చేరరా వదేమిరా రామయ్య

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
త్యాగరాజు కృతులు

అం అః

రీతిగౌళ రాగం - దేశాది తాళం


పల్లవి

చేరరా వదేమిరా ? రామయ్య !


అనుపల్లవి

మేర గాదురా యిక, మహా - మేరుధీర ! శ్రీకర !


చరణము

తల్లి దండ్రి లేని బాల తన నాథు గోరు రీతి

పలుమారు వేడుకొనిన బాలించ రాదా ?

వలచుచు నేను నీదు వద నారవిందమును

దలచి కరగగ జూచి, త్యాగరాజ సన్నుత !