జానపద గేయాలు/వస్తావంటెపిల్ల

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

వస్తావంటెపిల్ల

హరికాంభోజి స్వరాలు - త్రిశ్రం

వచనం ఆ చీరాడ్తదా
             ఊ చీరాడ్తదీ

ఆమె నీ - చేతనున్న చింతబెత్తం చీరాడ్తెనూ
              నా - నోట్లోఉండె బండమాట బయటెల్లదా

అతను నీ - నోట్లో ఉండె బండమాట బయటెల్లితే
              నా - కాళ్ళ ఉండె కిర్రుజోడు దవడాడ్తదీ

ఆమె నీ - కాళ్ళ ఉండె కిర్రుజోడు దవడాడితే
              నే - నమ్మగారింటికీ దౌడేస్తనూ

వచనం ఆ దౌడేస్తవా
              ఊ దౌడేస్తనూ

అతను నువ్వమ్మగారింటికీ దౌడేస్తనూ
              నే-కొట్టకుండ తిట్టకుండ తీసుకొస్తనూ

వచనం ఆ - తీసుకొస్తవా
              ఊ తీసుకొస్తనూ

ఆమె నువ్వు - కొట్టకుండ తిట్టకుండ తీసుకొస్తనూ
              నే - కూడొండకుండాను కూకుంటాను

అతను నువ్వు - కూడొండకుండాను కూకుంటేనూ
              నే - పొలమెల్లకుండాను తొంగుంటాను

వచనం ఆ తొంగుంటావా
              ఊ తొంగుంటానూ

ఆమె నువ్వు - పొలమెల్లకుండాను తొంగుంటేనూ
              బావిలో ఉన్న గుంటలోన నే పడ్తనూ