జయ జయ విఘ్న

వికీసోర్స్ నుండి

నాట - ఆది[మార్చు]

పల్లవి:
జయ జయ విఘ్ననాయకా జయ జయ శుభఫల దాయకా ||

చరణం 1:
జయ జయ జయ జయ జయ సుర పోషక
జయ జయ సనకాదియమి సమిధికాభయకర కారుణికా
నయయుత జన జనకా ప్రియ మ్రుదు వాక్పటుకా విలసదాఖు హయకా ||

చరణం 2:
జయ జయ శంభు కుమారకా జయ దోష నివారకా
జయ జయ జయ జయ జయ సుఖ కారక
జయ జయ కనకాచల సమ తనుకా జయ సురకుల తిలకా
శయ హిత క్రుతి శతకా శయ ధ్రుత సుమ కలికా సత్ఫణి కర కటకా ||

చరణం 3:
జయ జయ భక్త జనావనా జయ జయ సిద్ధి గజాననా
జయ జయ జయ జయ జయ విద్యాధన జయ జిత మదనా
జయ గుణ సదనా జయ జయ సిత వసనా
జయ జయ యుత కదనా నియమిత మధు మధనా నిర్మలతర రదనా ||

చరణం 4:
జయ జయ కీర్తి విరాజిత జయ జయ ధ్రుతి విభ్రాజితా
జయ జయ జయ జయ జయ సుర పూజిత
జయ మునిజనతాశ్రయ పద ఘనతా జయ వర దాసు యుతా
స్వయ కవి రామ నుతా జయ భంజిత వినుతా జయ జగదావనరతా ||