Jump to content

తాళ్లపాక అన్నమాచార్యుల జీవితచరిత్రము/అన్నమయ బాల్యము

వికీసోర్స్ నుండి

లక్కమాంబకుఁ బుణ్యలావణ్యనిధికిఁ
జక్కని గ్రహము లుచ్చమున మూఁడలర
ననుపము లగ్నంబునందు వైశాఖ-
మున విశాఖను జగంబున నుల్లసిల్ల
జనియించె నన్నమాచార్యుండు శక్తి-
మునికిఁ బరాశరముని పుట్టినటులు;
జనకుఁడు కారణజన్ముఁడైనట్టి
తనయున కాగమోక్తప్రకారమున
జాతకర్మము చేసి సకలవేదాంత-
జాతచోదితమునై జలజోదరునకు
నామమై వినఁబరిణామమై మున్ను
హేమాంబరుండానతిచ్చినయట్టి-
అన్నమాయ్యాహ్వయం బతనికి నొసగె;

అన్నమయ బాల్యము



పన్నినభక్తి నా పసిబిడ్డఁ జూచి
అన్నయ్య అన్నప్ప అన్నమాచార్య
అన్న రమ్మనుచు ముద్దాడుచునుండ
హరినందకాంశజుం డగుట డెందమున
పరమసుజ్ఞానసంపద పొదలంగఁ
బుట్టుచు నఁతడు నేర్పునఁ దల్లి జిడ్డు
పెట్ట రమ్మని యుగ్గు పెట్టఁబోయినను
పనిఁబూని తిరుమలప్పని ప్రసాదంబు
గొనుమని యనక లోఁగొనఁడు కేరుచును;

నెడపక తొట్టెలో నిడి యెంతపాటు
పడి యెంతవడి జోలఁ బాడెనేనియును
వేంకటపతిపేరు వివరించి పాట
పొంకించకుండినఁ బోరూఱడిలఁడు;
కొండలప్పనికి మ్రెుక్కుమటంచు ననక
యెుండులాగుల జతులొనరించఁ డతడు
ఈ లీల శేషశైలేంద్రునిమీఁద
బాళినే పడియుండుఁ బసిబిడ్డఁడయ్యు-

అన్నమయ విద్యలు



నింతయై యంతయై యీడేఱి బుద్ది-
మంతుఁడై పంచసమంబు లైనంత
నియతిమై గురుఁ డుపనీతుఁ గావించి
నయవేది నద్యయనంబు సేయించె;
నన్నమాచార్యున కహినాయకాద్రి
వెన్నుని వరముచే విద్యలన్నియును
నమితంబులగుచు జిహ్వరంగసీమ
తముఁదామె సొచ్చి నర్తన మాడఁదొడఁగె;-
నా పిన్న ప్రాయంబునందు నామేటి
యేపారఁ దనమది కిచ్చయైనట్లు
ఆడిన మాటెల్లఁ బరమగానముగ
తన కవిత్వమునకుఁ దన గానమునకుఁ
గనుఁగొని సకలలోకములు గీర్తింప
వేంకటపతిమీఁద వింతవింతలుగ