జయము జయము

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search


జయము, జయము

లలిత సుమనోజ్ఞ కావ్య మంజుల లతాంత

మాలి కాభరణా! వినిర్మల విశేష

సుగుణమాణిక్య దివ్యతేజోవిరాజ!

దీనజన హృద యాంతర స్థిరవిహార!

రామరాయేంద్రు శ్రీ సూర్యరాయ, జయము!"

అను స్తుతిధ్యానములు, జగ మంత క్రమ్మి,

యంబరపథాల మార్మ్రోగునపుడు, మీరు

మువ్వు రొండొరులం గాంచి మురియునపుడు,

గర్వమున నృత్యమాడు మీ కంటిచూపు,

లధర సాంధ్యప్రభల దరహాసరేఖ,

మింట మిలమిల చుక్కలై మెరయునేమొ!

వెన్నెలై వినువీథుల విరియునేమొ!

"https://te.wikisource.org/w/index.php?title=జయము_జయము&oldid=25743" నుండి వెలికితీశారు