జడకుచ్చులు/కవిత
కవిత
తేటలయిన పుణ్యారణ్య ♦ వాటికలను
బుట్టితి నుషఃకుమారి తోఁ ♦ బుట్టుగాఁగ
అంద మెగఁబోయు లావణ్య ♦ మాహరించి
తపసివం బసియాడు జీ ♦ వనము త్రావి
పెరిగితిని నిత్యకోమల ♦ స్ఫురణలడర
ఇగురుటాకు నెలల పచ్చి ♦ యెండలందు
గ్రీష్మమాస వేణికలఁ దే ♦ ఱినజలాల
స్నానమాడి శీరోజ గు ♦ చ్ఛములు కడిగి
నింగి బాలెంతనడికట్టు ♦ కొంగులనఁగ
జాఱు నతసీపయోద ప్ర ♦ సన్న రేఖ
లందికొని లాగి చీరెగా ♦ నందగించి
క్షాళితవిశాల విశ్వరం ♦ గంబుసందు
నిండువెన్నెల తెలిచాంది ♦ నీలుగట్టి
మొలక పచ్చని మ్రుగ్గులు ♦ పుడమిఁదీర్చి
శారదోత్సన భోగమ్ము ♦ సలిపి దనిసి
కవిత
87
పచ్చిముత్యాల వాయనాల్ ♦ పంచిపెట్టు
ఉదయసతి కాకుఁబచ్చప ♦ య్యెదలుసాచి
పత్త్ర వస్త్రాపహరణపా ♦ పంబుకతనఁ
జిన్నవోయిన కొమ్మల ♦ సిగలమీఁద
ఋతుహితస్నాన శోభన ♦ మెదుగ నరసి
తడిసితడియని నాజూకు ♦ త్రాళ్ళవలల
భావశుకములు బందాలు ♦ పడ రచించి
ప్రాణిలోకమ్ము నానంద ♦ పథవిలీన
మహ దనంతసౌందర సా ♦ మ్రూజ్యమునకుఁ
బెనువలపుఁగొన నారాట ♦ పెట్టుచుంటి,
చిక్కిన శకుంతములకు స ♦ చిత్రమయిన
అమలవాగర్థ కేళీర ♦ హాస్యమధువు
నామెతలు పెట్టి సాకితి ♦ ప్రేమవిరియ
నాదుసౌందర్య విభవము, ♦ నాదురేఖ,
నాదుకన్నె సింగారంబు ♦ నాదుచేష్ట,
నాదువడకల పోడిమి, ♦ నాదుగీతి
సుమధురంబైన పూజాప్ర ♦ సూనమట్లు
అస్ఖలితమైన కన్నె సో ♦ యగముచాయ
కనులఁబూజించి మనసుతో ♦ గారవించి
జడకుచ్చులు
88
వాణిఁద్రావుచునుండి ర ♦ రీణభక్తి
పరిపరివిధాల శోభా త ♦ పస్విజనులు
బాలపుష్పము నంటిన ♦ పాపమనుచును,
ముగుదవలె రేకుఁ జెఱఁగుల ♦ మూసికొనిన
మధుర తారుణ్య మర్చనా ♦ మాత్రమనుచు,
అడుగుసోకినకడనెల్ల ♦ నణువులణువు
లగుచు ప్రాణకళలు రాలు ♦ నందమెంచి
కొలుచుచుందిరి భావవి ♦ హ్వలులుమున్న
నిత్యకౌమార తరుణాభి ♦ జూత్యనగ దు
నింత స్పర్శాకలంకము ♦ నేనియెఱుఁగ