తాలాంకనందినీపరిణయము/ప్రథమాశ్వాసము

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

శ్రీమతే రామానుజాయ నమః

తాలాంకనందినీపరిణయము

ప్రథమాశ్వాసము

(కృత్యాది)

ఉ.

... ... .... ...... ... .... ......
... ... .... ...విధేయుని దోర్జవ నిర్జితోగ్రదై
తేయుని దేవగేయుని... ... .... ...
... ... .... ...గతిక్రమచక్ర... ... .... ...

1


చ.

... మతిన్ విరచనానుగతిన్ వినుతింతు శ్రీరమా
పతిఁ గరుణారతిన్ సుకృతిపద్ధతి నీజగతిన్ సృజించి సు
స్థితిలయ... ... .... ...... ... .... ...సతీపతీ
... ... ... .... ...... ... .... ...... ... .

2


క.

సారము, దాసామృతకా
సారము, దుర్వారవైరిచయసరదనలా
సారము, హతరక్షఃసం
సారము... ... .... ...... ... .... ...

3


క.

... ... ... ....
... ... .... ...... ... .... ...
దరము, సదాశ్రయదామో
దరము, మదీయాఘజనితదరమందరమున్.

4


గీ.

... ... .... ...... ... .... ...
... ... .... ...... ... .... ...
... ... .... ...... ... .... ...
గదను గొనియాడెదను మదఘదను గదను.

5

క.

... ...... ...... ...... ...
... ...... ...... ...... ...... ...... ...... ...
...... ... శుక వాల్మీకి వ
చశ్శ్రీ వర్ణింతు ననయ సవినయ నియతిన్.

6


సీ.

... ...... ...... ...... ...... ...
... ...... ...... ...... ...
మహి వరాహీశనామఖ్యాతిఁ దీపించి
పంచాస్యముఖనుతప్రభ గణించి
... ...... ...... ...... ...
శుభాధారైకగరిమ గాంచి
స్థిరత రసాతలాధిపతియై దీపించి
యాభోగబలభద్రుఁడై రహించి


గీ.

పాదుగ హరిస్వరూపమై యాదిచక్రి
రూపదశకంబు తనతో నిరూఢి దెల్పి
... ...... ...... ...... ...... ...... ...
... ... ...... ...... ...... ...... ...... ...

7


గీ.

... తత్వనుహృదత్వసులభత్వసత్వ ...
... ...... ...... ...బహుళ గురుత్వపావ
నత్వస్వముఖమహత్వభార ... ...... ...
...... ......... ...... ...... ...”

8


గీ.

... ...... ...... ...... ...... ...
ప్రాంజలి ప్రణుతి ప్రజామ మర్థి
హరిరమానంతగరుడసైన్యవరచక్ర
ముఖమహాయుధగురుకవిముఖ్యులకును.

9[1]

ఇట్లు శ్రీమద్వృషధరాధరసౌధవిహరణుఁడగు వేంకటరమణు నుద్దేశించి రంగదపాంగసంగతకరుణాతరంగాంగణయగు మంగాంగనాంతరంగానుషంగాభంగవైభవప్రసంగంబుఁ బ్రశంసించి, శేషగరుడచమూనాథవిశేషప్రభావం బాశ్వాసించి, దివ్యాయుధపంచకాంచన్మహత్త్వసత్వంబునకు గురుత్వంబు గావించి, భగవద్గుణగణవిభవానుభవప్రభావాతిశయకృతదినచర్య మద్వంశాచార్య పరంపరానుకంపాసంపల్లాభంబున కభినివేశించి, సకలాలంకరణపదప్రకరణ గూఢశ్లేషాశ్లేష శ్లాఘనీయ పురాణరచనాప్రవీణ చమత్క్రియాధురంధర కవిపురందర వాఙ్మరందస్యంద దమందప్రధానమాధుర్యంబునకు విశ్వసించి, దుష్కరపదపుష్కల శుష్కకవితాపరిష్కారులగు దుష్కవుల నిరసించి, కలుషలతావితాన లవిత్రంబుగా పవిత్రజనస్తోత్రపాత్రంబగు నొక్క చిత్రకథాచరిత్రంబు రమాకళత్రాంకితంబుగ [2]యోచింపు మటన్న, నెటులో యని వివరింపుచు, తద్గుణానుభవపరాయణుండనై యొక పుణ్యవాసరంబున న్నిద్రాపరపశుండనై యున్న సమయంబున -

10


క.

భాసురమగు నానిశి హరి
వాసరమున శేషగిరి నివాసరమేశుం
డాసురపోషణుఁ డనవర
తాసురఘోషణుఁడు సత్కృపార్ద్రహృదయుఁడై.

11


సీ.

శ్రీధరుం డరుణజపాధరుం డఖిలధ
    రాధరుండును రుచిరాధరుండు,
సుందరుండు, ధృతోరుమందరుండు, గుణాళి
    కందరుండు నుతపురందరుండు,
పావనుం డసురా౽హితావనుం డాశ్రితో
    జ్జీవనుం డమితసంభావనుండు
తారకుండు త్రిలోకదారకుండు మహోప
    కారకుం డసురసంహారకుండు

గీ.

 నెల్లలోకములకు గన్నతల్లిలీల
నుల్లసిల్లెఁడు కరుణామతల్లికేక్ష
ణోల్లసితనేత్రయుగ రమావల్లభుండు
గాననయ్యెను స్వప్నసాక్షాత్కరముగ.

12


తే.

తరణికిరణప్రకరణధిక్కరణరుచిర
విస్ఫురణతనుతేజఃప్రవీణ విభవ
లోకనానేకసంభవోత్సేకభక్తి
కేల్మొగిడ్చి పునర్నమస్క్రియ లొనర్చి.

13


క.

యోగ్యంబేమో మును, మ
ద్భాగ్యమునే శ్రీరమాధిపతిఁ గనుట మహా
భాగ్యంబై జన్మం బా
రోగ్యం బయ్యెనని బొగడ రూఢిఁ దలఁచితిన్.

14

గునుగుసీసము[3]

పరమయోగిహృదయశరణములగు చర
ణములు, తారాగణాభిముఖములు, న
ఖములు, తాబెళములకరణి నేవళములై
బొదలు ప్రపదములుఁ, బొంకమైన
గమకంపు బంగరుకాహళికల హళా
హళిసేయు జంఘలు, తళుకు తిన్ని
యల వన్నియల మిన్నయగు పిఱుందులు, గజ్జ
నంటిదంటల కడగంట గెంటఁ
గల మగంటిమి జాల్తొడలనడరు, బెడంగు
పిడికిటిలోననే నడఁగెఁ గన్ను
జెదఱి బాపురే యన జెల్వగు లేఁగౌను,
[4]చౌకుచౌకం జేసి... .... ...

టక్కు బఱచెడి బల్మిటారంపు నడలు,న
ల్వను దొడ్డబిడ్డఁగాఁ గనిన బొడ్డు,
తమ్మియు మినువాక తరఁగలఁ బొరగల
బడఁదొబ్బి యుబ్బు నిబ్బరపుఁ ద్రివళి
యు, నిఖిలజీవప్రయుక్తబ్రహ్మాండభాం
డంబులు తండతండంబు లగుచు
నిండి బుళ్బుళ్కురని గదల నొదుగైన
నుదరము రుచిరవిద్యోతమాన
కౌస్తుభమణిడోలికగు హేలగతి కాపు
రంబుఁ జేసెడి విస్ఫురదరవింద
మందిరయైన మాయిందిరచే నతి
సుందరమైన వెడందఱొమ్ము,
చెలువైన చిన్ని చీమలబిడార్గేరు ని
గారంపు నూఁగారు గరిగరికద
రము, నధరదరము రమ్యకంధరము, క
రికరముల ననుకరించు బాహు
వులు, కుధరశృంగములకన్న నెన్నిక
యగు యెగుభుజముల సొగసు, మేల్మె
ఱుంగు బంగరురంగు బొంగారు చేల చె
ఱంగుల వలెవాటు రహి వహించు,
[5]నారంగములన నూఁగారును దులకించు
దరహాసచుబుకము, తళుకుటద్ద
ములఁ గద్దరించు గోమున చాకచక్యమ్ము
లగు ముద్దుచెక్కిళ్ళు, జిగిమిగిలిన

సాధుసుధామాధురీ ధురీణాధర
మును,చిన్కుఁబూసల మురుపు నీస
డించు పల్వరుస, మండితమణిఖచిత కుం
డలముల గీల్కొన్న డంబుఁగల దొ
కాటంపు నిడుద, శ్రీకారములకు మొకా
రించుకర్ణములు, వర్ణితదయా ర
సార్ణవాకీర్ణ సంపూర్ణకటాక్షని
ర్ణీతములైన దృఙ్నీరజాత
యుగము, తొగమ గనిఁ దెగడు నగుమొ
గము, గములుగొను భృంగముల నమ్మ
గల యుంగరపు ముంగురుల మెఱుంగు, సహస్ర
కోటిభాస్కర నిరాఘాటకాంతి
తే. మయకిరీటము, గంజగన్మంగళావ
తరణసంసేవ మద్భాగ్యగరిమఁ గంటి
హతసురవిరోధ! విహృతాశ్రితాపరాధ!
జయరమానాథ! శ్రీ శేషశైలనాథ!

15


క.

అని వారిజనాభుని నే
ననివారితభక్తియుక్తి నలినమ్రత నా
తనివారఁ బొగడఁగా నా
తనివారఁ గనుల దయామృత మొలుకం బలికెన్.

16


క.

అంకితము మాకుగా తా
లాకతనూజాసదుద్వహకథాస్థితి ప
ర్యంకగతి గావ్యరచనా
కైంకర్యము సేయు బాలకా సువివేకా!

17

క.

నాతనయునిగతి నీకు స
నాతనకవివాఙ్నిరుక్తి నాకృప నిత్తున్
పూతనయ! విను మనిన కం
జాతనయను వాక్యములకు సంభ్రమమతినై.

18


తే.

ఇప్పు డిటువంటి మధురవాక్యముల జుంటి
తేనియపనంటివలె నంటి తెలుప, తొంటి
యింటి వేల్పైన మాతమ్మికంటిఁ గంటి
మేలుకొనఁదగు ననుకొంటి మేలుకొంటి.

19


క.

కల యని వెరఁగున నెన్నఁడు
గరియని శుభకారణానుకరణాకృతి ముం
గలఁ దోచె నెట్టి భాగ్యము
గలదో చర్చింప శౌరికరుణాదరణన్.

20


మ.

శుకవాల్మీకిపరాశరాత్మజముఖాస్తోకప్రణీతప్రబం
థకథాసారవినోదుఁడౌ హరి విచిత్రంబయ్యె గాదే మద
ల్పకృతిన్ గోరుట యజ్ఞభోక్తయగు లీలావేషి యా బీదవి
ప్రకులుం డెట్టిన ముష్టి మెక్కడె నతత్రాణైకపారీణుఁడై.

21


క.

అనుడు వృషాచలపతిన
న్ననుచు నెనరుఁబూని కోరిన ట్లీ కావ్యం
బనుపమగతిఁ జేసి యఘం
బనుప మతిం దలఁతు శ్రీవిహారిన్ శౌరిన్.

22


మ.

కవితాకల్పనకల్పభూరుహసమాఖ్యఖ్యాతిచే మద్గురు
ప్రవరానుగ్రహమే నిధానముగ గన్నట్టన్ రమాజాని స్వ
ప్నవశుండై కృతిఁ గోరె తన్నియమనప్రౌఢిన్ బుధు ల్మెచ్చ నీ
యవని న్నిమ్మకు నీర మెక్కుగతి కావ్యం బూర్జితం బయ్యెడిన్.

23

మ.

… … …అంతరాళమున చక్కం జూచి యంచత్కృపా
మృతధారాప్తి నివృత్తదోషముగ కూర్మిన్ నిర్మలప్రాభవా
న్వితగాఁ జేతురు మత్కృతిన్ జగతి స… … … … … … …
… … … … … … … … … … … … … … … … … … … … … … .

24


చ.

హరిపదసక్తులుం, గువలయాప్తులు సత్పథవర్తు లౌచు ను
ర్వర నభివృద్ధి గాంచు ద్విజరాజు లనందగు సత్కవీశ్వరుల్
… … … … … … … … … … … … … … … … … … … … … …
సరసత కీర్తిచంద్రికల సాధుతరుల్ గురిపింపఁజేయరే!

25

కుకవి నింద

చ.

సురుచిరవృత్తనేమములుఁ జూడక హీనకథాప్రసక్తిచే
గురులఘువర్ణనిర్ణయముఁ గొంచెములేక పదార్థసంగ్రహ
స్థిరమతి సత్ప్రబంధరుచిం దేఱక , శయ్యలు విశ్రమస్థలం
బరయక హీనజారులక్రియం దగు దుష్కవులన్ గణింతురే.

26


మ.

తమకై తాము వికల్పనార్థగతశబ్దంబుల్ దగం గూర్చి, ప
ద్యములుం గొన్ని సభన్ వచించునెడ[6] విద్వద్వర్యుఁడుం బూర్వప
క్షము గావించిన నోరుమూతురు తమిం గన్నంబులోఁ దేల్చి టు
క్కుమనన్ మీటిన దొంగబం టయిన గ్రుక్కన్ మిక్కుగా నుండఁడే.

27


ఉ.

రామకవాఙ్నియుక్తి మధురస్వరపంచమసూక్తి రక్తిగా
గోమలలీలఁ బల్క విని గోకిలఁ గాకినిగా గణింతు రు
ద్దామసదర్థబోధ కవితారచనం బ్రకటింపకున్న వి
ద్యామహిమాఢ్యు గౌరవగుణాఢ్యుని మౌఢ్యునిగా దలంపరే.

28

కావ్యప్రశస్తి

చ.

ఉరుతరకందవేణి, లసదుత్పలతోచన, చంపకాంగి భా
సురతనుమధ్య రమ్యవళి సుందరవృత్తనితంబ గీతవి
స్తర, బహుమత్తకోకిల రసస్వరభాస్వర యైన కావ్యసుం
దరిని వృషాచలేశున కుదారత గౌరత ధారవోసెదన్.

29


వ.

అని యభీష్టదేవతాసుకవికుకవిజనంబుల నమస్కరణపురస్కరణతిరస్కరణపూర్వకంబుఁగాఁ బ్రశంసించి యేతత్ప్రబంధనిబంధనప్రారంభధురంధరుండనై కృతిముఖాలంకారంబుగా మదీయవంశావతారం బభివర్ణించెద.

30

(వంశావతారవర్ణన)

క.

కల్యాణకరణగుణసా
కల్యుఁడు ముక్తివిభవానుకరణతపస్సా
ఫల్యుఁడు సౌశీల్యుఁడు వా
త్సల్యుఁడు మౌద్గల్యుఁ డనెడు తాపసి యలరున్.

31


క.

ఆసూరికులవరేణ్యుం
డాసూరికులాధినాథుఁడై నిజతనుశో
భాసూరుఁ డగుచు విబుధస
భాసౌరమణిప్రభావిభాసురమహిమన్.

32


ఉ.

శ్రీరమణీమణీవిభుని జెల్వగు నమ్మునిగోత్రజాతుఁ డా
సూరికులావతంసుఁడు విశుద్ధతపస్వి యశస్వి సాధుభ
ట్టారకుఁ డాగమాన్వయవిడంబితమంత్రరహస్యదాస్యహృ
త్సారసుఁడై యతిప్రవరుసన్నిధి పెన్నిధిగా వసింపగన్.

33


చ.

యతిపతి యొక్కకాలమున నాకురుశేఖరసాధుభట్టరుల్
జతగొని సన్నిధి న్నడువ చయ్యన రంగనిసేవకై సుహృ

ష్టత జనుదెంచునంత గరుడధ్వజుఁ డాదరభావుఁడై మహా
చతురత నిట్లు బల్కె యతిచంద్రునిజూచి రసోచితంబుగన్.

34


క.

కంటిమి మిముఁ గూరేశులఁ
గంటిమి మీవెంట వచ్చు ఘను లెవరొ మఱిం
గంటి మని బల్కి నది మా
కింటికి పేరుంటగా మహిన్ రహి కెక్కెన్.

35


క.

ఆ నంబెరుమా ళ్కృప ని
టానతి నిడ నాటనుండి యస్మద్వంశ
శ్రీనిధి జగద్ధితప్రభ
బూని ధరం బిల్లచెఱకుపోల్కెం బ్రబలెన్.

36


క.

వారలమహిమలు ద్రాక్షా
వారలహరు లట్ల నిఖిలవసుధాస్థలి ధై
వార లసదార్యజనులగు
వార లహా! యనఁగ గొంతవర్ణనఁ జేతున్.

37


సీ.

మంత్రమంత్రార్థస్వతంత్రమంజులబోధ
    చేత చేతనుల రక్షించినారు,
దీనావనకృపానదీనాభిధానచిం
    తామణిఖ్యాతిచే దనరినారు,
కుంభినీపరవాదికుంభినీంద్రవిభేద
    కంఠీరవప్రభ గాంచినారు,
శమదయాగుణరత్నసముదయావాప్తిని
    క్షీరాబ్ధియనఁ గీర్తిఁ జెందినారు


తే.

నయవిలక్షణసత్వవినయగరిమల
మహి మహిమగాంచి రఖిలదిఙ్మహితకీర్తి

సర్వచార్వాకముఖమతదుర్వహోగ్ర
గర్వహరులు మఱింగంటి పూర్వగురులు.

38


క.

ఆ మహనీయాన్వయజనుఁ
డై మహదంశమున భావనాచార్యుఁ డనం
గా మహిని వెలసె మత్ప్రపి
తామహుఁ డనవరతసుగుణతామహిమ నొగిన్.

39


సీ.

తనదువాక్ప్రౌఢసిద్ధాంతసూక్తులు జగ
    ద్గురునకు వజ్రపంజరము లయ్యె
తనురచించిన ప్రబంధకథాసుధానిధుల్
    దాస్యకోటికి భాగ్యధనము లయ్యె
తనుజేయు సంతతదానధారాసుధల్
    పండితాళికి మెట్టపంట లయ్యె
తనయశశ్చంద్రికాధవళరుక్తతి ధరా
    తరుణికైశికపుష్పదామ మయ్యె


గీ.

తనదు జిహ్వాంచలంబు వాగ్వనిత కెపుడు
మంగళోత్తుంగమణినృత్తరంగ మయ్యె
ననఁగ జెలువొందె విమతసంహతివిదారి
జనమనోహారి భావనాచార్యసూరి.

40


తే.

అట్టికోవిదునకు కూర్మిపట్టి యగుచుఁ
బుట్టి సిరిజట్టిగొను జగజెట్టి మహిమ
లుట్టిపడ చెట్టవిమతులబట్టి మట్టె
దిట్టయగునట్టి నరసింహదేశికుండు.

41


క.

దురితౌఘదూరితుండను
బిరుదాంకుఁడు- వాదిమతవిభేదుండగు నూ
నరసింహార్యులు సాక్షా
న్నరసింహులుగాక దలఁప నరమాత్రుండే.

42

సీ.

తగనాంధ్రసంస్కృతద్రావిడకవితాస
        మర్థుఁడై యేమహామహుఁడు జెలఁగె
శాస్త్రప్రసంగవచశ్శక్తి కుమతుల
        కే దేశికుండు హృద్భేది యయ్యె
నిష్కారణకృపాపరిష్కారహృదయుఁడై
        యేసూరిమణి చేతనేచ్ఛ దీర్చె
శ్రీసదాచార్యసేవాసక్తి సంతతం
        బేగురుం డతివీతరాగి యయ్యె


తే.

శేషభూధరవర సర్వశేషగుణ వి
శేషమహిమా ప్రవచన నిశ్శేషిత స్వ
దోషధిషణాసుసక్తసంతోష లసద
శేషగభసింధువరుఁడు నృసింహగురుఁడు.

43


క.

ఆ నయమతికిని ధరణీ
శాసయవచహితనిరూఢి నవనీస్థలి వి
జ్ఞానయశోధీన సుశో
భానవశోభితులు సుతులు ప్రబలి రిరువురున్.

44


క.

కలవేదశాస్త్రమహిమల
నిలవేదలచిలువ చెలువ మెనయుదు రన న
వ్వలవేఁ దలఁపఁగ నేటికి
నల వేంకటకృష్ణభావనార్యోత్తములన్.

45


క.

వారిరువురిలో ననుజుఁడు
వారిరుహాక్షాదరప్రవర్ధితవిద్యా
[7]చారయశస్సారవచ
స్స్ఫారదశ త్రిదశగురుఁడు భావనగురుఁడున్.

46

సీ.

శాస్త్రనిషిద్ధాన్యజనకాలకూటంబు
        కుటిలకుతర్కాళి గుండె దిగులు
విజ్ఞానశూన్యదుర్విమతాళికి నిమిత్తి
        వెక్కరులకు నుక్కుముక్కు గొయ్య
వికటమాయావాదులకు ఱొమ్ముగాలంబు
        బౌద్ధకాననబృహద్భానుమూర్తి
చార్వాకమతతమశ్ఛటభాస్కరద్యుతి
        క్రూరజైనేభకంఠీరవంబు


తే.

సకలవేదాంతశాస్త్రప్రసంగపాళి
సంభృతాఖిలసౌశీల్యసద్గుణాళి
కుటిలదుర్మదశైలేంద్రకటకపటల
చటులదంభోళి భావనాచార్యమౌళి.

47


సీ.

భాషాసతీకచభరముపై వలఁగొన్న
        తెలిపూవుదండలై తళుకుఁ దనరి
ఘనహలాయుధునీలికాశపెందట్టిపై
        శుభ్రాంశుకస్ఫూర్తి చుట్టుముట్టి
ప్రమథనాథుని కంఠభాగంబునకు గంధ
        పాటీరపంకమై ప్రభ నొసంగి
యోషధీశ్వరుని పెన్నుఱమున వన్నెల
        మగఱాలపతకమై సొగసుఁ బొలిచి


తే.

మహిని మాలిన్యగతుల నిర్మలులఁ జేసి
హారనీహారకర్పూరహీరతార
సారదక్షీరడిండీరచారుకీర్తి
నలరె మౌద్గల్యభావనాచార్యకీర్తి.

48


క.

ఆభావనగురుఁ డంబుజ
నాభావనతజనశుచిగనన్ ప్రథమశ్రీ
శోభావనధిగతిం గలు
షాభావనవీనహృదయుఁడై ధర నెగడెన్.

49

ఉ.

ధీమతి యాఘనుండు నలదీఁగెకులాబ్ధి జనించు శ్రీరమా
కామిని బోలినట్టి బుధకల్పకవల్లి, సతీమతల్లి, గం
ధామలపుష్పవల్లి, సుగుణౌఘమణుల్గల పాలవెల్లి స
త్ప్రేమను రంగనాయకిని పెండిలిగా గొనె ధర్మపత్నిగాన్.

50


తే.

తుంటవిల్తునిగను తమ్మికంటియదను
నంటియుండిన సిరివాలుగంటివలెను
గంటిలేనట్టి మా మఱింగంటివారి
యింటి మణిమయదీపంబువంటి దయ్యె.

51


తే.

వృషగిరీశుకటాక్షసమృద్ధివలన
నమ్మహాదంపతీవరుల్ మమ్ము గనిరి
యిరువులు తనూజులను మాననీయకీర్తి
గలిగే తద్గౌరవప్రౌఢికతన మాకు.

52


క.

శ్రీమద్వేంకటరాఘవ
ధీమణియే మదగ్రజుఁడు తదీయఘనకృపా
స్తోమముచే నేమముచే
క్షేమముచే మనితి నారసింహార్యుఁ డనన్.

53


తే.

గురుతమోహారి సంతతకువలయాప్తుఁ
డురుకళానిధి సత్సంగతోత్సవుండు
విష్ణుపదసక్తకరుఁడు కవిప్రియుండు
వసుధ మాయన్న మాయన్నవంటివాఁడు.

54


సీ.

గురునియామకము జేకొని ధర్మదీక్షచే
        నారామపదమునం దధివసించె
దానవారిప్రభాతతి దిగ్భరణఁ జేసి
        శంకరధర్మశాసనత మించె

కడుజడధిక్రోధగర్వం బపనయించి
        మిత్రజాతస్నేహపాత్రతఁ గొనె
షడ్గుణఫలరసాస్వాదనామోదియై
        యంగదాదిబహూకృతిం గ్రహించె


తే.

వాదకోవిద దుష్ప్రతివాదిపంక్తి
ముఖవిభంగయశఃప్రాప్తి ముదితుఁ డయ్యె
చిత్రకావ్యుండు మౌద్గల్యగోత్రజుండు
రాఘవార్యుండు రెండవరాఘవుండు.

55


చ.

సరసగుణాకరుం, దఖిలశాస్త్రవివేది, మనోజసుందరుం,
డురుకరుణాకరుండు, వినయోజ్జ్వలశీలుఁ, డఖండకీర్తిసం
భరితుఁడు, రంగనాయకితపఃఫలమూర్తి మదగ్రజుండు నా
గరికత కంటిఱెప్పవలె గాఁచిన వేంకటనారసింహుఁడన్.

56


సీ.

నిరతాఖిలావనీభరితాఖ్యచే శేష
        శైలవిఖ్యాతి నిశ్చయము గాదె
చేతనాఘవ్రాతఘాతనాధికవృత్తి
        ధర్మాద్రి యనుట వాస్తవము గాదె.
లోకావనాపాంగలోకనాఢ్యుని మ్రోయ
        గరుడాద్రి యనుట సార్థకము గాదె
ఘనముక్తులకు మోక్షధనము కన్నులఁ జూప
        నంజనగిరి తథ్యమయ్యె గాదె


తే.

యట్టి వృషగిరికటకమహాగుహాంత
రాళమణిమయసౌధాంతరస్థుఁడైన
వేంకటేశ్వరునకు వేనవే లొనర్తు
కలితభక్తిపునర్నమస్కారవిధులు.

57

షష్ఠ్యంతములు

క.

ఈదృశమహిమాతిశయ గు
ణాదియశశ్శరధి కహికులాంతకరథికిన్
వేదపదామోదపదా
పాదకదామోదరునకు భవహరణునకున్.

58


క.

అంగీకృతరంగద్రణ
రంగజయరథాంగునకు విరాజత్కరుణా
పాంగతరంగసుసంగ(త)
శృంగారదృగంగణునకు శ్రీరమణునకున్.

59


క.

హతదోషున కపరిమిత
ద్యుతిపూషున కమృతరసమధురభాషునకున్
మితరహితాహితజనతా
కృతినిహతామోఘబలసుఖితవేషునకున్.

60


క.

చిత్రసుచరిత్రునకు తా
పత్రయతరుదాత్రునకు శుభక్రమణకృపా
పాత్రపవిత్ర జగత్త్రిత
యత్రాతకు గురుగుణత్రయాతీకునతున్.

61


క.

పాధోధిజాపయోధర
భూధరతటనటదనల్పభువనధరునకున్
[8]వేధోదితయూథాగమ
గాధాసమవిలసదర్థకలితస్తుతికిన్.

62

క.

తృటితసముత్కటవిద్వి
ట్పటలికి పటుహాటకమయపటికసమమహా
కిటికి రమానికటికి వేం
కటమహిభృత్కిటికి పాణిఘటితసుకటికిన్.

63


వ.

సంతతనితాంత కల్యాణపరంపరాక్రాంత దిగంతవిశ్రాంతం బగునటుల నే రచియింపబూనిన తాలాంకనందినీపరిణయం బను శృంగారప్రధానప్రబంధంబునకు కథాసూత్రప్రారంభప్రకారం [9]బెట్టిదనిన-

64


కథాప్రారంభము

క.

జనమేజయనరపతి భూ
జనమే జయజయకరప్రశస్థితి బొగడం
గ నమేయదయాకీర్తుల
గన మేయెడ నితని కెనయగా నన నెగడెన్.

65


చ.

అతఁ డతులప్రభావమహిమాప్తిని సాత్యవతేయవాగుదీ
రితనిఖిలాగమాంత[10]సపరిష్కృతమైన పురాణకోటి సం
తతము తదీయశిష్యులు యథావిధిగా వినిపింప విన్చు సు
స్థిత నతినీతిసంయుతమతిన్ నుతికెక్కె కుతూహలోన్నతిన్.

66


క.

ఆ యనఘుఁడు కృష్ణద్వై
పాయనమునివలన బొడము భారత మమృతో
పాయనముగ విని వైశం
పాయనజైమినిసుమంతపైలులవలనన్.

67

క.

వారలనలువురిలోన న
పారదయాశీలు దుష్టభవనిర్మూలున్,
శౌరిపదభక్తలోలు
న్నీరదవాగ్జాలు పైలునిం గని బల్కెన్.

68


క.

సారతరనిగమబోధిత
భారతములు వేరువేరు బలుకుటచే వి
స్తారతమిఁ దొలఁగె కుతుక మ
నారతము న్గలిగె మీదు నలుగురివలనన్.

69


చ.

అందు భవన్ముఖోదితమునై గనుపట్టు మహాపురాణమున్
కొందఱు ధర్మశాస్త్రమని కొందఱు తాత్త్వికసంగ్రహంబు నా
గొందఱు నేతిహాసమని కొంద అనాదిపురాణమం చనిన్
గొందఱు వేదగూఢ మనుకొందురు భారత మానుపూర్విగన్.

70


మ.

విమలజ్ఞానము మూలకందము లసద్వేదాంతము ల్శాఖ లా
గమగాథల్ మృదుపల్లవంబులును యోగన్యాసమే పుష్పసం
ఘములున్ గేశవభక్తియే సుమపరాగంబున్ మహాయోగిభృం
గములున్ వ్యాసవచో౽మృతాభ్యుదయమై కల్పద్రుమం బట్ల ను
త్రమధర్మంబులు నిల్వనీడయగు నేతద్భారతామ్నాయమున్.

71


క.

అటుగాన మీర లిటు మా
రట సాత్యవతేయువలె పురాణముఖ నట
త్తటినీతటనటదూర్మీ
పటలప్రకటతరఘటన బలికితిరిగదా!

72


క.

అం దందము తాలధ్వజ
నందిని శశిరేఖ నందనందనభగినీ
నందనుఁడు పెండ్లియాడె న
నందనరిక గాథ మఱి వినం దనరె మదిన్.

73

క.

మును పది సంక్షేపముగా
వినిపించితి తత్కథన్[11] సవిస్తారముగా
మనమలరఁ దెలుపు మృదులవ
చనముల సుధ లొలుక మౌనిజనకులతిలకా.

74


చ.

అన విని పైలుఁ డిట్లను నృపాగ్రణితో నభిమన్యురేవతీ
తనయవివాహసత్కథ యథావిధిగా వినఁగోరి తీవు పా
వనుఁడు పరాశరాత్మజునివల్లను నాకు లభించినట్లు బో
ధనపడగా వచింతు ప్రమదస్థిరబుద్ధిని యాలకింపవే!

75


ద్వారకానగరవర్ణన

మ.

కల దభ్రంకషసౌధయూథవిహర త్కాంతాజనాలోకితో
జ్జ్వలగంగాతటినీతరంగచయచంపడ్డోలికామాలికా
కలనక్రీడిత రాజహంసమిథునాక్రాంతఁబునా ద్వారకా
విలసన్నామకరాజధాని యలరున్ విశ్రాంతసంపధ్గతిన్.

76


క.

ద్వారకవాటము కనక
ద్వారకవాటాభిశోభితస్ఫూర్తిసురు
ద్వారకనత్సౌధమహ
ద్వారకమై యొప్పె లవణవార్నిధినడుమన్.

77


ఉ.

ఆ పుటభేదనావరణ మభ్రతలోన్నతిగాగఁ దూఁగి యా
గోపురసాలముం గెలిచి గొబ్బున తజ్జయలక్ష్మి పెండ్లికై
ప్రాపుకుబోవ నొంటి ద్విజరాజశతంబును దుర్నిమిత్తము
ల్దా పొడగాంచి యవ్వలకుఁ దాటఁగ నిల్చినరీతి భాసిలెన్.

78


చ.

తిరముగ కోటకొమ్మలను దీర్చిన సద్గరుడోపలంబుల
న్నొరసి భుజంగరజ్జువులు స్రుక్క చికాకున నొంటి [12]కంటి తే

నొరిగి యహస్కరుండు భయమొందుట గాంచి విధాత మాస మొ
క్కరొకరివంతుఁ జేసే నదికారణమే పదిరెండ్లు భాస్కరుల్.

79


ఉ.

బాపురె! యర్ధచంద్రుఁ డొకబాసికమై చెలువొంద దేవతా
ద్వీపవతీసువర్ణమణిదీపితకంకణమై దనర్చ తా
రాపటలంబు సేసతలఁబ్రాలుగ తత్పురరత్నసాలమా
గోపురలక్ష్మిఁ బెండ్లిగొనె గొబ్బున ప్రాప్తసువర్ణసంగతిన్.

80


ఉ.

బంగరుకోటపళ్ళెర, ముపస్థితశాఖలు దీపముల్, తదు
త్తుంగబలాహకప్రతతిధూమము లట్లు వెలుంగ, ద్వారకా
భంగురలక్ష్మి విష్ణుపదభక్తి నొసంగెడు మంగళార్తి నా
రంగు బొసంగె, మంగళతరంగవిశాలము దీర్ఘసాలమున్.

81


మ.

పరిఖానీరమునం జనించు విలసత్పంకేజనాళంటు లా
వరణావాలమువెంట డిగ్గి భుజగావాసంబునన్ వ్రేల న
య్యురగస్త్రీతతి డోలికోత్సవములం దుయ్యాలజంపాల యం
చు రహిం దూఁగుదు రాసుగంధజనితాస్తోకానిలాభ్రాంతలై.

82


చ.

బలిసదనాపగాంతఋషపంక్తులు ఖేయజలంబు జొచ్చి యు
జ్జ్వలమగు కోటకొమ్మలవిశాలవిధూపలరాజి నిండువె
న్నెలల గరంగుధారలను నింగికి దా మెదురెక్క ఖస్థలిం
గలిగెను మీనరాశిపరిఖావరణంబుల నిమ్నతోన్నతిన్.

83


మ.

వియదాదర్శనమందుఁ దత్పురము బింబింపంగ దానిన్ సురా
లయమున్గా నటమానవుల్ సురవరుల్గా, నందు రాజున్ శచీ
ప్రియునింగా గురుతు ల్గణింతురు నభోవీధి న్నిరాలంబన
క్రియగా స్వర్గ మటంచు బల్కుట పుళక్కింగాక తథ్యంబులే.

84


మ.

మును శ్రీకృష్ణుఁడు దేవకీరమణికిన్ ముల్లోకసంపత్తు లా
ననసీమం బొడసూపుటల్ పరులుగానన్ లేమి కిన్నేడు భూ

జను లెల్లం గన పట్టణాకృతిని స్వేచ్ఛ న్నిల్పి తావిప్పుమో
మన వప్రంబు దగెన్ సమస్తజనమోహద్రవ్యము ల్లోగొనన్.

85


చ.

ఇఁక నొక రక్షకుల్ మనల కెవ్వరు లేమిని రాజతాచలం
బొకఁడును పెల్లగించె, మఱియొక్కఁడు మేరువు నొంచె, వింధ్య నిం
కొకఁ డఱికాల రాచె,మఱియొక్కఁడు క్రౌంచ మణంచె నంచు ద్వా
రక హరిచాటుగాంచు కుధరంబు లనం దగె రత్నసౌధముల్.

86


చ.

పురిపరిఖాయితాంబునిధిపుష్కలపుష్కర మెల్లఁ బిల్చి గో
పురతటినిం బడంగ పటుఫూత్కృతులన్ వడి జిమ్మి తద్ధునీ
శరముల బీల్చి యంబునిధి జల్లి వధూవరసంగమంబు ని
వ్వరుస నొనర్చి యప్పురి నవారణవారణరాజి రాజిలున్.

87


సీ.

అభ్రదంతిని ఢికేల్మని తాక బిల్చెడి
        కరణి తుండంబు లాకసము కెత్తు
కుంభజాకృష్ణమహాంభోధి నిదె నింపు
        ననుమాడ్కి మదధార నినుమడించు
నిలమ్రోయ నేనొక్కటే చాలు కమఠాహి
        కరులేల నని ధూళి శిరము దాల్చు
నఖిలదిక్తతి నాలుగంగలలోఁ జూచి
        వత్తు నం చనుమాడ్కి తత్తరించు


తే.

హిండదద్భుతతుండవచ్ఛౌండదాన
మండితస్ఫూర్తి నప్పురినుండు మెండు
చందభండనరిపుకాండ భండనోగ్ర
తాండవోద్దండనటులు వేదండఘటలు.

88


చ.

దురమున శాత్రవప్రతతి దోడ్పడకున్న మదారురోహకుల్
శరముల నేయ మజ్జవనచాతురికాశరపంక్తి రౌతు వె
న్నొరయక యున్నె యీ యపజయోక్తికి నెట్లు సహింతు మంచు దు
ర్భరత హయంబులున్ ఖరఖురంబుల ఠావులు గొట్టి భూస్థలిన్.

89

క.

ధారలఁ దగి సకలాలం
కారంబులు, వడియు కందగతిలక్షణ వి
స్తారంబగు హయములు శృం
గారకవిప్రోక్తమైన కావ్యముఁ బోలెన్.

90


క.

తా నుచ్చైఃశ్రవ మట తన
పై నొక వృద్ధశ్రవుండు బలురౌతట మి
న్నానె నని వేల్పుతేజిన్
ధీనిధిని హసించు [13]హీంకృతిన్ బురి హయముల్.

91


చ.

తమ పదవేగమున్గొనిన తార్క్ష్యుపదాహతిలో నణంగు నా
గములకు భీతి జెందు నునుగాడ్పులకున్ బురివిచ్చి కూలు సూ
నముల శరంబులన్ మరుఁ డణంచఁగ భీతివహించునట్టి చి
త్తముల నధఃకరించి త్వరితంబున మించి గమించు ఘోటముల్.

92


మ.

ఘనచక్రప్రభచే సువర్ణరుచు లాకాశస్థలిన్ నిండ చై
త్రనవస్ఫూర్తి నవక్రగామితము నుద్యత్పద్మరాగప్రభా
జనకంబై శరవర్షనాస్పదముగా ఛాయామనోహారమై
కనులు జూడఁగ భానుమండల మనంగా నొప్పె తేరు ల్పురిన్.

93


చ.

హరికులిశాతిభీతిని మహార్థిని డాగిన శైలజాల మీ
హరిపురిలో నుపేంద్రుని సహాయబలంబున క్రొవ్వి యాపురం
దరుని వివాదుకుం బిలుచుదారి నవాతవిఘాతకేతనాం
బరపరహస్తసంజ్ఞల నభంబునకానె రథంబు లాపురిన్.

94


ఉ.

కేసరిమీసము ల్సటలు గీల్చి మరల్చి పెగల్చి మేటియ
బ్బాసికరాసిదూసి శరభమ్ముల ఱొమ్ముల నెమ్ము లూడ్చి య
త్రాసత బెబ్బులిం దఱిమి ధట్టియు నెట్టియు కట్టి వ్రేతు రా
సీసపుగుండ్లపోలికను చిక్కటిమిక్కటియెక్కటు ల్పురిన్.

95

మ.

ఒకటిన్ రెంటిని బైటిపల్లియల నెంతో పోరి గెల్పొందె, యం
ధకునిం ద్రుంచెను, బొడ్డుబిడ్డపునుకం దట్టించె,పూఁగోల బా
లకునిన్ భస్మ మొనర్చె, నమ్మొగముకేల్వాని న్వడిన్ గెల్చె, వాఁ
డొక నక్షత్రవరావతంసుఁ డిక మాయుద్దే యనున్ సైన్యముల్.

96


సీ.

తనయాలు సాధ్విని తలవాకిటనె యుంచె
        నాభిజాతుండైన నలినభవుఁడు
శ్రుతిహీనుఁడై వక్రగతి మెలంగె సహస్ర
        ముఖుఁడైన భుజఁగసముదయవిభుఁడు
సత్రభుగ్వృత్తిచే సర్వభక్షకుఁ డయ్యె
        పటుజాతవేదియౌ పావకుండు
కువలయద్వేషియై రవిపద్మినీప్రీతి
        సలుపఁడే పుష్పిణీసంగమంబు


తే.

వలచి విధిశేషుక్రపూషులను దెగడు
విలసదభిజనసుపథసద్వృత్తినిరత
బ్రహ్మచర్యవ్రతాది సంపత్కళాప్ర
దీప్రసుకరులు నప్పురి విప్రవరులు.

97


మ.

చిరకావ్యప్రియసద్బుధుల్, విషమదృష్టిత్యక్తసర్వజ్ఞులున్,
వరసత్సంగతసూరివర్యులు, గురుప్రాప్తానుకంపాకళా
ధరులాత్తశ్రుతిభోగులై వివిధవిద్యాదక్షతన్ ధారుణీ
సురు లప్పట్టణమందు బ్రహ్మవిదులై స్ఫూర్తి న్విడంబించరే!

98


సీ.

మరుదధీశుండనేమాత్రమే పాకారి
        హవ్యవాహుఁడు సంతతాశ్రయాశి
యా శమనుండు ప్రేతేశుఁడే నూహింప
        కర్బురుం డూనాంబకప్రియుండు
దీప్రక్రారోహుఁ డప్ప్రభుండు దలంప
        ఘననాగభుగ్నుండు గంధవహుఁడు

భావింపఁగా నగైకావాసి ధనదుండు
        గౌరీమనోహారి ఖండపరశుఁ


తే.

డని యనూనబలస్ఫూర్తి నెనసి రచట
భండనోద్దండవైరిప్రకాండకాండ
ఖండనాఖండసత్కీర్తిహిండమాన
చండకోదండధరులు రాజన్యవరులు.

99


చ.

జనకుని భంగపెట్టి గురుశాపవిరోధము జెంది యాత్మమి
త్రుని సిరిగాంచి కుందుచు ప్రదోషమునంటి మయిం గలంకతన్
గని నిరతంబు సారసవనప్రతికూలత నొంది రాజుపే
రను జెలువొందె నౌర యని రాజిలు రాజులు రాజమాత్రులే.

100


చ.

నవనిధు లింటగల్గు ధననాయకునిన్ శివభక్తుఁ డన్నచో
భవుఁడు దిగంబరంబున కపాలము చేఁగొని భైక్ష్యవృత్తికిన్
దవిలిన రాజరా జనుప్రథన్ గుడపర్వతరీతి గాంచె నం
చవిరతి గేలిసల్పుదు రహర్నిశ మప్పురి వైశ్యనాయకుల్.

101


సీ.

తాను శ్రీనాథుఁడై తగు నిల్లు మంచంబు
        గానక పాలేటిగడ్డ నిలిచె
పోలింపఁగ మహావిభూతివంతుం డౌచు
        నేకాలమును భిక్షమెత్తి బ్రతికె
వితతధనాధిపత్యత వహించి పిశాచ
        సఖుని పంచ వసించె సంతతంబు
సిరిని తాఁగని యప్పుచే మునింగియు రాల
        కట్ట మ్రోయుచు నరికట్టఁబడియె


గీ.

ననుచు వికృతోక్తి లీలాప్రహాసములను
కేశవేశధనేశధునీశవరులఁ
గేలిసల్పుదు రఖిలాశ్రితాళికల్ప
వాటి యవ్వీటి మేటి కిరాటకోటి.

102

ఉ.

పండినధాన్యరాసులు నభం బొరయంగను, పైన జాళువా
పిండిని వ్రేయుముద్రలను విష్ణుపదీజల మంట పంకమై
మెండుగ తత్సరోజములమీఁదుగ బారిన పైడితమ్ములై
యుండెను పాదజుల్ భగిని కున్నతిబంగ రొసంగరే భువిన్.

103


ఉ.

చాలిన పంటచే నొరుగు సస్యములన్ గననయ్యె నెట్లనన్
హాలికవృత్తి మమ్ము గనినట్టి మహిన్ ఖననం బొనర్చు శూ
ద్రాళి మదర్థమేకద యటంచు తదంతరకైరవాక్షులం
జాలు మరందబాష్పములు జారఁగ మూర్చిలువ్రాలు పోలికన్.

104


సీ.

కైదండఁగొనగోర్కెగలిగిన జేకొమ్ము
        పైకమ్ము చేనుంచి పలుకవలదె
పాటించె దిచ్చనుబంతు లిష్టంబె నీ
        వీబంధనపుమాట లింక విడువు
మఱినేమి శయ్యపైమాట లోకొనెదొ చే
        తోజాతకార్యమే తుది లభించు
మరుమాటలాడక ధర బొందుటెట్లు నేఁ
        డిక ప్రొద్దుబోయె నింకేటిజాగు


గీ.

నమ్మికల గొట్టిజూచుట నయముగాదు
మంచితావులగోరంట మనసుగలిగె
ననుచు నునుజూడ్కులను మరుల్గొనుచు, కోడె
దొరల కిత్తురు చిత్రవైఖరుల విరుల.

105


సీ.

వేమారు బ్రీతిమై వెలగఁ జేకొననిమ్ము
        తెలవాఱినందాక ఫలము గొనుము
పృథులకుచములు గప్పిన హేతు వేమి? వా
        టిని జూడవలెనె వాడినవి గావు
తూఁగి నీ వాతెఱలోగల ఫల మిమ్ము
        బలుకాటు ధరకొంట భరము గాదె

పడతి నీ సహకారఫలము చేకురు టెట్లు
        మనసుగోరిన బండుగొనుటె సుఖము


గీ.

పొందుగా నిమ్ము బైకోర్కె లొందె తరుణి
కొను మనంగ సుఖాప్తి చేకొన వటంచు
మదనకదనానుమోదసంపదలఁ బొదల
ముదిత లెప్పాట ఫలము లమ్ముదురు వీఁట.

106


చ.

పురవరసౌధవీథుల నవోఢలు [14]వామనగుంటలాఁడు న
త్తఱి చెయి జింది భూనిపతితంబగు రత్నములెల్ల పౌరు లే
ర్పరపక ద్రొక్కఁగా ధరణి పాదుకొనన్ వసుధావధూటిని
న్వరుసను రత్నగర్భయని వాడిరి లోకములోన పండితుల్.

107


చ.

పటుతరకంకణప్రకటభవ్యనినాదమునన్ మహోర్మికా
పటలవిరాజమున్ విధృతసురపుష్కరవిభ్రమంబు ను
త్కటతరమంజుకోకనదకాంతివిశేషసముజ్జ్వలంబుగా
నట కమలాకరంబులగ్రియం గమలాకరముల్ జెలంగెడిన్.

108


సీ.

హల్లకప్రసవసంఫుల్లసన్మల్లికా
        వల్లికాతల్లజవేల్లితములు
నిందీవరాచ్ఛమరందానుభవసన్మి
        ళిందబృందానందకందళములు
బిసకాండమండలగ్రసనమత్తమరాళ
        రాజపక్షానిలభ్రాజితములు
నంభశ్చరన్మీనశుంభన్మహావాల
        సంభూతజలబిందుజృంభణములు


తే.

లలితకందర్పకేళీవిలాసకుతుక
పరవశభ్రాంతచక్రదంపతి విలాస

సత్కుశేశయరమ్యమౌ సరసిజాక
గమ్ములు తిరమ్ముగలుగు పురమ్ములోన.

109


చ.

లలనలు మేఘరంజ ననులాపనజేయఁ బయోదపంక్తిని
న్వెలువడి ముత్తియమ్ము లురువృష్టి ధరం బడి తత్సుగీతవా
క్కలనగరంగి యాచెఱుకుకాల్వల కెక్కిన తొంటిరూపులన్
మొలుచుటగాక తుంటలను ముత్తియముల్ జనియింప నేటికిన్.

110


సీ.

తనతురంగం బున్న తావిదే యనుచునో
        ముగుదలముఖబింబములను వెదకి
తనహయం బాశ చే జను మృగతృష్ణయో
        యని సతీనఖముఖఘృణుల నెమకి
తనను పైమ్రోయువాహన మిదే యనియునో
        లలనల నేత్రాంచలముల నరసి
తనహయమదసుగంధవ్యాప్తి యనుచునో
        సుదతుల చనుఁగవల్ [15]జొచ్చి చూచి


గీ.

పుడమి నెల్లను తనదు తత్తడిని గనక
బడలువడ దీరువెనుక నల్గడలు నెమక
గోరి యుపవనముల సేవదీర మెల్ల
మెల్లన జరించుచుండు సమీరణుండు.

111


చ.

విరులఁ దొఱంగు పుప్పొడిని వెన్నెలకుప్పల నాడి పువ్వుదే
నెరసపుచెమ్మట ల్గురియ నేర్పలరం 'జెడుగుళ్ళ' నాడి క్రొ
మ్మెఱుఁగుల చించు ఱాచలువమేడల 'జీకురుబండ' లాడి క
ప్పురఁపు టనంటి గుంపులను బూచుల 'దాగిలిమూత' లాడి వే
సరి కడుడస్సి దూబటిలి సారసనేత్రల చన్నుదోయి క
ప్పురముల చల్వ చెమ్మటలఁజెంది జెలంగు మరుత్కిశోరముల్.

112

సీ.

శ్రీగంధవనలసత్సౌగంధ్యసుమనఃప
        రాగాంధకారభారమున బొరలి
గంధసింధురగానగంధబంధురితపు
        ష్పంధయోభయపత్రసంధి వెడలి
సంతతాసూనవాసంతికాంతలతాంత
        తాంతవిశ్రాంతిచే సంతసించి
సారకాసారవిస్ఫారసారస్వత
        చారుసౌరభపూర మారగించి


తే.

యంగనాలింగనానంగసంగరప్ర
సంగసంగతఘర్మానుషంగసురభి
తాంగుఁ డౌచుఁ జరించు పురాంగనాభి
రంజనుండైన మలయప్రభంజనుండు.

113


మ.

పురసౌధాగ్రములందు ముగ్ధయువతుల్ పుంభావకేళీరతీ
పరిరంభత్వరహారము ల్దెగినచో పయ్యంట సారింపఁగా
పరుసం జారిన మౌక్తికంబు లని విభ్రాంతాత్మలై దోయిటన్
బరఁగం దారల నెత్తఁజూతురు దమున్ బ్రౌఢాంగనల్ నవ్వఁగన్.

114


చ.

అతివలు సౌధవీథుల విహారము చేయుచుఁ దత్సమీపసం
గతసుమనోసరిత్కనకకంజము లాత్మసుసౌరభాపహ
స్థితిఁ గను చోరులంచు నతిశీఘ్రగతిం దమదీర్ఘకేశపా
శతతిని గట్టివైతు రళిఝంకృతుల న్మొరబెట్ట బెట్టుగన్.

115


చ.

సరసులయందు కోకనదసంఘములున్ విలసిల్లు తత్పురీ
తరుణులనేత్రసంపద కధఃకృతమై కమమూయక న్మహా
వెరపుననున్న మత్స్యముల వేకరుణింపఁగ తామ్రపత్రికల్
బరువడి శాసనంబులుగ బంపినకై డి యొప్పె మెప్పుగన్.

116


చ.

ఉపవనసంచర న్నృపవయోవనితాధరపాణిచారు కాం
తిపటలబింబపల్లవసుధీసముపాగతకీరకోకిల

స్వపటుపతత్రివాతపరిచర్చితపుష్పరజంబు నొప్పె న
య్యుపవనలక్ష్మి విష్ణుపదినుంచిన యప్పటవాసమో యనన్.

117


సీ.

గబ్బిసిబ్బెపుగుబ్బకవబంగరఁపుగిండ్లు
        తరుణబాహుద్యుతుల్ తమ్మితూండ్లు
భువనమోహనమైన బొమలు సింగిణివిండ్లు
        తెలికనుంగవలు శ్రీదేవియిండ్లు
ఘనకటిద్వయము చొక్కఁపుజాలువా బండ్లు
        తులలేని యధరముల్ దొండపండ్లు
తనుదీప్తి మీనకేతనుని పువ్వులచెండ్లు
        వలచి దావలపించు తలిరుబోండ్లు


గీ.

దొరల గిడిగిండ్లు మేడ లబ్బురపుటిండ్లు
యిండ్లమద్దెండ్లు బలువిటకాండ్ల దండ్లు
కండ్లపండువుగల వెలయాండ్లపిండ్లు
వేడ్క విహరించుచుందు రవ్వీటియందు.

118


సీ.

తమచంచలతలు నేత్రములను సంధించి
        సతులైన ఘనతటిల్లతిక లొక్కొ
తమకఠినతలు సుస్తనములందున మాటి
        తరుణలౌ వజ్రపుత్తలిక లొక్కొ
తమవక్రతలు కుంతలములలోపల డాపి
        కాంతలౌ శశిమయూఖంబు లొక్కొ
తమపాండుకతలు హాసములలో దవిలించి
        గరితలౌ తారకాగణములొక్కొ


గీ.

సకలలోకైకవంచనాధికతపఃప్ర
భావభావభవప్రభాప్రభవసిద్ధి
యోగధేయులు పల్లవభాగధేయు
లైన వేశ్యాంగనలు గల రతులగతుల.

119

వ.

ఇప్పగిది నొప్పులకుప్ప యగుచు నొప్పు నప్పురంబు చొప్పుఁ జెప్పనొప్పని మెప్పుగను కప్పురంపు పుప్పొడులకుప్పలం దొప్పు గొప్పయుప్పరిగలకప్పుఱాతిప్పలందొప్పు కప్పురగంధుల కప్పుకొప్పులం జొప్పడు కమ్మవిరిపుప్పొడులు గుప్పుగుప్పునం దెప్పదేలి, యమందకుందమందారనిష్యందమరందబిందుబృందమ్ముల నందంద నానందంబులం బొంది, మందమందగమనంబునం బొలయు ముమ్మరంపు కమ్మతెమ్మెరలతుటమ్ము లిమ్ముగా నభ్రంకషశుభ్రమణిగణకిరణస్ఫురణభర్మహర్మ్యభాగవినిర్మలసముల్లసన్నపనవరత్నసంఘటితవాతాయనజాతంబుల వలసం జొచ్చి, ప్రవీణవైణికావీణానూనతానగానమ్ము లనవద్యహృద్యపద్యాదివాద్యవైశద్యాలాపంబులు కర్ణకలాపంబులుగా నుచ్చస్థానంబుల మూర్ఛశయ్యా మిత్రవర్ణ భేదచాతురీరీతులసుధారసధారాప్రధానమాధురీకౌశలపేశలంబు లంగరపు తదవరోధవధూగాత్రఘర్మబిందుసందోహపరిశ్రాంతి నొందించు సుందరీబృందకరారవిందకలితకంకణకింకిణీమంజుశింజారవంబులు విషమాపాయతాళమానంబులుగా చివ్వుచివ్వునన్ విసరు పువ్వుసురటీల మవ్వంపుపిల్లవాయువులం గలసి మెలసెడి చిత్రంబుల వశీకృతగాత్రలై యవలోకించు సురసుందరీసందోహంబులం దనరు సాలభంజికాపుంజరంజితపద్మరాగాధరవిలోకనబింబఫలభ్రాంతంబులై బాలరసాలఫలజాలంబులం బాసి గమకించి నిశితనాసాపుటంబులం బొడచి, చిత్తంబుల నిరాశాయత్తంబులై శుకపికారావంబులం బ్రకటించుచు సౌధవీథికాగారబహిర్ధ్వారాంగణవలమానమంగళతోరణప్రాయంబులై శ్రేణీరూపంబులం బొలయు శుకనికరపక్షవిక్షేపణా౽క్షీణవాతజాతవిధూతసుమరజోపటలపయోధర భ్రాంత తాండవకేళీవిలోలపురకామినీపరిపాలితకేకినికాయవిలసిత చంద్రకాంత-మణిస్తంభసంభరిత శుంభచ్ఛాత కుంభ కుంభవిజృంభమాణమంటపప్రాకార గోపుర విటంక విరాజిత ప్రతిగృహప్రాంగణంబునై వనుదేవనందనావాసంబు గావున సాక్షాత్ త్రివిష్టపంబును కృష్ణవర్త్మపవిత్రంబు గావున రెండవవైశ్వానరపుటభేదనంబును హరికుమారసంచారంబు గావున నభినవవరుణనివాసంబును - మహాబలసంవృతంబు గావునఁ బ్రతిభటవాయునగరంబును, ముకుందశంకమకరాంకకలితంబు గావునఁ బ్రతియలకాపురంబును, నిరంతరార్యానుషంగంబు గావున నపూర్వకైలాసంబును, దానవారియుక్తంబు గావునఁ బ్రశస్తవైరోచనీహస్తంబునై యుండె. వెండియు.

20

ఉ.

ఆ నగరంబులో కనకహర్మ్యములం గల బాలికల్ సుధా
భానునితో స్వకీయముఖపంకజవైరము నెంచి ధీయటం
చానఁగ దాకినన్ నొసటియచ్చపుకస్తురిబొట్టు నంటఁగా
దాన కళంకి యౌటయెగదా! మఱి గానము వేరె హేతువున్.

121


లయగ్రాహి.

తుంగములు వైరిజనభంగములు విజయరణ
        రంగములు మత్తమాతంగములు, శుంభ
త్స్వాంగములు నిర్జితకురంగములు, చిత్రగతి
        చంగములు పారసితురంగములు, నుద్య
చ్ఛంగములు సంగరాభంగములు రుగ్జితప
        తంగములు కాంచనశతాంగములతో పౌ
రాంగణ మభంగురజయంగతసుసంగతి బొ
        సంగె నతిమంగళతరంగము లొసంగన్.

122


మ.

వరగంధర్వచయంబు పుణ్యజనసద్వాసంబు లుద్యద్ద్విజో
త్కరగేహంబులు- కాంచనద్రుమములున్ గన్పట్టు నవ్వీట నే
వరగంధర్వచయంబు పుణ్యజనసద్వాసంబు లుద్యద్ధ్విజో
త్కరగేహంబులు కాంచనద్రుమములున్ గన్పట్ట నవ్వీటనే.

123


సీ.

మండితతారకామండలంబును బోలె
        కవిబుధద్విజరాజకలిత మగుచు
చారుమహామేరుశైలరాజముఁ బోలె
        సర్వజ్ఞు ధర్మప్రశస్త మగుచు
రామణీయకతుషారగిరీంద్రమును బోలె
        వరసర్వమంగళావాస మగుచు
బంధురస్ఫురితకిష్కింధాపురము బోలె
        నుత్తాలతాలసంవృత్త మగుచు


తే.

కమ్రతరమగు స్వర్గలోకంబుఁ బోలె
లలిసదానందనందనోల్లాస మగుచు

సరసకాసారమునుబోలె పరమహంస
మోదనంబగు నప్పుటభేదనంబు.

124


సీ.

అనృతు లనాచారు లజ్ఞు లకృత్యకు
        లనభిజ్ఞు లకృతజ్ఞు లనభిజాత్యు
లనభిమాను లదాను లల్పాయు లవగుణు
        లవిలక్షణు లభాగ్యు లవికృతఘ్ను
లన్యాభీషు లమాన్యు లనారోగ్యు
        లల్పు లనధ్యాయు లనుపకారు
లప్రమాణపాత్రు లతిదూష్యు లపరాధు
        లశుభు లనాకారు లప్రశస్తు


గీ.

లనతిథిప్రియు లతిచోరు లచట లేక
మిగుల నొగలను సగలను వగల యెగల
కుందుదు రఖండసంపద ల్నిండి యఖిల
తేజములఁ బూని ద్వారకారాజధాని.

125


సీ.

అజ్ఞానమెల్ల సుప్తావస్థలందునే
        చాపల్య మింతులచక్షువులనె
పక్షపాతము ఖగప్రతతులయందునే
        వక్రప్రవృత్తి భ్రూవల్లికలనె
యతిజాడ్యతలు సతీగతిచమత్కృతులనే
        బహుదరిద్రత మధ్యభాగములనె
వితతమూర్ఛలు గానవిద్యలయందునే
        నయనబాష్పంబు లానందములనె


తే.

పీడతాడన లారతిక్రీడలందె
గాని గానఁగలేని యనూనమైన
సిరుల బొరలుచు నఖిలధిగ్వరులుఁ బొగడఁ
గరము తిరమయ్యె ద్వారకాపురము గరిమ.

126

మ.

నగరిన్ సౌధశిఖాగ్రకర్షణత మేనం గప్పు నొప్పంగ నా
ఖగజైవాతృకబింబయుగ్మముల రాకన్నె ల్విలోకించి మి
త్రగతి గుంకుమ నింపఁగా నరుణుఁడై రాణించెనేగాక నీ
మృగధారింబలెనే దివాకరునకున్ మేన్కందు బాటిల్లదే.

126


క.

తత్పుటభేదన మాసుర
హృత్పుటభేదనుఁడు జగదధీశుఁడు గుణసం
పత్పటలుం డాఖండల
జిత్పటరథుఁ డేలుచుండు శ్రీకృష్ణుఁ డనన్.

127


క.

ఈ త్రిభువనజనముల కతఁ
డే త్రాతయు నేత యభవుఁ డీశుఁ డనఘుం డా
చిత్రచరిత్రులు దశశత
నేత్రుం డణుమాత్రమైన నేర్చునె తెలియన్.

128


శా.

శ్వేతద్వీపమున న్వికుంఠనగరిన్ శేషాహితల్పంబునన్
చేతఃప్రీతి నజాదులుం గొలువ లక్ష్మీభూమినీళ ల్పదా
బ్జాతద్వంద్వసపర్యఁ జేయ సుఖుఁడౌ సాక్షాత్పరబ్రహ్మ మీ
రీతిం ద్వారకలో వినోదగతి వర్తించెన్ సుఖేచ్ఛారతిన్.

129


మ.

అరిదిం జూడఁగ చిత్రకూటరుచి రామాహ్లాదమౌ నీపురం
బరిదిం జూడఁగ చిత్రకూటరుచిరామాహ్లాదమై యొప్పె నీ
హరినిం జూడఁ చిత్రకూటరుచిరామాహ్లాదుఁడుం గాడె య
వ్వరుసన్ భూజనపాలనక్రియకళావర్ధిష్ణుఁడై రాజిలెన్.

130


సీ.

శ్రీస్తనస్తబకవిన్యస్తకస్తూరికాం
        కస్తుతాస్తోకవక్షస్థలుండు,
తండోపతండసత్కాండజాతభవాండ
        మండితాఖండపిచండిలుండు,

సంగరాంగణసముత్తుంగవిహంగమ
        పుంగవాభంగతురంగముండు,
నక్షీణకరుణాకటాక్షవీక్షాదక్ష
        చక్షురంభోజవిలక్షణుండు


తే.

సర్వపూర్వామరాఖర్వదుర్వహోగ్ర
గర్వనిర్వాపణ మొనర్చి యుర్వి ధర్మ
నిర్వహణధూర్వహుండై జనించినాఁడు,
అఖిలకార్యచణుండు నారాయణుండు.

131


సీ.

పుట్టుపిన్నతనానఁ బూతనజనుఁబాలుఁ
        గొసరి బ్రాణములతోఁ గ్రుక్కఁగొనియె,
బసిగాపుతుటుము కుబ్బసమైన కార్చిచ్చు
        కసటుకారపుమందుగా గ్రహించె
సుడిగాలిరక్కసు మెడమేడమీద ను
        య్యాలజంపాలగా లాలిఁ దూఁగె
నిండుచల్లనిగాలితిండి కాళియునిపై
        దుడదుడవడి తప్పుటడుఁగు లిడియె


తే.

వింతగోవర్ధనాద్రిచే బంతులాడె
లాలితాశ్చర్యబాలలీలావినోద
మహిమహిమ నొప్పు నమ్మహామహుని సద్గు
ణములు వాఙ్మనసాగోచరములు భూప.

132


సీ.

తనపూర్వభాగ్యసంతానం బని దలంచి
        నిండుపండువుగ నందుండు జెలఁగ
దినదినాభివ్యక్తి గని ఘనుం డగుటకు
        మదిని యశోద సమ్ముదము బొదల
చారుజగన్మోహకారరూపము గాంచి
        వల్లవీయుల్లముల్ పల్లటిల్ల
దీప్రతీలామానుషప్రభావము గాంచి
        యఖిలలోకము విస్మయమున జెలఁగ

తే.

మొలకవలె సౌకుమార్యమై మొగ్గరీతి
వృత్తమై, పుష్పముంబలె వికచమై, శ
లాటువలె నీటుగల్లి, ఫలంబు గలిగి,
మధురమై తేనెవలె మధుమధనుఁ డలరె.

133


సీ.

పరగ నందునితపఃఫలపు ముద్దులపట్టి
        వల్లవీపల్లవభల్లమూర్తి
గోపికానికరానుకూల కులస్వామి
        హితబంధుజనముల కింటివేల్పు
చాణూరముష్టికప్రాణాశనీఘాత
        కంసవిధ్వంసనకాలమృత్యు
వఖిలమౌనీంద్రసదానందతత్వంబు
        తతఖలప్రతతి కుద్ధండదండి


గీ.

పావనేతరమూఢమనోవికలుఁడు
నరుల కద్భుతసుఖజీవనప్రదాయి
యగుచు లీలామనుష్యవేషగతుఁ డయ్యె
కుటిలసంహర్త సాక్షాద్వికుంఠభర్త.

134


సీ.

మనుజులు పురుషోత్తమఖ్యాతిఁ దీపింప
        సతులు శ్రీకాంతసంగతిఁ జెలంగ
నిభరాజములు కుంభినీశస్థితిని గోర
        హయములు హరిసమాఖ్యత వహింప
రథములు పీతాంబరస్ఫూర్తిఁ జెలువొంద
        సరసులు చక్రభృత్సరణిఁ దనర
సుమలతావలి మధుసూదనస్థితి నొప్ప
        వనతతుల్ మాధవవ్యాప్తి నెసఁగ


తే.

సర్వమును విష్ణుమయ మను సరణిఁ దెలియ
జనుల నవికుంఠతాభోగఘనతఁ దేల్చి

మొదల సారూప్యసామీప్యముల నొసంగి
తదనుసాయుజ్యసత్ఫలాస్పదుఁడు నయ్యె.

135


సీ.

పాలేఁటితరఁగలపై డోలలాడు స
        ర్వాంగంబులను జిడ్డునంటుకౌచు
శయనించువేళ భుజంగరాడ్ఫూత్కార
        విషవహ్నిఁ గ్రాగిన వెచ్చఁదనము
జడదారిగమి చెంతఁజేరి పూజింపుచు
        వినుతింప నోటివాసనల పెడుసు
బీదదాసరులు చప్పిడియుప్పుడుల్ బెట్ట
        వాచవి న్మెసఁగు నరోచకంబు


గీ.

దీరెను యశోద పుడిసెడుతేఁటనీట
గోపికానీకచందనాలేపనమున
వల్లవస్త్రీకచాననవాసనలను
విప్రభామార్పితాపూపవితతివలన.

136


సీ.

శ్రీరమాంశసుజన్య శ్రీరుక్మిణీకన్య
        సాధ్వీజనలలామ సత్యభామ
చిత్తజవిజయ ప్రమత్తదంతి సుదంతి
        తతమృదుగాత్రి మార్తాండపుత్రి
పతిహితోపేత జాంబవదాత్మసంజాత
        చిత్రభోగానంద మిత్రవింద
లలితసద్గుణ టి లక్షణాఖ్యవధూటి
        నిఖలకార్యాభినిర్నిద్ర భద్ర


గీ.

దర్పకోద్యత్కురంగి రాధాలతాంగి
మొదలుగలచంద్రవదనల సదనములను
మదనకదనానుమోదసంపదలఁ బొదలి
వసుధ కంసారి సంసారివలెఁ జెలంగె.

137

మ.

కరుణాసింధువు భక్తవత్సలసమగ్రప్రీతి జన్మించి యి
వ్వరుసం బూతన, బండిరక్కసుఁ, దృణావర్తుం, బకున్, మద్దులన్
ఖరునిం, బౌండ్రకు, జైద్యునిన్, నరకునిం, గంసున్, మురుం ద్రుంచి భూ
భరముం బాపి నిరంకుశప్రతిభచేఁ బాలించుచుండెన్ భువిన్.

138


క.

ఈరీతి నష్టమహిషీ
నారీతిలకములచే ననారతము నిజే
చ్ఛారీతి మెలఁగుచును చన
వారీతులనుడిపె నతఁ డవారితకరుణన్.

139


క.

ఆలమ్మున మురనరకుల
గూలంగ నడంచి తెచ్చుకొనినట్టి పదా
ర్వేలాంగన లాలింగన
లోలింగన దా ననంగయుక్తి నెసంగెన్.

140


క.

గారామున గోరిన వని
తారాజిని గలసి మెలసి తా రాజీలె ని
త్యారామసీమలందు వి
హారామలచిత్తవృత్తి సత్యుత్సుకుఁడై.

141


క.

క్షుద్రారిమరవిదారుం
డద్రీంద్రసమానధీరుఁ డఖిలసుగుణని
ర్నిద్రసముద్రుం డగు బల
భద్రుం డగ్రజుఁడు నెగడె భద్రయశుండై.

142


చ.

తలప ననంతుఁడై మొదల దాస్యములెల్ల లభించి పిమ్మటన్
సలలితరామచంద్రు ననుజన్ముఁ డనందగి లక్ష్మణాఖ్యచే
నెలకొని యగ్రజుం డలర నిత్యసపర్య లొనర్చి గాదె యీ
యలఘుఁడు కృష్ణమూర్తి కిపుఁ డగ్రజుఁడై చెలువొందె వేడుకన్.

143

క.

తమ్మునియెడ నరలేని హి
తమ్ము నిగుడ సర్వసమ్మతమ్మున దమచి
త్తమ్ము లెఱంగి మెలంగిరి
తమ్ము నిఖిలసురలు సంతతమ్ము నుతింపన్.

144


చ.

ఘనమణిలోన కాంతు లెడగాని తెఱంగున, బుష్పముల్ సుగం
ధనిచయము ల్దొలంగనివిధమ్మున, మర్త్యునితోడ నీడ యేఁ
గునటుల, క్షీరనీరములకున్ హితమైన తెఱంగు రేవతీ
శునకును కృష్ణమూర్తికిని జొప్పడుమైత్రి గణించ శక్యమే.

145


ఉ.

సంగరరంగవైరిజనచండపరాక్రమనిర్దళత్సదా
భంగురవిక్రమక్రమణబాహుబలాధికు లంగనిర్జితా
నంగులు యాదవాన్వయజనాధిపు లాబలభద్రకృష్ణు లు
త్తుంగయశోవిశాలపరితోషితు లౌచు జెలంగి రిమ్మహిన్.

146


మ.

హరిపాదోద్భవయౌట నగ్రజనక మోహతన్ దేపని
ర్ఝరిణిన్ గౌఁగిటఁ జేర్చినట్లు ధవళచ్ఛాయాంగముం దోప న
వ్వరుసన్ భానుసుతానుయోగమున నేవస్త్రంబు నైల్యప్రభన్
బురణింపం బలభద్రుఁ డాయతభుజస్ఫూర్తి న్విడంబింపగన్.

147


ఉ.

ఆతఁడు రైవతుం డను నృపాగ్రణిసూతను .రేవతీసమూ .
ఖ్యాతను ధీసమేతను జగత్త్రయపూతను రూపవిభ్రమో
పేతను, సత్కృతేతరవిభీతను, నిర్మలసచ్చరిత్రసం
ఘాతను బెండ్లియాడె కనకంబును సౌరభ మందుకైవడిన్.

148


సీ.

కమలమ్ము చెలువమ్ము గని దిమ్ముగొనజిమ్ము
        నెఱిసొమ్ములకు సొమ్ము నెమ్మొగమ్ము
పగడంపు వగగుంపు నొగినొంపు చెలువంపు
        జిగికెంపు తులకింపు చిగురుమోవి

యరవిందములబృంద మరడింద పొలుపొందఁ
        గలయందమున జెందఁ గలుగుకనులు
జతజక్కవలకెక్కు నుతికెక్కు గతినిక్కు
        రుచినెక్కు టెదనెక్కు కుచయుగంబు


తే.

మించు మించుగ మించగా మించుమేను
కర ముదరమును దరము కంధరము భరము
మెఱుఁగుతఱఁగల బరఁగు బిత్తరపుతరులు
జడలమెకములగుడివడ నెగడు నడుము.

149


మ.

బలుఁ డా రేవతితో నిరంతరము శుంభత్కేళికామందిరం
బుల నుద్యానవనాంతరంబులను సొంపున్మీరు పూఁబాన్పులన్
బలభిన్నీలహరిన్మణీవిరచితప్రాసాదహర్మ్యాంతరం
బుల కందర్పవిలాసవిభ్రమణసమ్మోదాత్ముఁడై వర్తిలున్.

150


ఉ.

వారికి ముద్దుచెల్లెలు సుభద్ర యనన్ లలనాలలామ శృం
గారసమగ్రసీమ కసుగందని పున్నమచందమామ వి
స్తారగుణాభిరామ తనుధామవినిర్జితహేమ మోహనా
కారతటిత్ప్రధామ యనఁగాఁ దగె పల్కులతేనెతేమయై.

151


గీ.

సవరములనెంచు తనకు దాసవరులంచు
బర్హములనెంచు టది కరం బర్హ మనుచు
తమము గణుతించు టదియె నుత్తమ మటంచు
కప్పుఁగలకొప్పు భృంగాళి కప్పులొసఁగు.

152


క.

తోడలా రంభవిజృంభణ
లొడలా హేమప్రభావ మురునాసిక జూ
పడు నాతిలోత్తమాకృతిఁ
గడువేడుక మంజుఘోషగతిఁ దగె పలుకుల్.

153


చ.

కనులబెడంగులున్ నగుమొగంబు మెఱుంగు పిఱుందుఠీవి చ
క్కని నెఱిసోగముక్కు గమకంబు గళం బధరంబు కెంపు మే

ల్చనుఁగవ పొంకము న్నడుముసన్నదనం బలబోఁటిసాటియౌ
వనితల మూఁడులోకములవారి నెగాదిగఁ జూడఁ గానమే.

154


క.

ఆకాంతాతిలకంబున
కే కవ్వడిచే జనించు హితుఁ డభిమన్యుం
డాకామపాలనందని
గైకొన్న కథాక్రమంబు కడబడ వినవే.

155


వ.

కావున నిట్లఖిలజగద్వల్లభుండగు రమావల్లభుండు నందవ్రజసుందరీసందోహనయనారవిందానందకందళత్సుందరతామందిరుండును, అనర్ఘ్యమణిగణకిరణస్ఫురణదేదీప్యమానహారకేయూరకటక శ్రీవత్సకౌస్తుభవైజయంతీవనమాలికాకుండలగ్రైవేయప్రముఖదివ్యభూషణుండును, సహస్రకోటిభాస్కరనిరాఘాటసుషమావిడంబితరథాంగశంఖాసిగదాధనుర్ధరణచతుర్భుజవిరాజితుండును, నిఖిలజగత్పూజితుండును, సమస్తవస్తుజాతాస్తోకవితరణప్రశస్తనిరస్తస్వస్తరుస్తోముండును, యదువృష్ణిభోజాంధకకులార్ణవరాకాసుధాకరుండును, షడ్గుణైజైశ్వర్యసంపన్నుండును, దేవకీజఠరశుక్తిముక్తాఫలుండును, షోడశసహస్రరాజకన్యాపరివృతుండును, అష్టమహిషీసేవితుండునునై యుండె. వెండియు—

156


తే.

అఖిలలోకాధినాథుఁడై యలరు శౌరి
నందనందనుఁ డగుచు నేడించు మధుర
శూరసేనాదిదేశముల్ భూరిమహిమఁ
బూని పాలించె నుగ్రసేనానుమతిని.

157


తే.

పుండరీకాక్షుఁ డఖిలబ్రహ్మాండనాథుఁ
డొండులేనట్టి హిమ నఖండవైభ
వుం డగుచు నుండువార్త నీరెండుచెవుల
నిండ వింటివి దీని నటుండనిమ్ము.

158


క.

అశాంతవిశదకీర్తి సు
రేశబిలేశయకులేశు లెన్నఁగ నతిసం

కాశమగు చెలువుగల కురు
దేశము గల దదియు మున్నుదెలిపెద వినవే.

159


మ.

అటపాండుక్షితినాథసంతతికి నిత్యావాసమై హేమని
స్ఫుటసౌధాంతరఖేలనాంబుజముఖీశుంభస్తనాగ్రస్ఫుర
త్పటవాసప్రమదప్రమోడితనభోభాగీరథీనీరజో
త్కటచంచద్భ్రమరీకదంబమగు నింద్రప్రస్థము న్ఫాసిలెన్.

160


క.

చంద్రప్రస్తరనిర్మిత
సాంద్రప్రస్ఫురితహేమసౌధోన్నతని
స్తంద్రసురేంద్రపురప్రతి
నింద్రప్రస్థంబు దగె నహీనశుభగతిన్.

161


మ.

పరిఖాసాలశిఖాపతాకభవనప్రాసాదరథ్యారథ
ద్విరదోత్తుంగతురంగసద్భటవితర్దిద్వారహర్మ్యాసర
స్తరుణీధాన్యధనస్ఫురన్మణిగణోద్యానంబులన్ సంపదా
కరమై యుండె పురంబు ద్వారకవలెం గల్యాణసంధాయియై.

162


సీ.

వావిదప్పువిధాతవర్తన నిందింతు
        రతిసదాచారులౌ నచటిద్విజులు
ధనువునీడిన జామదగ్ని నెమ్మది మెచ్చ
        రతిసాహసాంకులౌ నచటినృపులు
నాదిభిక్షునిమైత్రి నలరుధనదుని గేలి
        నెగ్గింతు రచటివణిగ్గణములు
చేఁబూనె హలము నిస్సీమబలుం డేమందు
        రఖిలధాన్యసమృద్ధి నచటిశూద్రు


గీ.

లామహామేరుసదృశంబు లచటిరథము
లభ్రవిభ్రాజితంబులౌ నచటిగజము
లనిలవేగంబు మది మెచ్చ వచటిహయము
లశనిశకలంబులను బొల్తు రచటిభటులు.

163

సీ.

సురగురుప్రముఖు లప్పురిమహావిద్వాంస
        జనుల కంతేవాసిసముదయంబు
దేవతాకవిముఖ్యు లావీటికవివర
        శ్రేణికి లేఖికాచిత్రఘనులు
నిర్జరవైణికానీకంబు లచ్చటి
        గాయకాళికి శ్రుతిదాయకులును
దేవాంగనలు తత్పురివారకామినీ
        పటలంబులకు దృష్టిపాత్రసమితి


గీ.

దైవతద్విప మచటిదంతావళముల
కింటిపెంపుడుగున్న వేగంటిఱేని
తురఁగ మటనుండు హరులకు బరువుతట్టు
వనఁగ నాకంబు తత్పురంబునకు నెనయె.

164


క.

వితతద్యుతి తత్పుర మతి
చతురతఁ బాలింతు రఖిలజనవితతి మహో
న్నతినీతిగతిని పాండు
క్షితిపతిసుతు లతులితతాపజితవిమతగతిన్.

165


క.

దుర్జయులు ధర్మసుతభీ
మార్జుననకులసహదేవు లనవరతయశో
పార్జితులు పటుధనుర్జ్యా
గర్జితనిర్జితరిపుప్రకరు లూర్జితులై.

166


మ.

ధరణీదేవసమర్చనం బఖిలవిద్వన్మైత్రి సత్యవ్రత
స్ఫురణోద్వృత్తి, భుజాబలంబు, జయనైపుణ్యంబు, నుద్దామసం
గరరంగప్రబలప్రతాపము, త్రిలోకవ్యాప్తసత్కీర్తిసం
భరితుల్ చంద్రకులప్రదీపకులు నప్పాండుక్షితిశాత్మజుల్.

167


సీ.

జనులయం దుద్యానవనులయం దొకరీతి
        సుమనోవిలాసవిస్ఫూర్తిఁ దనర

కరులయందును రాజవరులయం దొకరీతి
        బంధురప్రమదసంపదఁ జెలంగ
నగరాంతరమ్ము తద్గగనాంతరము రీతి
        మనలసత్సంపదాకరము గాఁగ
పౌరులం దాహవశూరులం దొకరీతి
        పరధర్మదీక్షానుకరణ మెసఁగ


తే.

కార్ముకములందు సత్సతీగణములందు
నొక్కరీతిని సుగుణప్రయుక్తిఁ దనర
ధర్మతనయుండు ప్రతిపురందరునిలీల
రాజ్య మట నేలె నొకటఁ గొఱంతలేక.

168


క.

ఏలన్వలె నితఁడే భువి
నేలన్వలె నితరధారుణీశ్వరు లనుచు
న్మేలెన్నఁగఁ గురుమండల
మేలె న్నగభిత్సమానహితభోగములన్.

169


క.

అందఱిలో మధ్యముఁడు పు
రందరనందనుఁడు యదుపురందరకరుణా
మందకటాక్షేక్షణరస
మం దనురాగంబు డెందమందు నటింపన్.

170


క.

వేయాలకింపుమాటల
వేయేల వచింప పాండవేయున కెనయే
నాయజుడుం గాయజుఁడున్
వాయుజుఁడుం జతురరూపవరభుజబలిమిన్.

171


చ.

పదములు లేఁజిగుళ్లు నఖపంక్తులు తారలు జానుజంఘల
భ్యుదయము, లూరువు ల్సొగసు లున్నతమౌ పిఱుఁదుల్ మనోహరా
స్పదమగు బొజ్జ, దిద్దినకవాటముదీటు వెడందఱొమ్ము న
వ్వొదవెడు తేఁటమోము చెలువొందఁగ భాసిలె మోహనాకృతిన్.

172

ఉ.

తీరిచినట్టులు న్సొగసుఁదేరుబొమల్ కనుదోయినిండు సిం
గారము బారలం గొలువఁగాదగు కంబుగళంబుడంబు నొ
య్యారపుఁజెక్కులుం దళుకుటద్దము లున్నతబాహుమూలవి
స్ఫారరుచుల్ జెలంగ నెఱప్రాయమునందు కిరీటి రాజిలెన్.

173


ఉ.

సూనృతజన్మభూమి తనుసుందరతానిధి ధర్మమార్గసం
స్థానము కీర్తివాస ముచితంబులతావు వివేకరాశి సు
జ్ఞానగృహంబు శాంతజనకంబు వివేకనిధాన మంచు స
న్మానతఁ గాంచె పాండునృపమధ్యమపుత్రుఁడు రాజమాత్రుఁడే.

174


మ.

హరితో స్వర్గము కేఁగి ఖాండవవనం బాయగ్నిభట్టారకే
శ్వరు సంతుష్టి నొనర్చి తత్కరుణ భాస్వద్దివ్యగాండీవకే
తురథాశ్వాస్త్రచయంబునుం బడసి దోడ్తో శౌరి కారుణ్యభా
పరతిన్ స్వర్గసుఖైకభోగముల దేవస్వామిలీలం దగెన్.

175


తే.

అతఁ డీరీతి నీలజారాతిభాతి
దినదినంబును గళలెల్లఁ దేజరిల్ల
నిఖిలసుగుణము లొకతట్టు నిలిచినట్టు
సమధికప్రాభవముఁ జెందు సమయమందు.

176


క.

ద్వారకలోపల నందకు
మారకసోదరి సుభద్ర మంజులరుచిరో
దారకథ ల్కోరికదై
వార కరము వినియె మిత్రవర్గమువలనన్.

177


ఉ.

కోరికచే భ్రమించు, సమకూడుటలే విధియంచు నెంచు,కం
సారి గలం డటంచు ధృతి యాశదలంచుఁ జలించు గాంచు నే
మారు గృశించుఁ దాళఁ దరమా యని యెంచు భ్రమించు మించు వే
సారకె చేఁజలించు చెలిచక్కదనంబు గణించు చిత్తమా
ద్వారకయందు నుంచుఁ దను దానె గమించదలంచుచుండఁగన్.

178

తే.

దైవవశమున నొక్కభూదేవమౌళి
గోగణంబులఁ దస్కరుల్ గొని పలాయ
నంబు గొనిరంచుఁ దెల్పఁగా నరుఁడు సాధు
రక్షణైకాభిరతి సత్వరమున లేచి.

179


క.

వడి వెంటనడచి తస్కరు
లడుగంట నడంచి తెత్తునని ధర్మజు మే
ల్పడకింటనుండు ధనువున్
కడగంటం గని బిరాన గైకొని జనియెన్.

180


ఉ.

దొంగల నంగలోఁ గలసి దోర్బలశక్తి కరివ్రజంబులో
సింగముభంగిఁ దూకి పటుశింజిని మ్రోయ గడంగి విక్రమా
భంగురసంగతిన్ విశిఖపంక్తుల వారలఁగూల్చి గోగణం
బుం గొని నిస్సహాయజయభూరియశోన్నతిఁ దెచ్చెఁ జెచ్చెఱన్.

181


క.

తెచ్చినగోగణములఁ దా
నిచ్చిన భూసురవరేణ్యుఁ దెచ్చిన ప్రేమన్
మెచ్చి నయోక్తుల దీవన
లిచ్చి నిజాలయమునకు సుఖేచ్చం జనియెన్.

182


గీ.

ఇంటి కేతెంచి యర్జునుం డొంటిఁ దలఁచె
వింటికై యగ్రజుని పడకింటఁ జొచ్చి
యుంటి నిటువంటి కాలుష్య మంటకుండ
పంటవాల్గంటి వలఁగొంట గెంటు ననుచు.

183


క.

మతి కేను భూప్రదక్షిణ
గతికే నిశ్చయము సేయఁగా ద్వారవతీ
స్థితి కేఁగుటయు సుభద్రా
సతికేళికి నిదియ యుక్తసమయం బనుచున్.

184


ఉ.

అన్నకు మ్రొక్కి నీదుశయనాలయ ముద్దతిఁ జొచ్చి మచ్చుపై
నున్న శరాసనంబు గొని యొక్క ధరామరగోగణాపహున్

భిన్నముజేసి విప్రునకు బ్రీతి నొసంగితిగాని పాపమం
చెన్నక నీగృహంబు జొరు నీయపరాధ మికెట్లుఁ బాయునో.

185


వ.

అనిన.

186


క.

తమ్మునితో ననలేక హి
తమ్మునిమిత్తమ్ము దుష్కృతమ్ములు జేయం
దమ్ముజొర వనుచు శ్రుతిజా
తమ్ములు మొఱవెట్టె సంతతమ్ము కిరీటీ!

187


గీ.

దీని కొకమేర గలదు సుధీవరేణ్య!
భూప్రదక్షిణమేబోలు గోప్రదక్షి
ణంబనుచుఁ దెల్పె మును పురాణమ్ములందు
వినయము లెఱుంగవే రాజతనయ! సనయ!

188


తే.

చెప్పినట్టుల నా మాట చెవిని నాట
మతిని దలపోయుమంచు సమ్మతి వచించు
నేర్పు చెలువొందు ధర్మజు నీతియందు
నెయ్య మింతైన గనక దానియ్యకొనక.

189


చ.

తలఁపు సుభద్రపైఁ గలకతమ్మున, ధర్మజుఁ డెన్నిధర్మముల్
బలికిన, భూప్రదక్షిణ నెపంబునగాని మనోరథంబు నా
కలవడదంచు నెంచి - తనయన్నకు మ్రొక్కి సుధీజనంబుచే
సెలవు గ్రహించి వల్దని వచింపఁ గమించెను శీఘ్రగామియై.

190


క.

అటుపురి వెలువడి గంగా
తటినిన్ రంగత్తరంగతటసంగటనా
ర్భటినిం గాశీనగరని
కటినిం గని నిటలతటవిఘటితాంజలుఁడై.

191


చ.

తన పరివారయుక్తముగ తానములాఁడి యనేక తైర్థికా
జనములు ప్రాణమిత్రుఁడు విశారదుఁ డర్మిలి వెంటఁ గొల్వ మౌ

ననియతితోఁ జపించు నెడ నాగకుమారి యులూచి నాకన
త్కనక బిస ప్రసూన ధళధాళధళాయతనేత్రిఁ గాంచియున్.

192


ఉ.

ఆదరహాస మామురిపె మాసొగ సారుచి యావిలాస మా
హ్లాదము గొల్పఁగా గని యయారె వయార మిటుండ మిటుండ వల్దె యం
చాదర లీల మేచ్చుచు మహామటుమాయల విద్యచే నరుం
బ్రోదిగ బట్టి వేఁగఁ గొనిబోయెను భోగవతీపురంబుకై.

193


ఉ.

అంతట పాకశాసని యొరయాపుఁగన్నులు విచ్చి జూచి య
క్కొంత యులూచి నాగకులకామిని గాఁగ నెఱింగి మోహవి
భ్రాంత దురంత కంతు శరబాధితుఁడై వలపాపలేక న
త్యంత కుతూహలంబున యథావిధి గూడె ననంగసంగతిన్.

194


క.

ఆపూప పాప జవరా
లాపార్థున మోఘ వీర్యమది సద్యోగ
ర్భాపాదితమై కడుమే
ల్గా పాపఁడు బొడమె నతఁ డిలావంతుఁ డనన్.

195


ఉ.

దానముహుర్వికాస విదిత స్థితి మానసుఁ డౌచు కూరిమిన్
దానము లెన్నియో సలిపి తైర్థిక సంఘముఁ జేరఁ బోవ డెం
దాన ముదంబు సంధిలఁగఁ దద్భుజగాంగనఁ జూచి యట్లనెన్
దానము చిద్విషత్సుతుఁ డదభ్ర మహాభ్రరవభ్రమోక్తులన్.

196


ఉ.

నీరజపక్షనేత్రి విను నీవును నీసుతుఁ డేను తీర్థయా
త్రారతిదీర్చు పిమ్మట పురమ్మునకుం జనుదెమ్ము మత్పురీ
వారము లాత్మ నెంత వలవంతల జెందిరొ! పోయివత్తు నం
చారసికుండు బల్క సతియట్లనె జేర్చెను జాహ్నవీతటిన్.

197


ఉ.

అంత కిరీటిరాకకు నిజాశ్రితులైన విశారదాదు ల
త్యంతకుతూహలాభ్యుదయమంద యులూచి మనోహరాకృతిన్

స్వాంతమునం దలంపుచు హిమాద్రికి వేఁ జనియుం దదీయప
ర్యంతధరిత్రిసేననిడి యన్నియమించి యుదంచితంబుగాన్.

198


ఉ.

బంగరుకొండపట్టి తనపట్టపురాణిగ మేలుమేటి య
ర్ధాంగము భర్తనంటిన మహాసతి నిన్గనుభాగ్యశాలి యు
తుంగపవిప్రహారమున బొర్లనిబిడ్డనిగన్నతండ్రి చూ
డంగడుమానికంబుల కొటారము శీతనగంబు గాంచియున్.

199


ఆ.

అరయ సర్వమంగళావాసమై యొప్ప
హితవిభూతిచే నహీనకటక
రమ్యమగుచు నీధరాధరమ్మును గిరీ
శాఖ్య గనుట కేమి యబ్బురంబు.

200


సీ.

తత్ప్రదేశంబునదగు నగస్త్యవటంబు
    గాంచి యచ్చట నిర్గమించి వెడలి
రహి భృగుశృంగహిరణ్యతీర్థము గ్రుంకి
    నైమిశారణ్యమునకు గమించి
నారాయణస్వామి నారాధన మొనర్చి
    యాప్రయాగకు నేఁగి యటఁ ద్రివేణి
సంగమంబున గృతస్నానుఁడై మాధవుఁ
    బొగడి పంచక్రోశమునకు నేఁగి


తే.

కడలి మణికర్ణికను గ్రుంకి గయకు నరిగి
పొగడి శ్రీపురుషోత్తమంబునకు నడచి
శ్రీజగన్నాథశౌరి నీక్షించి కొలిచి
యాతలను గౌతమీనదీస్నాతుఁ డగుచు.

201


క.

చని చని యనిమిషనాథుని
తనయుండు సమస్తపుణ్యతటినీతతిమ
జ్ఞానదానవిధు లొనర్చుచుఁ
గనుఁగొని యాకృష్ణవేణికడకుం జనియెన్.

202

చ.

పులినశ్రీకటి మీనలోచన లసత్ఫుల్లాంబుజాతాస్య యు
జ్జ్వలచక్రస్తని జీవనభ్రమణభాస్వన్నాభి చక్రాంగమం
జులయాన త్రివళీతరంగ మధులిట్ శుంభత్కచాబంధ కో
మలబింబాధర కృష్ణవేణి హరిరామాయీ నదీయైనదో!

203


వ.

అని వినుతింపుచు.

204


క.

అటు తటుకున వెడలి మహో
త్కట శుభద మహోబలంబు గని గడఁచి రుచి
స్ఫుట పటల దిక్తటము వేం
కట మహిభృత్కటకమణినికటమున విడిసెన్.

205


ఉ.

శ్రీ తిరువేంగఁడప్పని భజించి పదంపడి కాంచికాపురీ
నీతనతాదరు న్వరదునిం గని మ్రొక్కి కవేరకన్యకా
శీతల వీచికా తుషిత చిత్త సనాథుని రంగనాథు న
త్యాతుర భక్త పూజ లిడి యవ్వల సేతువు గాంచి వేడుకన్.

206


తే.

శ్రీ ధనుష్కోటి స్నానంబుఁ జేసి వెడలి
పదియు మూఁడవ నెలకు నప్పాండుసుతుఁడు
మహిని మలయధ్వజుం డేలు మణిపురమ్ము
చెంత నొక్కెడ నుపవనసీమలోన.

207


ఉ.

రంగదనంగమంగళతురంగి మెఱుంగుల మేలితావి సం
పంగి విలోలలోచన విధంగిత బాలకురంగి మోహనా
పాంగి కళానుషంగి రుచిరాబ్ధితరంగి మనోహరాంగి చి
త్రాంగద పేర నొప్పు మలయధ్వజు కూతురుఁ గాంచె దవ్వులన్.

208


సీ.

కనుఁగొన దళుకు తళుక్కని దృష్టి లోఁదోఁచ
     ఘనతటిల్లతిక యంచును దలంచు

ఘనతటిల్లతకు నిల్కడ గల్గునే! నిండు
     వెన్నెలతేఁట యంచు న్నుతించు
వెన్నలతేఁట కీ వన్నెలా? వలరాజు
     చిల్కపటానితేజి యని గాంచు
చిల్కపటాని కెమ్మెల నడ ల్గలవే? రా
     యంచ గాఁబోలు నం చతిశయించు


గీ.

నైన రాయంచ కలరు నీమేని సొబఁగు
మేని సొబఁగును బూనిన బ్రాణమైన
గుందనఁపుఁ బొమ్మ గాఁబోలు నిందువదన
యనుచు వినుతించె తమినాటి యా కిరీటి.

209


తే.

పడతి నడఁకకు మును గజపతియు నోడె
హరిపతియు సూక్ష్మ మధ్యమం బందు నోడె
సుదఁతి మెఱుఁగైన వాడి వాల్చూపు తూఁపు
లరసి నరపతిలోఁబడు టబ్బురంబె.

210


క.

విజయుం డాసతి మలయ
ధ్వజు కూఁతురుఁగా నెఱింగి తమిచే నబ్భూ
భుజు పాలికావిశారదు
నిజసుమనోరథముఁ దెలుపు నెట్టన బనిచెన్.

211


చ.

పనిచిన నాతఁ డర్థిజని పాండ్యపతిం గని బల్కె పాండుభూ
జనపతిసూనుఁ డర్జునుఁడు చక్కని నీతనయన్ వనంబులోఁ
గనుఁగొని యుద్వహక్రమణకౌతుకహేతుమనీషుఁ డౌచు మీ
మనమరయంగ బంపె ననుమానముమాని యొనర్పఁగాఁ దగున్.

212


క.

అని విని యెనలేని ముదం
బును బెనఁగొన బల్కెఁ బాండుపుత్రునకును నా
తనయను సతిఁగా నొసఁగం
బనిపడె నిది యింతకన్న భాగ్యము గలదే!

213

క.

ఈకన్యకామణికి యిపు
డా కవ్వడిచే జనించునట్టి కుమారు
న్నా కలిమికి రాజ్యమున క
నాకులగతి నాథుఁ జేతు నని సమ్మతుఁడై.

214


చ.

అని యిటు లుత్సహించి శుభమైన ముహూర్తము నిశ్చయించి, మే
ల్దనరుపనుల్ రచించి, విబుధప్రతతిం బిలిపించి, పెండ్లికూఁ
తునకు నలంకరించి, పటుతూర్యనినాదము మించి దిక్కులం
బెనఁగొన మేళవించి పురవీధుల చిత్రము లేర్పరించియున్.

215


చ.

వరుస నవద్యహృద్యశుభవాద్యము లెల్లెడ నిండి మ్రోయ క
ప్పురఁపుమెఱుంగుటారతులు పుణ్యవధూజను లీయ, వృద్ధభూ
సురవరు లాగమప్రథితసూక్తుల దీవన లీయ, పాండ్యభూ
వరసుతకు, గిరీటికి వివాహ మొనర్చి రతిప్రమోదులై.

216


తే.

మధురవృత్తులు రీతులు పృథుగుణములు
గలుగు కూతురునకు నలంకారము లిడి
పాండుసుతునకు మలయధ్వజుం డొసంగె
కవి రసజ్ఞుకు కృతినిచ్చు కావ్య మనఁగ.

217


మ.

ఇటులం బెండ్లి యొనర్పఁ బిమ్మట నరుం డిచ్ఛారతిం గొన్నినా
ళ్ళట చింత్రాంగదకేళికారతిసుఖయత్తాత్ముఁడై యుండున
ప్పట నయ్యంగన కందిపుచ్చుకొనుఠేవం గర్భచిహ్నంబు లం
తట జూపట్టె నహస్కరాభ్యుదయప్రోద్యత్పూర్వశైలక్రియన్.

218


క.

తొమ్మిదినెల లీగతి నతి
నెమ్మదిగా గడచినంతనే శుభమౌ ల
గ్నమ్మిదియని వినుతింపఁగ
నమ్మదిరాక్షికిని తనయుఁ డపు డుదయించెన్.

219


క.

తనమనుమని గనుఁగొని నం
తన యనుకంప పాండ్యధరణీపతియుం

దనదుహితాపత్యంబున
దనదు హితం బమరెనని ముదంబున జెలఁగన్.

220


చ.

అతనికి బభ్రువాహనుఁడు నా నొక నామ మొసంగి యర్జునుం
డతులితతద్ధరాతలమహాధిపతిత్వము వానికే దహో
త్రతవిధిగాఁ దదన్వయము రంజిలఁగా నిడి వారిచే సుహృ
స్టత సెలవందుచు న్వెడలె చయ్యన దక్షిణతీర్థయాత్రకై.

221


మ.

చనుచో పంచముఖప్రవాహ మగుచున్ సౌభద్రతీర్థంబు
జను దత్పంచకపుణ్యతీర్థములలో స్నానంబు గావింపఁ బో
యిన నందచ్చర లేవు రాది నొకమౌనీశోగ్రశాపాహతిం
ఘననక్రాకృతి బూని తైర్థికుల మ్రింగం జొచ్చుట ల్గాంచియున్.

222


క.

తనచే శాపవిమోచన
మును జేకురు టెఱఁగి తీర్థముల గ్రుంకిడి యం
తను వామకరముచే తొలి
తనువామకరములు దాల్ప దరిబడవైవన్.

223


చ.

చనుఁగవపొంకముం జిగురుచాయలవాతెఱలు న్నెరాతళు
క్కనుజిగిమేనులున్ సటువులైన పిఱుందులు ముద్దుమోములుం
గనుఁగవమేల్బెడంగులు చొకాటపుచక్కనిసోగముక్కు లిం
పునజెలువొందువేల్పుఁ బువుబోఁడుల రూపముదాల్చి నిల్చినన్.

224


క.

అంతట నక్కాంతలవృ
త్తాంతము నాద్యంతమరసి యతిమృదుభాషా
సంతతులన్ వీడ్కొలిపి య
నంతర మటవెడలి పశ్చిమాశాస్థలికిన్.

225


ఉ.

వచ్చి ప్రభాసతీర్థవనవాటికడన్విడి ప్రాణమిత్రుఁ డా
యచ్చుతుఁ బిల్వఁ బంప నతఁ డర్జును చిత్త మెఱింగి యిట్లనున్

వచ్చినభావ మేర్పడె సుభద్రను రాముఁడు రాజరాజుకే
నిచ్చెద నన్నవాఁడు సతి నేగతినైనను నీకె గూర్చెదన్.

226


క.

అన విని వనజనయను మన
మున తనునెనరెనయ నునిచి మునుపనుకొనురీ
తిని వనిత నెనయు చనువును
వెనుకొను కపటత్రిదండి వేషము దాల్చెన్.

227


సీ.

భుగభుగవాసించు మృగనాభిఁ దుడిచి స
     ద్విమలమృత్స్నోర్ధ్వపుండ్రమును దీర్చి
పుటపాకగాంగేయపటము సడల్చి కా
     షాయవస్త్రము గటిస్థలి ధరించి
జ్యావల్లికాటంక్రియావిధాయకమైన
     దక్షిణపాణి త్రిదండ మూని
గాండీవగుణకిణాంకంబైన డాకేల
     సలిలపూరితకమండలువు దాల్చి


తే.

వీరరసమెల్ల నిర్జించి విమలశాంత
రసము నేకీభవించి తారసిలునట్లు
ఘనజగన్మోహనాకారుఁ డనఁగ నెగడు
విజయుఁ డవ్వేళఁ దాపసవేషి యయ్యె.

228


క.

చెలులవిడి సన్న్యసించుట
లిలలో సహజం బటందు రీ చెలికై యా
శలఁ జెంది సన్న్యసించఁగ
నలవడి యర్జునుఁడు రైవతాద్రికిఁ జేరెన్.

229


క.

ఈవిధి రైవతకాద్రివ
నీవాటిం జేర్చి మౌననియమముచే ధా
త్రీవరతాపసవేషసు
ధీవరమతి నుండు మనుచుఁ దెలిపి హరి జనెన్.

230

క.

గోపాలాగ్రణి యంతటి
లోపలనే బోయి పురములోపల జనులన్
రేపే రైవతకోత్సవ
మాపాదింపంగవలయునని చాటింపన్.

231


శా.

నందుం డాదిగ యాదవుల్ మిగుల నానాజాతిజాతంబు గో
విందప్రీతికరాంగనాజనము వేవేల్ రాజకన్యాజనం
బుం దేవేరులు రుక్మిణీప్రభృతులున్ భూషామణిస్పీతులై
యందందం జనుదెంచి రప్పురములో నాబాలగోపాలమున్.

232


శా.

ప్రీతిన్ రైవతకోత్సవంబునకు శౌరిన్ గూడి రాముండు దా
నేతేరం గపటత్రిదండికడ కెంతేనేర్పునం జేరి కం
జాతాక్షుండు వినమ్రుఁడై బలికె నోస్వామీ! కృప న్మీరలీ
చాతుర్మాస్యము మద్గృహంబుననె భిక్షం జేయ వేంచేయరే.

233


వ.

అని యక్కడలి బొడమిన జడుతపడతివడయుం డవ్వెడఁగు జడదారి యొడంబడునటుల మడతనుడువుల నుడివిన.

234


క.

అనుజుం డనుమాటకు బలుఁ
డనుమతిఁ గైకొనఁగ నుత్సవాంతంబున నే
తనుతనవారలతో న
మ్మునిఁ దోకొని బోయి భవనమున వనవాటిన్.

235


క.

నిలిపి, సుభద్రామణి న
య్యలఘునకు సపర్య సేయునటు నియమించెన్
బలదేవుఁడు మునులకు క
న్యలెకా శుశ్రూష జేయనగు వారనుచున్.

236


క.

అన్నల యనుమతి నీగతిఁ
గన్నియ శుశ్రూషజేయఁగా దొరకొనియెన్

మున్ను ధనంజయు నెనయ మ
ది న్నెగడు మనోరథంబు దీరు నటంచున్.

237


సీ.

౧ అరుణపల్లవము లాదరణత నిడు తన
     యధరంబు సాటివి యన్న యట్లుఁ
౨ బుష్పముల్ దెచ్చి నేర్పుననిచ్చు తనసౌర
     భాంగము కివి సాటి యన్నయట్లు
౩ రసఫలంబులుఁ దెచ్చి యొసఁగును తనమధు
     రాలాపముల సాటి యన్నయట్లు
౪ నాహిమాంబువు పూజకని యొసంగును తన
     హాసంబునకు సాటి యన్నయట్లు


తే.

విమలపత్రపుటంబుల విధుశిలాది
పాత్రలను నించి, వినయసంభ్రమత మించి,
భక్తి సేవించి విజయుండు పతియుఁ గాఁగ
గోరియానారి రాజడదారిఁ జేరి.

238


సీ.

చారునఖద్యుతుల్ చరణారుణచ్ఛటల్
     గలసి కుంకుమగంధ మిల కొసంగ
మంజీరశింజినీరంజితధ్వని శుకా
     రావంబుతోడ బేరజము లాడ
వాల్గన్నుల మెఱుంగు వాఁడిచూపులు దిశా
     తతుల పువ్వుల వసంతంబు లాడ
పాణిపల్లవరుచుల్ పటుకంకణధ్వనుల్
     కలకంఠములను విందులకుఁ బిల్వ


తే.

ఘంటికాకాంచి లేఁగౌనునంటి మ్రోయ
బలుని యనుమతితోడ సపర్యఁ జేయ
మనసు భద్రముగా వేగమున సుభద్ర
భక్తితోఁ జేరె మాయాతపస్వికడకు.

239


క.

ఇటు లాకుటిలాలకనృప
జటి కభ్యర్చనలు సలుప సలుపఁగ మునిహృ

త్పుటము దిటమెల్లవిడి యం
తట నే నర్జునుఁడ ననుచుఁ దగఁ బలుకుటయున్.

240


మ.

మునుపే వాసవి రూపచిహ్నముల నాప్తుల్ జెప్పఁగా విన్నరీ
తిని యమ్మౌనికి గాననయ్యెనని సందేహింపఁగా తథ్యమ
య్యె నటంచు న్నునుసిగ్గుదొంతరలు నయ్యేణాక్షికిం దోడుగా
జని యభ్యంతరసీమఁ జేరె తను సంజాతాహతస్వాంతయై.

241


తే.

అన్న యెడ రుక్మిణి సత్య లన్ని చిన్నె
లెన్ని వెన్నునిచే మున్ను విన్నకతన
కన్నె కన్నుల విలుకాని బన్నములను
సన్నగిలనీక శిశిరముల్ గొన్ని బన్ని.

242


చ.

నరునకు భోజనోపకరణప్రముఖార్చన లాదరించి త
త్పరిణయకార్యసంఘటన బంకజనాభుఁ డొనర్ప మేచకాం
బరుఁ డిది విన్నచో సమయభంగ మొనర్చు నటంచు హస్తినా
పురమునకుం బ్రయాణమయి పోయె నిజాగ్రజుతోడ గూడుకన్.

243


సీ.

తన మంత్రివరులతోడను సుభద్రార్జునో
     ద్వహరహస్యములు యుక్తముగఁ దెలిపి
కేవలహితసాత్యకీయుద్ధవాదులఁ
     దగుకార్యముల జాగ్రతల నమర్చి
నేర్పు మీఱఁగ రుక్మిణీ సత్యభామల
     హిత శుభక్రమణసంగతి విధించి
కవ్వడితో లగ్నకాలంబు కిదె వచ్చె
     ద నటంచు నభయప్రదాన మొసఁగి


తే.

జనని యెడ నుంచి సుముహూర్తసరణి నెంచి
లలి సుభద్రార్జునులకు నలంకరించి
హితపురోహితు లతికుతుకత ధరించ
విధివిధాగతిఁ బెండ్లి గావించి మించి.

244

సీ.

కుచకోకముల మైత్రి గొనఁగ తానై వచ్చు
     పూషుం డనఁగ తాళిబొట్టు గట్టి
కల్యాణ లోకనాగత ఘనచ్యుత వృష
     త్పటలంబనా దలఁబ్రాలు వోసె
తనమన్మథవ్యథల్ తరళాక్షి చెవితోన
     జెప్పనేఁగినమాడ్కి చెట్టఁబట్టె
నీకాలిగోరున కేకాంతసరియన్న
     భావంబుగా సప్తపదము లానె


తే.

భీషణత మున్ను దన్ను దపింపఁజేయ
మేటికందర్పశరవహ్ని మింగునట్లు
దోప హోమాగ్ని నాత్మ నారోపణంబు
సలిపె సమయోచితము జూచి సవ్యసాచి.

245


తే.

అంతలోన సుభద్ర హృదంతరమున
గొంత సంతసమంది యొక్కింత చింత
నన్న రాఁడాయెనని యనుకున్న తఱిని
చెల్లెలి మనంబుఁ గని దారసిల్లె శౌరి.

246


ఉ.

అత్తఱి శేషహోమదివసాంతమునన్ ఫలశోభనోత్సవా
యత్త మొనర్ప మోదమున నర్జునుఁ డంగనతో దినత్రయిం
జిత్తజు కేళిలో మణితసీత్కృతహావవిలాసవిభ్రమో
పాత్తమనస్కుఁడై ప్రముదితాంబుధిలోఁ దగ నోలలాడుచున్.

247


సీ.

తనువుననంటు చందనకర్దమము నాఁటి
     భసితాంగరాగసంపదను దెలుపఁ
దళుకుకుంకుమజిల్క మొలతాటి మునుపటి
     కాషాయవస్త్రసంఘటన దెలుప
నుదుటిముత్తెఁపుసరు లెదనొత్తుటలు నాఁటి
     నళినాక్షమాలికోన్నతిని దెలుప

ఫాలంబు నంటి తత్పదనఖరేఖలా
     మృత్న్సోర్ధ్వపుండ్రసమృద్ధిఁ దెలుప


తే.

నంగజానందయోగాంతరంగుఁ డౌచు
ప్రేమనధరామృతాతిథ్యభిక్ష మెసఁగి
యోగియో గాక కామినీభోగియో య
నంగ వెడలెను దత్కేళికాంగణంబు.

248


శా.

ఈలీలన్ సుఖవార్ధినిం దనిసి లక్ష్మీశుండు వీడ్కొల్పఁగా
చాలాప్రేమను రుక్మిణీముఖసతుల్ స్రక్చందన స్వర్ణవ
స్త్రాలంకారము లిచ్చిపంపిన బురం బర్థిన్ బ్రవేశింపఁ బో
నాలో కొందఱు సీరపాణిహితు లుద్యత్కోవసన్నద్ధులై.

249


ఉ.

దొంగవలెన్ సుభద్ర నదె దోకొనిపోయె కిరీటి యంచు ను
త్తుంగబలాంగులై తనునెదుర్కొనువారి నెదిర్చి యాధను
శ్చంగుఁడు పుష్పసంభృతనిషంగుఁ డఱంగఁడె లోనగెల్చి య
బ్భంగి శుభాంగితోఁ జనియె భంగజయంగతపేటి వీటికిన్.

250


క.

నానావిధవాద్యంబుల
నూనగతిన్ మ్రోయఁ బురజను లెదుర్కొనఁగా
సూనాస్త్రకోటి రుచిరన
వీనాంగుఁడు తత్పురప్రవేశం బాయెన్.

251


క.

సతిపతు లీరీతి ననా
రతము హితము దోప సౌఖ్యరతి మెలఁగుతఱిన్
కతిపయదినములకును త
తృతి క తికుతుకతను నెలమసలె సలలితమై.

252


చ.

తనువు చెమర్పసాగె, కనుదమ్ముల మబ్బు ఘటిల్లె వేవిళు
ల్గనఁబడె చన్మొనల్ నలుపుఁ గాఁదగె చెక్కులు వెల్లనయ్యె భో
జనము లసహ్యమయ్యె గతిజాడ్యత గాంచెను. మంటిపెల్లలం
దున రుచిమించె జిట్టములుదోఁచె కటిం బెగడయ్యెఁ బోటికిన్.

253

క.

ఈ లీల గర్భచిహ్నము
లాలోలవిశాలనేత్రికలవడఁగ సము
త్తాలానువేలసుషమా
జాలారుణవిలసదుదయశైలము బోలెన్.

254


ఉ.

అంత లతాంతపేశలశుభాంగి సమస్తజనుల్ కుతూహల
స్వాంతులుగా నవగ్రహశుభాకలితాద్భుతలగ్నమందు శ్రీ
కాంతజయంతనైషధనృకాంతవసంతమంజులా
క్రాంతదురంతబాహుబలరంతు దిగంతరకీర్తివంతునిన్.

255


స్రగ్ధర.

కనియెం బుత్రుం బవిత్రుం గలుషచయలతాఖండనోద్దండదాత్రుం
ఘనగాత్రు న్సచ్చరిత్రుం గలితదరహసత్కమ్రకంజాతనేత్రున్
జనమిత్రున్ శత్రు న్సకలబుధజనాజ్ఞాతసంఘాతమిత్రున్
జననాథస్తాత్రపాత్రుం బటులరిపువనజ్వాలికావీతిహూత్రున్.

256


మ.

శరజాతప్రభవుండు నేర్పు దనరం జాంబూనదం బందు భా
స్కరబింబంబును సానబట్టి రజముం జల్లించి రాకాసుధా
కరసారంబును బిందుచుం బడునుగాఁ గైజేసి మర్దించి శం
బరవైరిం బడి యచ్చునొత్తి సృజియింపం బోలు నబ్బాలునిన్.

257


సీ.

కురువంశవల్లికాంకుర మీతఁడని కోర్కె
     దనరఁగా ధర్మనందనుఁడు జెలఁగ
నాపదుద్ధరణహస్తాలంబ మీ యప
     త్యం బని భీముఁ డుత్సాహ మంద
స్వర్గాపవర్గసంసర్గహేతువె పుత్ర
     సంతాన మని సవ్యసాచి యలర
బాలకుండీక్షణభాగధేయ మటంచు
     నకులుండు సహదేవునకు వచింప


తే.

నిటుల ననుకంప జనకుల కేర్తరింపఁ
బొల్ఫు దీపింపఁ గౌతుకంబున నిలింప

వరులు విరులను వర్షింప సిరుల బెంపఁ
దరమె వినుతింపఁ బడఁతి కాతఁడు జనింప.

258


క.

నెనరున గుంతీసతి దా
గనుఁగొని గనుగొనల వివిధగతులన్ మతులన్
జనువనుఁగుల్ బెనఁగొనఁగన్
మనుమని మను మనుచు దీవెనల నిడి వేడ్కన్.

259


క.

నరుడుం గన్నకుమారుని
పురుఁడుం గణుతింపఁగలఁడె భువనత్రయి న
మ్మరుఁడుం గలఁడేమో యని
బురుఁడుం గావించి రఖిలపుణ్యాంగనలున్.

260


ఉ.

ధన్యుఁడు కల్పకప్రతివదాన్యుఁడు విశ్రుతరాజలోకమూ
ర్ధన్యుఁ డనారతాశ్రితశరణ్యుఁడు రూపవిలక్షణైకసౌ
జన్యుఁడు దుష్కరారిజయసైన్యుఁ డితం డగుగాక యంచు స
న్మాన్యుఁడు ధర్మసూనుఁ డభిమాన్యుఁ డనన్ మహదాహ్వయం బిడెన్.

261


సీ.

సకలాగమాంతభాసకళాప్తిచే బృహ
     స్పతిరీతిని మహానుభావుఁ డగును
నిఖిలాస్త్రశస్త్రప్రముఖనీతి చతురత
     పరశురామసమప్రభావుఁ డౌను
సంతతాత్మజ్ఞానసంసర్గను సనత్కు
     మారునిగతి జగన్మాన్యుఁ డగును
కమనీయసుందరాకారగౌరవమున
     కందర్పకోటిసంకాశుఁ డగును


తే.

ననుచు దీవించి ధర్మజుం డతిశయించి
దానము లొనర్చి జాతకోత్సవ మొనర్చె
బ్రియము మొనదేల నిధిఁ గన్న బేదలీల
నుల్ల మిగురింప నభిమన్యుఁ డుద్భవింప.

262

సీ.

తలనంటి మేనజొబ్బిలఁగ జము ర్బూసి
     సకలాంగములు దిద్ది చక్కనొత్తి
జలకముల్ గోర్వెచ్చజలములచే నార్చి
     తడిబోవఁ గర్ణరంధ్రముల నూది
చలువసన్నపు పుట్టములమేన దడియొత్తి
     పట్టుపొత్తుల మెత్తపడక నునిచి
నునుపైన కాటుకఁ గనుదమ్ముల ఘటించి
     బొమలుదీరిచి యుక్క బొట్టుఁ బెట్టి


తే.

పొదిఁగిటను జేర్చి పాలిచ్చి బుజ్జగించి
కెంపురవచెక్కడంపు నిద్దంపు సొంపు
నింపునుయ్యాలలోన నిద్రింపు మనుచుఁ
బాటఁ బాడుచు నూచి రాపట్టినపుడు.

265


సీ.

కనుఱెప్పలిడక చక్కనజూచు తనకూర్మి
     తండ్రిని గను బురందరుని బోల్కి
పాలబుగ్గలపెంపు బరఁగును దనకుల
     స్వామిబుట్టిన దుగ్ధజలధిలీల
కరము లల్లనజాచి కదలించు తనవంశ
     కర్తయై తగుసుధాకరునిమాడ్కి
బుడమినిల్వడి తప్పడుఁగుల నిడు బలి
     మథనుఁడౌ తనమేనమామ పగిది


తే.

వైభవగభీరరుచిరకృపాభిరతులఁ
దేజరిలునంచు నికవేరె తెలుపనేల
ననుచు బుధులు నుతింప నయ్యతివబెంప
చిన్నిబాలుఁడు ముద్దులఁ జేయుచుండు.

266


సీ.

తొట్టెపై పికిలిబంతులు జూడఁగా సాగె
     మొగమెత్తి పొరలి బోరగిలసాగె

చెల్వమౌ జోపాట చెవియొగ్గి వినసాగె
     కిలకిల నగి ముద్దుజిలుక సాగె
కూర్చుండి చప్పటు ల్గొట్టి యూగఁగసాగె
     వేడుకల్ జూపి దొగ్గాడసాగె
చేతుల నప్పచుల్ జెయిమన్న జేసాగె
     వడి తప్పటడుఁగుల నిడఁగసాగె


తే.

నంతకంతకు దోఁబూఁచు లాడసాగె
నెత్తుకొని దించునపుడు పోర్వెట్టసాగె
బిలుచువారలతొడలపై నిలువసాగె
మాటికతఁ డిట్టు ముద్దులమూట గట్టి.

265


శా.

చుంచుం బుత్తడి ముత్తియాల్ మెలుచుకుచ్చు ల్పచ్చరా లుచ్చులున్
మించం జాలు కడేలుడా ల్గొడల గ్రొమ్మించుం గమిం చుంగరాల్
చంచత్కాంచననూత్నరత్నకృతమౌ జాబిల్లి ఫాలాగ్రమం
దంచత్ప్రీతి చలింప క్రీడఁగొను లోకానందసంధాయియై.

266


క.

దుడదుడ నడుఁగులు దడఁబడ
కడువేడుక నిడుచు తల్లి కడ నాడును నే
యెడ ధర్మ మిటుల భూస్థలి
నడుఁగుల నడిపింతునని యథార్థముదోపన్.

267


శా.

గున్నై మిన్నగు చిల్కతాళ్సరిఫిణీ ల్గొల్సుల్ సరా ల్కుండలాల్
సన్నాజి ల్గురుమా ల్తురాయి మొలనూల్ జూపట్ట నట్టిట్టుమే
ల్వన్నెల్ గుల్కఁగ నాటలాడుతరి నవ్వయ్యార మయ్యారె యే
మన్నాతీరునె కండ్ల పండువలు సేయం జూడఁగానే వలెన్.

268


క.

ఈ చందంబున బాలుం
డాచందనగంధి బెంప సభ్యుదయుండై
యాచందమామతో తుల
దూచం దగు మేని కళలతోఁ బెరుగుతఱిన్.

269

వ.

అంతం క్రమక్రమంబున నెలబాలునింబోలు నబ్బాలుండు దినదినబ్రవర్ధమానుం డగుచు నుండె మఱియును.

270


ఉ.

అంతట రాజసూయ మహదధ్వర మా సమవర్తిసూనుఁ డ
త్యంత ముదంబున న్సలుప నర్థిఁ దలంచి దిగంతరావనీ
కాంతుల నెల్లఁ గెల్వ మురఘస్మరుఁ డెందు సహాయ మంచు సు
స్వాంతమునం దలంచి యనుజన్ముల కీ తెఱుఁగెల్లఁ దెల్పియున్.

271


క.

నయమీ క్రతువు విపక్ష
క్షయము యశస్సర్వ దిగ్విజయ మఖిల సుహృ
త్ప్రియము వశీకృత లోక
త్రయ మిదియు నుపక్రమింపఁదగునని మఱియున్.

272


క.

గెలుతము శాత్రవనృపతుల
వెలుతము తద్రాజ్య కలిత వివిధ శ్రీలన్
నిలుతము సత్కీర్తి నిదే
ఫలితము లోకైక ధరణి పాలుర కెల్లన్.

273


వ.

అని వచించి విజృంభించి.

274


క.

తమ్ములకు రథభటాశ్వగ
జమ్ముల నిడి భూనభోదిశాగతరిపురా
ష్ట్రమ్ముల విజయమ్ములచేఁ
గొమ్మని రమ్మనుచు వీడు గొలిపి ముదమునన్.

275


సీ.

సంజయాదినృపాలకుంజరాన్వితు సహ
     దేవుని దక్షిణదిశకు బనిచెఁ
బ్రకటసేనాచతుష్ప్రకరంబుఁ గొలువఁగా
     నకులుని పశ్చిమాశకు విధించె
దుర్జనరిపుజయోపార్జితుండగు సవ్య
     సాచిని యుత్తరాశకు విధించె

భద్రకేకయమత్స్యపతులతో భుజబలో
     ద్దాముని భీముఁ బ్రాగ్భూమి కనిపె


గీ.

నంత చతురంగభూతలాక్రాంతమనుజ
కాంతసంతానదుర్మదధ్వాంతతాంత
కాంతికాంతనిశీధినీకాంతులన దు
రంతవిక్రము లగుచు నంతంత వెడలి.

276


క.

ప్రాచీదక్షిణప్రత్యగు
దీచీభూభాగదుర్మదీభూతధరి
త్రీచక్రేశులధైర్యసు
ధీచతురత గెలిచి వార లతిత్వరితగతిన్.

277


చ.

నలుదెసలం జయించి నరనాథులచే తగుయప్పనంబు లు
జ్జ్వలతరనూత్నరత్నగజవాజిశతాంగభటాంగనాంబరం
బులు శిబికంబులుం గనకభూషణము ల్గొనిదెచ్చి ధర్మజుం
డలర నొసంగి మ్రొక్కి వినయాన్వితులై వచియించి రున్నతిన్.

278


క.

మీపంపున గాదే రిపు
భూపాలుర గెల్చి జయముఁ బొందితిమి భవ
త్కోపానురూపమై దగు
చూపున కెవఁడైన వ్రేలు జూపం గలఁడే!

279


క.

అని వినయమునను తము దె
చ్చిన ఘనకనకమణిధనవిశేషములను స
య్యన నొసఁగిన నవియు సుయో
ధను నందుకొనంగ నాజ్ఞ తగ నియమించెన్.

280


క.

గంభీరనిధి యుధిష్ఠిరుఁ
డంభోరుహనాభు నియమ మటుగొని సవనా

రంభోరుమతిని తత్త
త్సంభారములుం గ్రమానుసరణతఁ గూర్చెన్.

281


సీ.

అఖిలార్తిజనమనోహరవస్తుసంచయం
    బెఱిఁగి గోరినరీతి నిడఁగ గర్ణు
షడ్రసోపేతభోజనచిత్రవైఖరుల్
    వడ్డింపఁగా గంధవహతనూజుఁ
బద్మాక్షు నిఖిలసపర్యల నొనగూర్చి
     సరసబాయక నిల్వ సవ్యసాచి
క్రతుసమయోచితార్జితశుభద్రవ్యముల్
     బ్రేమఁ దెప్పించి యిప్పింప నకులు


గీ.

గురుబుధద్విజదేవభూసురుల నరసి
పూజ గావింప సహదేవు పుణ్యసతుల
భక్తి నర్పింప ద్రుపదభూపాలపుత్రిఁ
దగ నియోగించె నీరీతి ధర్మసూతి.

282


సీ.

వ్యాస వైఖానస వాల్మీకి వరతంతు
     వాలఖిల్య వసిష్ఠ వామదేవ
కౌండిన్య గశ్యప కపిల కౌశిక కణ్వ
     కవన కవ్య క్రతుజ్ఞ కవల కాండ
గాధేయ గాంధార గౌలస గార్గేయ
     గౌతమ గాలవ గర్గ గవయ
మైత్రేయ మౌద్గల్య మాండవ్య మాగధ
     మధు మతంగ మరీచి మందపాల


తే.

శక్తి జమదగ్ని జాబాల ఛంద చ్యవన
సాంఖ్య జైమిని శాండిల్య సనక సరళ
బక భరద్వాజ భార్గవ భరతముఖ్య
మునుల రావించి విధ్యుక్త మనుసరించి.

283

ఉ.

మేరుచతుర్దశాకలితమేదినిపాలనధుర్యులైన సౌ
వీర విరాట చోళ కురువీర వరాంగ కళింగ వంగ కా
శ్మీర మరాట యావనక సింహళ గౌళ పుళింద మత్య్స గాం
ధార కరూశ కేరళ విదర్భముఖావనిపాలు రున్నతిన్.

284


క.

అరుదెంచి ధర్మతనయుని
బిరుదెంచి వినమ్రు లౌచు ప్రియ మలర సుధా
సరిదంచితోక్తులను మఖ
మరుదెంచి ప్రమోదహృదయులై యున్నయెడన్.

285


చ.

హరి శిఖి ధర్మ నైరృతి మహార్ణవనాథ మరు ద్ధనేశ శం
కర రవి చంద్ర భూజ బుధ కావ్య గురు స్థిర రాహు కేతు పం
కరుహతనూజ సిద్ధ సుర గారుడ గుహ్యక సాధ్య కిన్నరుల్
కురుకులు లాంబికేయ కృప కుంభజ భీష్మకు లేఁగుదెంచినన్.

286


క.

ఉచితోపచారవిధులన్
రచియింపుచుఁ దత్తదవసరంబుల ఋత్వి
క్ప్రచయంబు లుచితవిధులన్
వచియింపఁ దదైకభక్తివశుఁడై నిలిచెన్.

287


క.

అత్రిముఖాఖిలమును లౌ
ద్గాత్రమున న్నిఖిలహోమకర్మంబులు త
త్సూత్రవిధి నడప, ధర్మధ
రిత్రీపతి వారి ననుసరించి యొనర్చెన్.

288


సీ.

వివిధసంపన్నముల్ విమలశాల్యన్నము
    ల్సూపముల్ రుచిరానురూపములును
సకలశాకంబులు సారస్యపాకంబు
    లిరసంబులు సుధాతతిరసములు

ఘృతములు సౌరభాయతసమన్వితములు
     క్షీరముల్ మధురానుసారములును
చిత్రోదనంబు లార్జితమోదనంబులు
     దధులు వజ్రోపలప్రథితనిధులు


తే.

రుచుల చవిగొని మెసఁగఁ గోరుచు లలిం భు
జించి ధర్మజుఁ డటులఁ బూజించి కప్పు
రంపు విడెముల నీయ తోరంపు మహిమఁ
గరము జెలువొందె విప్రనికరము లపుడు.

289


క.

ఆహవనీయప్రముఖ మ
హాహవనాగ్నులు ప్రదక్షిణార్పుల వెలఁగెం
దాహముఁ దీఱఁగఁ గ్రతుపూ
ర్ణాహుతి శ్రుతిమంత్రవిధుల నటు వ్రేల్చుతఱిన్.

290


సీ.

క్రతుమహోత్సవ సమాగత విప్రభోజనా
     హ్వాన రణద్ఫేరిభాంకృతంబు
నఖిలభూసుర దేవతార్చన నైవేద్య
     సమయ ఘంటానాదఝాంకృతంబు
నానాభినయనాట్యగానానురాగ వ
     ర్థిత మృందంగాది దింధీకృతంబుఁ
దాపసపూజావిధానార్ఘ్యపాద్యాది
     కూలంకషాంబు ఘుంఘూకృతంబు


గీ.

నొక్క మొగి దిక్కులను నెక్కి పిక్కటిల్లు
నాద మంతటఁ ద్రిభువనాహ్లాదమైన
భూసతీమణి దృప్తిచేఁ బొగడె ననఁగ
సమధికము జెందుఁ గ్రతుమహోత్సవమునందు.

291


క.

మోదమున లక్షభూసురు
లోదనములఁ దృప్తి నొంద నొకసారి మహా

నాదమున మొరయు దుందుభి
నాదారక మ్రోసెఁ గ్రతువున నహర్నిశలన్.

292


సీ.

హవ్యోచితద్రవ్యనవ్యసత్కృతులచేఁ
     బ్రముదితాత్ముం డయ్యెఁ బావకుండు
వినయ సపర్యాది సనయప్రయుక్తిచే
     మది సంతసిలె రాజమండలంబు
నర్ఘ్య పాద్యాఖిలానర్ఘ్య గౌరవముచేఁ
     బరితుష్టి నొందెఁ దాపసకులంబు
షడ్రసోపేతభోజనదానవిధులచే
     సుఖు లైరి భూసురా ద్యఖిలజనులు


తే.

నిర్మలావభృధస్నానధర్మమునను
వివిధ లోకంబులెల్లఁ బవిత్రమయ్యె
బలరిపువిభాతి నీరీతి పాండుసూతి
యాచరించిన రాజసూయాధ్వరమున.

293


చ.

సకలధరామరాళికి ప్రసర్పణ దక్షిణతోడ హస్తిఘో
టక శిబికారథంబుల దృఢస్థితి భక్తి నొసంగి, లోకనా
యకుఁ డగు నందనందను గృపాభిరతిన్ వివిధానుభూతియం
దొకటి గొరంతలేకను సహోదరసేవితుఁ డౌచు నుండఁగన్.

294


చ.

మయుఁ డను విశ్వకర్మకులమండనుఁ డాసురకోటికిం జమ
త్క్రియలగు శాంబరీమయనికేతనము ల్విరచించి సర్వది
గ్జయమును బొందనేర్చు జయశాలి యతం డొక దివ్యమౌ సభా
లయ మొనరించి తెచ్చి యకలంకగతిం దనకీయ వేడుకన్.

295


వ.

అది మఱియును-

296


సీ.

సురలోకమునిభాతి సుమనోనిధానంబు
     నబ్ధిసంగతిబాడ బాస్పదంబు

గిరిరాజమునుబోలె సరసుల కనుకూల
     మభ్రంబుగతి సత్కళాంచితంబుఁ
బ్రాగ్దిశాసదృశంబు భాస్వదినప్రాప్తి
     యటవిపోలిక వివిధాగమనిధి
ఘనవసంతముమాడ్కి గణికాభిరామంబు
     బాణంబుగతిని ధర్మానుకూల


తే.

మల రసాతలలీల భోగులకు వసతి
విమలసన్మణివలెఁ ద్రాసవిరహితంబు
నల శశినిబోలె సదరిభయంకరంబు
నగుచుఁ జెలువొందు మయుని సభాలయంబు.

297


ఉ.

నీరము లేనిచోట నతినిమ్నజలంబులు భూరివారిసం
పూరితమైనచోట మరుభూములు, ద్వారము లేనిచో మహా
ద్వారములుం, దురాత్ములకు తథ్యముగాఁ గనుబట్టి సత్ప్రియుల్
జేరినచో కనత్కనకచిత్రితమై ముద మావహించెడిన్.

298


మ.

ఒకనాఁ డాసభలోన ధర్మతనయుం డుద్యత్ప్రమోదాప్తి గా
యకసామంతకవీంద్రమాగధపరిహాసద్విజానీక ము
త్సుకతం గొల్వ పురందరప్రతిభచే సొంపొందఁ బేరోలగం
బకలంకస్థితి దాను సోదరులు నిత్యానందులై యుండఁగన్.

299


సీ.

అకలంకబిరుదాంక సుకవీంద్రు లొక వంక
     నురుగాయక నికాయ మొక్క చాయ
పటుహాటకకిరీటపతికూట మొక చోట
     నుద్వేలహితజాల మొక్క మూల
సులతాంతతనుకాంతసురకాంత లొక చెంత
     నుద్గ్రీవరుతిరావ మొక్క క్రేవ
వనచారఘనసౌరమునివార మొక మేర
     నుద్దామభటభీమ మొక్క సీమ

గీ.

పెక్కువగఁజిక్కు నటకు లొక్కొక్కదిక్కు
నుట్టిపడినట్టి మాగధు లొక్కతట్టుఁ
గొలువ కొలువున కొలువుండె నలువచెలువు
మయునిమాయామయాలయమధ్యమునను.

300


చ.

అపు డతిమత్తుఁడుం దురభియాతి దయారసవర్జితుం డస
త్యపథుఁ డహంకృతుండు కలుషాత్మకుఁడుం గులపాంసనుండు బం
ధుపటలవైరి యార్యజనదూషకుఁ డైన సుయోధనుండు త
ద్విపులసభాంతరస్థలికి వే జనుదెంచె నుదంచితప్రభన్.

301


సీ.

అతిచిత్రగతిమిత్రతతి వేత్రములఁ బూని
    బలశీలులై వెంటబలసి గొలువ
సకలాభినయశోభితకళాభిరతులచేఁ
     బ్రమదాలినర్తన ప్రమద మెసఁగ
మణికంకణాలంకరణఝంకరణము తో
     రములుగా సితచామరములు వీవ
నసమానలసమానరసగాన మెనసి హృ
     ద్యములుగా నిఖిలవాద్యములు సెలఁగ


తే.

హితపురోహితసుత సుహృత్ప్రతతివినుత
సతతహితగతి నతికుతుకత దనర్ప
వచ్చె నచటికి నతిమదమచ్చరమున
గ్రోధమానధనుండు దుర్యోధనుండు.

302


మ.

చనుదేరం గపటాత్ముఁడౌ కతన నాస్థానంబు మాయావిమో
హనముం గావున నిర్జలస్థలి ప్రవాహప్రాయమై నీరము
లనుబట్టం దన చింగులెత్తుకొని డాకాలూఁతచేతం జివు
క్కున లంఘించు జలంబుగల్గునెడలం గూర్చుండు భావభ్రమన్.

303

క.

ద్వారములుగలుగు నెడ-పెడ
దారిని యేతెంచి భిత్తితాడనముల - వే
సారుచు నొకచోనైనం
ద్వారము గనలేక బేలతనమున దిరిగెన్.

304


చ.

మదిని చికాకుఁ జెందు కురుమండను గాంచి, వృకోదరుండు ద్రౌ
పదియును దక్కుభూపతులు ఫక్కున నవ్వఁగ బాండవాగ్రజుం
డది గని, గన్నుసన్నల నయంబున వారి నదల్ప లజ్జమై
నొదవ సుయోధనుండు కుపితోగ్రత హస్తిపురంబుఁ జేరియున్.

305


క.

మయమాయామోహసభా
లయమున నీరీతిఁ గళవళం బగుచు నిజా
లయమునను నిలిచి యతిని
ర్దయచేఁ దక్షణమె ప్రతికృతం బూహించెన్.

306


మ.

కపటద్యూతముగూర్చి, పాండవభుజాగర్వంబుఁ బోకార్చి, రా
జ్యపదభ్రష్టత జేందఁగా శకునిమాయల్ జేర్చి, నానామహా
విపినస్థానములందు దుర్ధశల నుర్వి న్సంచరింపంగ నే
నిపుడే సేయకయున్న మత్కురుకులాధీశత్వముం జెల్లునే.

307


క.

అని యిటుల దురాలోచన
లొనరించి సమవర్తి ను నొయ్యన కపటా
త్మనిరూఢి హస్తినాపురి
కనుకూలునివలెనె బిలువనంపిన నతఁడున్.

308

క.

శకుని సుయోధను బక్షము
నకు నిలిచి, తదక్షముల నణంగిన మాయా
వికటంబు గనక ధర్మజ్ను
డకుటిలమతితోడ జూద మాడ దొడంగెన్.

309


ఆ.

జూద మనుసరించి వాదముల్ ఖేదముల్
దగులు ననెడి రాజధర్మ మెఱిఁగి
బేల యగుచు బుద్ధి పెడతలఁబట్టె నిం
కేమిఁ జేయవచ్చు నీశ్వరాజ్ఞ.

310


క.

ఆడఁగ నాడఁగ, మఱుమా
టాడఁగనీకన్ సుయోధనాహ్లాదమె చే
కూడఁగ, ధర్మతనూజుం
డోడఁగ దొణఁగె న్వినిర్గతోత్సాహుండై.

311


సీ.

వేసారకను జూడు మీసారివ్రేటుచే
     నాసారెచేహూలు నడిపి గెలుతు
రేపాడనిత్తునా రాపాడి యికనైనఁ
     గాపాడ నీజోడు గదలఁ దీతు
నీ పట్టు లొకసారి నా పట్టుఁ జూడు నీ
     దాపెట్టు లేకుండఁ దరిమి పెడుదు
నీవంకఁ జూడకు నీవింక నిశ్శంక
     నీ బింకము లడంచి నిలువరింతు


తే.

ననుచు శపథోక్తులను జూద మాడ దొడఁగె
శకుని యవ్వేళ సుపథదుశ్శకునుఁ డగుచు
నిచ్చగల పందెములఁ దన కిచ్చుచుండ
సాధుబాధకుఁడైన దుర్యోధనుండు.

312

ఉ.

ఇమ్మెయి ధార్తరాష్ట్రుఁడు జయింపఁగ ధర్మజుఁ డాడ నాడ న
ర్థమ్ముల నోడె- గాంచనరథమ్ముల నోడె, గజాశ్వసద్భటౌ
ఘమ్ముల నోడె - సర్వకటకమ్ముల నోడె - జగత్ప్రపూజ్యరా
జ్యమ్ముల నోడె- తన్ను ననుజన్ముల నోడె నిజమ్ము నోడకన్.

313


క.

ఆతఱి ద్రుపదాత్మజబహు
రీతులఁ బాండవుల నుద్ధరించి తగ, పున
ర్ద్యూతమునకు దొరకొనఁగ వి
ఘాతకుఁడగు శకుని విషమగతి కపజితుఁడై.

314


క.

కొండారణ్యంబుల పది
రెండేడులు వెతల సంచరింపఁగ మఱియొ
క్కొండే డజ్ఞాతమ్మున
నుండఁగ నియమించె నాసుయోధనుఁ డంతన్.

315


చ.

సకలధరాధిపత్యము విసర్జనం జేసి సతీసహోదర
ప్రకరముతోడ, దా నటవి పర్యటనం బొనరింపఁబూని బా
లకు నభిమన్యు పై నెనర లంఘ్యముగావున బాయలేక కొం
డొకతడ వాత్మ చింతిలి నయోక్తులతోడ సుభద్ర కిట్లనున్.

316


క.

ఓసాధ్వి! నీవు నీసుతుఁ
డీ సమయము గడవ, పుట్టినింటికిఁ జని య
త్రాసతఁ బదమూఁ డేడులు
వాసిగ సోదరులవశత వర్తించఁదగున్.

317


క.

అని, జననీతనయుల ద
త్క్షణమే వీడ్కొల్పి ద్వారకాపురమునకుం

బనిచి, మహారణ్యమునకు
జనియెం ద్రుపదసుతుతోడ సహజులు గొలువన్.

318


సీ.

కుంతిని ధృతరాష్ట్రుచెంత నుంచి, సుభద్ర
     నభిమన్యు ద్వారక కనుపుటయును
ద్రౌపదితో తామరణ్యంబు జొచ్చి భీ
     ముండు కిమ్మీరుని జెండుటయును
భవుఁడు వరాహనెపమున బోరఁ జయించి
     యర్జునుం డస్త్రంబు లందుటయును
గాలకేయనివాతకవచుల నాతండు
     దివమున కేఁగి వధించుటయును


తే.

నియతమతి ద్వైతవనమున నిల్చుటయును
వినిన దుర్యోధనుఁడు విఱ్ఱవీఁగుటయును
దెలిసి జనమేజయుఁడు మోదించుటయును
నవలికథ దెల్పుమని బైలు నడుఁగుటయును.

319

ఆశ్వాసాంతము

పతాకబంధము

ఉ.

వేదపదప్రదర్శన! నవీనఘనద్యుతిదేహ దేవదే
వా! దరసారధారణ ! శుభప్రభవాభరణప్రదీప్త! దా
మోదర! వాదభేదనదమోదయ! మానసవాసవాజరు
ద్రాదిమభావ! భావితపదాంబుజ! తాపసబృందమోదదా!

320

ఖడ్గబంధము

క.

శూరవరసారకరఖర
మారణరణరంగనిహతమధుమురనరకా!
కారణసమధికనిపుణ ర
మారమణీమానసౌక! మన్మథజనకా!

321

పతాకబంధము

ఖడ్గబంధము


కం.

శూరవరసారకరఖర
మారణరణరంగనిహతమధుమురనరకా!
కారణసమధికనిపుణ ర
మారణీమానసౌక! మన్మథజనకా!

(1-321)

నిరోష్ఠ్యము


చ.

నలినజశంకరత్రిదశనాథశరణ్య! దయాంతరంగ! స
జ్ఞలజశరాంగ! సారదర శార్ఙగదాసిజయాగ్రసాధనా!
కలితధగధ్ధగద్ధగితకాంచనగల! నిశాకరాయతా
స్యలలిత! శేషశైలశిఖరాగ్రనికేతన! తార్క్ష్యకేతనా!

322


భుజంగప్రయాతము.

రమాకామినీచిత్తరాజీవభృంగా!
సమజ్జన్యచేతోవనశ్రీకురంగా!
అమర్త్యద్విషత్కర్దమాంచతృతంగా!
సముద్యధ్విషాగాగ్రసంచారచంగా!

323


మ.

ఇది శేషాద్రిగుహావిహారకమలాహృత్పోల్లసద్భావనా
ర్యదయావత్సుత రాఘవార్యగురుచంద్రప్రాజ్ఞసోదర్యమో
హదమౌద్గల్యకులీన వేంకటనృసింహాచార్యసంప్రోక్తధీ
వదతాలాంకసునందినీపరిణయాశ్వాసంబు ప్రాధాన్యమున్.

324


గద్య ఇది శ్రీమచ్ఛేషధరాధరసౌధవీధీవిహరణవేంకటరమణ చక్షుర్విలక్షణాక్షీణకృపాకటాక్షవీక్షణాపరిలబ్ధ లక్ష్యలక్షణానవద్యవిద్యావిలాస శ్రీనివాస గురుచరణస్మరణాభ్యసనరసనావికాస నిస్తుల్య కల్యాణ సాకల్య మౌద్గల్య గోత్ర పవిత్రభావనాచార్యపుత్ర

పర్వత్రయ కైంకర్య నిధాన
వేంకటనృసింహార్యాభిధాన ప్రణీతంబైన
తాలాంకనందినీపరిణయంబను
మహాప్రబంధంబునందుఁ
బ్రథమాశ్వాసము. 325

 1. వీనితర్వాత కొంతభాగము ‘ప్రా'లో గ్రంథపాతము, మరల, 24-25 సంఖ్యలుగల పద్యము లున్నవి. తర్వాత, 'ఇట్లు శ్రీమద్వృషధరాధర—' వచనముతో ప్రారంభము, 'తా' - ఈ 10 సంఖ్య వచనమునుండియే గలదు.
 2. యోచించుతఱిని - అనవలెను
 3. ‘గునుక సీసము’ అని ‘తా’ ప్రతులలో గలదు.
 4. మూలప్రతులలో ఈపాద మింతే గలదు.
 5. నారంగములతీరునను నూఁగారు - మూల ప్రతులు.
 6. విద్వత్కౌశలుం - మూలప్రతులలో పాఠము
 7. యశస్సారవశస్ఫార - ‘మూ’
 8. వేధోదిమ. (తా.లి.)
 9. బెట్టిదంటేని - ‘తా’
 10. సుపరిష్కృత - ‘తా’
 11. తత్కథా-(లి)
 12. ‘బండి-మూ’
 13. ఘీంకృతి. ' రా' , ప్రా.
 14. వామనగుంత. (తా.లి.)
 15. చూచి చూచి (లి)