తత్తర పడనేల - తాళు తాళురా సామి

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search


పల్లవి:
తత్తర పడనేల - తాళు తాళురా సామి
అత్తింటి కోడలరా ॥తత్తర॥

అనుపల్లవి:
కొత్తగా నేవచ్చి - కొన్ని నాళ్లాయెరా
పొత్తుగడియ మరచి - పోరు మా వారు
చిత్తమున నేరమెంచకురా - చీకటి వేళగాదురా
అత్తవారింట లేకున్నపు - డైన రావైతివిర సామీ ॥తత్తర॥

చరణ:
మక్కువ చెక్కిలి - నొక్కరాకురా సామి
- నొక్కు లెక్కడ దాతురా
అక్కడ నున్నది - అదిగో యాడు బిడ్డ
ఇక్కథ లెరిగిన - నెగిరి పైబడు సామి
నిక్కముగ నీకె దక్కితిరా - నేటి మాపటికి రాపోరా
పక్కనే పంచాది గది వెల - పటి తలుపు మూయకుంచెదరా ॥తత్తర॥

కౌగిటి కిది వేళ - గాదురా నీకింత
- కక్కుర్తి పని యేమిరా
బాగు బాగు రవిక - బట్టి నీగోళ్ళతో
లాగిన పికిలె నే - లాగు బొంకెదురా
కాగలదురా నీవు కోరిన - కార్యమది యొక జాములోపన
రాగదుర మాపటికి మా లో - గిటికి పడమటి కిటికి దారిని ॥తత్తర॥

వల్లగాదుర తోట్ల - వల్లూరి వేణుగో
- పాల తగదు తగదురా
చల్లని పన్నీరు - చల్లి యత్తరు దేహ
వల్లి బూసెదు మూయ - వశమా వాసనలు
సల్లలిత దాసు రాముని కృతి - నుల్లసిల్లితివిరా మది మన
మల్లగుంతలె వారు చూచిన - నల్లరికి మూలమగు సామి ॥తత్తర॥