చాటుపద్యమణిమంజరి/తొలిపలుకు

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

మొదటికూర్పు.


తొలిపలుకు.

తీరుతీయములు గల భాషావాహినియందు సుకవుల కవితామృతము ప్రబంధరూపమునన కాక చాటురూపమునను జాలువాఱును. వీనులకు విందులై డెందమును దనుపార్చుచుఁ జాటురచనము లొక్కొకయెడఁ బ్రబంధరచనముల సయితము మీఱియుండునని చెప్పుట భాషావేదుల కనుభవపునరుక్తమగును. గ్రంథములుగా నేర్పడామిచేఁదొల్లింటియాంధ్రకవీశ్వరులు రచించిన చాటుపద్యము లెన్నేని యినికితప్పినవి పరంపరాగతములగుచుఁ గొన్ని పల్లెటూళ్లలో ముదుసళ్లనోళ్లయందును మఱికొన్ని పురువులకు భుక్తులువెట్టు ప్రాచీనతాళపత్ర సంపుటములందును జీర్ణించుచున్నవి. ఇంపారు నిట్టిపద్యముల సంపాదించి గ్రంథరూపమున వెల్వరింపఁ దలంపుగొని యెఱిఁగినవారినెల్ల నడిగియు దొరికిన తాళపత్రసంపుటమెల్లఁ బరిశీలించియు నానాఁటఁ గొన్నిచాటువులఁ గూర్చితిని. సమకూజీనపద్యములలోఁ బెక్కింటి నేటి కాలపు మర్యాద నలో క్రమింపకుండ సవరించియు వీడనాడియు రత్నములనఁ దగిన వాని కథా సందర్శనకుఁ జేర్చి, గ్రంథ రూపమున సమకూర్చితిని. శృంగారవిషయము మిక్కిలిమెలఁకువతో సర్దుష్టుపటి చితిని. కొన్ని పద్యములు సందిద్దార్థములయినను. జరిత్ర కారులకుఁ జిక్కు కల్గు నని మార్పు చేయకయ ముద్రించితిని. నేటికవుల చాటువులఁ జే కొన లేదు. ప్రాచీన కృతులందలి పద్యము, లేవేని యిందుఁ జేరిన చో గుర్తింప లేని నాయపరిజ్ఞానమును క్షమింప వేఁడెదను. కొన్ని శతకములందలిపద్యము లిందుఁ జేర్చితిని. ప్రాచీనములగు నాశతకము లిప్పుడు కొన్ని దుర్లభములు. సహృదయులకియ్యది యింపు నింపు ననియే నాతలంపు.

రెండవకూర్పు.

ఈకూర్పున నెన్నో కొత్త పద్యములఁ జేర్చితిని, మార్చి, కిని. గ్రంథముద్ర ణాధికారమును చెన్నపురి : వావిళ్ల . రామ స్వామిశాస్త్రులు అండ్ సన్స్ వారి కిచ్చితిని."

చెన్నపురి: వేటూరి. ప్రభాకరశాస్త్రి, 31-1-1917.