చల్లకు వచ్చి ముంత దా - చ నేలనే

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search


పల్లవి:
చల్లకు వచ్చి ముంత దా - చ నేలనే ఓమధురవాణీ ॥చల్లకు॥

అనుపల్లవి:
ముల్లెకు మోసము లేదు - ముద్దు బెట్టి పొమ్మనే ॥చల్లకు॥

చరణ:
వల్లభ నీవంటి వాని - వలచి వచ్చిన వనిత నేచ
చెల్లదురా తగదు దగదని - చెయ్యి బట్టి రమ్మనె ॥చల్లకు॥

వానికెదురు చూచుచు - వాకిటనే నిలచితినే
చాన యేమొకాని యన్న - పానమునే మరచితినే ॥చల్లకు॥

వేసట జెందితిగదవే - వేణుగోపాలుని దేవే
దాసు రామ కవి హృదయ ని - వాసుని దయచేయుమనే ॥చల్లకు॥