Jump to content

జర్మనీదేశ విద్యావిధానము/అధ్యాయము 7

వికీసోర్స్ నుండి

కుండా కొన్ని సమయాలలో పుస్తకాలు, బట్టలు కూడ ఇస్తారు. పేద పిల్లలకు ఉచితముగా వైద్యమున్ను చేస్తారు.

ఆధ్యాయము 7.

పల్లెటూరి బడులు (ఫార్ షూలె)

యుద్ధసమయమున జర్మనీలో వ్వవసాయము చాల అభివృద్ధి చెందినది. పూర్వము పశువుల మేతకు వదలి పెట్టిన భూమి ఇప్పుడు సాగులోనికి వచ్చినది.చాల కాలము వరకు జర్మనులు తమ దేశములో పండే పంటల మీదనే బ్రతకవలసి వచ్చినది. అందు చేత వ్యవసాయమును గురించి శాస్త్రీయ పద్ధతుల ప్రకారాము పరిశోధనలు చేసి, ఆ శాస్త్రగ్నానమును పండ్లు, కూరగాయలు, ధాన్యములు, ఎక్కువగా మునుపటి కంటే బాగుగా ఎలాగు పండించడమో అనే విషయమునకు వినియోగించినారు, ఇంగ్లాడులో వ్వవసాయము వల్ల అంత లాభము లేదు. కనుక, వరు పొల

46

ములను పశువుల మేత బీళ్లుగా మార్చుకొంటారు. అందు చేత పల్లెటూళ్ళ జనము క్రమక్రమముగా పట్టణాలలోనికి వచ్చేస్తున్నారు. కాని, జర్మినీలో అట్లు కాదు. జర్మనులకు వ్యవసాయము లాభకరముగా ఉన్నది. జర్మనులకు వ్వవసాయము లాభకరముగా ఉన్నది. వ్వవసాయదారులకు తమ పనికి అంటి పెట్టుకొని ఉండడమే ఇష్టము. పూర్వము జంతువులనుంచి మాత్రమే తయారయ్యే చాల వస్తువులను జర్మనులు వృక్షములనుంచి కూడ తయారు చేయడము నేర్చుకున్నారు. అందు చేత వారు ఆడవులను పెంచడములో ఎక్కువ శ్రద్ద వహించి ఎంతో అభివృద్ది పొందినారు. అనేక జర్మను విశ్వవిద్యాలయాలలో అడవి శాఖలను ఏర్పాటు చేసినారు. ప్రత్యేక వ్వవసాయ కళాశాలలను అభివృద్ధి చేసుకొన్నారు. పరిశోధనల కోసము లెక్కలేనన్ని పొలములు లేచినవి. ఆరేసి గ్రామములకు ఒక్కొక్క పరిశోధన క్షేత్రమున్నది. జర్మినీలో కొన్ని పల్లెటూళ్ళు కలసి ఒక గెమెండె అను పేరు కలిగి ఉంటవి. ఒకొక్క మండలమునకు ఒకొక్క స్కూళ్ళ ఇన్ స్పెక్టరు ఉంటాడు. ఆ మండలములోని పల్లెటూరి బడులన్నీ అతని పరిపాలనములో ఉంటవి. ఒకానొక మండలములో 75 పల్లెటూళ్ళున్నవి. వాటిలో జనసంఖ్య 40,000 ఉన్నది. వీటిలో ప్రతి పల్లెటూరికి ఒక బడి ఉన్నది.

ఈ బడులలో నిర్బంధముగా వయస్సు పధ్నాలుగేండ్ల వరకు చదువు చెప్పుతారు. కొన్ని బడులలో ఒకొక్క తరగతికి, ఒక్కడే ఉపాధ్యాయుడు ఉంటాడు. పిల్లల సంఖ్య అరవైకి పైబడితే మరి ఒక ఉపాద్యాయుడిని నియమించవచ్చును. ప్రస్తుతము పిల్లల సంఖ్య ఎక్కువగానే ఉన్నది కాని, దన లోపము చేత అంతకంటె తక్కువ మంది పిల్లలకు ఒక ఉపాధ్యాయుడిని ఏర్పాటు చేయడానికి వీలు లేకున్నది. (కొన్ని దేశాలలో ఒక్కడే ఉపాధ్యాయుడుండే బడులలోని పిల్లలను రెండు తండాలుగా విభాగించి, ఒక తండావారికి సోమ, బుద, శుక్ర వారములలోను, రెండోతండావారికి మంగళ, గురు, శని వారములలోనున్ను చదువు చెప్పుతారు.) జర్మినీలో ఒక బడిలో 62 పిల్లలు కూడా ఉన్నారు. ఒకొక్క మండలమునకు ముగ్గురు వైద్యులున్నూ, ఇద్దరు దంత వైద్యులున్నూఉంటారు. వీరు నెల కొకసారి ప్రతి బడికి పోయి తనిఖీ చేస్తారు. బడిలో ప్రవేశించేటప్పుడు, ప్రతి విద్యార్థినిన్ని వైద్యుడు సంపూర్ణముగా తనిఖీ చేసి, ఒక ఫారములో తాను పరీక్షించిన విషయాన్నిటినీ వ్రాసి ఉంచుతాడు.

వైద్యుడు ప్రతి బడిని నెలకొక సారి అయినా పరీక్షిచి, రోగములు గాని,అంగ వైకల్యము గాని గల పిల్లలను "హిల్ఫ్ షూలె " (hilf schule) అనేప్రత్యేక విద్యాలయానికి పంపుతారు. గ్రుడ్డి, చెవుడు, మూగ పిల్లకున్ను, రోగిష్టి పిల్లలకున్ను, మందమతులకున్ను, ప్రత్యేక పాఠశాల లున్నవి. ఈ పాఠశాలలో పూర్వము నిర్బంధ పాఠ క్రమము లేకుండెను గాని 1924 సం. ములో ఒకొక్క రీతి బడికి ఒకొక్కరీతి పాఠ క్రమమును విద్యాంగ మంత్రి ఏర్పాటు చేసినాడు. ఈబడులలో పిల్లలు ఎట్లు అభివృద్ది పొందుతున్నారో జాగ్రతగ కనిపెట్టుతూ వుటారు, జర్మినీ దేశములో మందమతులైన పిల్లలకోసమే కాకుండా అసాధరణ ప్రజ్ణగల పిల్లలకు కూడ ప్రత్యేక విద్యాలయములున్నవి.

49

ఈ పల్లెటూరి బడుల ముఖ్యలక్షణము, వాటిలో నేర్పే విషయములు కాదు. ఆయా విషయాలను నేర్పే పద్ధతియే గమనింపదగినది. ఉదాహరణకి, అన్ని బడులలోను గణితేము నేర్పుతారు గాని ఒకొక్కరీతి బడిలో ఒకొక్కతీరు లెక్కలు చెప్పుతారు. ఒకొక్కరీతి బడికి ప్రత్యేకముగా పఠనీయ గ్రంధాలు వ్రాస్తారు. ఏవో ప్రాత విషలమీదను, జీవితానికి అవసరము లేని విషయాలమీదను కాలము వృథాచేయరు. పిల్లల నిత్యజీవనానికి సంబంధించిన కొన్ని విషయాలను ప్రత్యేకించి వాటిని గురించి మాత్రమే చెపుతారు. ఉదాహరణానికి, పొలములను స్వయముగా కొలిపించి, విత్తుల ఖరీదును, పండిన పంట ఖరీదును పిల్లల చేత కట్టిస్తారు. ఇట్లే, ఇతర విషయాలలో కూడాను. ఇత్రలేఖనము, చరిత్రము, భూగోళ శాస్త్రము, వాచక ఉస్తకాలు, ఇవన్నీ గ్రామ జీవనము మీద పిల్లల దృష్టి నిలిచేటట్లు చేస్తవి.ఈ పల్లెటూరి బడుల ఉపాధ్యాయులను ఆచుట్టుపట్ల వారినే నియమిస్తారు. వారికి ఆయాగ్రామాల


50

పరిస్థితులు తెలిసి ఉంటవి. ప్రతిబడికిన్ని ఒక పెద్ద తోట ఉంటుంది. ఒకొక్క పిల్లవాడు సాగు చేయడానికి కొంత స్థలము ఏర్పాటు చేస్తారు. వాడు తా నొక్కడే కాని, ఇతరులతో కలిసి కాని, అదానిని సాగుచేస్తాడు. తన స్థలములో పండించుకొన్న దానిని పిల్లవాడు ఇంటికి తీసుకొని పోవచ్చును. ఇంగ్లండులోని కొన్ని పల్లెటూరి బడులలో కొన్ని సంఘములవారు కలిసి భూములను సాగు చేసే పద్ధతి జర్మినీలో లేదు.

ఉపాధ్యాయుడు పిల్లలను వారమున కొక తూరి పరిశోధన క్షేత్రములకు తీసుకొని పోయి, వ్వవసాయ శాస్త్రములో సరికొత్తగా కనిపెట్టబడిన విషయాలను పిల్లలకు బోధచేస్తాడు. బడులలో వ్వవసాయము విషయమై సామాన్యోపన్యాసములిస్తారు. వీటిని పిల్లలు తలిదండ్రులు కూడా వచ్చి వినవచ్చును. పల్లెటూరి ప్రారంభ పాఠశాలలో వ్వవసాయమును ప్రత్యేక విషయముగా చెప్పరు గాని, విద్య వ్వవసాయము దారినే పట్టి ఉంటుంది. పాఠ్య పుస్తక నిర్ణయము, ఉపాధ్యా


51

యులు చెప్పే చదువు బడులలోనే చేసే వ్ద్వవసాయము, వవసాయ క్షేత్రములకు తరుచుగా పోయి చూడడము, వ్వవసాయము, పండ్ల చెట్ల కృషి మొదలయిన విషయములగురించి ఉపన్యాసాలు, ఇటువంటి వాటిచేత ఈ పాఠశాలలలోని విద్య వ్వవసాయ రీతినే అవలంబిస్తుంది. వ్వవసాయ విషములను గురించిన శాసనములను కూడ పిల్లలకు బోధిస్తారు. కోతల కాలములో పల్లెటూరి బడులకు ఎక్కువ సెలవులిస్తారు.

పధ్నాలుగేండ్ల వయస్సుతో పిల్లలకు నిర్బంద విద్య అయిపోతుంది. అప్పుడు వారు పొలాల మీద పని చేసుకొంటారు. ఇదే వారి వ్వవసాయ విద్యకు ప్రారంభ మనుకోవచ్చును. దేశ శాసనము ప్రకారము ప్రతి బాలుడున్ను, బాలిక యున్ను మరి రెండేళ్ళూన్నత గ్రామ పాఠశాలలలో (డోర్ఫ్ పోక్ హాక్ షూలె (Dorf Vilkhoch schule) చదువుకోవలెను. ఈ బడులలో (1) జర్మను భాష, (2) గణితము (3) క్షేత్ర గణితము (4) చిత్రలేఖనము (5) చరిత్రము, అనుభవశాస్త్రము (6) భూ


52

గోళ శాస్త్రము (7) కసరత్తు, (8) గాత్ర సంగీతము (9) పదార్త విగ్నానశాస్త్రము (10) సాధారణ విశేష వృక్షపోషణము (11) రసాయన శాస్త్రము (12) మొక్కలను గిరించి శాస్త్రము(13) జంతు శాస్త్రము (14) కూరగాయలు , పండ్లు, పండించడము (15) చిట్ఠాఅపర్జాలు వ్రాయడము (16) జంతువులగురించి బోధన, అనే విషయాలను నేర్పుతారు. ప్రతి విద్యార్తిన్ని (1) సాధారణ వ్వవసాయము (2) తోటలు పెంచడము, లేక (3) కూరగాయలు, పండ్లు పండించడము, అనే విషయాలలో విశేష గ్నామును సంపాదించవలెను. చలికాలములో వ్వవసాయపు పనులెక్కువగా వుండవు గనుక, ఈ బడులు సాధారణముగా చలికాలములో ఉంటవి. ఈ బడులను డెన్మార్కు దేశములోని పల్లెటూళ్ళబడుల మాదిరిగా జర్మనులు ఏర్పాటు చేసుకొన్నారు కాని వాటికి వీటికి కొన్ని ముఖ్య భేదములున్నవి.

జర్మినీలో ఈ బడులలో పిల్లలు నిర్బంధముగా చదువుకోవలెను. డెన్మార్కులో ఐచ్చి


53

కము, నిర్బందము లేదు.

2) డెన్మారు లో ఈ బడులు వసతి గృహములుగా ఉంటవి. జర్మినీలో ఇవి పగటి బడులు మాత్రమై ఉంటవి. 3) డెన్మార్కులో విద్య వ్వవసాయవాసన గలిగి ఉంటుంది. జర్మనీలో వ్వవసాయమును ఎక్కువగా నేర్పుతా-రు.

ఈ బడులు డెన్మార్కులో కంటే జర్మినీలో ఎక్కువగా వున్నవి. 75 పల్లెటూళ్ళకు ఇటు వంటి బడులు 36 వున్నవి. 2 1/2 చదరపు మైళ్ళకు ఒక బడి వున్నది. ఈ బడులు పరిశోధన క్షేత్రములకు అనుబంధములుగా ఉంటవి.