Jump to content

తాళ్లపాక అన్నమాచార్యుల జీవితచరిత్రము/పొత్తపినాడు

వికీసోర్స్ నుండి

పొత్తపినాడు

అనయము నయము సొంపారు క్రొవ్విరులు
గొనబైన చెంగల్వకొలఁకులు చుట్టి
పొదలు గొజ్జంగపూఁబొదలు క్రిక్కిఱిసి
వదలక వెలుఁగుకైవడి వెలుఁగొందు-
తెరువరుల్ త్రోవ నేతెంచి యేతెంచి
పొరిపొరిఁ గణ్పు గణ్పునఁ బాలుగారు-
రసదాళిచెఱకు తోరపుఁదుంట లంది
మిసిమైన ముంతమామిడిపండ్లు నైన-
నా రసంబులచేత నచటి రాజనపుఁ
బైరులు ముక్కారుఁ బండు నెయ్యెడలఁ
బాలనే పెరిగిన పసిఁడిటెంకాయ
పాళెల నెడనీరు పట్టి పెట్టినను
అనఁటిపండులు మేసి యలసి పై దప్పి-
గొనవచ్చి కోవెలల్ గ్రోలు నచ్చటను
నరిమీఱు నా మేటినాటి నానాఁటి-
సిరులింక నే మని చెప్పంగవచ్చు.