జనులార

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

కమాస్ రాగం - ఆది తాళం[మార్చు]

పల్లవి:
జనులార రామస్వామిని వేడరే
ఓహ్ జనులార రామస్వామిని వేడరే ||

అనుపల్లవి:
మనమున భక్తిచే మహి మించరే ఓహ్ ||

చరణం 1:
కామాది శాత్రవ గణము జయించి
శ్రీమంతుడౌ హరిని సేవించరే ఓహ్ ||

చరణం 2:
పంచ భూతాత్మక ప్రపంచ మనిత్యము
వంచింపబడనేల వానిచే మీరు ఓహ్ ||

చరణం 3:
రహిమీర దాసు శ్రీరామ కవీంద్రుని
మహిత వాక్య రీతి మన్నించరే ఓహ్ ||

"https://te.wikisource.org/w/index.php?title=జనులార&oldid=408302" నుండి వెలికితీశారు