జర్మనీదేశ విద్యావిధానము/అధ్యాయము 6

వికీసోర్స్ నుండి

పటములున్ను, ఇతర విద్యాసాధనములున్నూ కావలసినన్ని వుంటవి. పిల్లల ఎత్తున గది గోడలకు నల్లని రంగు పూసి ఉంటారు. పిల్లలు వాటి మీద వ్రాసుకుంటారు. ఇందువల్ల ఒక తరగతి పిల్లలలో సగము మంది ఒక్కసారిగా వ్రాసుకొనడానికి వీలవుతుంది.

ఆధ్యాయము 6.

ప్రారంభ విద్యాలయములు. (ఫోక్ షూలె

}}


జర్మినీ దేశములో బాలబాలిక లందరు నిర్భందముగా ఆరేళ్ల వయస్సునుండి పద్నాలుగేళ్ళ వయస్సు వరకూ విద్య నేర్చుకొనవలెనని శాసనమున్నది. ఈ ఎనిమిదేళ్ళలో మొదటి నాలుగేళ్ళున్నూ క్రిందటి అధ్యాయములో చెప్పబడిన సాధారణ పాఠశాలలో పదేళ్ల వయస్సు వరకూ అందురునూ చదువుకొనవలెను. ఆ తరువాత జీతము లిచ్చుకొని ఉన్నత విద్యాలయములలో చదువుకోలేని వాళ్లు సాధారణ పాఠశాలల

30

లోనే మరి నాలుగేళ్ళు చదువుకొంటారు. ఈ ప్రారంభ పాఠశాలలు (1)ఫోక్ షూలె (Vilk schule) లేక ప్రజల బడులు (2) మిట్టెల్ షూలె(Nuttek schUle) లేక మాధ్యమిక పాఠశాలలు అని రెండు విధములుగా ఉంటవి. గ్రామాలలోని బడులకున్ను పట్టణములలోని బడులకున్నూ కొంచెము భేదమున్నది. ఈ భేదము ముందు అధ్యాయములో తెలుపబడును.

మిట్టెల్ షూలె (Mittel schule)

మాధ్యమిక విద్యాలయములు

దేశము యొక్క కార్మిక, వాణిజ్యాభివృద్దుల కోసము కూలి పనివారి కంటె ఎక్కువ వారున్నూ కళాశాలలలో చదువుకొనిన వారున్నూ అయిన ఒక తెగ జనులు కావలసి వచ్చినది. అందుకోసము ఉచిత విద్య నిచ్చే బోర్డు స్కూళ్ళకున్ను, ఉన్నత పాఠశాలల కున్ను, మధ్యగా (మిట్టెల్ షూలె) అను మాధ్యమిక పాఠశాలలు ఏర్పాటయినవి. ఈ మాద్యమిక పాఠశాలలకున్నూ ప్రారంభ పాఠశాలలకున్ను సంబందము లేదు. అవి ప్రారంభ

31

ఉన్నత పాఠశాలలకంటె వేరుగా ఉంటవి. వాటిలోని విద్యావిధానము కూడ వేరుగా ఉంటుంది. మిట్టెల్ షూలె (MiTTel shcule)లోనికిన్ని ఫోక్ షూలె(Volk schule)లోనికిన్ని బాలురు పదేండ్ల వయసప్పుడే చేరినా మాధ్యమిక పాఠశాలల ఉపాధ్యాయులు ఎక్కువ విద్యానుభవము కలవారుగా ఉంటారు . వీటిలో సంవత్సరానికి ఎనిమిది పౌనులనుండి పన్నెండు పౌనులవరకు నామకాగా పిల్లలు జీతము చెల్లించవలెను. ప్రారంభ పాఠశాలలలో మాత్రము జర్మను భాష , రాజనీతిలో ప్రదమ పాఠములు, భూగోళశాస్త్రము, పకృతి పరిశీలనము అనుభవ పదార్థ విగ్నాన శాస్త్రము, లెక్కలు, క్షేత్ర గణితము చిత్రలేఖనము సంగీతము, కసరత్తు, చేతిపనులు, తోటపని ఇవి బాలురకున్ను, ఇవి కాక బాలికలకు కుట్టు పని, వంటలున్నూ నేర్పుతారు. ఈ ప్రారంభ పాఠశాలలో నేర్పే విష

32

యములే కాకుండా, మాధ్యమిక పాఠశాలలో ఒకటిగాని ఎక్కువ గాని పరదేశ భాషలను చిఠ్ఠాఆవర్జాలు వ్రాయడమున్ను, పదార్థ విగ్నాన శాస్త్రము, రసాయన శాస్త్రము , కొన్ని బడులలో జీవ శాస్త్రము, రసాయిన శాస్త్రము నేర్పుతారు. సామాన్య విషయములను బోదించే పద్ధతిలో కూడ భేదమున్నది. ప్రాథమిక మాద్యమిక పాఠశలలను స్థానిక ప్రభుత్వమువారే పరి పాలిస్తారు. మూల ప్రభుత్వము వారు వారికి గ్రాంటులిస్తారు. ఆ పాఠశాలల లోని ఉపాధ్యాయ్ల సంఖ్యను బట్టిన్ని, పిల్లల సంఖ్యను బట్టిన్నీ గ్రాంటు ఉంటుంది గాని బడులకన్నిటికిన్ని మొత్తముగ్రాంటు ఉండదు. ఈ పద్ధతి ప్రకారము ఒకొక్క తరగతిలో చాల ఎక్కువమంది పిల్లలను చేర్చుకోనడముగాని, కావలసినంత మంది కంటే ఎక్కువమంది ఉపాధ్యాయులను నియమించడముగాని జరుగదు. ఈ మాద్యమిక పాఠశాలలోని పిల్లలను పూర్వము యూనివర్సిటీ లలో చేఎర్చుకొనేవారు కారు. కాని 1902 సం. మున ఈ అడ్డంకిని తీసివేసినారు. ఇప్పటి విద్యా క్ర

33

మము ప్రకారము పిల్లలు 16 ఏళ్ళ వయస్సున ఉన్నత పాఠశాలలో చేరి, అబిట్యూరియెంటన్ (Aabiturienten) పరీక్ష ప్యాసై విశ్వవిద్యాలయములలో చేరవచ్చును. ఈ మాధ్యమిక పాఠశాలలోని పై తరగతులలో నాలుగు తరగతులున్నవి. పిల్లలు వాటిలో ఏదో ఒక భాగములో చేరవచ్చును. ఒక మాధ్యమిక పాఠశాలలలోని పై తరగతియొక్క పాఠక్రమము ఈ క్రింద చూపబడినది.-

34

జర్మినీ దేశము జనసంఖ్య ఆరుకోట్ల ఇరవై లక్షలు. వీరిలో ఈ బడులలో చదువుకొనే పిల్లల సంఖ్త్య 70 లక్షలు. వీరి కోసము 54,000 ప్రారంభ పాఠశాలలున్నవి. వీటిలో 1744 మాధ్యమిక పాఠశాలలు. చదువుకొనే ఆడపిల్లల సంఖ్య మగ పిల్లల సంఖ్య సరిగా ఉంటుంది. మాధ్యమిక ప్పాఠశాలలోని పిల్లలు మొత్తములో నూటికి అయిదు మంది ఉంటారు. ప్రారంభ పాఠశాలలలలోని ఉపాధ్యాయుల సంఖ్య 2,10,300 వీరిలో నూటికి ఇరవై యిద్దరు ఆడవాళ్లు. సగటున ఒక ఉపాధ్యాయునికి 33.3 మంది పిల్లలుంటారు.

మిశ్రమ తరగతులు.

ఆడపిల్లలను మగపిల్లలను కలిపి ప్రారంభ, మాధ్యమిక బడులలో చదువు చెప్పడము విషయమై జర్మినీ దేశములో వివిధాభిప్రాయము లున్నవి. కొన్ని బడులలో ఇద్దరినీ కలిపే చెప్పుతారు. గ్రామ బడులలో ఇది తప్పని సరి. చిన్న పట్టణాలలో ఆడ పిల్లలు, మగపిల్లలు కలిసి ఒకే బడిలో చదువు కొంటారు గాని, వారిని వేఋవేరు క్లాసులలో ఉంచు


36

తారు. పాఠక్రమము (Time Table) కోసము ఈ రీతిగా చేస్తారట. ఈ బడులలో ఆటలలో కూడ ఆడపిల్లలున్ను, మగపిల్లలున్ను ఒకరి నొకరు కసులు కోవడముండదు. పెద్ద పట్టణాలలో సర్వ సాధారణముగా ఆడపిల్లలుకున్ను, మగపిల్లలకున్ను బడులు వేర్వేరుగా ఉంటవి

జర్మను విద్యాపద్ధతి జయప్రదము కావడానికి మూలప్రభుత్వము అచ్చు వేసి పంపే పాఠ క్రమములు కారణముగాదు ఆయావిషయాలాలను నేర్పే పద్ధతియే కారణము. ఆ బడులలో ఏవిన్ని పఠనీయ గ్రంధములు నిర్నీతములుగా ఉండవు. ఉపాద్యాయులు తమ పాఠములను తామే ఏర్పరచుకొనవచ్చును. క్రొత్త రాజకీయ పరిస్థితులను బట్టి మూల ప్రభుత్వము వారు క్రొత్తగా పఠనీయ గ్రందాలను ఏర్పాటు చేస్తున్నారు. ఉపాద్యాయులు జ్గ్నానమును పిల్లలలోనికి క్రుక్కరు. పిల్లలు తమంతట తామే ఆయావిషయాలను తెలుసుకొనేటట్లు సహాయము చేస్తారు. ఏదో ఒక విషయమును తానే కనుక్కొంటునాననిన్నీ, తన


37

లోనికి అగ్నానమును ఉపాద్యాయుడు క్రుక్కలేదనిన్నీ పిల్లల ఉత్సాహపడతారు. విద్య పిల్లల జీవనానికి సంబంధించి ఉంటుంది కాని, ఎక్కడివో సంగతులను పిల్లలకు చెప్పరు. ఇటువంటి జీవనమునకున్ను, బడి జీవనమునకున్ను వ్యత్యాసముండదు. పిల్లలు బడులలో ఒక కాల్పనిక ప్రపంచలో ఉండరు. పిల్లల పరిశీలన శక్తిని అభివృద్ధి చేయడమే అతి ముఖ్యమనే సంగతిని ఉపాధ్యాయులు మరిచి పోరు. ఈ పరిశీలన సక్తిని అభివృద్ది చేయడానికి గ్రామ పట్తణముల జీవనము, కార్మిక జీవనము, మొదలయిన వాటిని తెలిపే అనేక పటములను ఉపయోగిస్తారు. జంతు వృక్ష జీవనమును తెలుసు కొనడము, వాతా వరణమును గురించి తెలుసుకోవడము కూడ ఈ బడులలో నేర్చుకొనేటట్లు చేస్తారు.

యుద్ధమునకు పూర్వము కసరత్తు, కవాతు నిర్భంధముగా చెప్పుతూ ఉండేవారు. ఇప్పుడు వాటికి బదులుగా ఆటలు, వ్యాయామక్రీడల మీద హెచ్చు శ్రద్ధ చూపిస్తున్నారు. బడి పిల్లలకు

38

ఆట స్థలము కోసము ఒక్క బెర్లిను పట్టణములోనే ఇన్నో మిలియనుల పౌనులు ఖర్చు పెట్టినారు. ఇంగ్లీషు వారి విజయమునకున్ను శీలమునకున్ను, వారి వ్యాయామక్రీడలే ముఖ్య కారణములని అనుకోవడము చేతనున్ను, "వాటర్లూ యుద్ధములోని జయము ఈటను బడి ఆటస్థలములలో కలిగినది" అనే మొదలయిన అభిప్రాయముల చేతనున్ను, ఈ రీతిగా జర్మనులు వ్యాయామక్రీడల పైని ఎక్కువ శ్రద్ధ తీసుకొంటు ఉన్నారు. బడి పిల్లలు విహార యాత్రలు చేయవససినదనే భావము పెరుగు తున్నది. నెలకు ఒక సారి అయినా బడి పిల్లలందరున్ను శాస్త్ర పరిశోదనల కోసము విహారమునకు పోవలెను.

మతవిద్య.

జర్మినీలో చాల మంది ప్రొటెస్తాంటు మతస్తులు, ఇవాంజెలీకల్ మతస్తులో అయి వున్నారు. కొంచెము మంది రోమను కేథలిక్కు మతస్థులున్ను, యూదులున్ను, కూడా ఉన్నారు. మొత్తము జనసంఖ్యలో రోమను కేథొలిక్కులు నూటికి 30

39

మందిన్ని, యూదులు నూటికి 0.3 మందిన్నీ ఉంటారు. వీరిద్దరికిన్ని ప్రత్యెకముగా బడులున్నవి. వీటిలో ఆయా మతస్థులే ఉపాధ్యాయులుగా ఉంటారు. వీటికయ్యే ఖర్చు అంతా మూల ప్రభుత్వమే భరిస్తుంది. రోమను కాథొలిక్కులకు తమ బోధనాబ్యసన కళాశాలలున్నవి. కాని యూదులకు లేవు. యూదులు కొంచెము మందె ఉండటమున్ను, వారున్ను అక్కడక్కడ చెదిరి ఉండడమున్ను దీనికి కారణములు. చిన్న పట్టణాలలో ప్రత్యేకముగా వీరికి బడులు పెట్టడానికి చాలినంత మంది విద్యార్థులు లేక పోవడము చేత వీరి పిల్లలను ప్రొటెస్టాంటే

బడులలోనే చేర్చుకొంటారు. మొత్తము మీద జర్మినీ దేశములో పొటెస్టాంట్ బడులలో చదువుకొనే రోమను కాథొలిక్కు పిల్లలు నూటికి 1.7 మందిన్ని,యూదుల పిల్లలు నూటికి 0.4 మందిన్ని ఉన్నారు. రోమను కాథొలిక్కు బడులలో ప్రొటెస్టాంటు పిల్లలు నూటికి 0.8 మందిన్ని, యూదుల పిల్లలు నూటికి 0.1 మందిన్ని ఉన్నారు. తరగతి ఉపాధ్యాయుడే మత విద్య

40

చెప్పుతాడు; కాని, అతనికిష్టము లేకపోతే, నేను చప్పనని నిరాకరించ వచ్చును. అయినా అనుభవములో అట్లు నిరాకారించడము అరుదుగా ఉన్నది. తల్లిదండ్రులు ఈ మత విద్యా పాఠములులకు తమ పిల్లలను పంపపక పోవడానికిన్ని, అదే బడిలో బడి వేళలో కాక మరొక్కప్పుడు తమ మత విద్యను చెప్పించడానికిన్ని హక్కు గలదు. మత విద్య సామాన్యముగానే ఉంటుంది గాని, ఇట్లు నమ్మవలెను, ఇట్లు నమ్మకూడదు, అని ఉండదు. సాథరణముగా బైబిలు కథలున్ను, చర్చి చరిత్రమున్ను, చెప్పుతారు. యుద్దమయిన తరువాత సోషలిస్టు ప్రభుత్వము వారు బడులలో నుంచి మత విద్యను కేవలము తీసి వేయడానికి ప్రయత్నించినారు. బవేరియా రాష్ట్రములో సిముల్టేన్ షూలె (Simultan schule) అనే మిశ్రమ పాఠశాలలను ఏర్పాటు చేసినారు. ఇవి క్రొత్త మోస్తరు బడులు. వీటిలోనికి ఏమతేము వారైనా చేర్చుకొంటారు.అన్ని విషయాలున్ను, అందరికీ సామాన్యముగానే నేర్పుతారు గాని, మతమునకు మాత్రము ప్రత్యేక

41

ముగా ఉపాధ్యాయు డుంటాడు. కేథొలిక్కు పిల్లలను బడులలో కేథొలిక్కు పురోహితుడు బోధిస్తాడు. యూదు పిల్లలను ఆస్థలములో వారి పురోహితుడైన 'రబ్బీ" ఉంటే, తనికిన్ని, ప్రొటెస్టాంటు పిల్లలను ఆస్థలములోని ప్రొటెస్టాంటు పురోహిహునికిన్ని ఒప్పచెపుతారు. బడి పెద్దదయితే, బడిలోనే ఎల్లకాలమున్ను పనియేయడానికి ఒకనిని నియమిస్తారు. మతేతర విషయాలను బోధించడానికి వారి వారి మతములతో నిమిత్తము లేదు.

ఈ ఏర్పాటును కేథోలిక్కు పురోహితులు ఒప్పుకోక, ఈ సిమల్టెన్ షూలెను గర్హించి పిల్లలను ఆ బడులలోనుంచి తీసివేయవలసినదని తేల్లి దండ్రుల కుద్భోదము చేయడము ప్రారంభించి నారు. ఈ బడులు మతము పోషించేవి కావనిన్ని, వాటిలో భూగోళ శాస్త్రము, చిత్రలేకనము, సంగీతము, మొదలయిన విషయాలను రోమను కేథోలిక్కు మతము ప్రకారము నేర్పలేదనిన్ని, వీరి ఆక్షేపణము. 1922 సం.రము జనవరి


42

నెలలో జరిగిన చర్చలో, ఒక కేథొలిక్కు సభ్యుడు గణితమును రోమను కేథోలిక్కు మతము ప్రకారము నేర్పవలసినదిని చెప్పగా హేర్ హీఫ్ మాన్ అనే కమ్యూనిస్టు సభ్యుడు మత విద్యయే కూడదని ఎక్కిరిస్తూ గొప్ప ఉపన్యాసము చేసి నాడు. ఈ చర్యను బట్టిన్ని, ఇతర చర్చలను బట్టిన్ని, బడులలో మత విద్య నిర్బంధముగా నిలిచి ఉన్నది. కాని, బైబిలు బోధనము, బైబిలు కతలు, చర్చి చరిత్రములను మాత్రమే నేర్పుతారు. ఏమినమ్మవలెను, అనే విషయమును బోధించరు. ఇప్పుడు సాథారణ విషయాలను బోధించే ఉపాధ్యాయులే మతమును కూడా భోదిస్తారు మతవిద్య లేని బడులు కూడ వున్నవి. వీటి ఖర్చు కూడ మూల ప్రభుత్వమువారే భరిస్తారు.

బడుల తనిఖీ

"గెమెండె" లకున్ను "స్టాడ్ టు" లకున్ను ఒకొక్క మండలమునకు ఒకొక్క ఇన్ స్పెక్టరును విద్యామంత్రి నియమిస్తాడు. అతడు సంవత్సరమున కొక సారి అయినా బడులను తేనిఖీ చేయ

43

వలెను. ఆతడు ఉపాధ్యాయ సభలను కూర్చి, ఆయా విషయాలలో సరి క్రొత్త బోధన పద్ధతులను గిరించి తెలుపు తాడు. తన మండలములో గాని, దగ్గరగల మరిఒక మండలములోగాని విద్యా విషయమై జరుగుతూ ఉన్న పరిశోధనలను చూడడానికి ఉపాధ్యాయులను పిలుచుక పోతాడు. ఉపాధ్యాయులకు మంచి సలహాలివ్వడానికి అతడు బడులను తనిఖీ చేస్తాడు కాని, వారి దోషములను మాత్రము చూపడానికి కాదు. అతడు ఉపాద్యాయుల తప్పులను గిరించి రెపోర్టు చేయడు. దానికి బదులుగా తానే ఒక తరగతి తీసుకొని ఏలాగు పాఠములు చెప్పవలెనో స్వయముగా చూపుతాడు. తనక్రింది వారి దోషాలను రెపోర్టులో చూపడము సులభమే కాని, మంచి బోధన పద్ధతిని స్యయముగా అవలంబించి చూపడము కష్టము గదా...

వెర్సోర్ గ్ంగ్ సంత్ ( శిశు పోషణ శాఖ

ఐరోపా ఖండములోని అన్ని దేశాలలోను మ్యునిసిపాలిటీలలోను, జిల్లా బోర్డులలోను, శిశుపోశ్హణ శాఖలున్నవి. కాని, ఆ శాఖలు జర్మినీ దేశ


44

ములో మంచి పద్ధతులమీద నడుస్తున్నవి. ప్రతి మ్యునిసిపాలిటీలోను శిశు పోషణ శాఖ ఉంటుంది. ఇంగ్లాండులో ఈ పని ప్రభుత్వము వారు కాక, ప్రయివేటు సంఘములవారు చేస్తారు. శిశువు పుట్తగానే ఆసంగతి మ్యునిసిపాలిటీ వారికి తెలియ జేయవలెను. వెంటనే ఒక మ్యునిసిపలు దాది వచ్చి తల్లిదండ్రులు శిశువుకు సమకూర్చలేని సదుపాయములన్ని చేస్తుంది శిశువు అనాధయినా తల్లిగండ్రులు దానిని సరిగా చూడక హింసించినా, సరి అయిన ఆహారము, దుస్తులు లేక పోయినా, వెంటనే ఆ శిసువును ఒక శిశు పోషణ గృహమునకు (Nursing home) పంపుతారు. ఈ శిశుపోషణ గృహములలోని పిల్లలను దగ్గరా ఉన్న కింటర్ గార్టెన్ బడులకో ప్రారంభ పాఠశాలలకో పంపుతారు. ఆ పిల్ల తండ్రి, బ్రతికి ఉంటే, ఆశిశువు పోషణమునకు అతడు కొంత సొమ్ము ఇచ్చుకోవలెను. ఈ శాఖవారు ప్రారంభ పాఠశాలలలోని పిల్లల శ్రేయస్సును కూడా గమనిస్తూ ఉంటారు. బడికాలములో పిల్లలకు ఉచితముగా తిండి పెట్టడమే కా

45

కుండా కొన్ని సమయాలలో పుస్తకాలు, బట్టలు కూడ ఇస్తారు. పేద పిల్లలకు ఉచితముగా వైద్యమున్ను చేస్తారు.

ఆధ్యాయము 7.

పల్లెటూరి బడులు (ఫార్ షూలె)

యుద్ధసమయమున జర్మనీలో వ్వవసాయము చాల అభివృద్ధి చెందినది. పూర్వము పశువుల మేతకు వదలి పెట్టిన భూమి ఇప్పుడు సాగులోనికి వచ్చినది.చాల కాలము వరకు జర్మనులు తమ దేశములో పండే పంటల మీదనే బ్రతకవలసి వచ్చినది. అందు చేత వ్యవసాయమును గురించి శాస్త్రీయ పద్ధతుల ప్రకారాము పరిశోధనలు చేసి, ఆ శాస్త్రగ్నానమును పండ్లు, కూరగాయలు, ధాన్యములు, ఎక్కువగా మునుపటి కంటే బాగుగా ఎలాగు పండించడమో అనే విషయమునకు వినియోగించినారు, ఇంగ్లాడులో వ్వవసాయము వల్ల అంత లాభము లేదు. కనుక, వరు పొల

46