Jump to content

జీవితమే సఫలము

వికీసోర్స్ నుండి

<poem>

జీవితమే సఫలము రాగా సుధా భరితము ప్రేమ కథ మధురము

హాయిగా తీయగా ఆలపించు పాటల వరాల సోయగాల పూల వలపు గొలుపు మాటల అనారు పూల తోటల... ఆశ దెలుపు ఆటల జీవితమే సఫలము...

వసంత మధుర సీమల ప్రశాంత సాంధ్య వేళల అంతు లేని వింతల అనంత ప్రేమ లీలల.. వరించు భాగ్యశాలుల... తరించు ప్రేమ జీవుల జీవితమే సఫలము