తగు తగులేరా చిన్న - దాన తాళజాలరా

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search


పల్లవి:
తగు తగులేరా చిన్న - దాన తాళజాలరా, నా
తోను పంతమేలరా యిం - తైన నిల్వలేనురా ॥తగు॥

చరణ:
నను గరుణింపవేర - న్యాయమరసి చూడరా, నా
మీద కోపమేలరా నీ - కేల రవ్వ మానరా ॥తగు॥

కోమలమగు నాదు వయసు - కోన వెన్నెలాయెరా, నా
గుట్టు బయలు బట్టెరా - నా కోరిక లీడేర్చరా ॥తగు॥

వేసకాడ ముద్దుసామి - వేణుగోపబాలకా, శ్రీ
దాసురామపాలకా నా - పాలి పంచనాయకా ॥తగు॥