁ గూర్చుండ నిలిపి

కొంకుచు రాజునకును భయంబడుచు
శంకలేమియు లేక సంకెల వేసి
కావలియై నలుగడ నుండి; రంతఁ
గోవిదుఁడైన యగ్గురువరేణ్యుండు
మునుపు ప్రహాదుండు మురవైరిఁ దలచి
దనుజబాధలఁ గాలఁ దన్నిన కరణి
ఫణిరాజశైలేంద్రుఁ బ్రణతార్తిహరుని
గణుతించి హృదయపంకజవీధి నిలిపి
"సంకెల లిడువేళఁ జంపెడువేళ-
నంకిలి ఋణదాత లాఁగెడువేళ
వదలక వేంకటేశ్వరుని నామంబె
విదలింప గతిగాని వేఱొండు లేదు
వనమాలి యతఁడె నావగపెల్ల నుడుపు"-
ననునర్థములతోడ నలవడియుండ
సంకలితాత్ముఁడై సరుగున నొక్క-
సంకీర్తనముఁ జెప్పి శరణుసొచ్చుటయు
ఘల్లున వీడి శృంఖల లూడె; గుండె
ఝల్లనఁ జూచి యచ్చటవారు బెగడి
యీవిధం బంతయు నా రాజుతోడ
వేవేగఁ బఱతెంచి విన్నవించుటయు,
నగి వడి సింహాసనము డిగ్గ నుఱికి
పగగొన్న బెబ్బలిపగిది నేతెంచి
అన్నయార్యునిఁ జూచి యయ్యరో!వద్ద
నున్నవారల కెల్ల నొగి లించి మించి

వేయని సంకెళ్ళు వీడె నటంచు
మాయురె!నీ వెంత మాయ వన్నినను
నే నేల పోనిత్తు నిది నిక్కమైన-
నే నుండి తిరుగ వేయించెద నిపుడు
కిదుకక నీదు సంకీర్తనంబునకు
నది వీడెనా నిజంబని యెన్నవచ్చు
నీపాలిదైవంబు, నిన్ను, నీ మహిమ
బాపురె!యని మెచ్చి పాటింపఁదగును-
ననుచు నొద్దనె యుండి యా నిగళంబు
తనికి చెనెత్తి యిద్దఱు దేర మగుడ
నెగసక్కెమునకు వేయించిన గురుఁడు
నగి తొంటి సంకీర్తము సేయుటయును
కాలిసంకెల చిటికనవ్రేలి పలుము-
చీలలు వీడి చెచ్చెర నూడిపడినఁ

 

రాయల పశ్చాత్తాపము



బరకించి భూపతి భయమంది యతని-
చరణాబ్జములఁ జక్క సాఁగిలి మ్రెుక్కి
కన్నీరు గదుర గద్గదకంఠుఁడగుచు
పన్నిన దైన్య మేర్పడఁగ నిట్లనియె;-
నపరాధి నపరాధి నన్నమాచార్య!
కృపఁజూడు నను నీవు కృపణశరణ్య!
యెఱుఁగని పసిబిడ్డఁ డేమైనఁ జేయ-
నరుదైన తల్లికి నలుగంగఁదగునె?